Latest Event Updates

MASTER DIRECTOR BIMAL ROY

Posted on Updated on

మాస్టర్ డైరెక్టర్ బిమల్ రాయ్ -వారాల ఆనంద్
=====================
 
భారతీయ సినిమాకు కవితాత్మకతను జోడించి కళాత్మకతతో హృదయాల్ని స్పృశించిన తొలి తరం దర్శకుల్లో బిమల్ రాయ్ ఒకరు. 19 50 లలో ప్రపంచవ్యాప్తంగా వెల్లివిరిసిన వాస్తవిక సినిమా ఉద్యమ ప్రభావంలో బిమల్ రాయ్ సినిమాలు తీసి వాటికి భారతీయతను జోడించి విజయవంతమయిన సినిమాల్ని తీసాడు. తన మేలంకోలిక్ అప్రోచ్ తో సినిమాలకు తనదయిన ఒక ధోరణిని ఏర్పరచుకున్నాడు. ఆయన సినిమాల కథలు కుటుంబమూ, సంభాదాలు, ఆత్మీయతలూ, ఆవేదనలూ ప్రధాన అంశాలుగా ఉండేవి. ఆయన సినిమాల్లో కథ నడిపే విధానం విలక్షణంగా వుండి మామూలు పాతలు కూడా సొంత వ్యక్తిత్వంతో కూడి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. బిమల్ రాయ్ సినిమాల్లో ప్రధానంగా నిశబ్దం, నటీ నటుల ముఖాల్లో భావ వ్యక్తీకరనకే ప్రాధాన్యత కనిపిస్తుంది.
 
సత్యజిత్ రే కంటే ముంది బిమల్ రాయ్ తన ‘దో భీగా జమీన్’ తో భారతీయ నేవీ సినిమాకు ప్రారంభ వాక్యాలు పలికాడు. అందులో గ్రామంనుంచి నగరానికి బతకడానికి వలస వచ్చిన ఒక రైతు శంబు జీవితాన్ని కష్టాల్ని ద్రుశ్యీకరించాడు. అప్పటిదాకా పాశ్చాత్య ధోరణిలో వున్న గొప్ప నటుడు బల్రాజ్ సహానీ తో రైతు వేషం కట్టించి అద్బుతమయిన నటనను రాబట్టాడు బిమల్ రాయ్. ‘దో భీగా జమీన్’ పైన ఫ్రెంచ్ రియలిజం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. 1952 లో మన దేశంలో నిర్వహించిన మొట్టమొదటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించిన ప్రపంచ వ్యాప్త సినిమాలు బిమల్ రాయ్ పైన తీవ్ర మయిన ప్రభావాన్ని చూపించాయి. దో భీగా జమీన్’ భారత దేశామోలోనే కాకుండా రష్యా, చైనా, బ్రిటన్ కార్లోవివారి, వేనీస్,మెల్బోర్న్ తదితర ఫెస్టివల్స్ లో ప్రముఖమయిన అవార్డుల్ని గెలుచుకొంది.
 
అట్లా ప్రపంచ వ్యాప్త దృష్టిని ఆకర్షించిన బిమల్ రాయ్ 12 జూలై 1909 రోజున అప్పటి తూర్పు పాకిస్తాన్ ( ఇప్పటి బంగ్లాదేశ్)లోని ఒక జమీందారీ కుటుంబంలో జన్మించాడు.కాని తండ్రి మరణం తర్వాత ఎస్టేట్ మేనేజర్ ద్రోహానికి గురై తల్లీ చిన్న తమ్ముళ్ళని తీసుకొని కలకత్తా కు తరలి వచ్చాడు. తొలి రోజుల్లో తీవ్రమయిన కష్టాల్ని ఎదుర్కొన్న బిమల్ రాయ్ ప్రముఖ దర్శకుడు పి.సి.బరువా దగ్గర ప్రబ్లిసిటీ ఫోటోగ్రాఫర్ గా చేరిపోయాడు. బిమల్ రాయ్ కున్న లైటింగ్ పరిజ్ఞాన్ని చూసి బెంగాల్ లోని గొప్ప సినిమా కంపనీ న్యూ థియేటర్స్ సంస్థ తనని నితిన్ బోస్ దగ్గర అసిస్టంట్ కేమరామన్ గా నియమించుకుంది. కె.ఎల్.సైగల్ నటించిన మొట్టమొదటి దేవదాస్ సినిమాకు, ముక్తి సినిమాకు బిమల్ రాయ్ పని చేసాడు. అదే సమయంలో బిమల్ బ్రిటిష్ ప్రభుత్వానికోసం రెండు డాకుమెంటరీ సినిమాలు తీసాడు కాని అవి లభ్యం కాకుండా పోయాయి. తర్వాత 19 5 6 లో ఆయన తీసిన ‘గౌతమ్ ది బుద్దా’ అనేక ప్రశంల్ని అందుకొంది. 194 4 లో బిమల్ రాయ్ తీసిన మొదటి పూర్తి నిడివి సినిమా ‘ ఉద యెర్ పాతెయ్ ‘ బెంగాల్ లో కల్ట్ సినిమాగా మిగిలింది. ఆ సినిమాలో బిమల్ రాయ్ చూపించిన కేమెర పనితనం బెంగాలీ వాసుల్ని అబ్బుర పరిచింది. ఆర్థికంగా కూడా గొప్ప విజయాన్ని సాధించింది.
 
40 వ దశాబ్ది చివర్లో యుద్ధం, దేశ విభజన నేపధ్యంలో అనేక మంది బెంగాలీ దర్శకులు బాంబే కు తరలి వెళ్ళిపోయారు. అదే క్రమంలో బిమల్ రాయ్ కూడా తన బృందాన్ని తీసుకొని బోంబే వెళ్ళాడు. అప్పటి ఆయన బృందంలో హ్రిషికేశ్ ముఖర్జీ ( ఎడిటర్), నబెందు ఘోష్ ( రచయిత), సలిల్ చౌదరి ( సంగీత దర్శకుడు), కమల్ బోస్( సినిమాటోగ్రాఫర్) ప్రధానంగా వున్నారు.
 
బాంబే లో తన మొదటి సినిమా గా 195 2 లో ‘ మా’ సినిమా నిర్మించాడు బిమల్ దా బాంబే టాకీస్ కోసం. తర్వాత తానే బిమల్ రాయ్ బిమల్ రాయ్ ప్రొడక్షన్స్ స్థాపించి దో భీగా జమీన్’ తీసాడు. అది భారతీయ సమాంతర వాస్తవవాద సినిమాకు ఆరంభంగా నిలిచింది. తర్వాత ప్రముఖ రచయిత శరత్ చంద్ర నవల ‘పరిణీత’ ను అదే పేరుతో సినిమాగా రూపొందించాడు. అశోక్ కుమార్, మీనా కుమారి లో ప్రాధాన్ పాత్రల్ని పోషించిన పరిణీత నవల రూపంతరీకరణలో గొప్ప సినిమాగా ప్రశంశించబడింది. ఇందులో మీనాకుమారి పాత్ర రూపొందిన తీరు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకటుకుంది. దాన్నే మళ్ళీ 2005 లో హిందీ లోనే తిరిగి తీసారు. బిమల్ రాయ్ పరిణీత రెండు ఫిలిం ఫేర్ అవార్డుల్ని అందుకుంది.
 
తర్వాత బిమల్ రాయ్ శరత్ చంద్ర మరో విజయవంతమయిన నవల ‘దేవదాస్’ తీసాడు. dileep కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ దేవదాస్ ఇప్పటివరకు వచ్చిన దేవదాస్ సినిమాల్లో ముఖ్యమయిన సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాతే దిలీప్ కుమార్ కు విషాద హీరోగా గొప్ప పేరు వచ్చింది. అతకు ముందు బెంగాల్ లో బరువా సైగల్ ప్రధాన పాత్రధారిగా తీసిన దేవదాస్ ను దిలీప్ కుమార్ చూడొద్దని తనకు తానే కారక్టర్ ను అర్ధం చేసుకొని నటించాలని బిమల్ రాయ్ సూచించాడని దాని వల్లే తన నటన తన లాగా నిలిచిపోయిందని dileep చెప్పుకున్నాడు.
 
బిమల్ రాయ్ తీసిన ‘ బందిని’ ఒక సైకలాజికల్ సినిమా. కల్యాణి ఒక హత్యా నేరం పైన జైలు జీవితం గడుపుతూ వుంటుంది . ఆమె నేపధ్యంలో హత్య జరిగిన సందర్భం తెలుస్తుంది కల్యాణి ఒక గ్రామ పోస్ట్ మాస్టర్ కూతురు. ఆమె స్వంత్ర సమర యోదుడయిన బికాస్ తో ప్రేమలో పడుతుంది. బికాస్ తిరిగి వస్తానని గ్రామం విడిచి వెళ్ళిపోతాడు కాని తిరిగి రాదు. గ్రామంలో ఉండలేక కల్యాణి ఓ జానే వాలే హో సకేతో లౌటే ఆనా అని పాడుతూ పట్నం చేరుతుంది. అక్కడ ఒక మానసిక రోగికి సహాయకారిగా పనికి కుదుర్తుంది. aa రోగిని బికాస్ భార్య గా గుర్తిస్తుంది. ఇంతలో కల్యాణి తండ్రి నగరానికి వచ్చి ప్రమాదంలో చనిపోయాడని తెలుసుకున్న కల్యాణి తన అన్ని కష్టాలకూ బికాస్ భార్యే కారణమని తలపోస్తుంది. పర్యవసానంగా విషమిచ్చి ఆమెను చమేస్తుంది. తన నేరాన్ని అంగీకరించి కల్యాణి జైలుకు వెళ్తుంది. జైల్లో డాక్టర్ ఆమెను ప్రేమిస్తాడు కాని కల్యాణి అందుకు సిద్ధంగా వుండదు. జై లుంచి విడుఅలయిన కల్యాణి సోదూరంగా బోట్ లో వున్న బికాస్ ని కలుస్తుంది. ‘మై బందిని ప్రియాకా…మై సంఘినీ హూ సాజన్ కీ అన్న మాటలతో చిత్రం ముగుస్తుంది. బందిని లో బిమల్ రాయ్ ప్రతీకాత్మక చిత్రీకరణ ఆయనను గొప్ప భావుకుడిగానూ, దర్శకుడి గానూ నిలబెట్టింది. తర్వాత బిమల్ డా రూపొందించిన సుజాత సామాజిక సమస్య అయిన అస్పృశ్యత ను ఇతివృత్తంగా తీసుకొని నిర్మించింది. ఇక బిమల్ దా రూపొందించిన ‘మధుమతి’ అటు సంగీత పరంగానూ ఇటు చిత్రీకరణ పరంగానూ కొత్త దారులకు పాదులు వేసింది. మధుమతికి ప్రసిద్ద దర్శకుడు రిత్విక్ ఘటక్ స్క్రీన్ ప్లే రాసాడు. పునర్జన్మ భావనను ఆధారం చేసుకొని నిర్మించిన ఈ సినిమా సగీత పరంగా సలిల్ చౌదురీ కి గీత రచయితగా శైలేందర్ కి గొప్ప పేరు తెచ్చింది. అద్భుతమయిన పాటల పేటి గా ‘మధుమతి’ నిలిచిపోయింది.
 
బిమల్ రాయ్ ఇంకా బిరాజ్ బహు, యాహుదీ , పరఖ్, నాదర్ నిమాయ్, ప్రేం పాత్ర లాంటి సినిమాలు చేసాడు.
 
బిమల్ రాయ్ నిర్మాతగా పరివార్, కాబూలివాలా, అపరాధి కౌన్, ఉసనే కహాతా, బెనజీర్, లాంటి పలు సినిమాలు నిర్మించాడు.
నిజానికి బిమల్ రాయ్ ప్రభావం అటు హిందీ ప్రధాన స్రవంతి, ఇటు సమాంతర సినిమాల పైన కూడా వుందని చ్ఫెప్పుకోవచ్చు. గుల్జార్ లాంటి అనేక మంది రచయితలు, కళాకారులకు బిమల్ దా అవకాశాలు ఇచ్చి భారతీయ సినిమా మరింత పరిపుష్టం కావడానికి దోహదపడ్డారు.
 
ఆయన కేవలం 55 ఏళ్ల వయసులో కాన్సర్ తో 8 జూలై 19 65 లో ముంబై లో మరణించాడు.
 
భారతీయ సినిమా రంగంలో దర్శకుడిగా బిమల్ రాయ్ కొత్త పాదులు వేసాడు. సైలెంట్ మాస్టర్ గా పెరుతేచ్చుకొని చిరస్థాయిగా మిగిలిపోయాడు.
(PUBLISHED TODAY IN ‘SOPATHI’ of NAVA tELANGANA today)
SOPATHI-BIMAL ROYSOPATHI-BIMAL ROY 2
Advertisements

అండర్ ప్లే లో అద్భుతం గుమ్మడి

Posted on

          తెలుగు సినిమా రంగంలో లబ్ద ప్రతిష్టుడయిన కారెక్టర్ ఆర్టిస్ట్ గుమ్మడి వెంకటేశ్వర్ రావు అనగానే నాకు ఆయన వేసిన పాత్రలతో పాటు అనేక సంవత్సరాలపాటు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో మాతో పాటు మామూలు డెలిగేట్ గా వచ్చి ఫెస్టివల్ జరిగిన అన్ని రోజులూ క్రమం తప్పకుండా వివిధ దేశాల సినిమాల్ని చూస్తూ కలివిడిగా కనిపించిన గొప్ప ప్రేక్షకుడు గుర్తొస్తాడు. అంతేకాదు ఆయనకు వివిధ దేశాల నటులగురించి వారి నటనా గొప్పదనాన్ని గురించి పూర్తి అవగాహన వుండేది. ఇక హాలీవుడ్ సినిమాల సంగతి చెప్పనే అక్కర లేదు. ఆనతిని క్విన్, అలెక్ గినిస్ లాంటి నటుల గురించి ఆయనకు గొప్ప అవగాహన వుండేది. ఉమర్ ముఖ్తార్ గా ప్రపంచవ్యాప్తంగా మన్ననల్ని అందుకున్న అంథోని క్విన్ గుమ్మడి అభిమానించిన నటుల్లో ముఖ్యమయిన వాడు. వివాజిపాటా, గన్స్ ఆఫ్ నవరోన్, ద విసిట్ లాంటి సినిమాల్లో క్విన్ పాత్రల్ని గుమ్మడి అమ్తితంగా ఇష్టపడ్డాడు. అట్లే

లేడి కిల్లర్స్, లారెన్స్ ఆఫ్ అరేబియా, డాక్టర్ జివాగో లాంటి సినిమాల్లో అజరామరమయిన నటనను కనబరచిన     అలెక్ గేనిస్  ను కూడా అమితంగా ఇష్టపడ్డాడు. అట్లా ప్రపంచ సినిమాల గురించి ఆయా నటుల ప్రతిభా పాటవాల గురించి మంచి అవగాహన కలిగివున్న telugu నటుడు గుమ్మడి. వివిధ దేశాల నటీనటులు అంత గొప్పగా సహజంగా కృత్రిమత్వానికి దూరంగా నటిస్తూ వుండగా మనదగ్గర ఇంకా aa స్థాయిలోకి చాలా మంది రాకపోవడం పట్ల కూడా ఆయనకు ఎంతో అసంతృప్తి వుండేది. గుమ్మడి అకాడమిక్ చదువు తక్కువే ఉన్నప్పటికీ తాను చదివిన చూసిన గొప్ప సినిమాల ద్వారా ఎంతో నేర్చుకున్నారు. అంతేకాదునటనలోని మేలుకువల్ని మెరుగుపర్చుకున్నాడు. నిజానికి గుమ్మడి తన సినీ కారీర్లో ఎన్నో వైవిధ్యమున్న పాత్రల్ని పోషించినప్పటికీ ఆయన పూర్తి సామర్థ్యాన్ని telugu సినిమా రంగం వినియోగించుకోలేదనే అనుకుంటాను.

        తెలుగు కథానాయకుడికి ఉండాల్సిన అర్హతలున్నప్పటికీ గుమ్మడి చిన్న వయసులోనే కారెక్టర్ పాత్రల్లోకి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ తన స్పష్టమయిన ఉచ్చారణా ప్రతిభతో అనేక సినిమాలో గొప్ప నటనను ప్రదర్శించి  కీర్తిని పొందాడు.

       గుమ్మడి జూలై 9, 1927 లో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా రావికంపాడులో జన్మించారు.బసవయ్య, బుచ్చమ్మ ఆయన తలిదండ్రులు. మొదటినుండీ పుస్తకాలు చదవడం ఆయనకున్న గొప్ప లక్షణం. తొలిరోజుల్లో ఆయన కమ్యునిస్టు భావ జాలం తో ప్రభావితుడయ్యాడు. కొల్లూరులో స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్న గుమ్మడి పైన  telugu మాస్టర్ జాస్తి శ్రీ రాములు చౌదరి ప్రభావం అధికంగా వుంది. గుమ్మడికి భాష పట్ల, ఆయన ప్రభావం తోనే గుమ్మడి telugu భాష పట్ల మమకారం పెంచుకోవడం తోపాటు మాటలు పలకడం లో మేలుకువల్ని ఆయన వద్దే నేర్చుకున్నాడు. గుమ్మడికి 17 వ ఏటనే లక్ష్మీ సరస్వతి తో వివాహమయింది, ఆయనకు 5 కుమార్తెలు, ఇద్దరు కుమారులు.

      నిజానికి నటన లో నటుడు పాత్రలోకి పరకాయప్రవేశం చేయడమే. తనను తాను కోల్పోయి కథకుడు రాసి దర్శకుడు రూపొందించిన పాత్రలోకి వెళ్ళిపోయి తన చుట్టూ వున్న ఇతర పాత్రల్ని గమనిస్తూ పాత్ర తత్వాన్ని మానసిక స్థితిని ఆవిష్కరించినప్పుడే  అది మంచి నటనగా అంగీకరించబడుతుంది. అట్లా పాత్రల్లోకి వెళ్ళడం లో నటులు అనేక సార్లు ఓవర్ ప్లే లేదా ఉండర ప్లే చేస్తారు. పాత్ర లక్షణాల్ని బట్టి ఆయా నటుల ప్రతిభావిశేశాల్ని బట్టి ఆయా పాత్రలు ఆవిష్కరించబడతాయి ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిలో నిలిచి పోతాయి. అంతే కాదు aa నటన కూడా వేదికమీద నాటకం లో నటించడానికీ సినిమాల్లో నటించడానికీ తేడాలున్నాయి. aa రెండు మాధ్యమాల నటీనటులకు ప్రత్యేక సౌలభ్యాలూ ఇబ్బందులో వున్నాయి. అవి అట్లా ఉంచితే నాటకాల్లో నటించే నటులు సినిమాల్లో రాణించడం లేదా సినిమాలలో నటించే నటులు నాటకాల్లో రాణించడం వేరు. దేని గొప్పదనం దానిదే దేని పరిమితులూ దానివే. నాటకాల్లో నటులకు విశాలమయిన ఆంగికాభినయం కావాలి అదే సినిమా కు వచ్చేసరికి భావ వ్యక్తీకరణమే ప్రదానమవుతుంది.  అయితే తెలుగు  సినిమా రంగంలో తన ఉండర్ ప్లే తో, గొప్ప వాచకం తో ఆకట్టుకొని దశాబ్దాల పాటు ప్రేక్షకుల్ని అలరించిన నటుడు గుమ్మడి గా ప్రసిద్దు డయిన నటుడు గుమ్మడి వెంకటేశ్వర్ రావు. ఆయన మొదట నాటకాల్లో నటించి దుర్యోధన తదితర పాత్రల్లో రాణించాడు. ఆయనకు రెండురోజులు శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిన అప్పటి గొప్ప నాటక రంగ నటుడు మాధవపెద్ది వెంకట్రామయ్య సూచన మేరకు తను నాటకాల కంటే సినిమాకే ఎక్కువ ఉపయోగ పడుతానని సినిమాల వైపు మరలాడు. తొలి రోజుల్లో గుమ్మడి తెనాలి లో ఒక రేడియో షాప్ నిర్వహించేవాడు.తెనాలి కి వచ్చే అనేక మంది సాహితీ సినిమా దిగ్గజాలు గుమ్మడి షాప్ కు వచ్చేవారు. అట్లా వచ్చిన వారిలో చక్రపాణి, గోపీచంద్,మాధవపెద్ది వెంకటరామయ్య, తదితరులు వుండే వారు. 1949 లో బలరామయ్య, గోపీచంద్ లు లక్ష్మమ్మ, శ్రీ లక్ష్మమ్మ సినిమాలు హీయడానికి పూనుకొని శేషమంబ ను బుక్ చేయడానికి తెనాలికి రాగా ఆమె భర్త ప్రొడక్షన్ వ్వాల్లతో గుమ్మడి ఊరించి చెప్పి కొన్ని ఫోటోలని ఇచ్చాడు. కాని వాళ్ళు ఇవ్వాలనుకున్న పాత్ర కోన ప్రభాకర్ రావు కు వెళ్ళింది. తర్వాత 19 5 0 లో టి.ఎన్ సౌందర్ రాజన్ తీసిన ‘ అద్రుష్ట దీపుడు’ తో గుమ్మడికి సినిమా అవకాశం లభించింది. అట్లా మొదలయిన ఆయన సినీ ప్రస్తానం విజయవంతంగా కొనసాగింది. విలన్ పాత్రల్ని పోషించినప్పుడు గుమ్మడి అండర్ ప్లే చేస్తూ తడిగుడ్డతో గొంతులు కోసే పాత్రల్ని తొలి రోజుల్లో విరివిగా చేసారు. ‘పిచ్చిపుల్లయ్య’, తోడు దొంగలు’ సినిమాల్లో ఆయన వి దుష్ట పాత్రలే. ఇక ఆయన వేసిన పాత్రల్లో నమ్మిన బంటు లో జమీందారు భుజంగ రావు పాత్ర, ఇద్దరిమిత్రులులో దివాన్ భుజంగ రావు, వాగ్దానం లో మంచి మాటలతో యువతిని మోసగించే పాత్ర, ఇంకా లక్షాధికారి, వదిన, నేనూ మనిషినే, లాంటి అనేక సాంఘిక సినిమాల్లో విలన్ గా మెప్పించాడు గుమ్మడి. ఇక పౌరాణిక పాతల్లోకి వస్తే విశ్వామిత్రుడు గా హరిశ్చంద్రలో, ద్రో ణు డిగా ఎకలవ్యలో, ధర్మరాజుగా పాండవ వన వాసంలో, బలరాముడిగా మాయా బజారులో విశేషమయిన నటనను ప్రదర్శించాడు. మాయా బజారులో ‘ఏదీ నా ముసలం..’ అన్న గుమ్మడి డయలాగు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచే వుంది. ఇక జానపద సినిమాల్లో గుమ్మడి రాజ మకుటంలో ప్రచండుడిగా , రహస్యం సినిమాలో శ్రీకంఠ ప్రభువుగా గొప్ప నటనని ప్రదర్శించారు.

ఇక ఆయన సినీ ప్రస్తానం లో పెళ్లి పుస్తకం సినిమాకు ఉత్తమ చితం నంది అవార్డు, మరోమలుపు సినిమాలో నటనకు ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నాడు. ఇక ఆయన పోషించిన మహామంత్రి తిమ్మరుసు సినిమాకు గాను రాష్ట్రపతి వెండి మెడల్ అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుమ్మడి అద్వితీయ నటనకు రఘుపతి వెంకయ్య అవార్డు నిచ్చి సత్కరించింది. ,

 తోడు దొంగలు (1954) , మహామంత్రి తిమ్మరుసు (1962) సినిమాలు గుమ్మడికి బాగా గుర్తింపునిచ్చాయి. మాయా బజార్ (1957), మా ఇంటి మహాలక్ష్మి (1959), కులదైవం (1960), కుల గోత్రాలు (1962), జ్యోతి (1977), నెలవంక (1981), మరో మలుపు (1982),ఏకలవ్య (1982), ఈ చరిత్ర ఏ సిరాతో? (1982),  గాజు బొమ్మలు (1983), పెళ్ళి పుస్తకం (1991) గుమ్మడికి పేరుతెచ్చిన సినిమాలలో కొన్ని.

           తెలుగు విశ్వవిద్యాలయం మహామంత్రి తిమ్మరుసు (1962)లో కథానాయకుడి పాత్రకు జీవం పోసిన గుమ్మడిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది

         గుమ్మడి జాతీయ సినిమా బహుమతులకు న్యాయనిర్ణేతగా మూడు సార్లు, రెండు సార్లు నంది బహుమతుల సంఘం సభ్యునిగా, రెండు సార్లు నంది బహుమతుల సంఘం అధ్యక్షునిగా పనిచేశాడు. ఎన్టిఆర్ అవార్డు మరియు రఘపతి వెంకయ్య అవార్డు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించాడు.

ఆయన తనజీవిత చరిత్ర ‘తీపిగుర్తులు చేదు జ్ఞాపకాలు’ రచించాడు. గుమ్మడి ఆయనకిద్దరు (1995) సినిమా సందర్భంగా  గొంతు సరిగా పనిచేయనప్పుడు, ఇతరుల గొంతు వాడటంఇష్టంలేక నటించటం మానుకున్నాడు. తిరిగి జగద్గురు శ్రీ కాశినాయన చరిత్ర (2008) లో ఆయన వయస్సు మరియు గొంతు సరిపోతుంది కాబట్టి నటించాడు

     గుమ్మడి జనవరి 10, 2010  హైదరాబాద్ లో అనారోగ్యంతో మరణించారు.

Gummadi-manam

ADOOR GOPALAKRISHNAN

Posted on

కళాత్మక వాస్తవిక రూప శిల్పి  అదూర్ గోపాలకృష్ణన్

===========

          భారతీయ నవ్య సినిమా ప్రపంచంలో సత్యజిత్ రే తర్వాత అంత గా ప్రపంచ వ్యాప్త గౌరవాన్ని అనుడ్కున్న దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్. సినిమా ఒక పరికరం కాదు అది ఒక ఆలోచన, అభిప్రాయం, ఒక ఆవిష్కరణ అని విశ్వసించి సినిమా ద్వారా జనానికి సామాజిక వాస్తవిక అవగాహన ఆకలుగుతుందని అదూర్ సినిమాలు వివరిస్తాయి. అదూర్ గోపాలకృష్ణన్ అంతర్ముఖుడైన భావుకుడు. వాస్తవికతకు నిబద్దుదయిన దర్శకుడు. ఎప్పటికప్పుడు తనని తాను తెలుసుకుంటూ ఆవిష్కరించుకుంటూ దృశ్య మాధ్యమంలో ప్రకటిస్తూ వచ్చాడు అదూర్. ఒక రకంగా అదూర్ చిత్ర యాత్ర సమస్తం ఆయన విశ్వసించిన వాస్తవికతను ఆయన తన కోణంలో పూర్తిగా తనదయిన ప్రాంతీయ నేపధ్యంలోంచి చిత్రీకరిస్తూ పోయాడు. అందుకే అదూర్ కేవలం తన మాతృ భాష మలయాలంలోనే తన సినిమాలు తీసాడు తప్ప వేరే భాషలో నిర్మించే అవకాశాలు వచ్చినా అందుకు ముందుకు రాలేదు ఎందుకంటే తాను చేపాదలచుకున్నది తనకు తెలిసిన భాషలో చెప్పడమే సరయినదని విశ్వసించాడు. అదే పాటించాడు.

మీ సినిమా తలా రూపొందుతుందంటే కలగా మొదలయి, అక్షరంగా రూపుదిద్దుకొని పాత్రలుగా మారి సినిమా తయారవుతుందని అదూర్ ఒక చోట చెప్పుకున్నాడు. ప్రాంతీయ కోణంతో పాటు అదూర్ సినిమాల్లో మానసిక వాస్తవికత కూడా ప్రతిఫలిస్తూ వుంటుంది. ఆయన సినిమాల్లో స్త్రీ లది ప్రముఖమయిన పాత్ర. అట్లని aa పాత్రలు స్థ్రేఎ వాడ పాత్రలు మాత్రమే కాదు. మొత్తంగా కుటుంబాన్ని సమాజాన్ని నిభాయించుకునే స్త్రీ పాత్రలు ఆయనవి. అదూర్ గమనించిన కేరళ  మాతృ స్వామ్య లక్షణాలు ఆయన సినిమాల్లో ప్రతిధ్వనిస్తూ వుంటాయి. అదూర్ సాధారణంగా  తన సినిమాలకు తానే కథ కథనాలు సమకూర్చుకుంటాడు. ఆయన తీసిన ‘ మధిలుకల్ ‘ (వైకం మొహమ్మద్ భషీర్), విదేయన్ ( పాల్ జక్కరియా) ల కథల ఆధారంగా తీసాడు. తను సినిమా నిర్మాణం మొదలు పెట్టింతర్వాత మరే ఆలోచన తనలో చొరబడనీయకుండా మొదటి ప్రింట్ పూ ర్తి అయేంతవరకు దీక్షగా కోన సాగుతాడు.

తన నాలుగు దశాబ్దాల చలన చిత్ర జీవితంలో 12 కథాత్మక సినిమాలు రూపొందించిన అదూర్ అనేక డాకుమెంటరీ సినిమాలు తీసాడు. తన సినిమాల్లో ప్రతి వివరాన్నిపూర్హి గా తన సంతృప్తి మేరకే తీసుకునే అదూర్ తన సినిమాల్లో నటులు సెచ్చ తీసుజోవదాన్ని అంగీకరించరు. సినిమాల్లో నటులు నాటకాల్లోలాగా ప్రేక్షకులకోసం నటించడం లేదని  వారు దర్శకుడికోసం దర్శకుడి ఆశించినట్టుగా దర్శకుడి సంతృప్తి మేరకు నటించాలని అంటారు. పాత్రల్ని సృష్టించి కథ మేరకు ఆవిష్కరింప చేసే పని దర్శకుడిదే కనుక నటులు పాత్రల్ని ఇంప్రోవైస్ చేయడాన్ని సమంజసం కాదంటారు. అంతే కాదు అదూర్ నటీనటులకు పాత్రల వివరాలు మాటలు సీన్లు సెట్లోకి  వచ్చింతర్వాతే ఇవ్వాలంటాడు. ఆతర్వాతే రిహార్సల్ తర్వాత షూట్ అంటాడాయన. అట్లా సినిమాలకు సంభందించి తనదైన ప్రత్యేక ఒరవడిని సృష్టించాదాయన. అందుకే దర్శకుడి దృక్కోణాన్ని తెరపైకి ఎక్కించి ప్రపంచ వ్యాప్త ఖ్యాతిని సంపాదించాడు.

మలయాళీ చలన చిత్ర రంగంలో అప్పటిదాకా ఉన్న నాటకీయత దాబికాల్ని తోసిరాజని అద్దోర్ గోపాలకృష్ణన్ తన మొట్టమొదటి సినిమా ‘స్వయంవరం’ తో నూతన ఒరవడిని మొదలుపెట్టాడు. జూలై 3 1941 న జన్మించిన అదూర్ గోపాలకృష్ణన్ కుటుంబం కథాకళి నేపధ్యం వున్న కుటుంబం కావడం తో చిన్ననాటినుండే నాటకాలు ప్రదర్శనలతో ఆయన జీవితం ప్రారంభమయంది. కథాకళి లో వున్న సంగీత ఒరవడి, శారీరక సంజ్ఞలు అదూర్ని అమితంగా ప్రభావితం చేసాయి. 8 ఏళ్ల వయసులోనే వేదికలెక్కి ప్రదర్శనలిచ్చారు. డిగ్రీ చదువు పూర్తి చేసుకున్న తర్వాత తమిళ నాడు లోని దిండిగల్ లో ఉద్యోగం చేసాడు.తర్వాత పూనా లోని ఫిలిం ఇన్స్టిట్యుట్ లో స్క్రీన్ప్లే, డైరక్షన్ లలో డిప్లొమా  పొందాడు. తర్వాత త్రివేండ్రం వచ్చి కొంత మంది మిత్రులతో కలిసి రాష్ట్రంలో మొట్టమొదటి ఫిలిం సొసైటీ ‘చిత్రలేఖ’ స్థాపించాడు. తర్వాత సినిమా నిర్మాణం కోసం ‘చిత్రలేఖ ఫిలిం కొ ఆపరేటివ్ ‘ ను ఆరంభించాడు. తాము కొంత చిత్రలేఖ సంస్థ కొంత నేషనల్ ఫిలిం ఫైనాన్స్ సంస్థ నుంచి కొత్త అప్పు తీసుకొని 1972 లో ‘స్వయంవరం’ తీసాడు. నూతన జీవితాన్ని ఆరంభించాలనే ఓ జంట ఎదుర్కొనే అడ్డంకులు ఒడిదొడుకులు ప్రధాన అంశంగా వుంటుందీ చిత్రంలో కాని aa నేపధ్యంలో అదూర్ ఆకాలం నాటి సామాజిక ఆర్ధిక అంశాల పైన ఒక స్టేట్మెంట్ లాగా ఈ సినిమా రూపొందించాడు. అత్యంత వాస్తవిక ధోరణిలో చిత్రీకరించబడి ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకుంది. నిజానికి విడులయిన మొదటి రోజుల్లో ప్రేక్షకులు రాక ఆర్థికంగా వైఫల్యాన్ని ఎదుర్కొంది. కాని ఎప్పుడయితే జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకొందో దాన్ని మళ్ళీ రెలీస్ చేయడంతో జనం దృష్టిని ఆకర్షించి గొప్ప విజయాన్ని సాధించింది. తర్వాత అద్దోర్ తీసిన సినిమా ‘ కోడియాట్టం’. ఇందులో ఒక వ్యక్తి అమాయక ఏదీ పట్టించుకోని వ్యక్తి నుండి ఒక సంపూర్ణ వ్యక్తిత్వం కల మనిషిగా ఎదిగిన క్రమాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. సినిమా మొత్తం కేరళ ఆలయాల్లో జరిగే పండుగలా జరుగుతుంది. కోడియాట్టం ప్రధాన పాత్ర దారి గోపికి ఈ సినిమా గొప్ప పేరును తెచ్చి పెట్టడంతో పాటు అనేక అవార్డులు సాధించింది. తర్వాత అదూర్ తీసిన ‘ఎలిపత్తాయం’  

అద్దోర్ సినీ రంగ జీవితంలో గొప్ప సినిమా గా ఎంచబడింది. ఇది కేరళ లోని ఫ్యూడల్ వ్యవస్థను అత్యంత వాస్తవికంగా ఆవిష్కరించి. బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యుట్ అవార్డును గెలుచుకొంది. ఇఅ అదూర్ ‘ ముఖాముఖం’ ఒక కమ్యునిస్టు కార్యకర్త జీవితం పైన నిర్మించబడి గెలుపు ఓటముల సంక్షోభాల్ని ఆవిష్కరించింది. ఇక ‘ అనంతరం’ అదూర్ స్వీయ జీవిత కథాత్మక సినిమా గా చెప్పుకుంటారు. నిర్మాణ సరళి లో మొదట  మోనోలోగ్ గా ప్రారంభమయి కోన సాగుతుంది. వాస్తవం, కల ల మధ్య ఊగిసలాడే జేవితాన్ని అనంతరం అద్భుతంగా చిత్రిస్తుంది.

తర్వాత వైకం బషీర్ కథ ఆధారంగా ‘ మథిలుకల్ ‘ తీసాడు. ఇది కూడా చిత్రీకరనలోవిలక్షనతు సంతరించుకుంది. స్వాతంత్ర పోరాట కాలంలో బషీర్ అనుభవించిన జైలు జీవితాన్ని మథిలుకల్ చిత్రించింది. ఆరాట కాలంలో బషీర్ను జైల్లో వేస్తారు. జైలు గోడకి అవతల మహిళా జైలులో వున్న నారాయని తో మాట కలుస్తుంది. గోడకు చెరో పక్క వున్న a ఇద్దరి నడుమా స్నేహం కుదుర్తుంది. ఒకరిని ఒకరు చూసుకునే అవకాశం లేదు కాని కాని మాటలు కలుపుతాయి చిత్రీకరణ గొప్పగా సాగుతుంది. ఇద్దరూ బయట ఆసుపత్రిలో కలుసుకోవాలనుకుంటారు కాని వీలు కాదు. ఇందులో మమ్ముట్టీ అద్భుతంగా నటించాడు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. తర్వాత అదూర్ విదేయన్, కథాపురుషన్ తీసాడు. ఇవి రెండూ కేరళలో కొంత వివాదాస్పదమయ్యాయి. విదేయన్ రచయిత పాల్ జక్కరియా తన కథకు అదూర్ న్యాయం చేయలేదని హిందూత్వాన్ని జోడించి నవలకు యదార్థ రూపం ఇవలేక పోయాడని అనడంతో వివాదం చెలరేగింది. దానికి జవాబుగా అదూర్ ఇట్లా అన్నాడు ‘ సాహిత్య పఠ నం వ్యక్తిగత అనుభవం అదే సినిమా సామూహిక అనుభవం కాబట్టి సినిమా రూపాన్తరీకరణ నవల లాగే ఉండాలనుకోవడం సమంజసం కాదు’. తర్వాత అదూర్ తీసిన కథాపురుషన్ స్వీయ కథాత్మక సినిమా గా నిలిచింది. ఇది కేవలం సినిమాఎన్ కాకుండా 40 నుంచి 80 దాక కథానాయకుడి చరిత్రగా తెరకెక్కింది కాని అది కేవలం అతని జీవితమే కాకుండా అయా కాలాలకు సంభంచిన సామాజిక చరిత్రను సైతం చిత్రించింది. ముఖ్యంగా ఆయా కాళాల దృక్పథాల ప్రభావాల్ని ప్రతిహావంతంగా చూపించింది.

ఇక అదూర్ తీసిన ముఖాముఖం కూడా కొంత వివాదాన్నే లేవనేత్త్తింది ఇది కేరళలో కమ్యునిస్టుల వైఫల్యాల్ని చూపించిం ది. దాంతో ముఖాముఖం కమ్యునిస్టుల వ్యతిరేక చిత్రం గా ఆరోపించబడింది. ఇందులో ప్రధాన పాత్రదారికి నత్తి పెట్టడంతో సూచన ప్రాయంగా ఒక నాయకుడిని ప్రతిబింబించి వివాదం ఎక్కువయింది.

తర్వాత అదూర్ ‘ నాలు పెలుంగల్ ‘ తీసాడు. ఇది తగజి శివ శంకర పిల్లి రాసిన నాలు కట్ర్హల్ని జోడించి నిర్మించాడు. స్త్రీల పాత్రల్ని ఆవిష్కరిస్తూ తీసిన ఈ సినిమా నాలుగు కథల సమ్మేళనంగా వుంది. తర్వాత అదూర్ పెన్న్యం నిర్మించాడు. ఇట్లా ఆయన నిర్మించిన సినిమాలు అంతర్జాతీయంగా ఎంతో పేరు గడించి సొంత గొంతును పలికించి నిలబెట్టాయి.

ఫీచర్ films తో పాటు అదూర్ అనేక డాక్యుమెంటరీ సినిమాలు తీసాడు. కాలమండలం గోపి లాంటి కథాకళి కలాకారు డి పైన ఆయన తీసిన డాక్యుమెంటరీ లు సాదికరికమయినవిగా పెరుతేచ్చుకున్నాయి.

 మానవీయ విలువల్ని ఆవిష్కరిస్తూ కళాత్మక వాస్తవికతకు తోడు మానసిక వాస్తవికతను తెరపై నిజాయితీగా చిత్రిస్తూ ముందుకు సాగుతున్న అదూర్ గోపాలకృష్ణన్ భారతీయ సినిమాకు అందించిన ఆణిముత్యాల్లాంటి సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి ఆయన ఖ్యాతి కూడా చిరస్థాయిగా నిలుస్తుంది.

-వారాల ఆనంద్  

manam= adoor

మబ్బు తునక (poem)

Posted on Updated on

మబ్బు తునక

——————– వారాల ఆనంద్

  వేడి గాడ్పుల్ని వెంటేసుకొని 

వెచ్చటి నిట్టూర్పులతో

వేసవి నా ముంగిట నిలిచింది

 

మంద్రస్వరంతో మాటల్ని

గుస గుసగా ధ్వనిస్తున్నది

 

నేనే పలకరిద్దామని

చేతులు సాచి బయటకు చూసాను

 

తడిలేని పొడి పొడి ‘వెల్తురు’ నిండా

అనంతమయిన దాహం కనిపించింది

 

ఎన్ని కడవలతో ఎన్ని కన్నీళ్ళతో

ఎట్లా తీర్చను

ఆ దాహాన్ని

 

గదిలోపల

నా మదిలోపల

నేనే తీరని దాహంతో

తీరం లేని సముద్రాన్నై వున్నానే

 

ఆకాశం కేసి చూస్తూ కూర్చున్నా

ఓ మబ్బు తునకయినా

కనిపించక పోతుందా అని

1530103913444_01

సాంత్వన (POEM)

Posted on Updated on

సాంత్వన

 మసకబట్టి మౌనం దాల్చిన  ‘మనసు’ను తేలిక చేద్దామని

తోటలో నాలుగు అడుగులు నడిచాను             

 కొమ్మ కొమ్మకూ విచ్చుకున్న పూలు

హరివిల్లులా హాయి గొల్పుతున్నాయి

 పరిమళాల భారానికి పూలేమో

తలలు వంచి నేల చూపులు చూస్తున్నాయి 

 దారిపొడుగూతా మట్టి రేణువులు

పూల ప్రేమతో పునీతమై పరవశిస్తున్నాయి

 పూల రెమ్మలకూ మట్టిపొత్తిల్లకూ నడుమ సాగుతున్న

రహస్య సంభాషణ నా మనసుకు పెద్ద ఊరట

 నడిచి వచ్చిన దారికి ప్రణమిల్లుతూ

నిలుచుండిపోయాను

 గొప్ప సాంత్వన

మనసుపై మసకలన్నీ మాయమయ్యాయి

                 – వారాల ఆనంద్swaanthana poem copy