Month: April 2016

తెలుగు సినిమా ‘పరిశ్రమ’ కు సామాజిక భాధ్యత లేదా?

Posted on Updated on

తెలుగు సినిమా ‘పరిశ్రమ’ కు సామాజిక భాధ్యత లేదా?

     సినిమా ఒక కళ అన్న వాత్సవం  నుండి తన రూపు రేఖల్ని మార్చుకుని వ్యాపారంగాను అనంతరం పరిశ్రమ గాను రూపాంతరం  చెందిన తెలుగు సినిమా ‘పరిశ్రమ’ కు కనీస సామాజిక భాధ్యత కరువయింది. దేశ వ్యాప్తంగా పని చేస్తున్న అనేక ప్రభుత్వ ప్రైవేట్ రంగ పరిశ్రమలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎంతో కొంత సామాజిక సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాయి. చట్ట పరంగానూ, బాధ్యతగానూ సేవా రంగం వైపు తమ సేవలు అందిస్తున్నాయి. కానీ పరిశ్రమగా ఎదిగిన తెలుగు సినిమా రంగం ఏనాడూ తమ సామాజిక భాధ్యతను నిర్వహించినట్టు కనిపించదు. కోట్లు పెట్టుబడి పెట్టడం, వందలాది స్క్రీన్స్ లో విడుదల చేయడం, ప్రతిగా 100 కోట్ల క్లబ్ లో చేరామా లేదా అన్నది మాత్రమే చూసుకోవడం తెలుగు సినిమాకు అలవాటయిపోయింది. అంతే తప్ప  సమాజానికి తమ వంతు బాధ్యతగా ఎలాంటి సేవా, కృషీ చేసిన దాఖలా లేదు. ఇక తెలంగాణా సమాజానికి తెలంగాణా కళలకు, కళాకారులకు మొత్తంగా తెలుగు సినిమా చేసిందేమీ లేదు.పైగా తీవ్ర నిర్లక్షం నిరాదరణకు తోడు తెలంగాణ భాష పట్ల జీవన విధానం పట్ల హేలనా పూర్వక వైఖరిని అవలంబించింది.

             భారత దేశం స్వాతంత్రం సాధించుకుని నెహ్రూ పాలన మొదలయిన కాలం లో హింది సిని

మా రంగం లో నెహ్రూవియన్ సిద్దాంతాల ఆధారంగా అనేక సినిమాలు వచ్చాయి. రాజ్ కపూర్ లాంటి దర్శకులు పలు సినిమాలు తీశారు. మరి ఆ బాధ్యత తెలుగు సినిమా రంగానికి లేదా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కే.సీ.ఆర్. వ్యూ తో ఒక లక్ష్యం తో తనదయిన విధి విధానాలతో చేపడుతున్న అనేక కార్యక్రమాల ఆధారంగా మంచి సినిమాలు తీసి ప్రజలకు మేలు చేసే కృషి చేయొచ్చు కదా, కనీసం ఆవైపు ఆలోచన చేస్తున్నట్టు గా కూడా కనిపించదు. నిజానికి చెరువుల పూడిక తీత, ఇంటింటికి మంచి నీరు లాంటి అనేక ప్రజామోద యోగ్యమైన కార్యక్రమాల ప్రేరణ తో కథలు రాసుకుని మంచి సినిమాలు తీయవచ్చు. లేదా నీటి అవసరాన్ని ప్రాముఖ్యతను పర్యావరణ పరి రక్షణను అనేక ఇతర అంశాల్ని తీసుకుని డాకుమెంటరీ చిత్రాల ద్వారా తెలుగు సినిమా తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించవచ్చు.  లేదా తెలంగాణ కళల ఆవిష్కరణను, తెలంగాణా యువత లో వున్న సృజనను వెలికి తీసే ప్రయత్నమూ చేయొచ్చు.

        కాదంటే హిందీలో ప్రముఖ నటుడు నానా పటేకర్ చేస్తున్న రీతిలో ప్రజలకు ఉపయోగ పడే పనులు చేయొచ్చు. కేవలం ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళే కాకుండా సుప్రసిద్ద పాపులర్ హీరో లు కూడా తమ పాపులారిటీని సామాజిక ప్రయోజనం కోసం వినియోగించవచ్చు. కానీ తెలుగు సినిమా రంగం లో దౌర్భాగ్యం ఏమిటంటే పెద్ద హీరోలు అనబడే వాళ్ళు తమ కొడుకుల్ని హెరోల్ని చేయడం లోనే బిజీగా వుండిపోతున్నారు.

          కేవలం ఇప్పుడే కాకుండా అనేక దశాబ్దాలుగా మద్రాస్ నుంచి హైదారాబాద్ కు తరలి వచ్చే క్రమంలో సినిమా రంగం ఆయా కాలాల్లోని రాష్ట్ర ప్రభుత్వాల నుండి తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ అనేక వసతుల్ని సౌకర్యాల్ని పొందింది. బంజారా హీల్స్, జూబ్లీ హీల్స్ లాంటి చోట్ల ఎకరాలకొద్ది స్థలాలు, ఏ.పి. ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి నిధులు, సబ్సిడీలు, అవార్డులూ రివార్డులూ పొందాయి.  సినిమా రంగా ప్రముఖులు శతవిధాల లబ్ధి పొందారు. కానీ ఆ రంగం ఏనాడూ తమ సామాజిక భాధ్యతను నిర్వహించిన పాపాన పోలేదు.   తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన కాలం లో తెలుగు సినిమా ప్రేక్షకపాత్ర పోషించింది. యువకుల ఆత్మహత్యల్ని మౌనం పాటించింది. కానీ ఈ హైదరబాద్ నగరం,ఈ తెలంగాణా ప్రజలు,ఈ  ప్రభుత్వం నించి ఇంత పేరు, ఆర్థిక లబ్ది పొందాం తిరిగి తెలంగాణాకు హైదరబాద్ కు ఏమిద్దామనే ఆలోచన రాకపోవడం, ఆలోచించక పోవడం అత్యంత విశాదకరం.   

           అంతే కాదు నెహ్రూ పాలనలో నాటి సాంస్కృతిక విధానం ఆధారంగా ఏర్పడ్డ ఫిలిమ్ డెవలప్ మెంట్  కార్పొరేషన్ సహకారంతో శ్యామ్ బెనెగల్, మృణాల్ సేన్ లాంటి అనేక మంది దర్శకులు తీసిన గొప్ప సినిమాలు అంతర్జాతీయ  స్థాయిలో మన దేశానికి ఎంతో పేరు తెచ్చాయి. ప్రపంచ సినీ యవనిక పైన భారతీయ సినిమాకు ఒక విశిష్ట మయిన స్థానాన్నిగుర్తింపునూ తెచ్చాయి. కాన్స్, బర్లిన్ లాంటి అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్స్ లో అవార్డులు అందుకుని ఖ్యాతిని గడించాయి. మరి దశాబ్దాలుగా రాష్ట్ర  ప్రభుత్వ సహకారం,ఆర్థిక తోడ్పాటునూ అందుకుంటున్న తెలుగు సినిమా స్వార్థంగా ఎదగడం తప్ప సమాజానికి ఎలాంటి సేవా చేయ లేదు, సినిమా నిర్మాణ రంగం లో కానీ, విజువల్ క్వాలిటీ పరంగా పేరు తెచ్చిందీ లేదు. పాశ్చాత్య దేశాల నుంచి వ్యాపార దృష్ట్యా సాంకేతికతను అరువు తెచ్చుకోవడం మాత్రం చేస్తున్నారు.  

    ప్రధాన స్రవంతి తెలుగు సినిమా రంగానికి తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం అందిస్తున్న సహకారం, తోడ్పాటు బహుశా మరే రాష్ట్ర ప్రభుత్వమూ అందించడంలేదన్నది వాస్తవం. వారి సమస్యల్ని పరిష్కరించేందుకు సినిమాటోగ్రఫీ శాఖను కూడా ఇండస్ట్రీ ఫ్రెండ్లీ మంత్రికి ఇచ్చారు.  ముఖ్యమంత్రి ఒక కాబినెట్ సబ్-కమిటీ ని వేసి మరీ తెలుగు సినిమా రంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్క రించే పనిలో వున్నారు. సింగల్ విండో అనుమతులు, తదితరమయిన అనేక సౌకర్యాల్ని తెలంగాణ ప్రభుత్వం అందించేందుకు ముందుకు వచ్చింది.ఈ నేపథ్యంలో తెలుగు సినిమా మూడు పువ్వులూ ఆరు కాయలుగా ఎదిగే పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. అంతే కాకుండా సినిమా రంగ అభివృద్ధికోసం 2000 ఎకరాల్లో ఫిలిమ్ సిటీ నిర్మాణానికి ఏర్పాట్లూ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

           ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయితే సినిమా రంగం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందోనని బెంబేలు పడ్డ తెలుగు సినిమా ప్రముఖులు కెసిఆర్ తన విజన్ మేరకు పూర్తి సహకారం అందిస్తుంటే చాలా ఆనందంగాను సౌకర్యంగానూ ఫీలవుతున్నది. కేవలం ఇప్పుడే కాకుండా అనేక దశాబ్దాలుగా మద్రాస్ నుంచి హైదారాబాద్ కు తరలి వచ్చే క్రమంలో ఆయా కాలాల్లోని రాష్ట్ర ప్రభుత్వాల నుండి తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ అనేక వసతుల్ని సౌకర్యాల్ని పొందింది. బంజారా హీల్స్, జూబ్లీ హీల్స్ లాంటి చోట్ల ఎకరాలకొద్ది స్థలాలు, ఏ.పి. ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి నిధులు, సబ్సిడీలు, అవార్డులూ రివార్డులూ పొందింది. సినిమా రంగా ప్రముఖులు శతవిధాల లబ్ధి పొందారు. కానీ ఆ రంగం ఏనాడూ తమ సామాజిక భాధ్యతను నిర్వహించిన పాపాన పోలేదు.   తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన కాలం లో తెలుగు సినిమా ప్రేక్షకపాత్ర పోషించింది. యువకుల ఆత్మహత్యల పట్ల  మౌనం పాటించింది.

        అట్లని తెలుగు సినిమా ను ప్రమాణాల పరంగా అంతర్జాతీయ స్థాయికి  తీసుకెళ్లి ఘనత వహించినదీ లేదు. ఇన్ని దశాబ్దాలుగా కనీసం జాతీయ  స్థాయిలో నయినా ఉత్తమ సినిమా గుర్తింపును అందుకున్నదీ లేదు. ఈ ఏడు బాహుబలికి ఉత్తమ చిత్రం అవార్డు వచ్చిందని గొప్పలు చెప్పుకోవడం తప్ప. బాహుబలి అవార్డు కూడా వివాదాస్పదమయిందే. అది పెద్ద చర్చనీయాంశం కూడా.

         ఇటీవలి కాలం లో రీమేక్ సినిమాలయినప్పటికీ దృశ్యం, ఊపిరి లాంటి కొంత విభిన్న మయిన సినిమాల్ని నిర్మించిన తెలుగు సినిమా తిరిగి మళ్ళీ సర్దార్ గబ్బర్ సింగ్ తో తమ తీరు మార లేదని మంచి సినిమాలు తెలుగు లో ఆక్సిడెంటల్ గా వస్తాయి తప్ప ఠ ఒరవడి మార లేదని ప్రకటించుకుంది. వ్యాపారమూ వారి లక్ష్యాలూ ఎట్లున్నప్పయికీ తెలుగు సినిమా రంగం అందులోని ప్రముఖులూ సామాజిక భాధ్యతను నిర్వహించాల్సి వుంది. తెలంగాణ పట్ల తమ వంతు పాత్రను పోషించల్సే వుంటుంది. లేదంటే తెలుగు చిత్రా సీమ నిలువెత్తు స్వార్థ సీమాగా, విలువల్లేని పరిశ్రమగా మిగిలి పోతుంది.

 

మెరుపు పుస్తకావిష్కరణ

Posted on Updated on

cover full copy

DSC_0296

 

 

 

 

 

‘MERUPU’ Literature of North Telangana written by AANAND VARALA was release on 24-04-2016 @film bhavan,Karimnagar. C.ParthasaradiIAS Secretary of Agriculture Telangana Govt. released the book.Poet and Public Service Member Mangari Rajender(ZIMBO), Vajjala Shiva Kumar, Nalimela Bhaskar and many other poets and writers of Telangana participated.

click చేయండి 

మెరుపు పుస్తకావిష్కరణ పూర్తి ఫోటోలు

Posted on

MY POEM PUBLISHED ON 17-04-2016 in NAMASTHE TELANGANA DAILY ‘BATHUKAMMA’

molaka poem NT

FILM FESTIVALS @ KARIMNAGAR

Posted on Updated on

Very first time in TELANGANA National Short and documentary film festivals and FILM TELANGANA was conducted at Karimnagar. pl click the links and see the festival books

-AANAND VARALA, FESTIVAL DIRECTOR.

DSC_0198

Mrs.KAVITHA KALVKUNTLA WAS CHIEF GUEST ONE OF THE FESTIVAL

 

I-NATIONAL SHORT &DOCUMENTARY FILM FESTIVAL  FJIM BHAVEN 2

 

 

II- NATIONAL SHORT & DOCUMENTARY FILM FESTIVAL 

festival book cover

III-NATIONAL SHORT & DOCUMENTARY FILM FESTIVAL 

DSC_0092

 

IV-NATIONAL SHORT & DOCUMENTARY FILM FESTIVAL  

 

 

Title

FILM TELANGANA FESTIVAL 

 

READ THE BOOKS

Posted on

pl click the link and read the book మనిషి లోపల   pl click the link and read the book మానేరు గల గల pl click the link and read the book సినీ సుమాలు     pl click the link and read the book బంగారు…

Source: READ THE BOOKS

READ THE BOOKS

Posted on Updated on

pl click the link and read the book

మనిషి లోపల  

first look cover

pl click the link and read the book

మానేరు గల గల

Maneru Galagala-FFFF

pl click the link and read the book

సినీ సుమాలు  

03 Cinee Sumaalu Book on Indian Women Cinema Weritten by Varala Anand

 

pl click the link and read the book

బంగారు తెలంగాణాలో చలనచిత్రం  

CINEMA STORIES COVER PAGE

 

 

మానేరు తీరం

Posted on

లింక్ ను క్లిక్ చేయండి, చదవండి

‘మానేరు తీరం’ రచన వారాల ఆనంద్

00 Poetry Book MANERU THEERAM By Varala Anand

కవితలు

Posted on

ఆనంద్ వారాల కవిత్వం

DSC_6635

కావడి కుండలు

=======================

కాలం భుజాలపై

బతుకు కావడి పయనం

ఊగుతూ తూగుతూ

 

కావడి కుండల్లో

ఒకటి ముందు మరోటి వెనక

ఒకటి సంతోషాన్ని

మరోటి దుఖాన్ని మోస్తూ

తూగుటుయాల్లాగా కావడిని కదిలిస్తున్నాయి

 

కాలం భుజం మార్చుకున్నప్పుడల్లా

కుండలు ముందు వెనకలవుతున్నాయి

కావడి కంగారు పడుతున్నది

 

 

కనికరం తెలీని కాలం

కదిలి పోతూ కదిలిపోతూ

ఏదో ఒక చోట

కావడిని దించేసి

తన దారిన తాను వెళ్లిపోతుంది

మట్టిలో కలిసిన

కావడి కుండలు

మళ్ళీ చిగురిస్తాయి

ఏనాటికయినా

==============


కల్ ఆజ్ ఔర్ కల్

ఈరోజు

నిన్నటి ప్రతి బింబం కాదు

రేపటి రోజుకు

ఇవ్వాల్టి రూపం వుండక పోవచ్చు

 

నిన్నటి కంటే

రేపు సుధీర్ఘ మయిందీ కావచ్చు

 

గతం గురించీ

పోగొట్టుకున్న దాని గురించే

మాట్లాడుతూ పోతే

 

నిన్నటికి రేపటికీ మధ్య

సన్నటి తెర కరిగి పోతుంది 

 

గతం లోంచి భవిష్యత్తుకు

వేసే నిచ్చెన కూలిపోతుంది

 

నవ్వులు చిందిస్తూ

కాలం నడిచి వెళ్లిపోతుంది

 

మిత్రమా

నువ్వూ నేనూ

కాలాన్ని వెనక్కి తిప్పలేక పోవచ్చు

 

సముద్రాన్ని ఎండ గట్టనూ లేక పోవచ్చు

తూఫాన్ని పిడికిట్లో బిగించ లేక పోవచ్చు

 

నేటి జీవితాన్ని

రేపటికి పునః ప్రారంభించవచ్చు

పూవులు పూయించ వచ్చు

 

==================

మనిషి కోసం… ఓ కన్నీటి చుక్క.

మనిషి మనిషి కేమివ్వ గలడు

సాటి మనిషి కేం చేయగలడు

 

చేద బావిలో బొక్కెనేసి

నీళ్ళు తొడినట్టు

అంతరాంతరాల్లోని దుఖాన్ని

తోడి బయట పోయగలడా

 

హృదయపు పొరల్లో మెటేసిన

ఒంటరి తనానికి మలాం పూసి

మాయం చేయగలడా

 

ఎడారిలో ఒయాసిస్సు కోసం

డి సముద్రం లో గుక్కెడు

మంచి నీళ్ళ కోసం వెతికినట్టు

తననుతాను

వెతుక్కుం టున్న మనిషి

సాటి మనిషి కేంచేయగలడు

 

కాల గమనంలో సాగిపోతున్న

సూర్యోదయాలూ చంద్రోదయాలకంటే

వేగంగా పరుగు చట్రంలోకి  

విసిరేయ బడ్డ మనిషి

 

మనస్సుని పోగొట్టుకుని

తన నుంచి తానెప్పుడో వేరయిన మనిషి

సాటి మనిషికేం ఊతమివ్వ గలడు

 

తన భుజాన్ని బండికానిలా

తాకట్టు పెట్టుకున్నవాడు

తోటి మనిషి

బరువునేం మోయగలడు

 

మనిషి తనాన్నే పోగొట్టుకుని

చుట్టూ వలయాన్ని

దిద్దుకున్న మనిషి

పక్కోడినేం పట్టించు కోగలడు

 

తనకు పోట్రాయి తగిలితేనో

మోకాలి చిప్ప పగిలి తేనో

పాదాల కింద మంట రగిలితేనో

వులిక్కి పడి కళ్ళు తెరిచే వాడికి  

చుట్టు  పక్కల వాళ్లేమి తెలుస్తారు

 

వాళ్ళే మనిషి కోసం

ఓ కన్నీటి చుక్క రాల్చాలి తప్ప

=====================

వేర్లు 

కొత్త చట్టాల నాగళ్ళ  తో

నా గుండెల్ని దున్నేస్తున్నారు

పగిలిన నా గుండె సాల్ల ల్ల

ఏ విత్తనం మొలకెత్తుతుంది

 

చెమటతో తడిసి ముద్దయి  సారవంత మయి

మా జీవితాల్లో పచ్చ దానాన్ని నింపిన నా తల్లిని

అమ్మేయ మంటున్నారు

 

మా కన్నీళ్లు తుడిచి కడుపు నింపి

తాతనూ అయ్యనూ

నన్నూ తర తరాలుగా

తలెత్తు కునేలా చేసిన భూమిని

సేకరిస్తా మంటున్నారు

 

నా కాల్రెక్కలు కత్తిరిస్తామంటున్నారు

 

కంపనీల  కోసమో కచ్చీ ర్ల కోసమో

నన్ను వదిలి పొమ్మంటున్నారు

 

భూమెందుకు దండగ బాట మార్చ మంటున్నారు

వేళ్ళతో సహా నడిచి పొమ్మంటున్నారు

 

మట్టిని బంగారం చేయగలిగిన

వాని మూలాల్ని తెంపి

మెడలు పట్టి గెంటేస్తున్నారు

. . . . . . . . . .. . .. . . .

 

వేళ్ళ కు చుక్కలు పెట్టి ముద్దర్లేయించుకుని

నోటి ముందటి ముద్దనే

లాగేసు కుంటున్నారు

 

వాడయితేమిటి వీడయితేమిటి

ఒక్క గొంగ ట్లోని వెంట్రుకలే కదా

 

==========================

 

ఆత్మ లోతుల్లో మొలకెత్తాలి

 

బాధ సాంధ్రత తెలిసినంతగా

భాష తెలీదు

 

గాయం సలపడం తెలినంతగా

మానడం తెలీదు

 

పెదాల మీద చిరునవ్వు కంటే

చెంపల పై నీటి చారికలే అధికం

 

తెలిసిందాని కంటే

తెలియందే ఎక్కువ

 

వ్యక్త పరిచిందానికంటే

అవ్యక్తమే అధికం

 

పెదాలు ఖాళీగానే వున్నాయి

గొంతుక సవరించ బడే వుంది

 

మాట మన రక్త సంబంధీకురాలే

 

అంతర్ బహిర్ భయాలన్నింటినీ

చిలక్కొయ్యకు తగలేసి

స్వేఛ్ఛగా మాట్లాడాలి

స్వచ్చంగా  జీవించాలి

 

చివరి అంచుకు చేరక ముందే

ఆఖరి క్షణం

ఎదురు కాక ముందే

సత్యం అంతరించక ముందే

 

ఆత్మ లోతుల్లో మొలకెత్తాలి

 

ఎప్పటికప్పుడు

పునరుజ్జీవులం కావాలి

======================

జీవితం

పరుపు బండ మీద

పరుగులుపెట్టే బండి చక్రం కాదు

 

అట్లని

కంకర రాళ్ళ గతుకుల రోడ్డు మీద

నడిచే నగ్న పాదాల నడకా కాదు

 

అడుగు అడుగిక్కీ మధ్య వ్యత్యాసాలు

కొన్ని హ్రస్వాలూ కొన్ని దీర్ఘాలూ

 

ఒక్కోసారి ముందుకూ

మరోసారి వెనక్కూ

నిప్పు మీదో

మంచు దిమ్మ మీదో

కఠిక చీకట్లోనో

పండు వెన్నెల్లోనో

 

అడుగులో అడుగు

అడుగు వెనకాల అడుగు

 

కదలిక బతుక్కి ప్రాణ వాయువు

చలన శీలతే జీవితం

=================

 

 

 

 

కొత్త దారులు కావాలి

Posted on

DSC_7821

కొత్త దారులు కావాలి

                                                                        అన్ని రంగాల మాదిరిగానే తెలంగాణా సినిమా కూడా ఇవ్వాళ క్రాస్ రోడ్స్ లో వుంది.మౌలికంగా తెలంగాణా సినిమా కు ప్రస్తుతం ఊపిరి పోసి  దాని ఎదిగుదలకు దోహదం చేయాల్సిన స్థితి నెల కొని వుంది. ఇప్పటికీ దశాబ్దాల క్రితం నిర్మిత మయిన తెలంగాణ నేపథ్యం కలిగిన కొన్ని సినిమాలు తప్ప ఇటీవలి కాలంలో పూర్తి తెలంగాణ సాంస్కృతిక జీవన నేపథ్యం కలిగిన సినిమాలు వచ్చిన సందర్భం అతి స్వల్పం. దానికి సరయిన కారణాల్ని కనుగొని చికిత్స చేయాల్సి వుంది. ఎలాంటి భేషజాలు లేని పరిశీలన అధ్యయనం జరిగితే తెలంగాణ సినిమాకి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే అవకాశం వుంది.

         నిజానికి సాంస్కృతిక రంగం, కళలు  ప్రజల మనోభావాల్ని అభిప్రాయాల్ని అనుభూతుల్ని విశేషంగా ప్రభావితం చేస్తాయి. బయటకు కనిపించినా లేకున్నా వాటి నీడలు మనిషి జీవన గతిలో స్పష్టంగానో అంతర్లీనంగానో వుండనే వుంటాయి. సాంస్కృత రంగంలో కవిత్వ మయినా, సంగీతమయినా, పెయింటింగ్ అయినా లేదా మారేదయినా అది ఆధునిక కళారూపమయిన సినిమా అయినా మానవ జీవితంతో విడదీయరాని  అనుభంధాన్ని కలిగివుంటాయి.  కానీ ఏ కళారూప మయినా ఎప్పటి కప్పుడు కొత్త ఆలోచనల్ని కొత్త రూపాల్ని, కొత్త దారుల్నీ ఎంచుకోక పోతే అవి క్రమంగా అంతరించి పోయే అవకాశం వుంది . ఆ స్థితిని గమనించి ముందుకు సాగినప్పుడే అవి ప్రజా జీవితంలో సజీవంగా మన గలుతాయి.  తమ ప్రభావాన్ని నిలుపుకొగలుగుతాయి. ఈ నేపథ్యంలో సినిమాకి సంభందించి హాలివుడ్ ,బాలివుడ్,టాలీవుడ్ తదితరాలుగా పిలువ బడుతున్న సినిమా ఇండస్ట్రీ లని చూస్తే అవి ప్రజల నిజమయిన జీవితాల నుంచి ఎంత దూరంగా వున్నాయో అన్న అనేక విషయాలు కనిపిస్తాయి.

        ఆధునిక సమాజంలో సాంకేతికంగా త్వర త్వరగా వస్తున్న ప్రభావాల్ని అందిపుచ్చుకుంటున్న కళా రూపంగా సినిమాని చెప్పుకోవచ్చు. కళ, విలువలకు  స్థానం అంతరించి, కేవలం సాంకేతి అంశాలు మాత్రమే  సినిమా నిర్మాణంలో కనిపిస్తున్నాయి. ఇవ్వాళ అందుబాటులో వున్న తెలుగు సినిమాల స్థితి పరిశీలిస్తే వంద కోట్లు పెట్టుబడి పెట్టి వందల కోట్లు ఎలా వసూలు చేసికోవాలోఅన్న ఒక చట్రంలోకి అది చేరిపోయినట్టు తెలుస్తుంది.  ఇందులో ఆడియన్స్ మేనేజ్ మెంట్, థియేటర్ బ్లాకింగ్, మీడియా కవరేజ్ లాంటి అంశాలే ప్రధానం  అయిపోయాయి.  అంతేకాదు వినోదం పన్ను మినహాయింపు, పైరసీ అరికట్టడం లాంటి కోరికల్తో ప్రభుత్వాల్ని ప్రభావితం చేసి లాభాలు గడించే ప్రయత్నాలూ తెలుగు సినిమా చేస్తున్నది.  ఈ మొత్తం స్థితిలో తెలంగాణ సినిమా రూపొందడం, మనగలగడం అత్యంత క కాష్ట సాధ్యమైన విషయం. తెలంగాణ సినిమా కూడా ప్రస్తుత తెలుగు లేదా హింది వ్యాపార సినిమా లాగా రూపొందాలని భావిస్తే అది అనవసర ప్రయత్నమే.  ఇప్పటికే నిలదొక్కుకుని వేళ్లూనుకుని వున్న ఇండస్ట్రీ లో వూపిరి తీసుకోవడం అసాధ్యమే కాదు అనవసరం కూడా.  మళ్ళీ అలాంటి సినిమాలు తీయడానికి ప్రత్యేకంగా తెలంగాణ సినిమా అవసరమే లేదు.

            అంటే తెలంగాణ సినిమా కొత్త దారుల్ని వెతుక్కోవాలి. తెలంగాణ సమాజం లోని ఆరాటాలూ పోరాటాలు అద్భుతమయిన కథా  సంవిధానం తో అందివచ్చిన సాంకేతికతో తనదయిన స్వంత గొంతు గల సినిమాల్ని రూపొందించగలిగితేనే దానికి  ఉనికి, భవిష్యత్తు వుంటుంది. సరయిన మానవీయ విలువలు కలిగిన విషయాల్ని కథాంశాలుగా స్వీకరించి కళాత్మక వాస్తవిక వాద  సినిమాల్ని రూపొందించ గలిగితే తెలంగాణ సినిమా అనేక విజయాల్ని సాధించగలదు. ఒకటి రెండు కోట్ల పెట్టుబడి తో వంద శాతం వసూళ్లని సాధించిన ఉదంతాలు మనకు ఇటీవలి కాలం లో దేశ వ్యాప్తంగా హిందీ లోనూ వివిధ ప్రాంతీయ భాషల్లోనూ మనకు  కనిపిస్తాయి. అహమద్ నగర్ జిల్లాకు చెందిన యువ రైతు యువకుడు బవూరావు కర్హడే ఇటీవలే తీసిన ‘ఖ్వాడా’  ఇందుకు ఒక మంచి  వుదాహరణ. అంతే జాదు ఈమధ్యే రూపొంది జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన చైతన్య తంహానే నిర్మించిన ‘కోర్ట్’ ఆస్కార్ కు నామినేట్ అయింది. ఇంకా చెప్పాలంటే అవినాష్ అరుణ్ ‘ఖిల్లా ‘, నీరజ్ ఘయవన్ తీసిన ‘మాసాన్’. మణికందన్  కాకముత్తయ్‘, కాను బెల్ తీసిన‘తిథ్లీ’ ఈలా అనేక సినిమాలు సరికొత్త అంశాలతో ఎలాంటి స్టార్ హంగామాలూ లేకుండా నిర్మించబడి విశేష ప్రాచుర్యాన్ని పొందాయి. జెవితం లోని విభిన్న కోణాలకు చెందిన సరికొత్త అంశాల్ని ఇతివృత్తాలుగా తీసుకుని నిజాయితీగా సినిమా తీయగలిగితే విజయాలు వరిస్తాయని ఈ సినిమాలు నిరూపిస్తున్నాయి. ఈ చిత్రాల్లో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టె అవసరమూ లేదు. పెట్టిన పెట్టుబడికి ధోఖానూ లేదు.

         సరిగ్గా ఇలాంటి సరి కొత్త దారుల ప్రయాణమే తెలంగాణ  సినిమా అనుసరించాల్సి వుంది. విలువల్లేని, ఎలాంటి మానవీయ సువాసనలు లేని ప్లాస్టిక్ పువ్వుల్లాంటి వ్యాపార సినిమాల కోసం తమ శక్తిని దార పోసే బదులు తెలంగాణ చలన చిత్రకారులు విభిన్నంగా ఆలోచించడం ప్రారంభించాల్సి వుంది. అందుకు ఇప్పుడొస్తున్న అంతర్జాతీయ సినిమా పోకడలని అధ్యయనం చేయాలి.

            నిజానికి తెలంగాణ ఒక కథల గని. మానవీయ విలువలకు నెలవు. మనుషుల్ని ప్రేమించడం, కనబడిన వాళ్ళని అన్నా  అని పిలవడం నుంచి అనేక అంశాల్లో విశిష్టతని  చాటు కున్న నేల . అలాంటి తెలంగాణ సమాజం లో సినిమాలకు సబ్జెక్టు లకు కోడువ లేదు. తరచి చూడడమే తెలంగాణ చలన చిత్రకారులు చేయాల్సిన పని.  ఎప్పుడూ గత సినిమాల గురించి మాట్లాడటమే కాకుండా కొత్త దారుల్ని వేసుకుంటూ పోవాల్సిన అవసరం వుంది. కొత్త తరానికి సరి కొత్త చైతన్యాన్ని అందించాల్సి వుంది.

            ఈ విషయం లో తెలంగాణ ప్రభుత్వం కూడా చేపట్టాల్సిన అంశాలున్నాయి. కొత్త పరిశ్రమలకు పారిశ్రామిక వేత్తలకు అందిస్తున్న రీతి లోనే తెలంగాణ సినిమాకు ప్రోత్సాహకాలను, సింగిల్ విండో ఆర్థిక ప్రోత్సాహకాల్ని ఇవ్వగలిగితే కొత్త వాళ్ళకు సరికొత్త దారులు వెదికే అవకాశం  కలిగించినట్టు  అవుతుంది.  గతంలో నెహ్రూ ఆద్వర్యంలో ఏర్పాటయిన ఎన్ ఎఫ్ డీసీ లాగా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం అందించ గలిగితే తెలంగాణ సినిమా ఎదిగే అవకాశం వుంది. ఇప్పటికే ఫిలిమ్ సిటీ లాంటి వసతుల పైన చర్యలు చేపట్టిన రాష్ట్ర  ప్రభుత్వం  తెలంగాణ సినిమా పైన కొంత ప్రత్యేక  దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి.

 

 

TWINS & GRIEF (Tr.ANU BODLA)

Posted on

DSC_0023TWINS

Twins

Whether sorrow is in me

Or I am in sorrow

I don’t know, like my poetry

In between the earth and the sky

In between me and my soul

They both adhere to me

I may walk step by step

Wheel of life may rotate and rotate

Going back and forth

They adhere to me like a lubricant

My sorrow and my poetry

Beneath a tree or eaves

Either morning or evening

Either I stand or walk

They follow me like a shadow

On a road or on a paper

I keep walking

One foot on ground and the other in thoughts

Ever they adhere to me

I know

Poetry and sorrow are twins

కవలలు

దుఖం నాలో ఉన్నదో

నేను దుఃఖంలో వున్నానో

నాకు తెల్వదు నా కవిత్వం లాగే

భూమికీ ఆకాశానికి మధ్య

నాకూ నా అంత రంగానికీ మధ్య

అంటి పెట్టుకునే వుంటాయి

అడుగుతీసి అడుగు వేసినా

బతుకు చక్రం ముందుకో వెనక్కో

గిర గిరా తిరిగినా

కందెన లాగా అంటిపెట్టుకునే వుంటాయి

దుఖమూ కవిత్వమూ

చెట్టు కిందో చూరుకిందో

ఉదయమో సాయంత్రమో

నిలబడ్డా నడచినా

నీడలా అంటిపెట్టుకునే వుంటాయి

రోడ్డు మీదో కాగితం మీదో

నడుస్తుంటా నా

ఒక అడుగు నెల మిద మరోటి ఆలోచనల్లో

నన్ను అంటి పెట్టు కునే వుంటాయి

నాకు తెలుసు

దుఖమూ కవిత్వమూ కవలపిల్లలని

Grief

The Grief

 

As though black clouds cast over

As though in a storm of dust

The wind on the road

Spin and spin and inundated

The grief hit me

 

As though the waves of the sea spiraled

Like a storm and drenched

As though all the leaves of trees

Fell in a heap

The grief encompassed me

 

Hands to move

Legs to walk

Eyes to cry – all of them

As though covered by layers of sand

As though stuck behind the bars

The grief encompassed heart

Controls the thoughts

 

The walking chariot came to a halt

The directions on the way disappeared

All the hopes collapsed

 

But

Time has a healing medicine

I have a way of

sprouting again and again

 

Slicing the clouds of the sky

Setting the waves of the sea

Like a great tree that doesn’t waver

Even in a whirlwind, I stood

 

Eyes that drooped in tears

Turned to be sun and moon

The grief beneath the layers of heart

Got centered

Life again

Took a new road

 

దు:ఖం కేంద్రీకృతమయింది

 

ఆకాశం లో కమ్ము కున్న నల్ల మబ్బుల్లాగా

గాలి దుమారం లో రోడ్డు మిద గాలి

సుడి దిరిగీ దిరిగీ

ముంచు కొచ్చినట్టు దుఖం నా మిద దాడి చేసింది

 

సముద్రం లో అలలన్నీ సుళ్ళు తిరిగి తిరిగీ

తుఫాను గా ముంచెత్తి నట్టు

చెట్ల ఆకులన్నీ రాలి కుప్ప బడ్డట్టు

నన్ను దుఖం మొత్తంగా ఆవరించేసింది

 

కదలడానికి చేతులూ

నడవడానికి కాళ్ళూ

ఏడి చేందుకు  కళ్ళూ.. అన్నీ

ఇసుక పొరల కింద కమ్మేసినట్టు

ఇనుప చెరల కింద బంది అయినట్టు

మనసంత ఆవరించిన దుఖం

ఆలోచనల్నీ నియంత్రిస్తోంది

 

 

నడుస్తున్న రథం నిలిచిపోయింది

తోవ మిద దిక్కులు అదృశ్యం అయిపోయాయి

ఆశలన్ని కుప్ప కూలిపోయాయి

 

 

కాని

కాలానికి మరుపు మలాం తెలుసు

నాకేమో మళ్లీ మళ్లీ మొలకెత్తే

వాటం తెలుసు

 

ఆకాశంలో మబ్బుల్ని ముక్కలుగా నరికేసి

సముద్రం లో అలల్ని సరి చేసి

సుడిగాలి లో చెదరని మహా వృక్షం లా

నిలబడ్డా

 

నదులై వాలిపోయిన కళ్ళు

సూర్య చంద్రులయినాయి

మనసు పొరల అడుగున ఆవరించిన

దు:ఖం కేంద్రీకృతమయింది

బతుకు మళ్లీ

కొత్త దోవలోకి మళ్ళింది