తెలంగాణ సినిమా దశ దిశ

Posted on

5de90957-92fe-4076-a34d-e227f1036d90

జనవరి 5 న ‘తెలంగాణ సినిమా దశ దిశ’  ఆవిష్కరణ

       ప్రముఖ కవీ, సినీ విమర్శకుడు వారాల ఆనంద్ రచించిన ‘ తెలంగాణ సినిమా దశ దిశ’ పుస్తకావిష్కరణ రాష్ట్ర పట్టణాభివృద్ది, ఐ.టి. శాఖల మంత్రి శ్రీ కల్వకుంట రామా రావు ఆవిష్కరిస్తారు. జనవరి 5వ తేదీన ఉదయ 10.30 లకు సెక్రెటేరియట్ లోని కార్యాలయంలో జరిగే ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ అతిథిగా హాజరవుతారు.ఇంకా ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి శ్రీ దేశపతి శ్రీనివాస్, కవి వజ్జాల శివకుమార్ తదితరులు హాజరవుతారు.

      వారాల ఆనంద్ ఇప్పటివరకు నవ్య సినిమా రంగం పైన నవ్య చిత్ర వైతాళికులు,బాలల చిత్రాలు, సినీ సుమాలు, 24 ఫ్రేమ్స్, బంగారు తెలంగాణాలో చలన చిత్రం, CHILDREN’S CINEMA, తదితర పుస్తకాలు వెలువరించారు.

      కవిగా సాహిత్యం లో లయ (కవిత్వ సంకలనం ఇతర కవులతో కలిసి ),మానేరు తీరం (కవిత్వం), మనిషి లోపల (కవిత్వం), అక్షరాల చెలిమె (కవిత్వం), SIGNATURE OF LOVE (Poetry Tr.), మానేరు గలగల (సాహిత్య విమర్శ), మెరుపు ( సాహిత్యకారుల ఇంటర్వూలు) రచించారు,

            కాగా  ఇటీవలే మిద్దే రాములు,  పైడి జైరాజ్, బి.ఎస్.నారాయణ ల పైన  మోనోగ్రాఫ్స్ రాశారు,

            ఇంకా తెలంగాణా సాహితీ మూర్తులు: ముద్దసాని రాంరెడ్డి,  తెలంగాణా సాహితీ మూర్తులు:     

     యాది సదాశివ,  LONG BATTLE WITH SHORT MESSAGES’,  ‘A Ray of Hope’,    

     ‘KAFISO’ a saga of film lovers, మొదలయిన డాకుమెంటరీ చిత్రాలు నిర్మించారు.

Leave a comment