Month: September 2017

మంత్ర కూట వేమన రావికంటి రామయ్య

Posted on

Ravikanti Ramaiah

 

RAVIKANTI RAMAIAH 1RAVIKANTI RAMAIAH 2RAVIKANTI RAMAIAH 3

Advertisements

Children’s Cinema (బాలల సినిమా వ్యాసం)

Posted on Updated on

హైదరబాద్ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు శాశ్వత వేదిక. తెలుగు సినిమా దేశం లో హిందీ తర్వాత ఎక్కువ సినిమాలు నిర్మించే పరిశ్రమ. హైదరబాద్ లో దేశంలోనే అత్యధిక సినిమాలు నిర్మాణమవుతున్నాయి కానీ భావి సమాజపు నిర్మాతలయిన పిల్లల కోసం సినిమాలు వచ్చింది తక్కువ. తీసుకుంటున్న చర్యలూ తక్కువే. బాలల సృజనాత్మక అభివృద్దికి అర్థవంతమయిన సినిమాల అవసరం వుంది. ప్రకృతితో మమేక మయిన సహజ సిద్దమయిన దృశ్య మాధ్యమమే పిల్లల మానసిక వికాసానికి తోడ్పడుతుంది. లేకుంటే కృత్రిమ విలువలతో కూడిన దృశ్యాల్ని చూస్తూ ఎదిగే పిల్లల్నుంచీ ఉత్తమ విలువల్ని ఆశించడం అత్యాశే అవుతుంది. అటు ప్రభుత్వమూ ఇటు సమాజమూ విలువల్తతో కూడిన వాతావరణాన్ని కల్పించే దిశలో కృషి చేయాల్సి వుంది .

       ‘’మానవ జీవన రాగంలో మధురమయిన ఆలాపనే బాల్యం’’  అలాంటి బాల్య దశలో వారి మనోభావాల పైన పడ్డ ప్రభావాలు జీవితాంతం నిలిచి వుంటాయి. అంతేకాదు వారి శారీరక మానసిక వ్యక్తిత్వ వికాసంలో చివరంటా వుందడి పోతాయి. పర్వసానంగా వాళ్ళ ఎదుగుదల సమాజం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఏ దేశంలో నయినా సమాజంలో నయినా పిల్లల శారీరక, బౌద్దిక, మానసిక ఎదుగుదల భవిష్యత్తు సామాజం రూపొందంలో ప్రధాన మయిన భూమికను పోషిష్తుంది. ఆక్రమంలో పిల్లల ఎదుగుతున్న సమాజం వినోదాన్ని, విజ్ఞాన్ని, విలువల్నే వికాశాన్ని ప్రోది చేసుకొని వుండాలి. వాళ్లపైన చూపించే ప్రభావల పైన సమాజం ఒకింత జాగురూకత తో వుండాలి. ఇవ్వాళ మిగతా అన్నింటికంటే పిల్లల మనోభావాల పైన సినిమా గొప్ప ప్రభావాన్ని చూపిస్తున్నది. ఆహార్యమూ, అలవాట్లు, నడవడికలో సినిమా ప్రభావం అమితంగా వుతున్నది. కానీ ఎనిమిదిన్నర దశాబ్దాల తెలుగు చలన చిత్రా పరిశ్రమ లో వేలాది సినిమాలు నిర్మాణమయ్యాయి. సాంఘికం,జానపదం,పౌరాణికం, క్రైం, సోషియో ఫాంటసీ ఇలా అనేక రకాలయిన జానర్ సినిమాలు వచ్చాయి. విజాయాల్ని వైఫల్యాల్నీ చవి చూశాయి. కానీ భవిష్యత్తుకూ భావి సమాజానికీ ఆటపట్టులయిన బాలల గురించి ప్రత్యేక మయిన ప్రయత్నాలు మాత్రం జరుగలేదు. ఏవో కొన్ని చిదురు ముదురు ప్రయత్నాలు జరిగినప్పటికి వాటి ప్రభావం అంతగా కనిపించదు.

 ‘పిల్లల సినిమాలు ‘, ‘’పిల్లకోసం సినిమాలు’’ నిర్మించాలని మాత్రం తెలుగు సినిమా రంగమే కాదు మొత్తం భారతీయ సినిమా రంగం కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనిపించదు. కానీ తెలుగు లో వచ్చిన జానపద సినిమాలు, మాయల మరాఠీలు మాత్లెడే చిలుకలు లాంటివి తెలుగు బాలల్ని విపరీతంగానే వినోద పరిచాయి.

   పిల్లల సినిమాలు ఏవి అన్నప్పుడు పిల్లలు నటించిన సినిమాలా, పిల్లలు తీసిన సినిమాలా, పిల్లల కోసం నిర్మించిన సినిమాల అన్న ప్రశ్న ఉద్భవిస్తుంది. పిల్లలు నటించిన సినిమాలనప్పుడు తెలుగులో బే.ఎన్.రెడ్డి బంగారు పాప ఏ.వి,ఎం వారి రాము లాంటి సినిమాలు, తొలి రోజుల్లో వచ్చాయి. తర్వాత జంతువులతో పిల్లలు నటించిన సినిమాల్లో మాకూ స్వాతంత్రం వచ్చింది లాంటివి వచ్చాయి. తర్వాత సామాజిక అంశాల్ని తీసుకొని బాపు నిర్మించిన బాల రాజు కథ 1970లో వచ్చింది. కానీ అందులో కుటుంబ నియంత్రన్ లాంటి అంశాల్ని తీసుకొని నిర్మించి కావడం తో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సమాచార శాఖ ద్వారా వూరూరా ప్రదర్శింప జేసింది. కమలాకర కామేశ్వర రావు 1972 లో పిల్లలతో బాల భారతం తీశాడు. తర్వాత రెండు దశాబ్దాలకు ఎం.ఎస్.రెడ్డి పిల్లల పాత్రదారులుగా బాల రామాయణం నిర్మించాడు. అయితే ఇవన్నీ పిల్లలు ప్రధాన పాత్రదారులుగా వచ్చిన సినిమాలే తప్ప పిల్లల సినిమాలు గా చెప్పలేం.

  కానీ తెలుగులో 80కి పైగా సినిమాల్ని తీసిన తాతినేని ప్రకాష్ రావు 1979లో గంగా భవానీ పిల్లల సినిమా తీశారు. బాలల చిత్రా సమితి నిర్మించిన ఈ సినిమా తెలుగు తమిళ్ మరాఠీ ల్లో కూడా వుంది. భారతీయ మొదటి ప్రధాని పండిత్ నెహ్రూ ఆలోచనల ప్రతి రూపంగా పిల్లల సినిమాల కోసం ఏర్పడ్డ చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటి ఆఫ్ ఇండియా నిర్మాణం లో రూపొందిచబడ్డ మొదటి సినిమా గంగా భవానీ. విగ్రహాల్ని దొంగిలిస్తున్న ఓ ముఠా ను పట్టుకోవడంలో పిల్లలు చూపిన సాహశాల్ని ఏ సినిమా అత్యంత సహజంగా ఆసక్తికరంగా చూపించి ప్రశమస్ల్ని అందుకుంది. తర్వాత ఆయనే హామ్ భీ కూచ్ కామ్ నాహీ పిల్లల సినిమా తీశారు. అది కూడా కన్నడ హిందీ తెలుగుల్లో డబ్ చేయబడింది అట్లా మొదటి సారిగా ప్రకాష్ రావు బాలల చిత్ర సమితి తో పిల్లల సినిమాలు తీశారు.

కానీ అంతకు ముందే సుప్రసిద్ధ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర్ రావు పిల్లాల్ సినిమా రంగంలో రెండు మంచి ప్రయత్నాలు చేశారు. 1967లో సుడిగుండాలు, 1970లో మరో ప్రపంచం. సుడిగుండాలులో ఆధునికత,నాగరికతల పేరు మీద సమాజంలోకి చొచ్చుకు వచ్చిన చెడు సంస్కృతిని వీళ్లూనుకుంటున్న హింసా ప్రవృత్తిని ఎత్తి చూపించారు. మరో ప్రపంచంలో పిల్లల భవిష్యత్తుకోసం ఆధునికంగా విలువలతో కూడిన సమాజ నిర్మాణాన్ని గురించి వివరించారు. అప్పటి కాలం లో అక్కినేని ఆ సినిమాల పట్ల తీసుకున్న చొరవ అభినందించాల్సిందే. ఆడుర్హ్తి ఆలోచనలకు అక్కినేని సహాకారం గొప్పది. కేవలం సహకరించడమే కాకుండా ఆయన అందులో ప్రధాన  పాత్రలు పోషించారుకూడా. ఆ సినిమాలు రెండూ ఆర్థికంగా విజయవంతం కాక పోవడం తో పిలల సినిమాలే కాదు మరే సమాంతర సినిమాలు అక్కినేని నుండి రాలేదు.

  ఆ తర్వాత అంతకు ముందు పాపం పసివాడు,, పాప కోసం లాంటి సినిమాలు వచ్చాయి. తర్వాతి కాలంలో తెలుగులో నిర్మితమయిన లిటిల్ సోల్జర్స్ , రేపటి పౌరులు లాంటివి కూడా కొన్ని వచ్చాయి.

1992లో రచయిత అక్కినేని కుటుంబ రావు భద్రం కొడుకో పిల్లల సినిమా నిర్మించాడు. బాల కార్మిక వ్యవస్థను ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని నిర్మించ బడ్డ భద్రం కొడుకో మంచి ఆదరణను పొందింది. ఫిల్మ్ సొసైటీల ఆధ్వర్యంలో అనేక చోట్ల ప్రదర్శించబడి పిల్లల్లోకి చొచ్చుకు పోయింది. తర్వాత ఆయనే పాత నగరం లో పసివాడు, గులాబేలు, అమూల్యం లాంటి సినిమాలు తీశారు. పిల్లల సినిమాల విషయంలో అక్కినేని కుటుంబరావు కృషి తెలుగులో ఎన్నదగింది. పి.సునీల్ కుమార్ రెడ్డి    హీరో ‘” లాంటి సినిమాల తో పిల్లల సినిమా రంగంలో కృషి చేశారు. ప్రముఖ దర్శకుడు జాతీయ స్థాయిలో అవార్డులు అంకున్న బి.నర్సింగ్ రావు డి.రామానాయుడు నిర్మాణ సారథ్యంలో హరివిల్లు’’ 2003లో తీశాడు.

 ఈ క్రమంలో తెలుగులో స్పోరాడిక్ గా కొన్ని బాలల సినిమాలు వచ్చినప్పటికీ  పిల్లల్కోశమ్ ఇదిమిద్దమయిన ప్రయత్నాలు జరగలేదనే చెప్పుకోవాలి. కేవలం వ్యాపారమే ప్రధాన లక్షణంగా మిగిలిన తెలుగు సినిమా రంగం పిల్లల్ని చిన్న చొపు చూసిందనే చెప్పుకోవాల్సి వుంటుంది.

 నిజానికి చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా రెండేళ్ల కోసారి నిర్వహించే అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం 1999లో మొట్ట మొదటి సారి హైదరాబాద్లో నిర్వహించారు. అందులో ప్రదర్శించిన ఇరానీ సినిమాలు, చైనీస్ తదితర అంతర్జాతీయ బాలల సినిమాలు హైదరాబాదీయుల్ని అబ్బురపరిచాయి. అప్పుడే ఎం. వేద కుమార్ ఆధ్వర్యంలో పిల్లల కోసం అనేక వర్క్ షాప్ లు నిర్వహించారు. అప్పుడే మొట్ట మొదటి సారిగా బాలల చిత్రాల పైన మొట్టమొదటి పుస్తకం వెలువడింది. తర్వాత 2003 నుంచి అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం శాశ్వత వేదికగా హైదరబాద్ మారింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలల చిత్రా సమితికి బాలల సినిమాలు తీసే నిర్మాత దర్శకులకు విశేష ప్రోత్సాహాకాలు ఇవ్వడానికి అంగీకరించి ప్రకటించాయి. ఆ స్థితిలో తెలుగులో కూడా పిల్లల కోసం ప్రత్యేక సినిమాలు అంతంగా నిర్మాణ మవుతాయని తెలుగు లో కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే సినిమాలు వస్తాయని ఆశించారు. కానీ అలాంటిదేమీ జరుగలేదు.  రాస్త్ర ప్రభుత్వం తెలుగులో పిల్లల సినిమాలు తీసే దర్శక నిర్మాతలకు 20లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తామని ప్రకటించిది. ఏదయినా అవార్డు పోనితే దాని 30 లక్షలు ఇస్తామని ప్రకటించారు కానీ 2006 తర్వాత స్క్రిప్ట్ కామేటేనే లేకుండాపోయింది . ఆయా కాలాల్లోని ప్రభుత్వాలు నిర్లక్షం వహించడం తో పిల్లల సినిమాలకు ఎలాంటి ప్రోత్సాహమూ రాలేదు సబ్సిడీలూ ఇవ్వలేదు. 2006 నుండి నిర్మించబడి పలు అవార్డులు అందుకున్న తెలుగు పిల్లల సినిమాలక్కూడా ఎలాంటి ప్రోత్సాకాలు అందలేదు. ఇక హైదరబాద్ లో చిల్డ్రన్ ఫిల్మ్ కాంప్లెక్స్ కోసం 19 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ అప్పటి ఫిల్మ్ డెవెలప్మెంట్ కార్పొరషన్ దాన్ని ఉపయోగించుకోవడంలో కానీ లేదా చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా కు దాఖలు పర్చడంలో కానీ చొరవ చూపక పోవడం తో ఆ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకుంది. ఇప్పటి వరకు దాని పైన ఎలాంటి చర్యా తీసుకోవడం జరగలేదు. ఫలితంగా ఫిల్మ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగలేదు పైగా అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం వేదికను హైదరబాద్ నుంచి మార్చాలనే ఆలోచనలూ వస్తున్నాయి పలు రాష్ట్రాలు పూర్తి సహకారాన్ని అందిస్తామని బాలల చిత్ర సమితి పైన వొత్తిడి తెస్తున్నాయి. వారి వొత్తిడి ఫలిస్తే అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం తరలి పోవడానికి ఎంతో కాలం పట్టక పోవచ్చు. కోల్ కట్టా లోని నందన్ కాంప్లెక్స్ లాగా మూడు టాకీసుల కాంప్లెక్స్ హైదరాబాద్లో ఏర్పడితే ఒక్క అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం మాత్రమే కాదు ఏటా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కూడా నిర్వహించు కోవచ్చు. హైదరబాద్ లో  నవంబర్ 8 నుంచి 14 వరకు జరుగనున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం సందర్భంగా నయినా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి బాలల కోసం ఎతొడిక చొరవ చూపించాల్సిన అవసరం వుంది . తెలంగాణ ఫిల్మ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఛైర్మన్ నియామకం కూడా చేసిన ప్రభుత్వం పూర్హి స్థాయి కమిటీ ని నియమించాల్సి వుంది. అంతే కాకుండా సబ్సిడీ పాలసీని రూపిండించి 2006 నుంచి ఇవ్వాల్సిన సబ్సిడీల్ని విడుదల చేయాల్సివుంది. ఇంకా ఫిల్మ్ కాంప్లెక్స్ కోసం స్థల కేటాయింపును పూర్తి చేసి ఫిల్మ్ కాంప్లెక్స్ నిర్మాణం జరపాలి. పిల్లల సృజనాత్మక భవిష్యత్తు కోసం పలు చర్యలు చేపట్టాల్సి వుంది.

 వోట్లు వున్న అన్నీ వర్గాల అభ్యు న్నతి కోసం పలు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం వోట్లు లేని పిల్లల కోసం కూడా ఎంతో చేయాల్సి వుంది.   


ad77f132-54a8-42f4-806e-9fcf436c916d

ARTICLE PUBLISHED TODAY IN NAVA TELANGANA SUNDAY

CLICK THE LINK IF NEEDED

Article on CHILDREN CINEMA

‘SINEE SUMAALU’ ‘సినీ సుమాలు’

Posted on Updated on

‘సినీ సుమాలు’ a book on Women cinema in India. Films made with women as protagonists in different Indian languages= reviews & news clips

Released in Delhi International film festival 2003

 

03 Cinee Sumaalu Book on Indian Women Cinema Weritten by Varala Anand

07 Film Maker K.Vishwanath releasing Book Cinnesumaalu in Delhi International Film FestivalScan0038Scan0036Scan0035Scan0034Scan0037Scan0039

Navyachitra Vythalikulu (BOOK ON NEW CINEMA)

Posted on

Navyachitra Vythalikulu
(Released in International film festival 1999)
(Profiles of 54 New wave film makers) Reviews and Clips 

305 Film Maker Girish Kasaravelli Releasing the Book Navyachitravythalikulu at IFFI Hyderabad in 1999

Scan0040Scan0041Scan0042Scan0043Scan0044Scan0045Scan0046Scan0047Scan0048Scan0049Scan0050Scan0051

CHILDREN’S CINEMA book

Posted on

aanand varala’s  బాలల చిత్రాలు (CHILDREN’S CINEMA) 1999 reviews & articles

CHILDREN'S CINEMA

 

This slideshow requires JavaScript.

CHILDREN’S CINEMA book

Posted on Updated on

aanand varala’s  బాలల చిత్రాలు (CHILDREN’S CINEMA) 1999 reviews & articles

CHILDREN'S CINEMA

This slideshow requires JavaScript.