వారాల ఆనంద్ కవిత్వం

సాష్టాంగం (Poem)

Image Posted on

sashtaangam

Advertisements

మబ్బు- గుల్జార్ కవిత

Posted on

మబ్బు 2

====

గుల్జార్ కవిత

——

నిన్న ఉదయం వర్షం విసురుగా వచ్చి

నా కిటికీని తాకింది

అప్పటికి నేనింకా నిద్దర్లోనే వున్నా

బయటంతా  చీకటి

 

లేచి వెళ్ళి బయట వర్షాన్ని

పలకరించే సమయం కాదిది

 

కెటికీ పరదాల్ని వేశాను

అయినా చల్ల గాలి విసురుగా నా ముఖాన్ని తాకి

తడి తడి చేసింది

 

నా హాస్య చతురత మూగవోయింది

లేచి కిటికీల్ని దడాల్న మూసేశా

తిరిగి ముసుగేసుకొని పడకేసా

 

మనస్తాపం చెందిన వాన కోపంతో

కిటికీ అద్దాల్ని కొట్టేసి వెళ్లిపోయింది

మళ్ళీ తిరిగి రాలేదు

 

కిటికీ అద్దం పగుళ్లు మాత్రం

అట్లాగే వుండిపోయాయి

అనువాదం: ఆనంద్ వారాల

ok

గడపదాకా వచ్చి (POEM)

Posted on

చావు

నన్నెప్పుడూ భయపెట్టలేదు

నేను

చావును భయపెడదామన్నా కుదర్లేదు

ఊపిరి తీసుకోవడం

రెప్పలు టప టప లాడించడం

నాకెవరూ నేర్పలేదు

 

గాలి వీచినంత సహజంగా

వెళ్తురు కురిసినంత స్వచ్ఛంగా

నాతో అల్లుకు పోయాయి

 

ప్రేమించమనీ ద్వేషించమనీ

నా కెవరూ చెప్పనేలేదు

మంచు చల్లగానూ

నిప్పులు వేడిగానూ వున్నంత నిజంగా

నా లొంచే పుట్టాయి

 

ఇష్టాల్నీ అయిష్టాల్నీ

ఎవరూ భోదించనే లేదు

 

వాన కురిసినట్టు

పిడుగు రాలినట్టు

ఎక్కడినుంచో ఎగిసి దుమికాయి

 

బతకమనీ బతుకు నేర్పమనీ

చావు అనీ చావు తథ్యమనీ

ఎవరూ దారి చూపాల్సిన పని లేదు

బతుకుని నమ్మిన వాన్ని

చావెప్పుడూ భయపెట్టలేదు

 

గడప దాకా వచ్చి

పలకరించి వెళ్లిపోతుంది

-వారాల ఆనంద్

images

కన్నీటి ధార (కౌముది లో కవిత)

Posted on Updated on

కన్నీటి ధార

నాకు కొంచెం నిద్ర పోవాలనుంది
శరీరాన్ని భూమికి సమాంతరంగా చాపలా పరిచి
దేహం లోని ధమనుల్నిండా గాలి నింపుకుని
కొంచెం విశ్రమించాలని వుంది
పగలూ రేయీ
పరుగు పరుగున పాకులాడి
కావలసిందేదో దొరకనితనంతో చేష్టలుడిగిన శరీరాన్ని
మూసిన  కనురెప్పల సాక్షిగా
చీకటి దారాలతో బంధించాలని వుంది
ఎండో వానో… ఉక్కపోతో ఉన్మాదమో
తెలియందేదో తెల్లగోలు కావాలనో
గానుగలా తెగ తిరిగి
వేడెక్కిన తలకు వూదు పొగేసో
అరికాళ్ళకు ఆముదం రాసో
నాక్కొంచెం చల్ల బడాలనుంది
అలసట ముడి విప్పి కొంచెం తెరిపిన బడాలునుంది
దేహానినిదేముంది కన్నంటుకుంటే చాలు
అలసటేమిటి అన్నీ
మంచు ముక్కల్లా కరిగిపోతాయి
దూదిపింజల్లా ఎగిరిపోతాయి
కానీ మనసే
అన్నినదుల్నీ తనలో ఇముడ్చుకున్న సముద్రంలా
అల్ల కల్లోలంగావుంది
కవ్వ మెదో చిలుకుతున్నట్టు
రాత్రీ పగలూ నిద్రా మెలకువా
అన్ని స్థితుల్లో
ఛిద్రం ఛిద్రమవుతున్నది
తుఫానులా కన్నీటి ధార కురిసి
ఎక్కిళ్ళు నిలిస్తేనే
మనసు స్వచ్చమవుతుంది
నేనూ స్పష్టమవుతాను

-వారాల ఆనంద్

Koumudi kavitha-nov17