Month: March 2018

రేడియో గొంతు నొక్కవద్దు

Posted on Updated on

రేడియో గొంతు నొక్కవద్దు

Wed, March 28, 2018

 

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అద్దంకి మన్నార్, భాయి యో ఔర్ బెహనో మై అమీన్ సయాని బోల్ రహాహూ, ప్రాం తీయ వార్తలు చదువుతున్నది సురమౌళి, రేడియో సిలోన్ నుంచి మీనాక్షీ పొన్నుదురై ఇంకా రేడియో అక్కయ్య, అన్నయ్య, చిన్నక్క రాంబాబు.. ఇట్లా ఎన్నో మాటలు, గొంతులు ఈ తరానికి పరిచయం లేకపోవచ్చు. కానీ ఒకనాడు ఇంటింటా మార్మోగిపోయాయి. అంతేకాదు 1969నాటి తొలి తెలంగాణ పోరాట సమయంలో ఉద్యమవార్తలు వినేందుకు తెలంగాణ ప్రజలు రేడియోల ముందు బారులు తీరిన దృశ్యా లింకా మదిలో గుర్తున్నాయి. అట్లా జనజీవన స్రవంతిలో భాగమైపోయి న రేడియో ఇవ్వాళ సాంకేతిక అభివృధ్ధి నేపథ్యంలో అసంబధ్ధమైపోయిం దని, అంతరించిపోతున్నదనే వాదాలు వినిపిస్తున్నాయి. ఎంత సాంకేతికత పెరిగినప్పటికీ ఆధునికతను సంతరించుకొని రేడియో నేటికీ సజీవంగానే ఉందని చెప్పుకోవచ్చు. పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో ఆవిర్భవించి న టీవీ, ఇంటర్నెట్ ఏ విలువలను పోషిస్తున్నయో, కుటుంబాల్లో సమా జంలో ఎలాంటి వాతావరణాన్ని కల్పిస్తున్నయో తెలిసిందే. ఇంకా భాష విషయంలో టీవీలు ఎట్లాంటి కృత్రిమ భాషను వాడుతున్నాయో, కనీసం పలకడమై నా స్పష్టంగాలేని యాంకర్లతో భాష ఎంతగా భ్రష్టుపట్టి పోతున్నదో మనం చూస్తూనే ఉన్నాం.

టీవీలు, ఇంటర్నెనెట్‌కూ ప్రజలు ఎంత అలవాటుపడినప్పటికీ ఈ రోజుల్లో అర్థవంతమైన, ఆరోగ్యవంతమైన భాషా వినియోగానికీ, భావాల ప్రసారానికి రేడియో ఎంతో ఉపయోగపడే మాధ్యమంగా అర్థం చేసుకోవాల్సి ఉన్నది. అంతేకాదు వినియోగంలో రేడియో చాలా సౌకర్యవంతమైంది. ట్రాన్సిస్టర్ వచ్చిన తర్వాత మనతోపాటు రేడియో కదిలే సమాచార సాధనంగా మారింది. ఇక ఓ దిక్కు రేడియో మోగుతూ ఉండగానే మన పనిచేసుకుంటూ ఉండొచ్చు. టీవీల ముందు స్థిరంగా ఉండిపోవాల్సిన అవసరంలేదు. ఇవ్వాళ డీటీహెచ్ ప్రసారాల నుంచి మొదలు కేబుల్ ప్రసారాల దాకా రేడియో స్టేషన్ ప్రసారాలకు అవకాశం ఆక్సెస్ కల్పిస్తున్నాయంటే రేడియో మనుగడ ఇంకా అవసరమనే విషయం బోధ పడుతున్నది.

1981 ఆగస్టులో మొదలైన ఎంటీవీ ప్రారంభ కార్యక్రమంలో వీడి యో కిల్ రేడియో స్టార్ అని పాట పాడారు. కానీ నాలుగు దశాబ్దాల తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా రేడియో అనేక ఆటుపోట్లు, అవరోధా ల నడుమ ఇంకా సజీవంగానే ఉన్నది. పాలకుల నిర్లక్ష్యం, వ్యాపార దృక్పథాలతో రేడియో కొంత వెనుకబడ్డట్టు గానూ, టీవీ ఇంటర్నెట్ ఆధిప త్యంలో కొనసాగుతున్నట్టు కనిపించినప్పటికీ, మనదేశంలో నేటికీ ఆకాశవాణి 23 భాషల్లో, 179 మాండలికాల్లో తన ప్రసారాలను కొనసా గిస్తున్నది. అంతేకాదు భౌగోళికంగా దేశంలో 92 శాతం ఉన్న ప్రాంతాల కూ, 99.19 శాతం ప్రజలకు తమ ప్రసారాలను వినిపిస్తున్నది. రేడియో ప్రాధాన్యాన్ని దాని ప్రసార విస్తృతిని గమనించే ప్రధాని మోదీ మన్ కీ బాత్ పేరున ప్రజలతో తన భావాలను పంచుకునేందుకు రేడియోను వాహకంగా ఉపయోగించుకుంటున్నారు.

దేశంలో పలుచోట్ల జరిగిన ప్రమాదాలు, ఊహించని ఉపద్రవాలూ వచ్చినప్పుడు రేడియో అందించే సేవలు అనితర సాధ్యమైనవి. 2004 నాటి సునామీ, 2013లో వచ్చిన ఉత్తరాఖండ్ జలప్రళయ సంధర్భంలోనూ రేడియో అందించిన ఆపత్కాల సేవలూ, సమాచారం అద్భుతమై నవి. నేటికీ దేశంలోని మారుమూల గ్రామాలకు చెందిన ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రసా ర మాధ్యమం రేడియోనే. ఇప్పటికీ బుందేల్‌ఖండ్, గఢ్వాలీ, అవధ్, సంథాలి లాంటి భాషల్లో 180కి పైగా కమ్యునిటీ రేడి యోలున్నాయంటే రేడియో రీచ్‌ను అర్థం చేసుకోవచ్చు.

ఇంతటి ప్రభావవంతమైన రేడియో ప్రసారాలను మొదట మోర్స్ 18 44లో కనిపెట్టిన టెలిగ్రాఫ్ సుసాధ్యం చేసింది. టెలిగ్రాఫ్, టెలిఫోన్ విస్తృతంగా ప్రాచుర్యంలోకి రాకముందే వాక్యుమ్ ట్యూబ్ ద్వారా ధ్వని తరంగాలను పంపించే ప్రక్రియ రావడంతో రేడియో ప్రసారాలు సాధ్యమయ్యా యి. అమెరికాలో 1910-12 ప్రాంతంలోనే రేడియో వాడకం గురించి మార్గదర్శకాలు రూపొందాయి. 1922 నాటికి ఇంగ్లండ్‌లో రేడియో ప్రసారాలు స్థిరీకరించబడి బీబీసీ ఏర్పడింది. ఇక మనదేశంలో రేడియో వ్యవ స్థ 1926లో ప్రారంభమైంది. ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపనీ ముంబై, కోల్‌కతా నగరాల్లో 1927లో రేడియో కేంద్రాలను ఆరంభించింది. తర్వా త 1930లో ఆ సంస్థ ఇండియన్ స్టేట్ బ్రోడ్ కాస్టింగ్ సంస్థగా మారింది. తర్వాత 1936లో ఆల్ ఇండియా రేడియోగానూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అది ఆకాశవాణిగానూ మారింది. ప్రభుత్వ సేవా కార్యక్రమంగా ఉన్న ఆకాశవాణి ప్రసారాలు 1967 నుంచి వాణిజ్య ప్రకటనలకు అవకాశం ఇచ్చింది.

అట్లా అనేక మార్పు, చేర్పులకు లోనై దేశవ్యాప్తంగా విస్తరించిన ఆకాశవాణిని 1997లో దూరదర్శన్ తో కలిపేసి సమాచార ప్రసారాల శాఖ నుంచి విడగొట్టారు. కొత్తగా ప్రసారభారతి చట్టాన్ని తెచ్చి నూతన వ్యవస్థను ఏర్పాటుచేశారు. స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థగా రూపొందించాలనే లక్ష్యం ఉన్నప్పటికీ ప్రసారభారతిని కేంద్రప్రభుత్వ అప్రకటిత నియంత్రణలోనే ఉంచారు. బోర్డ్ పేర అధికార పార్టీలు తమ వాళ్ళను నియమింపజేస్తూ ప్రసారభారతిని తమ కనుసన్నల్లోనే ఉంచుకుంటున్నారు. వ్యవస్థీకృతంగా ప్రసారభారతి అస్వతంత్రతను ఎదుర్కోవడంతోపాటు ఇతర మాధ్యమాలైన టీవీ ఇంటర్నె ట్‌తో కూడా తీవ్ర మైన పోటీని ఎదుర్కొంటున్నది. కానీ రేడియో మాత్రమే ఎలాంటి కేబుల్ చార్జీ లూ, నెట్‌ఛార్జీలు లేకుండా విని యోగదారులకు అందుతున్న మాధ్యమం.

ప్రభుత్వం అవలంబిస్తున్న గుత్తాధిపథ్య ధోరణి రేడియోకు తీవ్రమైన నష్టా న్ని కలిగిస్తున్నది. ఇవాళ సమాజం ప్రసార మాధ్యమాల నుంచి వినో దంతో పాటు వార్తలు తదితర సమాచారాన్ని ఆశిస్తున్నది. వార్తా ప్రసార సేవలను ప్రైవేట్, ఎఫ్.ఎం. ఛానళ్లకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిధ్ధంగా లేదు. దాంతో నగరాల్లో ఎఫ్.ఎం.స్టేషన్లు సినిమా కార్యక్రమాలు, పాట లు ట్రాఫిక్ వివరా లు అందించేందుకు మాత్రమే పరిమితమవుతున్నా యి. ప్రైవేట్ రేడియో ల కు వార్తా ప్రసారాల అనుమతిని భద్రతా కారణాల రీత్యా ఇవ్వడం కుదరద ని 2017లో కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. దాంతో ఎఫ్.ఎం.లకు వార్తలందించే అవకాశం లేకుండా పోయింది. ఇక కేంద్రం లైసెన్స్ ఫీ కింద ఒక్కో ఫ్రీక్వెన్సీకి 15ఏండ్లకుగాను సుమారుగా 100 కోట్లు వసూలు చేస్తున్నది. ఆ విషయంలో కొంత సడలింపు ధోరణి ఉంటే తప్ప కొత్త రేడియో స్టేషన్లు రావడం లేదా ఉన్నవి మనుగడ సాగించడం కష్టం.

రేడియో స్టేషన్లు సినిమా కార్యక్రమాలకే పరిమితమైతే వాటి విస్తరణ పెరిగే అవకాశాలు తక్కువే. కానీ శ్రీలంకలోని ఒక్క కొలం బో నగరంలోనే 23 స్టేషన్లు వార్తలు, భక్తిగీతాలు, వయోజన విద్యా కార్యక్రమాల కు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి ఆ స్థితి మనదేశంలో వస్తే రేడియో మరింతగా ఎదిగే అవకాశం ఉన్నది. ప్రభుత్వాలు ప్రసారభారతిని ప్రజాస్వామీకరించి దాని స్వయం ప్రతిపత్తిని కాపాడగలిగితే ఫలితాలు మరింత బాగుంటాయి. సాంకేతికత రేడియోను మింగేస్తుదన్న వాదన తేలిపోతుం ది. ఎప్పటికీ అద్భుతమైన, అనువైన వినోద, వినియోగ, సమాచార సాధనంగా రేడియో నిలిచిపోతుంది.

(తెలంగాణ ప్రతిభా మూర్తులు పేర హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైన విశేష ప్రసంగాలను పుస్తకరూపంలోకి తెచ్చారు. నేడు హైదరాబాద్
ఆకాశవాణి కేంద్రంలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా..)

2a4347b0-0bf6-4ce4-a0d8-9ffe3cbdb1a6

AMRITA POEM

Posted on Updated on

మిత్రులారా….
అమృతా ప్రీతం (1919-2005) పంజాబీలోనూ హిందీ లోనూ విస్తృతంగా రాసిన ప్రగతిశీల రచయిత్రి. అమృత కవిత్వం, కథలు, నవలలు, వ్యాసాలూ రాశారు, పంజాబీ సాహిత్యంలో అత్యంత ప్రముఖమయిన మహిళా రచయిత్రి. ఆమె కవిత్వం ‘కాగజ్ తే కాన్వాస్ కు జ్ఞాన్ పీఠ్ అవార్డు లభించింది. సాహిత్య అకాడెమీ అవార్డు, ఫెలోషిప్ , పద్మ శ్రీ, పద్మవిభూషన్, లాంటి అనేక అవార్డులు అందుకున్నారు.
అమృతా ప్రీతం రాసిన గొప్ప కవితల్లో ‘మై తుఝే ఫిర్ మిలూంగి..’ క్లిక్ చేసి వినండి

 

Live with Aanand Varala

Posted on Updated on

#AnveshLive Great day with #VaralaAnand గారు , కరీంనగర్ నుంచి ఉన్న గొప్ప సినిమా రచయిత, వక్త , తెలుగు సినిమా సెన్సార్ బోర్డ్ మెంబర్ , తెలుగు సినిమాల గురించి చాల పుస్తకాలు రాసినప్పటికి ఆయన నిమ్మలత్వం, మంచితనం, ఎంత పైకి ఎదిగిన ఒదిగి ఉండాలనే ఆయన వైఖరి జీవన విధానం నా సినిమా జీవన ఆరంభంలోనే ఒక గొప్ప మేధావిని కలిసినందుకు ఉన్న తృప్తి సంతోషం ఇలా ఈ వీడియోలో ఆయన చెప్పిన చరిత్ర మరియు జరుగుతున్న ప్రస్తుత యధార్ధాలు మీతో పంచుకుంటున్న ….. 

వివాదం లో వినోదం

Posted on

వివాదంలో వినోదం

Sat,March 3, 2018 11:06 PM

ఇంటింటికీ ఇంటర్నెట్ వినియోగం, అరచేతిలో స్మార్ట్‌ఫోన్లు రావడంతో అంతర్జాలం మొత్తంగా అవరించిపోతున్నది. సినిమాల విషయం వచ్చేసరికి యూట్యూబ్ ప్రమాదాన్ని మించి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వీడియో లాంటి ఆన్‌లైన్ సినిమా ప్లాట్‌ఫాంలు వెల్లువలా ముంచుకు వస్తున్నాయి. పాత సినిమాలతో పాటు సరికొత్త సినిమాలను కూడా అవి విడుదల చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకుంటున్నాయి.

సామాన్య బడుగుజీవికి దేశంలో ఉన్న వినోద సాధనాల్లో అందుబాటులో ఉన్న ముఖ్యమైన వేదిక సినిమా. అంతేకాదు సినిమా వారి జీవితాల్లో అంతర్భాగమైపోయింది. ప్రేక్షకు ల పైన సినిమా ప్రభావం ఎంతగా ఉందంటే వారు మాట్లాడే భాష, ఆహార్యం, ఆహార పుటలవాట్లు మొత్తంగా జీవనసరళి సినిమా ప్రభావంలో పడి ఎప్పటికప్పుడు మారిపో యే పరిస్థితి ఏర్పడింది. అలాంటి సినిమా ఇవాళ ప్రదర్శనారంగంలో వచ్చిన వివాదం నేపథ్యంలో వెండితెర మీద బొమ్మపడకుం డా వినోదం మూతపడే స్థితి ఏర్పడింది.

సినిమాకు సంబంధించి ఉన్న ప్రధాన మూడు విభాగాలు-నిర్మాణం, పంపిణీ, ప్రదర్శనరంగాల్లో ఏర్పడిన సంక్షోభం తీవ్రమై దక్షిణ భారతంలో సినిమాహాళ్ళ మూసివేతకు దారితీసే దాకా వెళ్లింది. నిజానికి సినిమా నిర్మాణ రంగంలో వచ్చిన అనేక మార్పులతోపాటు వ్యాపారమే ఇరుసుగా ఉన్న పంపిణీ రంగం కూడా ఆది నుంచి అనేక మార్పులకు గురైంది. నైజాం ఏరియా గా పిలుచుకునే తెలుగు సినిమా రంగానికి సంబంధించి సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డు నిండా అనేక ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ల ఆఫీసులుండేవి. కాలక్రమంలో సినిమాలకు జిల్లాలవారీ అమ్మకా లు మొదలవడంతో డిస్ట్రిబ్యూటర్లు క్రమంగా వెనక్కుతగ్గారు. టేబుల్ ప్రాఫిట్‌లు మొదలై స్టార్డమ్ విపరీతంగా పెరిగిపోయిం ది. పెద్ద హీరోల సినిమాలకు పెద్ద పెద్ద బిడ్డింగులు మొదలయ్యా యి. తమ థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదల చేయడానికి సినిమాహాళ్ళ యజమానులు ముందస్తు అడ్వాన్సులు చెల్లించి సినిమాలను వేలంలో కొన్నట్టుగా కొనడం మొదలుపెట్టారు. సినిమాలకు వసూళ్లు తగ్గడంతో సినిమా హాళ్ల యజమానులు తీవ్ర నష్టాలను చవిచూశారు. సరిగ్గా అప్పుడే వారంతా సినిమా హాళ్లను లీజుకు ఇవ్వడం ప్రారంభించారు. దాంతో రెండు రాష్ర్టాల్లోని వందలాది సినిమాహాళ్లు లీజులతో కొంతమంది చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఫలితంగా సినిమాల విడుదల విషయంలో లీజుదార్ల ఇష్టాయిష్టాలు ప్రధాన పాత్ర పోషించడం ఆరంభమైంది.

ఇట్లా పంపిణీరంగం కొన్నేండ్లుగా ఒడిదొడుకులకు గురై ఎగ్జిబిషన్ మేనేజ్‌మెంట్ ఫలితంగా మొత్తం సినిమా రంగాన్ని కొన్ని వర్గాలు గుత్తాధిపత్యంలోకి తెచ్చుకొని మొత్తం సినిమా రంగా న్ని నిర్దేశించే పరిస్థితి ఏర్పడింది. దాని ఫలితంగా చిన్న సినిమా లు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాయి. అది అందరూ అంగీకరిస్తున్నదే. సినిమా ఆవిర్భవించిన తొలినాళ్లలో స్టూడియోల ఆధిప త్యం నడిచింది. తర్వాత హీరోయిజం పెరిగి వారి ఆధిపత్యం కొనసాగింది. అనంతరకాలంలో సినిమాహాళ్ల, లీజుదారుల చేతుల్లోకి సినిమారంగం వెళ్లిపోయింది. ఏ ఆధిపత్యమైనా సమాజం లో కొంతకాలమే నడుస్తుంది కనుక ఇప్పుడు ప్రదర్శనారంగం లో సంక్షోభం మొదలైంది. ఫలితంగా వినోదం కాస్తా వివాదం లో పడిపోయింది. పంపిణీరంగాన్ని నియంత్రిస్తూ వచ్చిన వర్గాలకు సాంకేతికంగా వచ్చినమార్పులు అశనిపాతంగా మారాయి.

సినిమా నిర్మాణ రంగంలో సెల్యులాయిడ్ కాలం పోయి డిజిటల్ తరం ఆరంభమైన తొలినాళ్లలో దాని ప్రభావం నిర్మాణ రీతికే పరిమితమవుతుందనుకున్నారు. రీళ్లు పోయి సాఫ్ట్‌వేర్ తెరమీదికి రావడంతో ఫిల్మ్‌బాక్సులు పోయి ఆధునికమైన హార్డ్ డిస్క్‌లతో మొదలై ఉపగ్రహాల ద్వారా సినిమాహాళ్లకు నేరుగా సినిమాను ప్రదర్శించే వసతులు ఏర్పడ్డాయి. పర్యవసానంగా సర్వీస్ ప్రొవైడర్ల యుగం ఆరంభమైంది. ఉభయ తెలుగు రాష్ర్టా ల్లో 900కు పైగా సింగిల్ స్క్రీన్ హాళ్లు, 200కు పైగా మల్టీ ప్లెక్స్ హాళ్లున్నాయి. వాటిల్లో 95 శాతానికి పైగా డిజిటల్ స్క్రీనింగ్‌లకు మారిపోయాయి. ఫలితంగా ప్రధాన డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ సేవల్లోకి వెళ్లిపోయాయి. వాటిల్లో దాదాపు హాళ్లన్నీ క్యూబ్, యుఎఫ్‌ఓ లాంటి ప్రధాన సంస్థలతో ఒప్పందాలను చేసుకున్నాయి. దానిలో భాగంగా డిజిటల్ ప్రొజెక్షన్‌కు అవసరమైన పరికరాలు సమకూర్చడం కూడా ఉన్నది. ఇంకా వర్చువల్ ప్రింట్ ఫీజు కూడా మరో ప్రధానమైన అంశం. మొదట్లో అంతా బాగానే ఉన్నా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు క్రమంగా వర్చువల్ ప్రింట్ ఫీజు పెంచడం ఆరంభించారు. ఫలితంగా సినిమాహాళ్లను లీజుకు తీసుకున్న వర్గానికి ఆర్థికభారం ఆరంభమైంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు తమ ఆధిపత్యాన్ని చూపించడం మొదలు పెట్టారు. పరికరాల కోసం తాము పెట్టిన పెట్టుబడిని కూడా వీలై నంత త్వరగా వసూలు చేసుకోవాలని ప్రయత్నించడం మొద లు పెట్టడంతో ఇన్నేండ్లుగా సినిమా రంగంపైన గుత్తాధిపత్యం చెలాయించిన వర్గాలకు సెగ తగులడం మొదలైంది.

దాంతో దక్షి ణ భారతానికి చెందిన సౌత్ ఇండియన్ నిర్మాతల మండలి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సినిమాహాళ్ల మూసివేతకు పిలుపునిచ్చింది. దాంతో వినోదం కాస్తా వివాదంలో పడిపోయింది. దాదాపుగా సినిమాహాళ్లను లీజుకు తీసుకొని సినిమా రంగాన్నే నియంత్రించే స్థాయికి చేరినవాళ్లంతా రోడ్డెక్కారు. అం టే తాము ఇన్నాళ్లుగా చేస్తున్న ఆధిపత్య దోపిడీ ప్రపంచీకరణ నేపథ్యంలో సాంకేతిక విప్లవ నేపథ్యంలో ఆవిర్భవించిన డిజిట ల్ ప్రొవైడర్ల దెబ్బకు కునారిల్లిపోయే స్థితిలోకి నెట్టివేయబడ్డారు. దాంతో చర్చలు సమ్మెలు మొదలుపెట్టారు. డిజిటల్ ప్రొవైడర్లు మొత్తం జాతీయస్థాయి వ్యాపార లక్ష్యాలతో వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాహాళ్ల మూసివేత బహుశా ఎంతోకాలం కొనసాగక పో వచ్చు. త్వరలోనే ఒప్పందం కుదిరిపోవచ్చు. కానీ ఈ సమ్మె వల్ల పెద్ద నిర్మాతలకు పెద్ద సినిమాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకొనే సమ్మెకు దిగారు. జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మెకు దిగిన ఈ సమయంలో పెద్ద సినిమాలేవీ విడుదలకు లేవు కాబట్టి వాళ్లంతా సేఫ్. ఇక ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్నది. అధిక శాతం చిన్న సినిమాలే. కనుక నష్టపోయేది చిన్నవాళ్లే. పోట్లాడే పోట్లగిత్తల కాళ్ల కింద పడి నలిగిపోయేది చిన్న లేగ దూడలే.
varala-anadh
ఇదిలా ఉంటే పంపిణీ రంగం భవిష్యత్తు మరింత ప్రమాదం లో పడిపోయే స్థితి కూడా ఉన్నది. ఇంటింటికీ ఇంటర్నెట్ విని యోగం, అరచేతిలో స్మార్ట్ ఫోన్లు రావడంతో అంతర్జాలం మొత్తంగా అవరించిపోతున్నది. సినిమాల విషయం వచ్చేసరికి యూట్యూబ్ ప్రమాదాన్ని మించి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వీడియో లాంటి ఆన్‌లైన్ సినిమా ప్లాట్‌ఫాంలు వెల్లువలా ముంచుకు వస్తున్నాయి. పాత సినిమాలతో పాటు సరికొత్త సినిమాలను కూడా అవి విడుదల చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకుంటున్నాయి. ఫలితంగా సరికొత్త సినిమా తెరలు ఆవిష్కృతమవుతున్నాయి. ప్రస్తుతానికి ఆ ప్లాట్‌ఫారమ్స్ అతి తక్కువ ధరలకు లెక్కలేనన్ని సినిమాలను అందుబాటులోకి తెచ్చాయి. వాటి విస్తృతి క్రమంగా పెరిగి సినిమాహాళ్లకు, పంపిణీ రంగానికి పెద్ద సవాల్‌గా మారే ప్రమాదం పొంచి ఉన్నది. ప్రస్తుతానికి మాత్రం జాయింట్ యాక్షన్ కమిటీకి సర్వీస్ ప్రొవైడర్లకు నడు మ వర్చువల్ ప్రింట్ ఫీజు విషయంలో ఒక ఒప్పందం కుదిరి వినోదంలోని వివాదం అంతరిస్తుందని ఆశిద్దాం. ఎప్పటిలాగే సాధారణ ప్రేక్షకులకు వినోదాన్ని అందించే పని మొదలవుతుంద ని కోరుకుందాం0fc874f2-c18b-4ca8-a9e1-494296ed6b33