Month: November 2016

‘పత్రహరితం”దర్భశయనం శ్రీనివాసాచార్య కవిత్వం

Posted on Updated on

review

             ర్రైతులూ,పచ్చదనమూ, చేనూ, చెలకా, నదీ ఇలా మనిషి మనుగడకు ప్రాణాధారమయిన అంశాలనేకం ‘పత్రహరితం’ లో పరుచుకుని వున్నాయి.

 ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య కవితా ప్రస్థానం లో నూతన మజిలీ ‘ పత్రహరితం’ కవితా సంపుటి. మూడు దశాబ్దాలుగా సాగుతున్న ఆయన కవితా ప్రస్థానంలో భావసాంధ్రత, భాషా సరళత, సూటిదనం,నిలదీయడం లాంటి అంశాల్ని ప్రాథమికం చేసుకుని ఆయన తన సృజనని కొనసాగిస్తున్నారు.

‘ఒక వ్యాక్యాన్ని రాస్తాను

అది చెరకు గడ

మనిషికివాల అది మధుర రసాన్నందిస్తుంది  

రెండో వాక్యాన్ని రాస్తాను

అది వెదురు బద్ద

రేపటి యుద్ధ సందర్భంలో విల్లంబై అది

మనిషికి దన్ను గా నిలుస్తుంది

ఇష్టంగానే రాస్తాను రెంటినీ

రెండు కాదు ఒక్క వాక్యాన్నే

రాయాల్సోస్తే

రెండో వాక్యాన్నే రాస్తాను

అంటూ దర్భశయనం రెండో దిక్కునే నిలబడ్డాడు.

 భాష విషయంలో కూడా  దర్భశయనం బయట కనిపించే భాష కంటే లోపలి భాషణనే  ప్రేమించాడు. అనుసరించాడు వ్యక్తీకరించాడు.

 శిలలగురించి శిల్పాల గురించీ రాస్తూనే

‘శిలల భాష తెలియనంత కాలం/ నీకు శిల్పాల భాషా సాంధ్రత తెలియదు సుమా అంటాడు

 (లోపలి భాష లో) .

దర్భశయనం కవిత్వం నిండా రైతు పరుచుకుని వుంటాడు.రైతు కేంద్రంగా రైతు ఇరుసుగా ఆయన కవిత్వం విస్తరించుకుని వుంటుంది. కొన్ని సార్లు విన్న విస్తుంది మరికొన్ని సార్లు నిలదీస్తుంది, దిక్కరిస్తుంది.

 

‘భూమీ అతడు దగ్గరివాళ్లు

దూరం నుంచి కాదు దక్కరికెళ్లి దర్శించు

అతడు భూమి నీడలో వుంటాడు భూమిని ఇష్ట పూర్వకంగా తాకి

మట్టి పనిలోంచి చెట్టు ను లేపుతాడు ( అతనిని నమస్కరిస్తూ)

 

తనని రైతులా ఇ డెంటిఫై  అవుతూ రైతూ తానూ ఒకటే  అనే సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు.

‘ చేనుని తీసుకొచ్చి కాగితం మీద పరిచాను అక్షరాలుగా

మొక్కల్ని భగ్న పరచకుండా

ఎవరో ఒకతను అడిగాడు నన్ను

మాటల పెట్టేలోంచి

మీరు రైతులా అని

ఆ ప్రశ్నకు మించిన ప్రశంస ఏముంటుంది

మత్తికి డడంపెడుతూ నేను  చేనులా బదులిచ్చాను(కితాబు)

 

రైతు పై ఇష్టాన్ని వ్యక్తం చేస్తూనే రైతు కృషిని, రైతుకూ మట్టికీ వున్న అనుభందాన్ని స్పృశిష్టాడు. దర్భశయనం రైతు ని గ్లామరైస్ చేయడమే కాదు రైతు దుఖాన్నీ,వర్థ్మాన వ్యాపార సమాజంలో రైతుల ఆత్మ హత్యల్నీ అంతే స్థాయిలో కవిత్వీకరించాడు.

 రైతన్న నువ్వు బతకాలి అంటూ

నీ పొలం ముందు

ఏ సింహాసనమైనా  ఎంతని

సింహాసనాలు గాల్లో తెలుతాయి

నువ్వు నెలనాంతిపెట్టుకునే వుంటావు

నీ కంటే ఇష్టులేవరు భూమికి

భ్హోమి మీద బతకడానికి

నీకంటే ఎక్కువ హక్కు ఎవరికుంది ?

అని నిలదీస్తాడు. ఆధునికత, ప్రపంచీకరణ, అభివృద్ది నెపం మీద నవీకరణ అమెరికీకరణ జరుగుహున్న పద్దతిని, సింహాసనాలెక్కిన వారి ప్రాధాన్యతల్ని వాటి  ఫలితంగా ఆత్మ హత్యలకు పాల్పడుతున్న  రైతుల పక్షాన నువ్వే చెప్పాలిగా బతికి చెప్పాలి గా బతుకుతూ చెప్పాలిగా అంటూ రైతులు జీవించాలని అంటాడు.

సింహాసనాలకేముంది

రాజధానులు బతికితే చాలు

వర్ధిళ్ళితే మరింత పులకరింత అంటూ పాలకుల రీతిని చెబుతాడు.

 

సింహాసనాలు మెత్తటి మాటల్నే చల్లుతాయి

మనిషిని ధాన్యం  గింజ బతికించింది కానీ

బతుకు తడే లేని మాటేపుదయినా బతికించిందా అంటాడు.

 

నగరాలు కాదు ముందు వూర్లు బతకాలి అన్నం పుట్టించే రైతు బతకాలి అంటాడు.

సింహాసనాన్ని పొలం దగ్గరికి ఈడ్చుకొచ్చి అడగాలి,

చెంపలు వాయించి చెప్పాలి’ అంటాడు దర్భశయనం.

 

పచ్చని చెల నుంచి వచ్చానిప్పుడే/ ప్రాణ రహస్య సంగీతాన్ని/ దేహం లోకి వొంపుకొని వచ్చా

సారగీతమై అంటాడు.

 

రైతు ఆత్మహత్యలకు పాలకుల్నే బాధ్యుల్ని  చేస్తూ

‘వేలాడుతున్న మట్టి మనిషి శవం ముందు / ఇప్పుడు ఏ తలల్తో నిలబడతాం మనం‘

ఇక్కడ ఎవరయినా ఎంతటివారయినా మట్టికీ మట్టిమనిషికీ సలాం చేయాల్సిందే

లేదంటే

ఉన్న పలాన వేదిక మీది నుండి దిగి పోవాల్సిందే

అని స్పష్ట పరుస్తాడు.

                * * * 

రైతులూ సమస్యలే కాదు ఒకటి దర్భశయనం మంచి భావుకుడు. తన కవిత్వంలో సున్ని తత్వాన్ని ఆవిష్కరిస్తాడు.

‘ఎవరు పరిచారు ఈ ఆకాశం పరదా మీద

ఏడు రంగుల చిత్రాన్ని అని భావుకత తతో పలికే దర్భశయనం

 

రెండు దేశాల్ని నది

సారవంతం చేస్తున్నది

ఇరు దరుల్నీ మెత్తగా

ప్రేమగా తాకుతూ అంటూ రెండు దేశాల మధ్య గల గలా పారే నది ని  ప్రేమిస్తాడు

 

అంతే కాదు దేవాలయంలో పిల్లన  గ్రోవి వూదే  కళాకారున్నీ చూసి విని

‘ఇక్కడి కొచ్చిన వాళ్ళు

పరిమళాల స్పర్శతో  ప్రశాంత చిత్తులై శుభ్ర పడతారంటాడు

 

సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ గురించి రాస్తూ

ఇసుకను చూసినప్పుడల్లా ఆయన గుర్తొస్తా దంటాడు.

 

దర్భశయనం శ్రీనివాసాచార్య నిరంతర అధ్యన శీలి ఒక్కో పుస్తకాన్ని కవితనీ అనేకసార్లు  చదివి రీడ్ డైజెస్ట్, అస్సిమీలేట్ ఆన్న సూత్రాన్ని పాటిస్తాడు.

అందుకే హనుమకొండలో జూబర్ పుస్తకాల షాపు దగ్ధ మయినప్పుడు

‘జుబెర్ నీకు పుస్తకం అన్యాయం చేయదు’  అన్నాడు.

 

కవిత్వం భావుకథే లే కాదు దర్భశయనం శ్రీనివాసాచార్య మంచి వక్తకూడా. అంతే కాదు

మంచి పర్యాటకుడు కూడా. పర్యటకుడయినందుకు   ప్రపంచాన్ని తెలుసుకున్నాడు. భిన్నమయిన మనుషుల అంతర్లోకాల్ని అర్థం చేసుకున్నాడు. డెట్రాయిట్ లోని వీపింగ్ విల్లాస్ ని, చికాగో చిత్రశాలని, బుద్దగయని, వెయిస్థంబాల గుడిని, మహాబలిపురాన్నికవిత్వం చేశాడు.

 సారాంశంలో దర్భశయనం శ్రీనివాసాచార్య కవిగా మనిషి గా ఆర్తి గలవాడు కన్సర్న్ తో వున్నవాడు.

ఎక్కడున్నావని కాదు తల్లీ

వున్న చోట ఎట్లా వున్నావన్నదే ముఖ్యమంటాడు

ఎప్పటి కప్పుడు తననీ తన కవిత్వాన్నీ ఇంట్రాస్పెక్ట్ చేసుకునే దర్భశయనం శ్రీనివాసాచార్య

‘వెళ్ళాలి లోపలికెళ్లి తిరిగి తిరిగి/ నన్ను నేను దర్శించాలి స్పృశించాలి/ ఈ కాసేపు ఏకాంత యాత్రా వేళలో/ నన్నెవరూ కదపొద్దుదయచేసి/ దూరం నుంచాయినా దగ్గరి నుంచయినా/ ఈ అంతర్దర్శనం లేకుండా రేపు ఏ బాహ్య దర్శనానికి వెళ్లగలను’

అన్న స్పష్టమయిన ఎరుక కలిగిన కవి దర్భశయనం శ్రీనివాసాచార్య నిరంతర అంతర్ బహిర్ లోకాల దర్శనాలతో సంఘర్షణలతో విత్తి నాటి నీరు పోసి జాగ్రత్తగా పోషించి విస్తరింప జేసిన పరిమళం ఆయన కవిత్వం ‘పత్రహరితం’

 

-వారాల ఆనంద్

9440501281

 

 

 

 

‘మనం'(poem)

Posted on

sopathi

మనం

-వారాల ఆనంద్

నీకూ నాకూ మధ్య

చిమ్మ చీకటి

కఠోర నిశ్శబ్దం

కనిపించని వంతెన

            ఎక్కడి వారక్కడే

కాళ్ళకి ప్రేమ మువ్వలుంటే

సవ్వడి

హృదయానికి కళ్ళుంటేనే

సింగిడి

         నాలుగు అడుగులేస్తేనే కదా

నేను నిన్ను కలుస్తాను

నీకు నేను తెలుస్తాను

నువ్వూ నేనూ మనమవుతాం

మనుషులమవుతాం

Where have those days gone?(poem)

Posted on

gone

Wake up with the morning star

Start with the daily chores

Speak to the people and

Share with the neighbours

Fun was all ours

Where have those days gone?

 

How are you and how do you do?

Greetings and salutations

Not in facebook likes

Not in whatsapp shares

Everything was face to face

Where have those days gone?

 

Light a lamp at twilight

Take a gulp of porridge

Lie down under the sky

Count the stars and hum the tunes

Time was all ours

Where have those days gone?

 

Long nights and longer sleeps

No fantasies, no failures

No talking in dreams

Everything was under control

 

Love and friendship

Prevailed in true sense

In good and bad times

We had people around

Where have those days gone?

 

సినీ చైతన్యం బి.ఎస్.నారాయణ(BS.NARAYANA FILMMAKER)

Posted on

 

bs-narayana

తెలంగాణకు భౌతికంగా సుధూరంలో ఎక్కడో మద్రాస్ లో  వేళ్లూనుకుని మానసికంగా మరెంతో దూరంగా వుండిపోయిన ఆంధ్ర సినిమా రంగం లోకి  1952లో ఓ తెలంగాణా యువకుడు కాలు పెట్టి తనదయిన ముద్రా వేసుకుని జాతీయ స్థాయిలో రెండు అవార్డులు సాధించాడు.అంతేకాదు తెలుగు సినిమా ప్రపంచానికి మొట్టమొదటి సారి జాతీయ ఉత్తమ నటి అవార్డ్ ను నటి శారద కు సాధించి పెట్టిన మహా దర్శకుడు బి.ఎస్.నారాయణ. నిమజ్జనం సినిమా బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో పనోరమా విభాగం లో ప్రదర్శించ బడి విశేషంగా మానానల్ని అందుకుంది.  నిమజ్జనం,ఊరుమ్మడిబతుకులు సినిమాలు మాస్కో, బెర్లిన్ ఫ్రాన్స్ తదితర అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలల్లో ప్రదర్శించబడి మొట్టమొదటిసారి తెలంగాణ దర్శకుడి జెండా ఎగురవేసిన తెలంగాణ బిడ్డ ఆయన.

బి.ఎస్.నారాయణ కరీంనగర్ జిల్లా లోని కొత్తపల్లి గ్రామంలో 1929లో జన్మించాడు. వెనుకబడిన తరగతులకు చెందిన బి.ఎస్.  సినిమా గురించి గొప్ప కల గన్నాడు. కల నెరవేర్చుకోవడానికి మద్రాస్ పయనమయ్యాడు. 1952లో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన మొదట హెచ్.వి.బాబు.,కె.ఎస్.ప్రకాష్ రావు , కె.బి.తిలక్ ల వద్ద అసిస్టెంట్ గాను అస్సోషియేట్ గాను పని చేశాడు. 1960 తర్వాత తాను స్వంతంగా దర్శకత్వ భాధ్యతలు చేపట్టాడు. శ్రీదేవి, పెళ్లినాటిప్రామానాలు,ఎదురీత, తిరుపతమ్మ కథ , ఆమె ఎవరు, శ్రీవారు మావారు, ఆమె ఎవరు,ఆనంద నిలయం,ఆడవాళ్ళు అపనిందలు, ఆడది గడప దాటితే  లాంటి 32 చిత్రాలకు పైగా నిర్మించాడు. ఎన్.టి.ఆర్., కృష్ణ లాంటి అప్పటి స్టార్ హీరో లతో సినిమాలు తీశాడు.తెలుగు మాత్రమే కాకుండా తమిళ,కన్నడ,హింది చిత్రాలకు దర్శకత్వం  వహించారు.

మృణాల్ సేన్ (ఒకవూరి కథ), శ్యామ్ బెనెగల్ (అనుగ్రహం) లాంటి చిత్రాలతో తెలుగులో సమాంతర చిత్రాల నిర్మాణానికి  పాదులు వేసిన నేపథ్యంలో బి.ఎస్.నారాయణ తీసిన నిమజ్జనం, ఊరుమ్మడి బతుకులు జాతీయ స్థాయిలో ఆర్ట్ సినిమా విభాగంలో ప్రతినిధులుగా నిలిచాయి.

తెలంగాణ మట్టి చాళ్ళల్లోంచి ఎదిగిన వాడు కనుక బి.ఎస్. మద్రాస్ లో కేవలం సినిమాల నిర్మాణం లోనే సినీ కార్మిక సంఘం లో చురుకయిన పాత్రను పోషించారు. దక్షిణ భారత సినీ దర్శకుల సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. సినీ దర్శకుల కోసం ఒక సంఘాన్ని స్థాపించి వారికోసం ‘రాజా రామ్ డైరెక్టర్స్ కాలనీ’ ఏర్పాటు చేశాడు. మొదటినుంచీ ఉత్తమ కాళా విలుపయిన, చిన్న చిత్రాల పయిన మక్కువ కలిగిన బీ.ఎస్. మద్రాసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు లేని బి.ఎస్. ఎంతో మంది కళాకారుల్ని చెరదీసి వృద్దిలోకి తెచ్చారు.

నిరంతరం కళా కార్మిక చైతన్యంతో జీవించిన బి.ఎస్. కు ఫిల్మ్ సొసైటీ ఉద్యమంతో కూడా సన్నిహిత సంభందాలున్నాయి.  1990 ప్రాంతంలో సుగర్ వ్యాధి తీవ్రం కావడం తో ఆయన దృష్టిని కోల్పోయారు. అయినప్పటికీ ధైర్యాన్ని కోల్పోకుండా కరీంనగర్ లో వున్న లయన్స్ కాంతి ఆసుపత్రి పైన ‘తమసోమా జ్యోతిర్గమయ’   డాకుమెంటరీ చిత్రం తీశాడు. 1991 లో కరీంనగర్ లో కొంత మంది యువకుల్ని సమీకరించి ‘మార్గదర్శి‘ చిత్రాన్ని తీశాడు. అంధుడిగా వుండి సినిమా నిర్మించిన నేపథ్యంలో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రెకార్డ్స్ లో బి.ఎస్. కి చోటు దక్కింది. అంతే కాదు ఆ సినిమాకు రాష్ట్ర స్థాయిలో జాతీయ సమైఖ్యతా చిత్రంగా నంది అవార్డ్ ను అందుకుంది.

అలా ఆంధ్ర వ్యాపార సినిమాకు సమాతరంగా ఆర్ట్ సినిమాల్ని తీసిన మొదటి  తరం దర్శకుడిగా బి.ఎస్.నారాయణ చరిత్రలో  మిగిలిపోయాడు. 1994 నవంబర్ 23న తనువు చాలించాడు.

ఆంధ్రా సినిమా మాత్రం పెత్తందారీ తనంతో తెలంగాణ ప్రతిభకు సముచిత స్థానం ఇవ్వలేదు. 1980లో ఫాల్కే అవార్డ్ ను అందుకున్న పైడి జయరాజ్ ను మరుగున పెట్టినట్టే జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారి ఉత్తమ నటి అవార్డును, రెండు జాతీయ అవార్డులను అందించిన బి.ఎస్.నారాయణ ను కూడా మర్చిపోయింది. అది తెలుగు సినిమా ధౌర్భాగ్యం. తెలంగాణ రాష్ట్రం లో నయినా బి.ఎస్. కి సముచిత స్థానం ఇవ్వాల్సి వుంది.

-వారాల ఆనంద్

9440501281

Sprout (POEM)

Posted on

 

unnamed

In isolation

My head shrivels

And heart shrinks

Eyes in meekness

Behold the world

Multifariously

 

Heart reaches

An unknown experience

Either of ecstasy or agony

An absurd form

Neither of solid nor liquid

A transparent state

Neither of Luminous nor darkness

 

Just then,

A seed sprouts

Sprout turns to bud

Blooms like a flower

Its fragrance

Blossoms as poetry

Anywhere and anytime

Isolation fetches creativity

And spreads universally

TRAGEDY (POEM)

Posted on

mobility

Flow is an eternal truth;
Motion is a reality;
Mobility is life.

Tragedy is,
In the continuous flow of
The ‘lub dub’, ‘lub dub’
The silence in between
Is also a part of life

In the perpetual movement
For a moment,
If there is a break
We confront
A still and static state
Vacuum emerges
What a melancholy!
We can neither walk nor move

Wish to walk and run
Miles together
Desire to meet everyone
And be as everyone
Inability to do as we wish
Incapability to be as we desire
What a tragic state!
Painful than death

Shadow (POEM)

Posted on

shadow-88

Shadow, forever,

Opposite to the light

 

Roars

When light spreads

Recedes

When the light is blown off

 

Increasing and decreasing

Shadow is polymorphic

 

If you follow,

It runs;

If you run,

It follows;

Shadow is witty

 

Is it an image or reflection?

Looks very similar

But no life

Shadow is a silent saint

Does it have

Heart or soul?

Neither speaks nor fights

Shadow is a trickster.

 

Shadow is only a sign

Doesn’t stand for sight

 

To stand or

To visit the innermost

Only the shadow of the heart

@aanand varala

To Begin is to End (POEM)

Posted on

first-step

 

Sitting idle isn’t prudent

There should be a start

From thoughts or experiences

 

Beginning is difficult,

As if, for too long

Squatted to a wall

Or hung on a peg,

Lethargic mind

And fatigue body

 

Whatever begins

Makes a move

Either forward

Or backward

Like a tub in the well

Or a cry in the jungle

 

Beginning is not,

Drawing a kolam in front of the house

It’s like,

Discovering the rays of light

In a silent night

Creating the ripples

In a tranquil lake

 

However,

Beginning is difficult

We should,

Set the mind and make the thoughts

Stack the flowers and gather the smiles

Weave the dreams and sprinkle the tears

 

Anything that begins

Comes to an end

Be it a life or a poem.

Anchor (POEM)

Posted on Updated on

anchor-1

For me,

Poetry is not just poetry

Half sound, half silence

Sound, a hiccup,

Comes out of the cry of life

Silence, an expression,

Comes out of the incapability of life

 

For me,

Poetry is not just poetry

Half language, half life

Language is a struggle of expression

Life is a struggle for existence

 

For me,

Poetry is not just poetry

Half life, half death

Life is a dream

In the palanquin of hopes

Death is a disappointment

In the edge of failures

 

For me,

Poetry is not just poetry

In the time of crisis

A sail that takes me to shores

In the battle of survival

An anchor that positions me upright

SLING (POEM)

Posted on Updated on

sling

On the wings of time

The journey of life,

Swings and sways

Like a water bearer’s sling.

 

On his shoulders

One pot in front

And the other at the back

One carries glee

The other holds grief

And the sling swings

Like a cradle.

 

Whenever time changes

The sling trembles

The pots swap positions

Same with the glee and the grief

 

Time has no compassion

Amid of its journey

Places the sling down

And moves on

 

One fine day

The pots mixed in soil

Spring to life again