Month: November 2022

అదూర్ ‘స్వయంవరం’ @50

Posted on

  

FRIENDS, 24 FRAMES MY WEEKLY COLUMN IN ‘DISHA DAILY 

24 ఫ్రేమ్స్  

అదూర్ ‘స్వయంవరం’ @50   

+++++ వారాల ఆనంద్

సాధారణ అట్టడుగు ప్రాంతీయ జీవితాల్లోంచి ప్రపంచ మానవ జీవితాల్ని ఆవిష్కరించిన అదూర్ దర్శకుడు గోపాలకృష్ణన్. ఆయన రూపొందించిన మొట్టమొదటి సినిమా ‘స్వయంవరం’. ఆ సినిమాకిప్పుడు యాభై ఏళ్ళు. అంటే గోల్డెన్ జూబ్లీ, స్వర్ణోత్సవం. అర్థవంతమయిన సినిమా అభిమానులు రియలిస్టిక్ సినిమాల్ని ఇష్టపడేవారికి ఇది ఒక పండగే. స్వయంవరం మలయాళీ సినిమాకు కొత్త భాషను కొత్త ఒరవడిని చూపించిన సినిమా. ఆ సినిమా ఎలాంటి రాజీ లేకుండా కేవలం సినిమాను సినిమాగా ఆవిష్కరించిన సినిమాగా నిలబడింది. అప్పటిదాకా మలయాళీ సినిమాల్లో వున్న మెలోడ్రామా, పాటలు, డాన్సులు, కామెడీ ట్రాకులూ లేకుండా దృశ్య ప్రధాన మయిన ఒరవడిలో కొత్త దారులు వేసింది. రే లాంటి వాళ్ళు ఆరంభించిన సమాంతర సినిమాలకు కొనసాగింపు ఈ స్వయంవరం. ఇద్దరు ప్రేమికులు వారి పెద్దలు అంగీకరించకున్నా తమ అభీష్టం మేరకు పెళ్ళాడి తమ కాళ్ళ పై తాము నిలబడాలని నగరానికి వస్తారు. కాని ఈ సమాజంలో మన గలగడం అంత సులభం కాదని అందునా రచయిత గా నిలబడడం చాలా కష్టమని క్రమంగా తెలుసుకుంటారు. ఆ గమనం లో ఆ జంట ఎదుర్కొన్న అనుభవాలూ చూసిన జీవితాలూ ఈ సినిమా కాన్వాస్. అందులో అదూర్ తన దృష్టి కోణాన్ని గొప్పగా ఆవిష్కరించాడు. టార్చ్ బేరర్ గా నిల బడ్డాడు. స్వయంవరం సినిమా స్వర్ణోత్సవం సదర్భంగా ఫిలిం క్రిటిక్ మధు ఎరవంకర THE JOURNEY, Swayamvaram at Fifty అన్న డాక్యుమెంటరీ తీసాడు. అట్లా ‘స్వయంవర’ స్వర్ణోత్సవం కేరళ లోనే కాదు మొత్తం భారతీయ సినిమా రంగంలో నిర్వహించుకోవాల్సిన పండుగ.     

         భారతీయ నవ్య సినిమా ప్రపంచంలో సత్యజిత్ రే తర్వాత అంత గా ప్రపంచ వ్యాప్త గౌరవాన్ని అనుడ్కున్న దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్. సినిమా ఒక పరికరం కాదు అది ఒక ఆలోచన, అభిప్రాయం, ఒక ఆవిష్కరణ అని విశ్వసించి సినిమా ద్వారా జనానికి సామాజిక వాస్తవిక అవగాహన ఆకలుగుతుందని అదూర్ సినిమాలు వివరిస్తాయి. అదూర్ గోపాలకృష్ణన్ అంతర్ముఖుడైన భావుకుడు. వాస్తవికతకు నిబద్దుదయిన దర్శకుడు. ఎప్పటికప్పుడు తనని తాను తెలుసుకుంటూ ఆవిష్కరించుకుంటూ దృశ్య మాధ్యమంలో ప్రకటిస్తూ వచ్చాడు అదూర్. ఒక రకంగా అదూర్ చిత్ర యాత్ర సమస్తం ఆయన విశ్వసించిన వాస్తవికతను ఆయన తన కోణంలో పూర్తిగా తనదయిన ప్రాంతీయ నేపధ్యంలోంచి చిత్రీకరిస్తూ పోయాడు. అందుకే అదూర్ కేవలం తన మాతృ భాష మలయాలంలోనే తన సినిమాలు తీసాడు తప్ప వేరే భాషలో నిర్మించే అవకాశాలు వచ్చినా అందుకు ముందుకు రాలేదు ఎందుకంటే తాను చేపాదలచుకున్నది తనకు తెలిసిన భాషలో చెప్పడమే సరయినదని విశ్వసించాడు. అదే పాటించాడు.

మీ సినిమా తలా రూపొందుతుందంటే కలగా మొదలయి, అక్షరంగా రూపుదిద్దుకొని పాత్రలుగా మారి సినిమా తయారవుతుందని అదూర్ ఒక చోట చెప్పుకున్నాడు. ప్రాంతీయ కోణంతో పాటు అదూర్ సినిమాల్లో మానసిక వాస్తవికత కూడా ప్రతిఫలిస్తూ వుంటుంది. ఆయన సినిమాల్లో స్త్రీ లది ప్రముఖమయిన పాత్ర. అట్లని aa పాత్రలు స్థ్రేఎ వాడ పాత్రలు మాత్రమే కాదు. మొత్తంగా కుటుంబాన్ని సమాజాన్ని నిభాయించుకునే స్త్రీ పాత్రలు ఆయనవి. అదూర్ గమనించిన కేరళ  మాతృ స్వామ్య లక్షణాలు ఆయన సినిమాల్లో ప్రతిధ్వనిస్తూ వుంటాయి. అదూర్ సాధారణంగా  తన సినిమాలకు తానే కథ కథనాలు సమకూర్చుకుంటాడు. ఆయన తీసిన ‘ మధిలుకల్ ‘ (వైకం మొహమ్మద్ భషీర్), విదేయన్ ( పాల్ జక్కరియా) ల కథల ఆధారంగా తీసాడు. తను సినిమా నిర్మాణం మొదలు పెట్టింతర్వాత మరే ఆలోచన తనలో చొరబడనీయకుండా మొదటి ప్రింట్ పూ ర్తి అయేంతవరకు దీక్షగా కోన సాగుతాడు.

తన నాలుగు దశాబ్దాల చలన చిత్ర జీవితంలో 12 కథాత్మక సినిమాలు రూపొందించిన అదూర్ అనేక డాకుమెంటరీ సినిమాలు తీసాడు. తన సినిమాల్లో ప్రతి వివరాన్నిపూర్హి గా తన సంతృప్తి మేరకే తీసుకునే అదూర్ తన సినిమాల్లో నటులు సెచ్చ తీసుజోవదాన్ని అంగీకరించరు. సినిమాల్లో నటులు నాటకాల్లోలాగా ప్రేక్షకులకోసం నటించడం లేదని  వారు దర్శకుడికోసం దర్శకుడి ఆశించినట్టుగా దర్శకుడి సంతృప్తి మేరకు నటించాలని అంటారు. పాత్రల్ని సృష్టించి కథ మేరకు ఆవిష్కరింప చేసే పని దర్శకుడిదే కనుక నటులు పాత్రల్ని ఇంప్రోవైస్ చేయడాన్ని సమంజసం కాదంటారు. అంతే కాదు అదూర్ నటీనటులకు పాత్రల వివరాలు మాటలు సీన్లు సెట్లోకి  వచ్చింతర్వాతే ఇవ్వాలంటాడు. ఆతర్వాతే రిహార్సల్ తర్వాత షూట్ అంటాడాయన. అట్లా సినిమాలకు సంభందించి తనదైన ప్రత్యేక ఒరవడిని సృష్టించాదాయన. అందుకే దర్శకుడి దృక్కోణాన్ని తెరపైకి ఎక్కించి ప్రపంచ వ్యాప్త ఖ్యాతిని సంపాదించాడు.

మలయాళీ చలన చిత్ర రంగంలో అప్పటిదాకా ఉన్న నాటకీయత దాబికాల్ని తోసిరాజని అద్దోర్ గోపాలకృష్ణన్ తన మొట్టమొదటి సినిమా ‘స్వయంవరం’ తో నూతన ఒరవడిని మొదలుపెట్టాడు. జూలై 3 1941 న జన్మించిన అదూర్ గోపాలకృష్ణన్ కుటుంబం కథాకళి నేపధ్యం వున్న కుటుంబం కావడం తో చిన్ననాటినుండే నాటకాలు ప్రదర్శనలతో ఆయన జీవితం ప్రారంభమయంది. కథాకళి లో వున్న సంగీత ఒరవడి, శారీరక సంజ్ఞలు అదూర్ని అమితంగా ప్రభావితం చేసాయి. 8 ఏళ్ల వయసులోనే వేదికలెక్కి ప్రదర్శనలిచ్చారు. డిగ్రీ చదువు పూర్తి చేసుకున్న తర్వాత తమిళ నాడు లోని దిండిగల్ లో ఉద్యోగం చేసాడు.తర్వాత పూనా లోని ఫిలిం ఇన్స్టిట్యుట్ లో స్క్రీన్ప్లే, డైరక్షన్ లలో డిప్లొమా  పొందాడు. తర్వాత త్రివేండ్రం వచ్చి కొంత మంది మిత్రులతో కలిసి రాష్ట్రంలో మొట్టమొదటి ఫిలిం సొసైటీ ‘చిత్రలేఖ’ స్థాపించాడు. తర్వాత సినిమా నిర్మాణం కోసం ‘చిత్రలేఖ ఫిలిం కొ ఆపరేటివ్ ‘ ను ఆరంభించాడు. తాము కొంత చిత్రలేఖ సంస్థ కొంత నేషనల్ ఫిలిం ఫైనాన్స్ సంస్థ నుంచి కొత్త అప్పు తీసుకొని 1972 లో ‘స్వయంవరం’ తీసాడు. నూతన జీవితాన్ని ఆరంభించాలనే ఓ జంట ఎదుర్కొనే అడ్డంకులు ఒడిదొడుకులు ప్రధాన అంశంగా వుంటుందీ చిత్రంలో కాని aa నేపధ్యంలో అదూర్ ఆకాలం నాటి సామాజిక ఆర్ధిక అంశాల పైన ఒక స్టేట్మెంట్ లాగా ఈ సినిమా రూపొందించాడు. అత్యంత వాస్తవిక ధోరణిలో చిత్రీకరించబడి ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకుంది. నిజానికి విడులయిన మొదటి రోజుల్లో ప్రేక్షకులు రాక ఆర్థికంగా వైఫల్యాన్ని ఎదుర్కొంది. కాని ఎప్పుడయితే జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకొందో దాన్ని మళ్ళీ రెలీస్ చేయడంతో జనం దృష్టిని ఆకర్షించి గొప్ప విజయాన్ని సాధించింది. తర్వాత అద్దోర్ తీసిన సినిమా ‘ కోడియాట్టం’. ఇందులో ఒక వ్యక్తి అమాయక ఏదీ పట్టించుకోని వ్యక్తి నుండి ఒక సంపూర్ణ వ్యక్తిత్వం కల మనిషిగా ఎదిగిన క్రమాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. సినిమా మొత్తం కేరళ ఆలయాల్లో జరిగే పండుగలా జరుగుతుంది. కోడియాట్టం ప్రధాన పాత్ర దారి గోపికి ఈ సినిమా గొప్ప పేరును తెచ్చి పెట్టడంతో పాటు అనేక అవార్డులు సాధించింది. తర్వాత అదూర్ తీసిన ‘ఎలిపత్తాయం’ 

అద్దోర్ సినీ రంగ జీవితంలో గొప్ప సినిమా గా ఎంచబడింది. ఇది కేరళ లోని ఫ్యూడల్ వ్యవస్థను అత్యంత వాస్తవికంగా ఆవిష్కరించి. బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యుట్ అవార్డును గెలుచుకొంది. ఇఅ అదూర్ ‘ ముఖాముఖం’ ఒక కమ్యునిస్టు కార్యకర్త జీవితం పైన నిర్మించబడి గెలుపు ఓటముల సంక్షోభాల్ని ఆవిష్కరించింది. ఇక ‘ అనంతరం’ అదూర్ స్వీయ జీవిత కథాత్మక సినిమా గా చెప్పుకుంటారు. నిర్మాణ సరళి లో మొదట  మోనోలోగ్ గా ప్రారంభమయి కోన సాగుతుంది. వాస్తవం, కల ల మధ్య ఊగిసలాడే జేవితాన్ని అనంతరం అద్భుతంగా చిత్రిస్తుంది.

తర్వాత వైకం బషీర్ కథ ఆధారంగా ‘ మథిలుకల్ ‘ తీసాడు. ఇది కూడా చిత్రీకరనలోవిలక్షనతు సంతరించుకుంది. స్వాతంత్ర పోరాట కాలంలో బషీర్ అనుభవించిన జైలు జీవితాన్ని మథిలుకల్ చిత్రించింది. ఆరాట కాలంలో బషీర్ను జైల్లో వేస్తారు. జైలు గోడకి అవతల మహిళా జైలులో వున్న నారాయని తో మాట కలుస్తుంది. గోడకు చెరో పక్క వున్న a ఇద్దరి నడుమా స్నేహం కుదుర్తుంది. ఒకరిని ఒకరు చూసుకునే అవకాశం లేదు కాని కాని మాటలు కలుపుతాయి చిత్రీకరణ గొప్పగా సాగుతుంది. ఇద్దరూ బయట ఆసుపత్రిలో కలుసుకోవాలనుకుంటారు కాని వీలు కాదు. ఇందులో మమ్ముట్టీ అద్భుతంగా నటించాడు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. తర్వాత అదూర్ విదేయన్, కథాపురుషన్ తీసాడు. ఇవి రెండూ కేరళలో కొంత వివాదాస్పదమయ్యాయి. విదేయన్ రచయిత పాల్ జక్కరియా తన కథకు అదూర్ న్యాయం చేయలేదని హిందూత్వాన్ని జోడించి నవలకు యదార్థ రూపం ఇవలేక పోయాడని అనడంతో వివాదం చెలరేగింది. దానికి జవాబుగా అదూర్ ఇట్లా అన్నాడు ‘ సాహిత్య పఠ నం వ్యక్తిగత అనుభవం అదే సినిమా సామూహిక అనుభవం కాబట్టి సినిమా రూపాన్తరీకరణ నవల లాగే ఉండాలనుకోవడం సమంజసం కాదు’. తర్వాత అదూర్ తీసిన కథాపురుషన్ స్వీయ కథాత్మక సినిమా గా నిలిచింది. ఇది కేవలం సినిమాఎన్ కాకుండా 40 నుంచి 80 దాక కథానాయకుడి చరిత్రగా తెరకెక్కింది కాని అది కేవలం అతని జీవితమే కాకుండా అయా కాలాలకు సంభంచిన సామాజిక చరిత్రను సైతం చిత్రించింది. ముఖ్యంగా ఆయా కాళాల దృక్పథాల ప్రభావాల్ని ప్రతిహావంతంగా చూపించింది.

ఇక అదూర్ తీసిన ముఖాముఖం కూడా కొంత వివాదాన్నే లేవనేత్త్తింది ఇది కేరళలో కమ్యునిస్టుల వైఫల్యాల్ని చూపించిం ది. దాంతో ముఖాముఖం కమ్యునిస్టుల వ్యతిరేక చిత్రం గా ఆరోపించబడింది. ఇందులో ప్రధాన పాత్రదారికి నత్తి పెట్టడంతో సూచన ప్రాయంగా ఒక నాయకుడిని ప్రతిబింబించి వివాదం ఎక్కువయింది.

తర్వాత అదూర్ ‘ నాలు పెలుంగల్ ‘ తీసాడు. ఇది తగజి శివ శంకర పిల్లి రాసిన నాలు కట్ర్హల్ని జోడించి నిర్మించాడు. స్త్రీల పాత్రల్ని ఆవిష్కరిస్తూ తీసిన ఈ సినిమా నాలుగు కథల సమ్మేళనంగా వుంది. తర్వాత అదూర్ పెన్న్యం నిర్మించాడు. ఇట్లా ఆయన నిర్మించిన సినిమాలు అంతర్జాతీయంగా ఎంతో పేరు గడించి సొంత గొంతును పలికించి నిలబెట్టాయి.

ఫీచర్ films తో పాటు అదూర్ అనేక డాక్యుమెంటరీ సినిమాలు తీసాడు. కాలమండలం గోపి లాంటి కథాకళి కలాకారు డి పైన ఆయన తీసిన డాక్యుమెంటరీ లు సాదికరికమయినవిగా పెరుతేచ్చుకున్నాయి.

 మానవీయ విలువల్ని ఆవిష్కరిస్తూ కళాత్మక వాస్తవికతకు తోడు మానసిక వాస్తవికతను తెరపై నిజాయితీగా చిత్రిస్తూ ముందుకు సాగుతున్న అదూర్ గోపాలకృష్ణన్ భారతీయ సినిమాకు అందించిన ఆణిముత్యాల్లాంటి సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి ఆయన ఖ్యాతి కూడా చిరస్థాయిగా నిలుస్తుంది.

-వారాల ఆనంద్   944440501281

అదూర్ ‘స్వయంవరం’ @50

69=యాదొంకి బారాత్

Posted on

69=యాదొంకి బారాత్

  • వారాల ఆనంద్

******

కళా సృష్టి అనేది

మనసుకు అంటిన మాలిన్యాన్ని తొలగించి

ప్రతిమను రూపొందించడం లాంటిది

‘కళ’

అంటే కలల లోకంలోంచి వాస్తవ ద్వారం గుండా

విశ్వంలోకి చేసే ప్రయాణమే

అట్లా సాగుతున్న నా ప్రయాణంలో 1999లో రెండు సినిమాల పుస్తకాల ఆవిష్కరణలు  జీవితంలో ప్రధాన ఘట్టాలే కాదు నాకో అపురూపయిన అనుభవాలు కూడా. అదట్లా ఉంచితే వాటికి ముందే విడుదలయిన ‘మానేరు తీరం’ మరెన్నో జ్ఞాపకాల్నీ ఎంతో మంది సాహితీ మిత్రుల్నీ కలిపింది. ‘మానేరు తీరం ’ బాగుందన్న వాళ్ళున్నారు, అదంతా కవిత్వమే నువ్వేదో ఫీచర్ అంటున్నావ్ అని కోప్పడ్డ వాళ్ళూ వున్నారు. కవులంటే కవిత్వమంటే ఏమయినా అయిష్టమా అన్నవాళ్ళూ వున్నారు. అదేమీ లేదండీ బాబూ అని సర్ది చెప్పుకోవడం కూడా జరిగింది. దాంతో పాటు అప్పటికి కొంత మంది మిత్రులవి కొన్ని పుస్తకాలు వెలువరించడం లో నా ప్రమేయం కూడా ఉండడంవల్ల మరికొంత మంది బాగా దగ్గరయ్యారు. అట్లా చెప్పుకోవాల్సిన మిత్రుల్లో డాక్టర్.టి. రాధా కృష్ణమాచార్యులు ఒకరు. తాను క్వాలిఫైడ్ హోమియో డాక్టర్. దాంతో పాటు సాహిత్యం మీద ఆసక్తి మమేకత్వంతో ఉస్మానియాలో ఎం.ఏ. తెలుగు కూడా చేసారు. వరంగల్ వాసి అయిన తాను కరీంనగర్ కు చెందిన లెక్చరర్ సుజాత గారి తో వివాహం అయ్యాక కరీంనగర్ వచ్చి స్థిరపడ్డారు. కరీంనగర్ లో ప్రముఖ సర్జన్ అయిన డాక్టర్ వి. భూంరెడ్డి గారి ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ గా చేసే వారు. నాకు మొదట మిత్రుడు డాక్టర్ కే.సత్యసాగర్ రావు గారి ద్వారా తను పరిచయం. సాహిత్యం ఇదరికీ కామన్  ఇంటరెస్ట్ కనుక బాగా దగ్గర అయ్యాం. మేడం సుజాత గారు కూడా ఆత్మీయంగా వుండేవారు. సో క్రమంతప్పకుండా కలిసేవాళ్ళం. రోడ్డు మీదయినా తన క్లినిక్ లోనయినా గంటలకు గంటలు మాట్లాడేవాళ్ళం. అప్పుడప్పుడూ నలిమెల భాస్కర్, ధర్భశయనం కూడా మాతో చేరేవాళ్ళు.  డాక్టర్.టి. రాధా కృష్ణమాచార్యులు డాక్టర్ భూంరెడ్డి ఆసుపత్రితో పాటు కొంతకాలం స్వయంగా సేయింట్ జాన్స్ స్కూలు వద్ద, మరికొంత కాలం భారత్ టాకీసు వద్ద క్లినిక్ పెట్టారు. సాయంత్రాలు అక్కడ కలిసేవాళ్ళం. సాహిత్యాన్నిగురించీ వైద్యాన్ని గురించీ చర్చల తర్వాత ఆల్ఫా చౌరస్తాలో వున్న ‘ఆనంద్ స్వీట్ హౌస్’ కాఫి తాగేవాళ్ళం ( స్వీట్ హౌస్ నాపేర వుంది కానీ నాది కాదండీ బాబూ). దర్భశయనం కరీంనగర్ ఆంద్ర బాంక్ మెయిన్ బ్రాంచ్ లో పని చేసినంత కాలం ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి సారీ అదే స్వీట్ హౌస్ లో కాఫీ తప్పనిసరి. వీడేదో మరుగు మందు పెట్టాడు మనకు అనుకునే వాళ్ళం సరదాగా.  

     అప్పుడే డాక్టర్.టి. రాధా కృష్ణమాచార్యులు తాను రాసిన కవితలతో పుస్తక వేద్దామనే ఆలోచన వచ్చింది. ఇంకేముంది మానేరు తీరం ను ఫాలో అయిపోవడమే అన్నారు. అమర్ డీ టీ పీ, హదరాబాద్ ఓం సాయి లో ప్రింటింగ్. బాధ్యత నా మీదే పెట్టాడాయాన. మనకిష్టమే కదా. “మౌనం మాట్లాడింది” కవితా సంకలనం పూర్తి అయింది. ఇక ఆవిష్కరణ పెట్టాలి. ఎవర్ని పిలవాలని ఆలోచించి వరంగల్ నుంచి డాక్టర్ కాత్యాయిని విద్మహే గారిని పిలవాలనుకున్నాం. మీది వరంగల్ కదా వెళ్ళండి అన్నాను.. లేదు నువ్వూ రా అన్నాడాయన, తప్పేదేముంది వెళ్ళాము. ఆమె కరీంనగర్ రావడానికి అంగీకరించింది. సభకు డాక్టర్ గండ్ర లక్ష్మణ్ రావు అధ్యక్షత వహించగా డాక్టర్ వి. భూంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేను ఆడియెన్స్ లో వున్నాను. సభ బాగా జరిగింది. తర్వాత సమీక్షలు అవీ మామూలే. అట్లా డాక్టర్.టి. రాధా కృష్ణమాచార్యులు గారు తన మొదటి పుస్తకం తో సాహిత్య ప్రపంచంలోకి వచ్చారు. తన మౌనం మాట్లాడింది లో రాసిన కవితలో ఇట్లా రాసారు..

జ్ఞాపకాలు

నా జీవన వాహిని జ్ఞాపకాలు

నాకుగాక ఇంకెవరికి ఎరుక

నా గుండె గుడిలో ఒదిగిన అనుభవాలు

నాకుగాక ఇంకెవరికి ఎరుక

నా ఎదలో ఒదిగిన పొదిగిన

సుందర స్వప్నాలు నిత్య సత్యాల్ని

ఎవరు బొమ్మగా గీయగలరు

నేను గాక

నా మదిలి ముసిరినా మురిసిన

చీకటి వెలుగు ఆలోచనలను

ఎవరు పాటగా రాయగలరు

నేను గాక

స్నేహ యాత్ర ఓ పొడరిల్లయింది

జీవన యాత్రలో జీవన్ ధారగా సాగింది

ఒడి దొడుకుల బాటలో బతుకు బండి సాగినా

పడిపోకుండా కుదురుగా నడిపించిన

హితైక  హస్తాలు నేస్తాలు

నాకుగాక ఇంకెవరికి ఎరుక ( డాక్టర్ టి. రాధాకృష్ణమా చార్యులు) 

‘మౌనం మాట్లాడింది’ తర్వాత డాక్టర్ టి. రాధాకృష్ణమా చార్యులు వెలువరించిన ‘ఎదారి దీపం’ సంకలనం ప్రచురణలో కూడా నేను చొరవ తీసుకున్నాను. ఆ పుస్తకం ఆవిష్కరణ కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సభలో ఆయనకు సహాధ్యాయి మిత్రుడు అప్పటి ఆదిలాబాద్ ఎం.పి. డాక్టర్ వేణుగోపాలా చారి ఆవిష్కరించారు.

..

డాక్టర్ల ప్రస్తావన వచ్చింది కనుక ఆ రోజుల్లో అంతకు ముందు కూడా మా కరీంనగర్ లో కొంతమంది ఫిసీశియన్స్, సర్జన్స్ చాలా పాపులర్. వారిలో 70,80 దశకాల్లో ఫిసీశియన్స్ గా డాక్టర్ భాస్కర్ మాడేకర్, డాక్టర్ జగన్నాథ రెడ్డి, డాక్టర్ నాగభూషణం లు దాదాపు తొలి తరం వాళ్ళు. వారిలో మాడేకర్ లయన్స్ క్లబ్ లో బాగా ఉత్సాహంగా కృషి చేసారు. అంతేకాదు ఆయన చొరవ, కృషి తో ‘కరీంనగర్ లయన్స్ చారిటబుల్ కంటి ఆసుపత్రి’ని ఏర్పాటు చేసారు. అదిప్పటికీ వేలాది మందికి కంటి సేవలు అందిస్తోంది. దానిపైన నేనో డాక్యుమెంటరీ కూడా చేసాను. ఇక డాక్టర్ నాగభూషణం గారు అపురూపమయిన వస్తువుల్ని సేకరించి ఒక మ్యూసియమే పెట్టారు. కరెన్సీ, కాయిన్స్ తో పాటు ‘కర్రముక్కల్లో కమనీయ రూపాలు’ పేర అందమయిన కర్రముక్కలతో గొప్ప సృజనాత్మకమయిన సేకరణ చేసి పెట్టారు. ఆ తరం తర్వాత ఫిసీశియన్స్ లో నాకు తెలిసి డాక్టర్ ఏ.లక్ష్మినారాయణ, డాక్టర్ విజయ మోహన్ రెడ్డి, డాక్టర్ రఘురామన్ తదితరులున్నారు. ఇక లేడీ డాక్టర్ల లలో అబిదా బానో, ఖుతీజా ఖాతూన్, ఝాన్సీమణి, డాక్టర్ హైమవతి, శారదావాణి ఇట్లా పలువురు వుండేవాళ్ళు. ఇంకా డాక్టర్ శేషగిరి రావు కంటి వైద్యుడి గానే కాకుండా సంగీత నృత్య అభిమానిగా కరీంనగర్ లో ‘త్యాగరాజ లలిత కళా పరిషత్’ అన్న సంస్థను ప్రారంభించి నడిపారు. డెంటిస్ట్ జగన్నాథ రావు, స్కిన్ స్పెషలిస్ట్ కమల్ లాహోటి ఇట్లా నాకు గుర్తున్నంత వరకు పలువురు డాక్టర్లు విశేషంగా సేవలు అందించారు.

ఇక ఫిలిం సొసైటీ విషయాలకు వస్తే 1999-2000 సంవత్సరాల్లో టి.రాజమౌళి, కోల రామచంద్ర రెడ్డి, సీహెచ్ వేణుగోపాల్, వారాల మహేష్ తదితరులు ప్రధాన బాధ్యతల్ని అంటే అధ్యక్ష కార్యదర్శి పోస్టుల్లో వున్నారు. అప్పుడు మీట్ ద డైరెక్టర్ పేర పలు కార్యక్రామాలని నిర్వహించాం. వాటిల్లో ప్రధానమయినది మీట్ ది డైరెక్టర్ జట్ల వెంకటస్వామి నాయుడు. పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థి అయిన జట్ల రూపొందించిన మొట్ట మొదటి సినిమా ‘ప్రత్యూష’.

“ప్రత్యూష”

      ఒక మంచి సినిమా ప్రయత్నం “ప్రత్యూష”. ఒక మంచి ప్రయత్నాలు చేయడానికి ధైర్యం కావాలి. చొరవ కావాలి,  గొప్ప ప్రతిభ వుండాలి అకుంఠిత దీక్షా కావాలి. ఒక్కోసారి అన్నీ వున్నా ప్రయత్నం పూర్తి కాకపోవచ్చు. మరోసారి అచంచలమయిన నిబద్దతతో ప్రయత్నం పూర్తి అయినా చివరికి రావల్సినంత గుర్తింపూ గౌరవమూ దొరక్కపోవచ్చు.  చరిత్రలో స్థానమూ అర్హమయినంత దొరక్క పోవచ్చు. కానీ ఆ ప్రయత్నం వెనకాల వున్నకృషీ దాని ప్రభావమూ చివరంటా ప్రభావం చూపుతూనే వుంటుంది. అలాంటి గొప్ప ప్రయత్నమే “ప్రత్యూష” సినిమా. జట్ల వెంకట స్వామి నాయుడు దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాకు ఒక గొప్ప నేపధ్యముంది. ఆ ప్రయత్నం వెనకాల కొంతమంది యువకుల దీక్ష పట్టుదల వుంది, ఎక్కడో మారుమూల నిజామాబాద్ జిల్లా లోని ఆర్మూర్, అరసవెల్లి గ్రామాలకు చెందిన సాయిలు, నాగ భూషణం, నాగయ్య తదితరుల బృందం కష్టంగా నిధులు సమకూర్చుకుని ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. తెలంగాణా జిలాల్లో నిజామాబాద్ లో ‘జోగిని’, మెదక్ లో బసివిని, కరీంనగర్లో శివసత్తులు లాంటి మూఢాచారాలున్నాయి. దేవుని పేర స్త్రీలను వూరిపరం చేయడం. వూరి ఆస్తిగా పరిగణించడం వుండేది. అలాంటి జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ ఫలితమే ఈ ‘ప్రత్యూష’ సినిమా. తెలంగాణా కుత కుత ఉడుకుతున్న కాలంలో 1978లో ఈ సినిమా నిర్మాణం మొదలయింది. అప్పుడే పూనా FTIIలో  చదువుకుని వచ్చిన జట్ల వెంకట స్వామి నాయుడు ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా, కవి కే.శివారెడ్డి రచన, శీలా వీర్రాజు కళా రంగ బాధ్యతలు చేపట్టారు.

     వాస్తవిక దృక్పధం తో కళాత్మకంగా రూపొందిన ప్రత్యూష పూర్తి అయింది కాని వాణిజ్యపరంగా విడుదల కాలేదు. అప్పటికే సత్యజిత్ రే, మృనాల్ సేన్ లాంటి దర్శకుల సినిమాలను చూసివున్న సొసైటీ సభ్యులు ప్రత్యూష చూసి తెలుగులో ఇలాంటి సినిమాని ఊహించలేదని గొప్ప ఆశ్చర్యానికి లోనయ్యారు. అలాంటి సినిమాను వేములవాడ, కరీంనగర్ ఫిలిం సోసైతీల్లో అప్పటికే ప్రదర్శించాం. కానీ మీట్ ద డైరెక్టర్ అన్నప్పుడు జాట్ల తీసిన రెండు సిన్మాలు వేయాలనుకుని ప్రత్యూష తో పాటు ఆయన తీసిన రెండవ సినిమా ‘శిశిర  కూడా కరీంనగర్ లో వేశాము. టి.జలజవేని, టి.జయలక్ష్మి లు సంయుక్తంగా నిర్మించిన శిశిర లో మీనాక్షి నాయుడు, లింగ మూర్తి, వినోద్ బాల, బిక్షు ప్రధాన భూమికల్ని పోషించారు. శిశిర సినిమా ప్రధానంగా మహిళా కోణం లో రూపొందించబడింది. స్త్రీకి స్వీయ ఆలోచనలు, స్వంత వ్యక్తిత్వమూ వుండాలని చూపించే క్రమంలో ఈ సినిమా సాగుతుంది. సీమ డబ్బున్న తండ్రిని కాదని ప్రేమించిన కృష్ణ ను పెళ్లాడితే అతను కూడా తన తండ్రి డబ్బు కోసమే తనను ప్రేమించాడని, పెళ్ళాడాడని  తెలుసుకుని డబ్బుకోసం అతను పెట్టె హింసల నుండి తప్పించుకునేందుకు ఆత్మహత్యా యత్నం చేస్తుంది. మిత్రుడు రవి కాపాడుతాడు. ఇద్దరూ కలిసి వున్దామనుకుంటారు. కాని ఆమె తండ్రి ఆమెను బలవంతంగా లాక్కొచ్చి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు.. సీమ తనకు ఎలాంటి ఆశలు ఆకాంక్షలు లేకుండా మౌనంగా పరిస్థితులకు లొంగి పోతుంది… స్థూలంగా ఇది కథ. సినిమా తర్వాత మీట్ ద డైరెక్టర్ లో జట్ల అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. తన దృక్కోణాన్ని సవివరంగా చెప్పాడు. అట్లా జట్ల  తన రెండు సినిమాలతో మా కరీంనగర్ ఫిలిం సొసైటీ సభ్యులతో ‘కరచాలనం’ చేసాడు. ఇక మరో కార్యక్రమంలో ‘కొమరం భీం’ సినిమా ప్రదర్శించి ఆ చిత్ర దర్శకుడు అల్లాణి శ్రీధర్, కొమురం భీం పాత్రని పోషించిన భూపాల్ లతో కూడా సమావేశం ఏర్పాటు చేసాం.

ఇదిట్లా సాగుతూ వుండగా అగ్రహారం డిగ్రీ కాలేజీ నుండి కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీకి బదిలీ ప్రయత్నాలు ఆరంభించాను. కాని అప్పుడు బదిలీల పైన ప్రభుత్వం బాన్ విధించింది. బదిలీ కావాలంటే సెక్రెటేరియట్ నుంచి ఆర్డర్స్ తెచ్చు కోవాలి. అందుకోసం పెద్ద ప్రయత్నమే చేయాల్సి వచ్చింది. దరఖాస్తును మొదట డైరెక్టర్ కు పెట్టాలి. అక్కడినుంచి దాన్ని  సెక్రెటేరియట్ పంపాలి. నాకు అంతగా ఆ వివరాలుతెలీవు. అప్పుడు మిత్రుడు అల్తాఫ్ ఎంతో సహాయం చెసాడు. అత్మీయ మిత్రుడు పీ.ఎస్.రవీంద్ర అపుడు కరీంనగర్ లో జిల్లా విలేఖరిగా వున్నాడు. కరీంనగర్ ఎం.ఎల్.ఏ. కే.దేవేందర్ రావు గారిని కదిలిస్తే ఫైలు కదిలి ఖాళీగా వున్న కరీంనగర్ కాలేజీకి ఆర్డర్స్ ఇచ్చారు. అమ్మయ్య అనుకున్నాను. నేను చదివిన కాలేజీలో ఉద్యోగం గొప్ప ఉద్వేగాన్ని కలిగించింది… అక్కడే ఉద్యోగ విరమణ దాకా 16సంవత్సరాలు పని చేసాను. నా జీవితంలో ఎస్.ఆర్.ఆర్. కాలేజీ ది విడదీయరాని అనుబంధం.. ఎన్నో గొప్ప అనుభవాలు.. అనుభూతులు.. విజయాలు..

అన్నింటి జ్ఞాపకం చేసుకుంటూ వివరిస్తూ మళ్ళీ వారం కలుస్తాను..

-వారాల ఆనంద్     

నిజ చిత్రాల నిర్దేశకుడు –బి.ఎస్.నారాయణ

Posted on

FRIENDS, MY WEEKLY COLUMN IN “DISHA” DAILY
– VARALA ANAND
నిజ చిత్రాల నిర్దేశకుడు –బి.ఎస్.నారాయణ
(23 నవంబర్ బీ.ఎస్. నారాయణ వర్ధంతి )
ప్రపంచ ప్రసిద్ద దర్శకుడు ఆండ్రీ తార్కొవిస్కీ ఒక చోట ఇలా అంటాడు ‘ సినిమాల్లో తెర మీద మీ భావాలు చూపించడం కాదు అసలయిన జీవితాన్ని ఆవిష్కరించాలి, అప్పుడే ప్రేక్షకులు తమకు తామే వాస్తవాల్ని అర్థం చేసుకుంటారు, అభినందిస్తారు.’ అట్లా వాస్తవిక జీవితాల్ని , సమాజాన్ని నిజాయితీగా తెరపైన ఆవిష్కరించినప్పుడే ఆ సినిమాకు లేదా మరే కాళాత్మక వ్యక్తీకరణ కైనా సార్థకత వుంటుంది శాశ్వతత్వమూ వుంటుంది. అందుకే అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడయినా అర్థవంతమయిన సృజనకే గౌరవమూ, ప్రజలపై దాని ప్రభావమూ వుంటాయి.
సంఖ్యా పరంగా తక్కువగా వెలువడినప్పటికీ మంచి సినిమా దర్శకులకు వారి సినిమాలకు దశాబ్దాలపాటు అన్వయముంటుంది. ఆ కోవలో తెలుగు సినిమా రంగంలో తాను తన కారీర్లో 31 సినిమాలకు పైగా తీసినప్పటికీ కేవలం రెండు మూడు వాస్తవ వాద సినిమాల ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపునూ కీర్తినీ పొందాడు బి.ఎస్.నారాయణ. తెలుగు సినిమాకు ఒక గుర్తింపునూ గౌరవాన్ని తెచ్చిపెట్టాడు.
అప్పటికి అత్యంత వెనుకబడిన ప్రాంతంగా వున్న తెలంగాణ ప్రాంతం లోని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో 1929లో ఫిబ్రవరి 17న బి.ఎస్.నారాయణ జన్మించాడు. తాన 23 ఏళ్ల వయసులో తన మీద తనకున్న విశ్వాసామూ, సినిమా రంగం పైన వున్న మమకారంతో 1952లో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన అకుంటిత దీక్షతో అనేక కష్టాలకొర్చి నిలదొక్కుకున్నాడు.
అప్పటికి భారతదేశంలో సినిమా పరిశ్రమకు బొంబే( ముంబాయి), మద్రాస్ ( చెన్నై ) లు ప్రధాన నిర్మాణ కేంద్రాలుగా వున్నాయి. దక్షిణాది భాషా చిత్రాలన్నింటికీ మద్రాసే కేంద్రం. దశాబ్దాల క్రితం కనీసం రైలు వసతి కూడా లేని ప్రాంతం నుండి సినిమాలకోసం మద్రాస్ వెళ్ళే సాహసం చేసిన బి.ఎస్.నారాయణ దీక్షా పట్టుదలతో దర్శకుడిగా అప్పటి పెద్ద నటులతో సినిమాలు తీయగలిగాడు. భారీ విజయాల్నీ కొన్ని అపజయాల్నీ చవిచూశాడు. సినిమా జిలుగు వెలుగుల ఛాయలో వుంటూనే సినీ కార్మికుల గురించి కృషి చేశాడు. తన లాంటి దర్శకుల గురించీ తపన పడ్డాడు. కానీ తన సినిమాల గురించి తనకే ఎక్కడో ఒక అసంతృప్తి, ఎంతగా సామాజిక కుటుంబీక ఇతివృత్తాలతో సినిమాలు నిర్మించినప్పటికీ బి.ఎస్.లో తన దారి ఇది కాదు మరింకేదో చేయాలనే తపన వెంటాడగా ‘ఊరుమ్మడి బతుకులు’, ‘నిమజ్జనం’ లాంటి సినిమాలతో తనని తాను నిరూపించుకున్నాడు. తనదైన సమాజాన్ని సరిగ్గా వెండి తెరపై ఆవిష్కరించాడు. అనారోగ్యం తో దృష్టిని కోల్పోయినా మొక్క వోని దీక్షతో డాకుమెంటరీలు, ఒక పూర్తి నిడివి సినిమా తన వూర్లో తన వాళ్ళ మధ్య నిర్మించి రికార్డులు నెలకొల్పాడు. తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు, కానీ ఇదంతా ఆషామాషీగా జరగ లేదు. తెలంగాణ అంటేనే అత్యంత వివక్షకు, నిరాదరణకూ నెలవైన సినిమా రంగంలో నిలదొక్కుకోవడం సాధారణ విషయం కాదు. సహనంతో ప్రతిభతో బి.ఎస్.నారాయణ అది సాధించాడు.
మొదట ఆయన నైజాంకు వ్యతిరేకంగా హైదరబాద్ స్టేట్ కాంగ్రెస్ లో పనిచేశాడు. జమలాపురం కేశవ రావు, హయగ్రీవాచారి లాంటి వారితో కలిసి పనిచేశారు. స్వతహాగా కళాకారుడయిన బి.ఎస్.నారాయణ రాజకీయాలల్లో ఇమడ లేక తనకు గల సినిమా ఆసక్తి మేరకు మద్రాస్ పయనమయ్యాడు. వెనుకబడిన తరగతులకు చెందిన బి.ఎస్.నారాయణ సినిమా గురించి గొప్ప కల గన్నాడు. కల నెరవేర్చుకోవడానికి మద్రాసు చేరుకున్నాడు. 1952లో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన మొదట హనుమప్ప విశ్వనాథ్ బాబు ( హెచ్.వి.బాబు) వద్ద అసిస్టెంట్ గా ‘ఆదర్శం’ సినిమాకు పనిచేశాడు. అందులో ప్రధాన పాత్రను కొంగర జగ్గయ్య పోషించారు. తర్వాత కె.ఎస్.ప్రకాష్ రావు , కె.బి.తిలక్ ల వద్ద అసిస్టెంట్ గాను, తర్వాత అసోసియేట్ గాను పని చేశాడు.
1960 తర్వాత తాను స్వంతంగా దర్శకత్వ భాధ్యతలు చేపట్టాడు.
ఆయన మొట్ట మొదట తీసిన సినిమా ‘మాంగల్యం’. రెండో సినిమా 1963లో ‘ఎదురీత’. 1963లోనే బి.ఎస్.నారాయణ తన మూడవ సినిమా ‘తిరుపతమ్మ కథ’ కు దర్శకత్వం వహించారు.
తర్వాత బి.ఎస్.నారాయణ ‘ విశాల హృదయాలు “”’ఆమె ఎవరు’. ‘ఆనంద నిలయం’. ‘శ్రీ వారు మావారు’, ‘ఆడవాళ్ళు అపనిందలు’, ఆడది గడప దాటితే కు దర్శకత్వం వహించారు
అలా ఎన్.టి.ఆర్., కృష్ణ, కాంతా రావు లాంటి అప్పటి స్టార్ హీరోలతో సినిమాలు తీసి పలు విజయవంతమయిన సినిమాలు తీసిన బి.ఎస్.నారాయణ ప్రధాన స్రవంతి సినిమా దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు .తెలుగు మాత్రమే కాకుండా తమిళంలో ఉల్లాస పయనం, యార్నీ, తేదివంద, తిరుమగల్, దైవీగరవు తదితర సినిమాల్ని తీశాడు. కన్నడంలో మమథేయ భందన, జాణర జాణ, కానికే చిత్రాలు తీశాడు. ఇక హిందీలో 20 సూత్రాల పథకం ఆధారంగా హేమామాలిని, వినోద్ మెహ్రా తదితరులతో ‘ ఏక్ నయీ ఇతిహాస్’ సినిమా తీశాడు.
కానీ అప్పటికీ తన నేపధ్యం, తన భావాల కనుగుణంగా సినిమాలు తీయాలనే తపన ఆయన మనసులో తొలుస్తూనే వుంది. అప్పటికే దేశ వ్యాప్తంగా ప్రధాన స్రవంతి సినిమా రంగానికి సమాంతరంగా ఆర్ట్ సినిమా సమాంతర సినిమా పేర మరో సినిమా వేళ్లూనుకుంటున్నది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులూ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలల్లో ప్రదర్శనలతో ఆ నవ్య సినిమా విచ్చుకుంటున్నది, ముఖ్యంగా బెంగాల్, కేరళ, కన్నడ సినిమా రంగంలో ఆ వొరవడి ఎక్కువగా సాగింది. అర్థవంతమయిన సినిమాకు వాటి ప్రభావంతో తెలుగు లో కూడా కొన్ని సమాంతర సినిమాల నిర్మాణ ప్రయత్నాలు మొదలయ్యాయి.
మృణాల్ సేన్ (ఒకవూరి కథ), శ్యామ్ బెనెగల్ (అనుగ్రహం) లాంటి చిత్రాలతో తెలుగులో సమాంతర చిత్రాల నిర్మాణానికి పాదులు వేసిన నేపథ్యంలో బి.ఎస్.నారాయణ తీసిన నిమజ్జనం, ఊరుమ్మడి బతుకులు జాతీయ స్థాయిలో ఆర్ట్ సినిమా విభాగంలో తెలుగు సినిమాల ప్రతినిధులుగా నిలిచాయి. అదే వొరవడిలో బి.ఎస్. నారాయణ కళాత్మకత, వాస్తవిక దృక్పధం తో సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. అప్పటిదాకా తాను రూపొందిస్తూ వచ్చిన వ్యాపార లక్షణాలతో వున్న సినిమా సరలికి భిన్నంగా ఆలోచించడం మొదలు పెట్టాడు. సత్యజిత్ రే, మృణాల్ సేన్, శ్యామ్ బెనెగల్ లు నిర్మిస్తూ వచ్చిన నిర్మాణ శైలిని అందిపుచ్చుకొని తాను చూసిన గ్రామీణ ప్రాంత ఇతివృత్తాలతో సినిమాలు నిర్మించాడానికి పూనుకున్నాడు. అది అప్పటిదాకా తెలుగు సినిమాలకు తెలియని శైలి. తెలుగు సినిమా రంగం అలాంటి సినిమాల నిర్మాణానికి సిద్దంగా లేని వాతావరణం లో బి.ఎస్. ఆ స్టైల్ ఒఫ్ ఫిల్మ్ మేకింగ్ కి ధైర్యంగా పూనుకున్నాడు. జాతీయ స్థాయి లో అవార్డులు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును అందుకున్నాడు. తెలుగు సినిమాకు ఆ స్థాయిలో పేరు తెచ్చిపెట్టాడు.
నూతన నవ్య సినిమా రీతిలో అతి తక్కువ బడ్జెట్ తో ఆయన నిర్మించ పూనుకున్న సినిమా ‘ఊరుమ్మడి బతుకులు’. దాన్ని ఆయన 1977 లో తీసాడు. ప్రముఖ రచయిత సి.ఎస్.రావు రాసిన నవల ఆధారం చేసుకుని తీసిన ఈ సినిమా ఆ నాటి వ్యవస్థలో పెత్తందార్ల ఆగడాలను వారి ఆకృత్యాలకు బలయిపోయిన సాధారన జనజీవితాల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఎలాంటి హంగులూ ఆర్హాతాలూ లేకుండా అత్యంత వాస్తవిక దృక్పధంతో సాగిన ఊరుమ్మడి బతుకులు పల్లె సీమల్లోని రెండు వర్గాల ప్రజల జీవితాల్లో వున్న అంతరాల్నీ, ఒక వర్గం మరొక బలహీన వర్గం పై చేసే ఆకృత్యాలకు అద్దం పట్టింది. ఇక ఇతివృత్తం విషాయానికి వస్తే కామాంధుడయిన ఓ వూరి పెత్తందారు పేదలకు అప్పులిచ్చి ఆడవారిపై అత్యాచారం చేయడం, ఆస్తులు కాజేయడం చేస్తూ వుంటాడు. ఒక రోజు కుమ్మరి వాడయిన గన్నయ్య అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని అతన్ని పట్నం పంపి ఆతని భార్యపైన అత్యాచారం చేసేందుకు పూనుకుంటారు. ఆ సమయానికి తిరిగి వచ్చిన గన్నయ్య వారిపై దాడి చేసి హతమారుస్తాడు. అదొక గొప్ప మార్పును సూచిస్తుంది. అత్యంత సహజంగా నిర్మించబడ్డ వూరుమ్మడి బతుకులు లో మాధవి, సతేంద్రకుమార్ తదితరులు నటించారు. ఇది జాతీయ స్థాయిలో ప్రాంతీయ ఉత్తమ చిత్రం గా బహుమతి గెలుచుకొంది. రాష్ట్ర స్థాయిలో నంది అవార్డును కూడా అందుకుంది. శ్రీ రాజేంద్ర ప్రసాద్ కంబైన్స్ నిర్మించిన ఈ సినిమాలో సత్యేంద్ర కుమార్, మాధవి ప్రధాన్ భూమికల్ని పోషించారు
ఊరుమ్మడి బతుకులు సినిమాలో ప్రముఖ విప్లవ కవి శ్రీ శ్రీ
రాసిన శ్రమైక జీవన సౌందర్యానికి సమాన మైనది లేనే లేదోయి äన్న గొప్ప
గేయాన్ని బి.ఎస్. నారాయణ వాడుకున్నాడు. ఆ పాటను ఎం.బి.శ్రీనివాస్ సంగీత దర్శకత్వం లో ఎస్.పి.బాలసుబ్రమణ్యం గానం చేశాడు. గొప్ప ఉత్తేజ కరంగా సాగుతుంది ఈ పాట.
అట్లా తెలంగాణ వాడు తీసిన సమాంతర్ సినిమాల పరంపరలో బి.ఎస్. నారాయణ ఊరుమ్మడి బతుకులు దాదాపుగా తొలి ప్రయత్నంగా మిగులుతుంది.

తర్వాత 1979 లో బి.ఎస్. నారాయణ తీసిన మరో గొప్ప సినిమా ‘నిమజ్జనం’. ఇందులోని నటనకు నటి శారదకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు వచ్చింది. అంతే
కాదు ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు కూడా వచ్చింది. ప్రతిష్టాత్మకమయిన ఇండియన్ పనోరమా లో కూడా ఎంపికయింది.
నిమజ్జనం స్త్రీ పాత్ర ముఖ్యాభినేతగా చేసి నిర్మించిన చిత్రమ్. ఇందులో భారతీయ స్త్రీ సెక్సు పరంగా హిసకు గురయినప్పుడు, లేదా రేప్ చేయబడినప్పుడు ఆమె వేదన, అతలాకుతలమయిన ఆమె జీవితమూ, శీలం పోయిందన్న వ్యధ, ఇక మామూలు జీవితం జీవించ లేమేమోనన్న భావన వీటన్నింటి పర్యవసానాల ఫలితంగా గంగలో కలిసి పోయి నిమజ్జనం అయిన మానసిక శారీరక సంఘర్షణ ఈ సినిమాలో మౌలికాంశం. అత్యాచారం అనే ఒక శారీరక, సామాజిక హింసకు బలయిన స్త్రీ జీవన వ్యధ ఈ సినిమా. ఈ సమాజంలో ఎవడో చేసిన నేరానికి భాదితురాలిపైననే అప్రకటితంగా శిక్ష వేస్తుంది. -వారాల ఆనంద్
19 NOVEMBER 2022

బహుముఖీన సృజన శీలి – దీప్తి నావల్

Posted on Updated on

‘SAHITHI SRAVANTHI’ No-15

బహుముఖీన సృజన శీలి – దీప్తి నావల్
+++++++++ వారాల ఆనంద్

దీప్తి నావల్ అనగానే మనకు మన దేశంలో 1980లలో ఎగిసి విరిసిన నవ్య సినిమా ఉద్యమం గుర్తొస్తుంది. ఆ సినిమాల్లో నటించిన నటీ నటులు గుర్తొస్తారు. నసీరుద్దీన్ షా, ఓం పూరి, ఫరూఖ్ షేఖ్, నటీమణులు స్మితాపాటిల్, షబానా ఆజ్మీ, అపర్ణా సేన్ లాంటి వాళ్ళు గుర్తొస్తారు. వాళ్ళందరితో పాటు దీప్తి నావల్ గుర్తొస్తుంది. వివిధ భాషల్లో వంద సినిమాలకు పైగా నటించిన దీప్తి మంచి నటే కాదు మంచి కవి, రచయిత, ఫోటోగ్రాఫర్, పేయింటర్ కూడా. మొత్తంగా మంచి కళాకారిణి. ఆమె సినిమాలనగానే “చస్మే బద్దూర్” లో దీప్తి పోషించిన మిస్ చంకో వెంటనే స్పురణలోకి వస్తుంది, “కథ” లోని సంధ్య సబ్నిస్, “దామూల్” లోని మహాత్మాయి జ్ఞాపకం వస్తారు. అంతే కాదు ఇంకా అనేకానేక పాత్రలు గుర్తొస్తాయి. అయితే ఆమె తన కారీర్ లో తాను ఎంపిక చేసుకున్న పాత్రలు మాత్రమే చేసింది. లేకుంటే ఆమె చేసిన సినిమాల సంఖ్య వందకంటే ఇంకా చాలా ఎక్కువగా వుండేది. అట్లా ఆమె నటిగా తనదయిన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. సమాంతర సినిమాలతో పాటు మధ్యేవాద సినిమాల్ని కూడా దీప్తి చేసారు.
అయితే ఆమె కేవలం నటే కాదు మంచి కవి, కథా రచయిత్రి కూడా. దీప్తి నావల్ కవిత్వం ఇప్పటికి రెండు సంకలనాలు వెలువడ్డాయి. మొదటిది “ లమ్ హా.. లమ్ హా” , రెండవది “బ్లాక్ విండ్ అండ్ ఆదర్ పోయెమ్స్” . ఈ రెండు సంకలనాలూ సాహిత్య ప్రపంచంలో మంచి పేరు గడించాయి. “బ్లాక్ విండ్ అండ్ ఆదర్ పోయెమ్స్” పుస్తకానికి ప్రసిద్ద కవి గుల్జార్ ముందు మాట రాసారు. అందులో ఆయన ఇట్లా అంటారు… “ దీప్తి నావల్ ఆలోచనలు హృదయం లోనూ, ఆమె హృదయం ఆలోచనల్లోనూ వుంటాయి. ఆమె ప్రతి విషయాన్నీ రెండేసి సార్లు అనుభవం లోకి తీసుకుంటుంది. మొదటిసారి ఆ సందర్భంలోకి వెళ్లి సంపూర్ణంగా అనుభూతిస్తుంది, రెండవసారి ఆమె దాన్ని వడపోసి సారాంశాన్ని కవితగా మార్చి పునర్జీవింపజేస్తుంది” దీప్తి నావల్ కు కవిగా గొప్ప కవి ఇచ్చిన ప్రశంసగా దాన్ని తెసుకోవచ్చు. ఇక దీప్తి మంచి కథా రచయిత్రి కూడా. ఆమె రాసిన కథలతో “మాడ్ టిబెటన్-స్టోరీస్ ఫ్రం దెన్ అండ్ నౌ “ అన్న కథా సంకలనం వెలువడింది. అమే కథలన్నీ వాస్తవ జీవితానుభవాలనుండే రాసింది. చాలా కథలు తాను తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు ఇతివృత్తాలుగా తీసుకుని రాసింది. మరి కొన్నింటిని తన మిత్రులు దగ్గరి వాళ్ళు చెప్పిన వారి వారి అనుభవాల ఆధారంగా రాసింది. అయితే అవన్నీ కేవలం కథ చెప్పడం లాగా కాకుండా సృజనాత్మకతను జోడించి స్క్రీన్ ప్లే లాగా వుంటాయి. అవి చదువుతూ వుంటే దాదాపుగా సినిమా చూస్తున్న అనుభవమే కలుగుతుంది. కేవలం ’మార్నింగ్ ఆఫ్టర్’ కథ మాత్రం కల్పిత కథ. ముఖ్యంగా ఆమె రాసిన ‘తుల్లీ” కథ చాలా గొప్ప వాస్తవిక కథ. బాంబే లోని రెడ్ లైట్ ప్రాంతంలో ఒక యువతీ కథ అది. మొదట ఒక సినిమా స్క్రిప్ట్ ను విజయ్ టెండూల్కర్ దీప్తి కిచ్చాడు. దాన్ని సినిమాగా తీయాలనుకున్నారు. దానికి ముందు రెడ్ లైట్ ప్రాంతంలో కొంత రిసర్చ్ చేయాలని తల పోసి కొందరు మిత్రులతో కలిసి ఆ ప్రాంతంలో రాత్రుళ్ళు తిరిగింది దీప్తి. అక్కడ చూసిన సంఘటనలు, అక్కడి యువతుల అనుభవాలు చూసి చలించిపోయిన దీప్తి తుళ్ళి కథ రాసారు. అత్యంత సహజంగా, అక్కడి వాళ్ళ భాష, జీవితమూ అన్నీ ఈ కథ లో ఆవిష్కరించ బడ్డాయి. సినిమా నిర్మాణం అటుంచి కథ గొప్ప పేరును సంపాదించుకుంది. ఇక మరో ముఖ్యమయిన కథ దీప్తి రాసిన ఇద్దరు మగవాళ్ళ కథ.
ఆ కథను ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తన అనుభవంగా దీప్తికి చెప్పాడు. ఓక యువకుడు సినిమాల మీద వ్యామోహంతో మొట్ట మొదటిసారిగా బాంబే బయలు దేరతాడు. రైల్లో ప్రయాణిస్తూ వుండగా అతన్ని మరొక సహప్రయాణికుడు చాలా సేపు పరిశీలించి మాట కలుపుతాడు. ఎక్కడి వెళ్తున్నాడో ఏమి చేయాలనుకున్తున్నాడో లాంటి వివరాలన్నీ అడుగుతాడు .ఆ యువకుడి విషయం తెలుసుకుని తనతో రమ్మని వసతి కల్పిస్తానని తీసుకెళతాడు. ఇంటికీ వెళ్ళిన తర్వాత ఆతని భార్య ఈ యువకున్న వ్యామోహానికి గురిచేస్తుంది. వారిద్దరూ శారీరకంగా ఒకటవుతారు. ఇదంతా జరుగుతుండగా ఇంటతను బయట మంచంలో పడుకునే ఉంటాడు. అంటే అతను నపుంసకుడు. యువకున్ని తన భార్యకోసం తీసుకుచ్చాడు. అతనికి తన భార్య అంటే చాల ఇష్టం. ఆమెను వదులుకోలేడు. అట్లని కోరికల్నుంచి ఆమెను దూరం చేయలేదు. అందుకోసమే ఇదంతా చేస్తాడు. కథను నడిపించిన తీరు చాలా గొప్పగా వుంటుంది. జరిగిన కథే అయినా తన సృజనాత్మకతతో కథను నడిపించిన తీరు.. ఆ ఇద్దరు పురుషుల మనస్తత్వాలూ, పురుష కోణం లోంచి బాగా రాసారు దీప్తి. ఇట్లా కథలన్నీ పూర్తి స్థాయిలో ఉత్తమ కథకుడు రాసినట్టే వున్నాయి.
ఇక ఫోటోగ్రఫీ విషయానికి వస్తే దీప్తి ఓక రోజు టాటా సుమో తీసుకుని బయలు దేరి లడఖ్ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడి అందమయిన దృశ్యాల్ని అక్కడి మనుషుల్నీ తన కెమెరా లో బంధించింది. ఫలితంగా “ఇన్ సర్చ్ ఆఫ్ అనదర్ స్కై” అన్న ఫోటోగ్రఫీ ప్రదర్శన ఏర్పాటయింది. ఆ ఫోటోలు మామూలుగా కాఫి టేబుల్ బుక్ లోని ఫోటోల్లాగా కాకుండా మనసుకు హత్తుకునే వెంటాడే ఫోటోలుగా వుంది మంచి పేరు తెచ్చుకున్నాయి.
దీప్తి నావల్ కి ‘కళ’ ఏ రూపంలో వున్నా ఆసక్తే. అందుకే 1996లో ఒక సిరీస్ ఆఫ్ పెయింటింగ్స్ చేసింది. అవన్నీ కళాకారుల్లో ఎంతో ఆసక్తిని కలిగించాయి. మంచి ప్రశంసల్ని అందుకున్నాయి. అందుకే ఏ ఒక్క కళా రూపానికో పరిమితం కాలేను అంటారామె. అందుకే దీప్తి సృజన రంగంలో భిన్నమయిన దారుల్లో పయనిస్తున్నారు. ఇంత భాహుముఖీన మయిన సృజనను ప్రదర్శిస్తున్న దీప్తి నావల్ ‘ తనకు నటనతో సహా అన్ని కళారంగాలు ప్రేరనాత్మకంగానే వుంటాయి అంటారు. నటన గొప్పదే కానీ దానిలో ఆయా సినిమాల రచయితల, దర్శకుల ఆలోచనలు అనుభవాలూ కలిసి వుంటాయి.. అయినప్పటికీ మంచి నటులకు వాటిల్లో కూడా ఎంతో కొంత స్వీయ జీవితానుభవాలు కల్సి పోతాయి అంటారామె. కానీ రచనలలోనే స్వంత హృదయం ఉంటుంది అన్నది ఆమె అభిప్రాయం.

దీప్తి నావల్ ౩ ఫిబ్రవరి 1952లో పంజాబ్ లోని అమృత్ సర్ లో జన్మించారు. అమృత్ సర్ లోని సేక్రేడ్ హార్ట్ సెకండరీ స్కూలు లో స్కూల్ ఫైనల్ పూర్తి చేసారు. తర్వాత ఆమె అమెరికా వెళ్ళారు. న్యు యార్క్ లోని హంటర్ కాలేజ్ ఆఫ్ సిటీ యునివర్సిటీ లో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేసారు. డిగ్రీలో పేయింటింగ్ ప్రధాన అంశంగా నూ ఇంగ్లీష్, సైకాలజీ లు ద్వితీయ అంశాలుగా తీసుకున్నారు. దీప్తి తండ్రి గారు ఉదయ్ నావల్ ప్రొఫెస్సర్ గా పని చేసారు. తల్లి హిమాద్రి గంగాహర్ ఉపాధ్యాయురాలిగానూ, పెయింటర్ గానూ కృషి చేసారు. ఆమెకు ఒక సోదరుడు రోహిత్ నావల్, సోదరి స్మితి నావల్ వున్నారు.

ఆమె సృజనాత్మక జీవితం మొదట నాటక రంగం లో మొదలయింది. ఒక రోజు ఆడిషన్ కోసం ఆమె దూరదర్శన్ స్టూడియోకు వెళ్ళారు. అక్కడ ప్రముఖ నటుడు టీవీ హోస్ట్ ఫరూఖ్ షేఖ్ ను కలిసింది. ఇద్దరూ కలిసి ఫరూఖ్ అన్న కార్యక్రమం చేసే అవకాశం వచ్చింది. తర్వాత ఫరూఖ్ షేఖ్ ఇచ్చిన సమాచారం తో దీప్తికి వినోద్ పాండే రూపొందించిన “ఏక్ బార్ ఫిర్’ లో ముఖ్యాభినేతగా నటించే అవకాశం వచ్చింది. అట్లా ఆమె హిందీ లో నటించిన మొదటి అమెరికన్ ఇండియన్ నటి గా నిలిచారు.
సాధారణంగా నటుల జీవితాలు వేరు… నటించిన సినిమాలు వేరుగా ఉంటాయి. కానీ దీప్తి సినిమాల్లోని పాత్రలు ఆమె నిజజీవితానికి అద్దం పడుతాయి. తండ్రి ఆమెను మంచి చిత్రకారిణిని చేయాలనుకున్నాడు. కానీ ఆమె సినిమాను ప్రేమించింది. నటి కావాలనుకుంది. ఆమె సినిమాల్లోకి వచ్చేనాటికి మహామహా నటీమణులున్నారు. అయినా గ్లామర్‌తో కాకుండా పాత్రల్లోని గాఢత, సాధారణంగా కనిపించే ఆ అసాధారణ నటన ఆమెను ప్రేక్షకులకు దగ్గర చేసింది. అందుకు కారణం… తాను పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయడం.. తాను కాకుండా పాత్ర మాత్రమే అక్కడ ఉండటం ఆమె బలం.
న్యూయార్క్ లో ఫైన్‌ ఆర్ట్స్ కోర్సు చేసింది దీప్తి. కానీ ఇక్కడ భారతీయ సినిమా పూర్తిగా కమర్షియల్‌ వైపు నడుస్తున్నది. చదువుకున్నదానికి, ఇక్కడి సినిమా స్థితికి పొంతన కుదరలేదు. అయినా ఆమె నట జీవితం 978లో శ్యామ్‌బెనగల్‌ ‘జునూన్‌’ సినిమాతో బాలీవుడ్‌లో మొదలయింది. ఛష్మేబద్దూర్‌, కమలా, మై జిందా హూ, ఆంఖే, మిర్చీమసాలా, సాత్‌సాత్‌, అంగూర్‌… సినిమాలన్నింటిలో ఛాలెంజింగ్‌ రోల్స్‌ చేసింది. నిజానికి సమాంతర, ఆర్ట్‌ సినిమాలు చేయడం అంత సులభం కాదు.వాటిల్లో మమేకం అయి నటించాలి. పాత్రలకు జీవం పోయాలి. ఒక్కో పాత్ర కోసం ఎదురు చూసింది.ఎంపిక చేసుకుంది.
1981వచ్చిన ‘ఛష్మేబద్దూర్‌’ మొదలు.. 80 తొలినాళ్లలో సక్సెస్‌ఫుల్‌ ఆన్‌స్క్రీన్‌ జంట ఫరూక్‌షేక్‌, దీప్తి. ఈ ద్వయం తరువాత ‘సాత్‌సాత్‌’, ‘కిసీసే న కెహ్నా’, ‘కథ’, ‘రంగ్‌బిరంగీ’ వంటి సినిమాల్లో కలిసి పనిచేశారు. మూడు దశాబ్దాల తరువాత 2011లో ‘టెల్‌ మీ ఓ ఖుదా’లో కలిసి నటించారు. ఇద్దరూ తెర పంచుకున్న చివరి సినిమా ‘లిజన్‌ అమాయా’. ఫరూక్‌షేక్‌ మరణించిన 2013లో విడుదలైంది.1990 తరువాత ఆమె కెరీర్‌ కొంత నెమ్మదించింది. 2000లో ‘బవందర్‌’, ‘ఫిరాక్‌’ సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఉత్తమ నటిగా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. హృషికేష్‌ ముఖర్జీ సినిమాలను ప్రేమించే ఆమె’చష్మేబద్దూర్‌’, ‘కథ’ వంటి జీవిత కథలను చిత్రీకరించిన సాయి పరాంజపే తనకు అత్యంత ఇష్టమయిన దర్శకురాలు. దీప్తి దర్శకుడు ప్రకాశ్‌ఝాను పెండ్లి చేసుకుంది. కొన్ని సంవత్సరాలు కలిసి వుంది మనస్పర్తల కారణంగా విడిపోయారు. కానీ మంచి స్నేహితులుగా వున్నారు. వాళ్లిద్దరూ ఒక అమ్మాయి దిశ ని దత్తత తీసుకున్నారు. పంచ్‌గానీలోని బోర్డింగ్‌ స్కూల్‌లో చదువుకున్న దిశ… శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంది. తండ్రి సినిమా ‘రాజనీతి’కి కాస్టూమ్‌ డిజైనర్‌గా పని చేసింది.

దీప్తి మంచి నటి మాత్రమే కాదు… ఫిల్మ్‌మేకర్‌ కూడా. మనీషా కొయిరాలా హీరోయిన్‌గా ఆమె తీసిన ‘దో పైసే కి ధూప్‌, చార్‌ ఆనేకి బారిష్‌’ సినిమా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. 2009లో కాన్స్ లో ప్రదర్శితమైంది. దీప్తి కేవలం హిందీ లోనే కాకుండా అనేక భారతీయ భాషా చిత్రాల్లో నటించింది. పంజాబీలో “మర్హీ డా దీవా’, కన్నడంలో గిరీష్ కాసరవెల్లి రూపొందించిన ‘మనే’, మరాఠీ లో ‘అనాహాట్’ లో నటించారు. టీవీ లలో కూడా నటించారామె.
‘రచన తనకెంతో ఇష్టమైన, తన జీవితంలో అత్యంత ప్రధానమైన ప్రక్రియ. రాయకుండా ఉండలేను’ అని చెబుతుంది. ఆమె రాసిన వాటిలో ఇప్పటికి పబ్లిష్‌ అయినవి చాలా తక్కువ. కేవలం తన పనేదో తాను చేసుకుంటూ పోదామె… తన చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్నెప్పుడూ పరిశీలిస్తూ ఉంటుంది. చిత్రకారిణిగా కాన్వాస్‌పై ఆయిల్‌ పెయింటింగ్‌ను ఇష్టపడతారు. ల్యాండ్‌స్కేప్స్‌ చిత్రించడానికే సుముఖత చూపుతుంది. ఎన్నో సెల్ఫ్‌ పోట్రెయిట్స్‌ కూడా గీసింది. ల్యాండ్‌స్కేప్స్‌ కంటే సెల్ఫ్‌ పోట్రెయిట్స్‌ లోతుగా, సునిశితంగా ఉంటాయి. చాలా సంవత్సరాలు ఒంటరిగా జీవించిన ఆమె..’నాకు నేనే బెస్ట్‌ కంపనీ’.. అంటుంది. రచనలు చేయడం తన హృదయానికి అత్యంత దగ్గరయిన కళ అన్నారామె.
ఇక ఇటీవలే తన చిన్ననాటి స్మృతుల్నీ, అనుభవాలనీ అక్షబద్దం చేస్తూ “ అ కంట్రీ కాల్డ్ చైల్ హుడ్” అన్న జ్ఞాపకాల తోరణాన్ని రాసారు. విడుదలయిన అతి కొద్ది రోజుల్లోనే విశేష ప్రాచుర్యం పొందింది.
తాను పుట్టి పెరిగిన ప్రాంతంలోని ధ్వనుల్నీ, అక్కడి సువాసనల్నీ అన్నింటినీ కలబోసి రాసిన పుస్తకమిది అంటారామె. అదికూడా కేవలం తాను గడిపిన కాలం అనుభవాలని ఉటంకించడం కాకుండా ఒక నవల చదివినంత ఆసక్తిగా ఉండేలా ప్రయత్నం చేసారామే. ఇది కేవలం దీప్తి తన 19 ఏళ్ళ వయసు వచ్చేవరకు గడిపిన చూసిన జీవితమే. మొదటి నాలుగు చాప్టర్లను 20 ఏళ్ళ క్రితమే రాసారు. తర్వాత ఇటీవలి 5 ఏళ్లుగా చేసిన రాసిన కృషి ఫలితంగా ఈ పుస్తకం వెలువడింది. ఇందులో ఎన్నో విషయాల్ని ఎలాంటి మొహమాటం లేకుండా రాసారామే. తాను తన మిత్రురాళ్ళు ఆనాడు హీరో రాజేష్ ఖన్నా అంటే ఎంత పిచ్చిగా వుండే వాళ్ళో రాసింది. ‘ఆరాధన’ సినిమాలో రాజేష్ ఖన్నా తల ఊపుతూ చేసిన మానరిజం తననుఎంతగా ఆకట్టుకుందో రాసింది. ఆ సినిమాను 13 సార్లు చూసానంది. అంతే కాదు సఫర్, కటీపతంగ్ లాంటి సినిమాలంటే ఎంతగా పడిచచ్చామో రాసింది. ఇంకా తనను ‘మేరా నాం జోకర్’ ఎంతగా ఆకట్టుకుందో కూడా రాసింది దీప్తి. మొత్తంగా తన బాల్యాన్ని పునసృష్టించింది ఈ పుస్తకం లో.
“నిజానికి జీవన ప్రయాణం లో బాల్యాన్ని అందరం రిటర్న్ టికెట్ బుక్ చేసుకోకుండానే.. వదిలేసి వస్తాం,,తర్వాత కేవలం జ్ఞాపకాల్లోనే ఆ ప్రాంతాన్ని తిరిగి దర్శిస్తాం.’ ఆ పనిని దీప్తి అత్యంత ప్రేమతో ఆసక్తి తో సృజనాత్మకంగా చేసింది.
ఇట్లా బహుముఖీనమయిన రంగాల్లో సృజనాత్మక కృషి చేసిన దీప్తి నావల్ రాసిన కవితల్లోంచి కొన్నింటికి నేను చేసిన అనువాదాలు మీకిప్పుడు అందిస్తాను…
నేనూ-స్మిత
———————
మన కలల్ని వెంటాడుతూ
మనదెప్పుడూ ఒకటే పరుగు
ప్రతిసారీ విమానాశ్రయాల్లో సామాన్లు తెసుకుంటూనే,
వీ ఐ పీ లాంజిల్లోనో లోని వెళ్ళే కౌంటర్ల దగ్గరో కలుసుకునే వాళ్ళం

జనసమూహం మధ్య
మాట్లాడుతూనో మౌనంగానో
ఏదయినా చెప్పు కుందా మనుకుంటూ
భయం తో మనకు మనమే భయంతో
చుట్టూ జనం చేతులు ఊపుతూ కేరింతలు కొడుతూ
మనం పిచ్చితనం మధ్య అద్భుతాలుగా

ఓ క్షణం చూపుకోసం,
ఓ క్షణం స్పర్శ కోసం
ఓ క్షణం జీవించడానికి చూస్తూ చూస్తూ
కదిలి వెళ్ళిపోయేవాళ్ళం

మనం చివరిసారి కలిసి కూర్చున్నప్పుడు
నేనడిగినట్టు గుర్తు
“మనం మన బతుకుల్ని ఇంతకంటే
భిన్నంగా జీవించ వచ్చు అనుకుంటాను”
కొన్ని క్షణాల మౌనం తర్వాత
నావైపు చూడకుండానే
కళ్ళు కడపకుండానే
“అలాంటి వీలు లేదు” అన్నావు
ఇవ్వాళ నువ్వు వెళ్ళిపోయావు
కానీ
‘వీల్లేదు’ అన్న నీ మాట తప్పని
రుజువు చేసేందుకు
నేనిప్పటికీ పరుగులు పెడుతూనే వున్నాను
ప్రయత్నిస్తూనే వున్నాను
******* అనుసృజన- వారాల ఆనంద్
+++++++++++++++++++
మానసిక దుర్గంధం
—-
నీ లోపలేదో కుళ్ళి పోయింది
నీ దేహంలో రక్తమాంసాల్లో.. మానసిక దుర్గంధం
అది నీ కళ్ళల్లో శ్వాసిస్తున్నది
అది నీ మాసంలో ఇంకి క్షీనింపజేస్తుంది
ఆలస్యమయి పోతున్నది
నువ్వు దాంతో చచ్చిపోతావు
రాత్రి వెనుక రాత్రి అది నీతోనే నిద్రిస్తుంది

ఇష్టం లేని వయసు మళ్ళిన స్త్రీలాగా
ఎక్కడో వీధి చివర చీకట్లో గడుపుతుంది
అయినా అది నిన్ను అనుసరిస్తూ
నిన్ను చెత్తలో పడేయడానికి ఎదురు చూస్తుంది
నీకు తప్పించుకునే దారి లేదు
అది నీలో నీ రక్త మాంసాల్లో శ్వాసిస్తుంది
నువ్వు మానసిక దుర్గంధం తో చచ్చిపోవాల్సిందే
+++++++++++++++++++++++++++

బహుముఖీన సృజన శీలి - దీప్తి నావల్

ప్రయాణం సాగుతూనే వుంది

Posted on

++++++ వారాల ఆనంద్

మిత్రులారా! ఇవ్వాళ 13 నవంబర్(2022) ‘సంచిక’ ఆన్లైన్ పతియాలో ప్రచురితమయిన నా కవిత, మిస్ అయిన వాళ్ళు చదువుతారని.. ఇక్కడ పోస్ట్ చేస్తున్నా..కస్తూరి మురళికృష్ణ గారికి ధన్యవాదాలు.

ప్రయాణం సాగుతూనే వుంది

++++++ వారాల ఆనంద్

ఇద్దరమూ నదీ ప్రవాహంలో

కాగితప్పడవల మీద బయలుదేరాం

సముద్రంలో కలుసుకుందామనుకున్నాం

పయనించే ప్రవాహపు అలల్లో పుట్టిన ‘లయ’ను

చేతుల్లోకి తీసుకున్నాం

అది హృదయంలో ప్రతిధ్వనించింది

‘లయ’ని పిడికిట్లో బంధించాలనుకున్నాం

అది చేజారి ప్రవాహంలో కలిసిపోయింది

నది మంద్రంగా గాంభీర్యాన్ని సంతరించుకుంది

ఆకాశపు నీలి రంగుని

ప్రతిఫలిస్తూ మురిసి పోయింది

ప్రయాణం సాగుతూనే వుంది

సముద్రున్ని చేరతామో లేదో

ఎప్పటికయినా జతగా కలుస్తామో లేదో తెలీదు

కానీ

లక్ష్యం వైపు కలిసి నడుస్తున్నామనే భావనే

ఇద్దరిలో చిందులు వేస్తున్నది

ఆనందం చిగుర్లు తొడుగుతున్నది

*******

Like

Comment

Share

68= యదొంకీ బారాత్ +++++ వారాల ఆనంద్

Posted on

68= యదొంకీ బారాత్
+++++ వారాల ఆనంద్
“జీవన రాగంలో మధురమయిన ఆలాపనే బాల్యం”
ఇది నేను ఎప్పుడో రాసుకున్న వాక్యం

ఈ మధ్య మళ్ళీ ఇట్లా రాసుకున్నాను …

రోజూ ఉదయాన్నేఆరోగ్యం కోసమో ఆహ్లాదం కోసమో
మైదానంలోనో, మట్టిరోడ్డు మీదో కాళ్ళు కదపాల్సిందే

మన్నాడే నో, జగ్జిత్ సింగ్ నో చెవులకు తగిలించుకుని
‘ మై జిందగీక సాత్ నిభాతా చలా గయా…’
అంటూ వాకింగ్ ట్రాక్ ఎక్కాల్సిందే

అక్కడ వాడి మమ్మీకి తోడొచ్చిన ఓ మూడేళ్ళ పిల్లాడు
పరుగెడుతూ అందంగా నా వైపు చెయ్యూపుతాడు
వాడి కళ్ళల్లోని మెరుపులూ.. కాళ్ళలోని అశ్వనీ నాచప్పలూ..
నవ్వుల్లో విచ్చుకున్న అమాయకత్వపు నజరానాలూ
నాలోకి బదిలీ అవుతాయి..పట్నంలో వున్న మనుమడు గుర్తొస్తాడు

‘ఓ కాగజ్ కి కత్లీ బారిష్ క పానీ …’ అంటూ చెవుల్లో
జగ్జిత్ సింగ్ బాల్యం గురించి పాడుతూ ఉంటాడు

తూర్పున పొద్దు పొడుస్తూ వుంటుంది…నా రోజట్లా మొదలవుతుంది
…..
అట్లా మొదలయ్యే ప్రతి రోజులోనూ ఎదో ఓ క్షణం బాల్యంలోకి తొంగి చూస్తూనే వుంటాను. పోగొట్టుకున్న బాల్యం ఎప్పుడూ వెంట నడుస్తూనే వుంటుంది.. మరి.. నాకయినా మీకయినా..
……..
1999 జనవరిలో ‘నవ్యచిత్ర వైతాళికులు’ విడుదలయ్యాక నాలో గొప్ప ఉత్సాహం పెల్లుబికింది. నవ్యోత్సాహంతో ఉండగానే బాంబే లోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా’ 1999 నవంబర్ లో హైదరాబాద్ లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఇంకేముంది. పిల్లలన్నా పిల్లల సినిమాలన్నా ఎంతో ఇష్టం వున్న నాకు అది పెద్ద పండగే. పండగల్ని సెలెబ్రెట్ చేసుకోవాలికదా. ఈ సినిమా పండగల్ని ఉత్సవాల్ని నిర్వహించుకునే అలవాటు వేములవాడ నటరాజ కళానికేతన్ రోజులనుంచీ వస్తున్నదే. అయితే ఆ రోజుల్లో నాది ద్వితీయ పాత్రే.. కానీ ఎప్పుడయితే ఫిలిం సొసైటీ ఉద్యమలోకి వచ్చానో ఉత్సవాలు నావే అయిపోయాయి. 1981 వేములవాడ ఫిలిం సొసైటీ కాలం నుంచి ఫిలిం ఫెస్టివల్స్, సెమినార్స్ నిర్వహించడం ఎంతో ఉత్సాహంగా వుండేది. సీరియస్ సినిమాల ఉత్సవాలే కాకుండా పిల్లల కోసం ‘బాలల చలన చిత్రోత్సవాలు’ నిర్వహించడం కూడా నా కార్యక్రమాల్లో ముఖ్యమయిన అంశం అయిపోయాయి. వేములవాడలో ఇట్టేడు కరణ్, పీ.ఎస్.రవీంద్ర లు నాకు తోడూ నీడా. నా కార్యస్థలం కరీంనగర్ కు మారింతర్వాత ఫిలిం సొసైటీలో సమాంతర సినిమాల ప్రదర్శన, చర్చలు, అవగాహన కల్పించడం నా ప్రధాన కార్యక్రమం. వీటన్నింటితో పాటు ప్రతి ఏటా నవంబర్ లో వారం నుంచి రెండు వారాల పాటు బాలల చలనచిత్రోత్సవాల్ని నిర్వహించడం కూడా కఫిసో ప్రధాన కర్తవ్యంగా తీసుకుంది. దీనికి ముఖ్యంగా నాతో పాటు రేణికుంట రాములు, నరేడ్ల శ్రీనివాస్, ఒకరేమిటి మొత్తం కార్యవర్గం కార్యరంగంలోకి దూకేది. కరీంనగర్ లోని అన్ని స్కూళ్ళను సంప్రదించడం ముఖ్యమయిన పని. దాదాపు అన్ని స్కూల్లన్నుంచి వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు ‘ప్రభాత్ భేరీ’ లాగా ఉదయాన్నే వరుసలు కట్టి టాకీసులకు బారులు తీరేవాళ్ళు. గొప్ప పండుగే అది. చిల్ద్రెన్’స్ ఫిలిం సొసైటీ బెంగళూరు శాఖనుండి సినిమాల్ని తెప్పించేవాళ్ళం. ‘రిక్కి టిక్కి తావి’, ‘గంగా భవాని’, లాంటి వాటితో పాటు చాప్లిన్ సినిమాలు కూడా వేసేవాళ్ళం. రోజూ ఉదయాన్నే ఏడు గంటలకల్లా నిర్వాహకులమంతా టాకీసుల దగ్గరికి రావడం..సినిమా మొదలు అయిపోయేంతవరకు వుండి.. ఓ కప్పు చాయ్ తాగి ఎవరి పనుల్లోకి వెళ్ళేవాళ్ళం. విద్యార్థికి రెండు రూపాయల చొప్పున కలెక్ట్ చేసేవాళ్ళం. ఆ లెక్కలన్నీ రాములు సార్ చూసేది. పిల్లల్లో కనిపించే ఉత్సాహం చూడగానే అప్పటిదాకా పడ్డ శ్రమ అంతా ఎగిరి పోయేది. ఒక్కోసారి ప్రారంభోత్సవ సభకూడా పెట్టే వాళ్ళం. ఆయా కాలాల్లో వున్న జిల్లా కలెక్టర్లు కే.ఎస్,శర్మ, టీ.ఎస్.అప్పారావు, ఐ.వీ.సుబ్బారావు, సుమితా దావ్రా, దానకిశోర్, సి.పార్థసారధి ఎంతో ఉత్సాహంగా పిల్లల సినిమాలకు వచ్చేవాళ్ళు. సుమితా దావ్రా గారు అయితే తన కూతుర్ని వెంటేసుకు వచ్చేది. వారితో పాటు టాకీసుల యజమానులు జగన్ మోహన్ రావు, మురళీ మోహన్ రావులు కూడా ఎంతో సహకరించేవాళ్ళు. పిల్లలు సీట్లు చింపు తారని, కుర్చీలు విరగ్గొడతారని ఫిర్యాదులున్నా కూడా పూర్తిగా సహకరించేవాళ్ళు. ఒక్కోసారి అనేక టాకీసుల్లో పిల్లల సినిమాల్ని ఒకేసారి వేసేవాళ్ళం. కార్యవర్గమంతా వంతుల వారీగా ఆయా చోట్లకు వెళ్లి ఆర్గనైజ్ చేసేవాళ్ళం.
అప్పటిదాకా పిల్లలు, పిల్లల కోసం రూపొందించే సినిమాల గురించి అప్పటికే దశాబ్దాలుగా చేస్తున్న కృషి నాకు గొప్ప నేపధ్యం. 1999 లో హైదరబాద్ లో అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం అనేసరికి నేనూ ఏదయినా చేయాలనిపించింది. ‘బాలల చిత్రాలు’ పేర పుస్తకం రాయాలనిపించింది. బి.నరసింగ రావుని సంప్రదించాను. ఆయన బాగుంటుంది రాయండి అన్నారు. అంతే కాదు నువ్వు రాసే పుస్తకాన్ని ఇంగ్లీషులో కూడా వేయాలి అన్నారు. అనువాదం ఎట్లా అంటే సీఫెల్ లో ఏ.సాయి ప్రసాద్ వున్నారు తను చేస్తారు అన్నాడు. సమయం సరిపోతుందా అనుకున్నాను. రాసిన చాప్టర్ రాసినట్టు సాయి ప్రసాద్ గారికి పంపాను తాను ఎంతో శ్రమ తీసుకుని వెంట వెంటనే అనువాదం చేసారు. ఇక ప్రింటింగ్ ఎట్లా.. ఎవరు పబ్లిష్ చేయాలి అన్న ప్రశ్న వచ్చింది. నరసింగ రావు నన్ను హైదరాబాద్ రండి ఫిలిం డెవెలప్ మెంట్ కార్పోరేషన్ ఎం.డీ. గారిని కలుద్దాం అన్నాడు. ఒక రోజు వెళ్లాం. ఆఫీసు అంతా బిజీగా వుంది. సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ రత్నకిశోర్ ఎం.డీ.గా వున్నారు. మేం వెళ్లేసరికి ఎదో మీటింగ్లో వున్నారాయన. వెయిట్ చేసాం. తను రాగానే. మేము వచ్చిన పని వివరించాము. INTERNATIONAL CHILDREN’S FILM FESTIVAL సందర్భంగా పిల్లల సినిమాల మీద మంచి పుస్తకం వేస్తే బాగుంటుంది అన్నాము. ఇంత తక్కువ సమయంలో ఎవరు రాస్తారు అన్నారాయన. స్క్రిప్ట్ ఇంగ్లీషు తెలుగులలో సిద్ధంగా వుంది అన్నారు నర్సింగ్ రావు. మీరు పబ్లిష్ చేయడమే తరువాయి అన్నారు. దానికి ఒక్క క్షణం ఆలోచించిన రత్నకిషోర్.. చూడండి మేమే వేయాలంటే ఒక కమిటీ వేయాలి వాళ్ళు అది చదివి అప్రూవ్ చేయాలి. అదంతా త్వరగా అయ్యేపని కాదు మీరు పబ్లిష్ చేయండి మేము వెయ్యి కాపీలు కొంటాం అన్నారు. ఆయన అంత ఫాస్ట్ గా నిర్ణయం తీసుకోవడంతో మేం ఎగిరి గంతేశాం. హైదరాబాద్ ఫిలిం క్లబ్ నుంచి వేస్తామని చెప్పాం. తాను సరే అన్నాడు. చూడండి నరసింగ రావు గారు, ఆనంద్ గారు మీ పైన విశ్వాసంతో ముందుగా స్క్రిప్ట్ కూడా చూసేది లేదు ప్రింటింగ్ కు వెళ్ళిపొండి అన్నారు.
బుక్స్ డీటీపీ నేను కరీంనగర్ లో చేయించాను. ఆ వెంటనే నరసింగ రావు గారు కవర్పేజీ ఏలే లక్ష్మణ్ గారికి, ప్రింటింగ్ బాధ్యతల్ని దుర్గం రవీందర్ కి అప్పగించారు. నేను తెలుగు ఇంగ్లిష్ డీటీపీ, కావలిసిన ఫోటోస్ అందజేశాను. ఫిలిం క్లబ్ ప్రకాష్ రెడ్డిగారు, చిల్ద్రెన్’స్ ఫిలిం సొసైటీ ఏ.పి. చైర్మన్ శ్రీ ఎం.వేదం కుమార్ ఎంతో సహకరించారు. అట్లా పుస్తకం నవంబర్ 13 నాటికి సిద్దం అయింది. లలితకళా తోరణంలో పర్యవేక్షణ లో వున్న రత్నకిషోర్ గారికి కొన్ని కాపీలు అందజేశాను. ఆయన ఎంతో సంతోషించారు. థాంక్ యు ఆనంద్. ఇది ఈ INTERNATIONAL CHILDREN’S FILM FESTIVAL లో మన ప్రాడక్ట్ అన్నారు. ఉదయమే రాజ్భవన్ కు వెళ్లి కాపీలని గవర్నర్ గారికి అందజేస్తాను అన్నారు. నాకెంతో సంతోషం వేసింది. ఫెస్టివల్ కిట్ లో ఒక్కో పుస్తకం పెట్టి డెలిగేట్స్ అందరికీ ఇచ్చారు.

ఇక ‘బాలల చిత్రాలు’ పుస్తకం విషయనికి వస్తే ‘బాలల చిత్రాల ఆవశ్యకత’ గురించి మొదటి చాప్టర్ లో నేను ఇట్లా రాసుకున్నాను. “నిజానికి ఓ మహాకవి అన్నట్టు “బాల్యమే మనిషికి తండ్రి లాంటిది”అందుకే ఎ దేశ భవిష్యత్తయినా బాల ఎదుగుదల పైననే ఆధారపడుతుంది. ఏ సమాజం నిర్మాణమయినా బాలల మానసిక వికాసం పైననే సంపూర్ణతను సంతరించుకుంటుంది, అందుకే బాలల్ని వారి చుట్టూ వున్న ప్రపంచం నుంచి వేరుచేయకూడదు. సృజనాత్మక ప్రపంచంలో నివసించినప్పుడే వారికి సంతోషం కలుగుతుంది. లేకుంటే బాలలు వాడిన పువ్వులే అవుతారు”. ఇంకా ఈ బాలల చిత్రాలు లో భారతీయ బాలల చిత్రాలు- పరిశీలన, చార్లీ చాప్లిన్ చిత్రాలు, సత్యజిత్ రే చిత్రాలు, సాయి పరంజి పే చిత్రాలు, తెలుగులో బాలల చిత్రాలు, అనిమేషన్ చిత్రాలు అంటూ పలు చాప్టర్లు పొందుపరిచాను.
ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ శ్రీ.బి.నరసింగ రావు ఇట్లా అన్నారు ‘ బాల్యం ఒక విచిత్ర అనుభవం. అదొక వింత లోకం. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ క్రమంగా వికసించే వారి మేధస్సు పురివిప్పుకునే మయూరం లాంటిది. క్రమంగా పిల్లల మనస్సులపై ముద్రితంయ్యే రూపచిత్రాలు ఏటిలో కదిలిపోయే అలలలా, ఆకాశంలో తేలిపోయే మబ్బుల్లా ఒక్క సారిగా కురిసే జల్లుల్లా, నదిలా ప్రవహిస్తుంటాయి. వారి దృష్టి నుండి ఏదీ తప్పించుకోలేదు. ఒక చిరు స్వర్గం వారి మనస్సులో కాపురం చేస్తూ వుంటుంది.”

నవంబర్ 14 న INTERNATIONAL CHILDREN’S FILM FESTIVAL ఘనంగా ప్రారంభమయింది. 17 నవంబర్ రోజున పగలు ఖైరతాబాద్ లోని మీరా థియేటర్ ఆవరణలో నిర్వహిస్తున్న ఓపెన్ ఫోరంలో నా పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. సుప్రసిద్ద మలయాళీ దర్శకుడు శ్రీ షాజీ కరుణ్ ఆవిష్కరించారు. శ్రీ కే. రత్నకిశోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నరసింగ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీ వాశిరాజు ప్రకాశం పుస్తకం గురించి మాట్లాడారు. ప్రకాశ్ రెడ్డి, ఎం.వేదకుమార్, ఏ. సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సభ పిల్లల నడుమ కోలాహలంగానూ ఆనందగానూ జరిగింది.
..
విడుదల సభ ముగిసిన తర్వాత కొన్ని ఫెస్టివల్ సినిమాల్ని చూసి నేను కరీంనగర్ వెళ్ళిపోయాను. కొన్ని కాపీలు సమీక్షలకు పంపేందుకు, మిత్రులకు ఇచ్చేందుకు తీసుకున్నాను. మిగతా కాపీలు వాటి మార్కెటింగ్ అంతా దుర్గం రవీందర్ చూసుకున్నారు. దానిలో నా ప్రమేయం శూన్యం. మొత్తం మీద పుస్తకం వచ్చింది అదీ తెలుగుతో పాటు సాయి ప్రసాద్ గారి కృషి తో ఇంగ్లీష్ అనువాదం కూడా వెలువడింది. చాలా సంతోషం మిగిలింది.
..
1999 లోనే నావి రెండు పుస్తకాలు రావడం ఆ రెండూ INTERNATIONAL FILM FESTIVALs లో రిలీజ్ కావడం ఒక గొప్ప మరపురాని అనుభవం. పుస్తకాల పట్ల విమర్శకులు సమీక్షకులు చాలా పాసిటివ్ గానే స్పందించారు. అది నాకు పెద్ద ఊపు.
ఇక అప్పుడే అగ్రహారం కాలేజీనుంచి కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. కాలేజీకి బదిలీ అవకాశం వచ్చింది. అక్కడ పని చేస్తున్న శ్రీ ఎల్.నర్సయ్య ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ఇక ఏముంది బదిలీకోసం భాగీరధ ప్రయత్నాలు శురూ చేసాను. 1999 లోనే మిత్రుడు ప్రముఖ కవి డాక్టర్ టి.రాదాకృష్ణమాచార్యులు గారి ‘మౌనం మాట్లాడింది’ కవితా సంకలనం వెలువడింది..ఆ పుస్తకం రూపొందడం లో నాదీ చిన్న పాత్ర వుంది ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను…

-వారాల ఆనంద్
13 నవంబర్ 2022

68= యదొంకీ బారాత్
+++++ వారాల ఆనంద్

అంపశయ్య  పై ‘సినిమా వినోదం’

Posted on

FRIENDS, my weekly column in ‘DISHA’ daily

++++ వారాల ఆనంద్

“టికెట్ కొనుక్కుని థియేటర్ కు వెళ్లి సినిమా చూడడంలో వున్న ఆనందమే వేరు..దయచేసి థియేటర్ కు వెళ్ళండి మా బొమ్మల్ని చూడండి. ప్రస్తుతం పెద్ద సమస్యగా వుంది ఈరోజుల్లో ఎవరూ సినిమా థియేటర్ కు వెళ్లేందుకు సిద్ధంగా వుండడం లేదు. చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మా సినిమాని థియేటర్ కు వెళ్లి చూడండి” అంటూ సుప్రసిద్ధ నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేసారు. తన పాపులర్ క్విజ్ షో ‘కౌన్ బనేగా క్రోర్పతి’ కొత్త ఎపిసోడ్లో తమ కొత్త సినిమా ‘వూంచాయి’ ప్రమోషన్ షో నిర్వహించారు. ఆ సినిమాలో సహనటులు అనుపమ్ ఖేర్, నీనా గుప్తా, బొమ్మన్ ఇరానీలను అతిథులుగా పిలిచి ఆ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ ఈ మేరకు చేతులెత్తి ప్రేక్షకులను కోరుకున్నారు. అమితాబ్ లాంటి పాపులర్ సీనియర్ నటుడు ఈ మేరకు విజ్ఞప్తి చేసే పరిస్థితి వచ్చిందంటే ఇవ్వాళ ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావడం దాదాపుగా మానేసినట్టు కనిపిస్తున్నది. వారిని టాకీసుల దాకా రప్పించడం ఎంత గగనంగా మారిందో  తేట తెల్లం అవుతున్నది. ఇన్నేళ్ళుగా భారతీయ ప్రజలకు చౌకగా అందుబాటులో వున్న సినిమా వినోదం ‘అంపశయ్య’ పై చేరిందా అనిపిస్తున్నది. ఎదో ఒక సినిమా ఆర్థికంగా  విజయవంతమయితే పది సినిమాలు పరాజయం పాలవుతున్న వర్తమాన స్థితిలో హిందీ సినిమా రంగం తో సహా దాదాపు అన్ని భారతీయ భాషా సినిమా రంగాలూ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ‘పుష్ప’, ఆర్ ఆర్ ఆర్’, కీజీఎఫ్ లాంటి సినిమాల తాకిడికి గురయి హిందీ సినిమా చచ్చిపోతోంది అన్న వాదన కూడా ముంబై లో విస్తృతంగా వినిపిస్తున్నది. ఆ వాదన కొంత అతిగా ఉన్నప్పటికీ వాస్తవంగా హిందీ సినిమా దాదాపు సంక్షోభంలో ఉందన్నది మాత్రం నిజం. దాదాపు మిగతా భాషా సినిమాలది కూడా అదే పరిస్థితి.

    ఈ స్థితికి కారణాలని అన్వేషిస్తే రెండు అంశాలు మన ముందుకు వస్తున్నాయి. ఒకటి ఉప్పెనలా దాడి చేస్తున్న సాంకేతిక ఆవిష్కరణలు కాగా రెండవది ఊక దంపుడు కథలతో రొడ్ద కొట్టుడు కథలతో సినిమా రంగం చేసుకుంటున్న స్వయంకృతాపరాధం.

    మొదట సాంకేతిక అంశాల గురించి మాట్లాడుకున్నప్పుడు అసలు సినిమా ఆవిష్కరణే గొప్ప సాంకేతిక పరిణామం. తెరమీద బొమ్మలు కదలడమే ఆనాటి అద్భుతం. మూకీ నుంచి టాకీ, 16 ఎం.ఎం. నుంచి ఇప్పటి డిజిటల్ కాలం దాకా సాంకేతిక రంగం లో వచ్చిన మార్పులే ఇవ్వాల్టి సినిమా రూపానికి మూలాధారం. అప్పటిదాకా వీధి భాగోతాలూ, నాటకాలూ, బుర్రకథలు, హరికథలు మాత్రమె వినోదాంశాలుగా వున్న ప్రజలకు సినిమా కొత్త వినోదంగా ముందుకొచ్చింది. అయితే ఆ వినోదం తొలి రోజుల్లో కొంత సామాజిక ఉపయోగానికి, మంచి విలువలతో కూడిన కథలకు పరిమితమయి ప్రజల్ని అలరించాయి. కానీ సమాజంలో వచ్చిన మార్పులు, సాంకేతిక రంగంలో వచ్చిన సరికొత్త ఆవిష్కరణలు సినిమా రూపాల్ని పూర్తిగా మార్చేశాయి. సినిమా ప్రేక్షకులమీద మొట్టమొదటి సాంకేతిక ప్రభావం టీవీ లతో వచ్చింది. టీవీ వచ్చిన మొదటి రోజుల్లో సాయంత్రాలు, ఆదివారాలు ప్రజలు ఇండ్లల్లోంచి బయటకు రావడమే మానేశారు. రామాయణాలు, భారతాలు, సీరియల్లు, టీవీ లలో ప్రసారమయ్యే సినిమాల ప్రభావంతో 70 -80 లలో సినిమాలు చూడ్డానికి ప్రేక్షకులు కరువయ్యారు. తర్వాత వచ్చిన ‘వీడియో’ మరింత ప్రభావాన్నిచూపించింది. వీడియో పార్లర్స్ కొంత కాలం సినిమాల్ని దెబ్బ తీసాయి. కానీ క్రమంగా టీవీ కార్యక్రమాలు రొటీన్ కావడం వీడియోలు అంతగా ఆకట్టుకొక పోవడం తో పాటు థియేటర్లో చూసిన అనుభూతి పూర్తిగా కలగక పోవడం వలన  ప్రేక్షకులు తిరిగి సినిమా హాళ్ళ వైపునకు మరలారు. సినిమాలు కూడా హింస, సెక్స్ లాంటి ఎమోషన్స్ ని ప్రేరేపించే కథలతో ప్రజల ముందుకు వచ్చి ఆకర్షించే ప్రయత్నాలు చేసాయి. అయితే ఇప్పటి పరిస్థితి వేరు. కోవిడ్ నేఅధ్యంలో ప్రజలు ఇండ్లల్లోంచి బయటకు రాక పోవడం సరిగ్గా అప్పుడే ఓ టీ టీ లు రావడం తో పరిస్థితి పూర్తిగా మారి పోయింది. దాంతో పాటు విపరీతంగా పెరిగిన సెల్ ఫోన్ల వినియోగం కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నది. అరచేతిలోనూ, ఇంట్లోనూ సినిమాల్ని చూసే లుక్ కల్చర్ పెరిగిన తర్వాత ప్రత్యేకంగా సినిమా హాల్లకు వెళ్లి వందలాది రూపాయలు ఖర్చు చేసేందుకు భారతీయ ప్రస్తుతానికి సిద్దంగా లేరు.

ఓటీటీ గురించి జరిపిన ఒక సర్వ్ లో చెప్పిన దానిప్రకారం ఓ టీ టీ లలో డిస్నీ-హాట్ స్టార్ కు 4 కోట్ల మంది చందాదారులు వున్నారు. అట్లే అమెజాన్ ప్రైం కు 2- 2 ½ కోట్ల మంది, జీ5 కు 60 లక్షలు, నెట్ఫ్లిక్స్ కు 60 లక్షలు, సోనీ లైవ్ కు 40 లక్షలు,వూట్ కు 30 లక్షల మంది చందాదారులున్నారు. అట్లా దేశంలో మొత్తంగా పది కోట్లకు పైగా ఓ టీ టీ చందాదారులున్నారు. సగటున ఓ టీ టీ లలో స్ట్రీమింగ్ చూసే సమయం మాత్రం వారానికి 10 నుంచి 13 గంటలు మాత్రమే నని ఆ సర్వే సూచించింది. ఇక ఓ టీ టీ లలో వారానికి సగటున 2-3  సినిమాలు చూసే వారి సంఖ్యే హెచ్చుగా వుంది. గత రెండు సంవత్సరాలుగా చూస్తే ఓ టీ టీ ప్రేక్షకుల సంఖ్యక్రమంగా పెరగడం గమనించవచ్చు. అదే క్రమంలో సినిమా హాల్లల్లోకి వెళ్లి సినిమాలు చూసే వాళ్ళ సంఖ్యా తగ్గుతూ వస్తున్నది అన్నది నిజం. అంటే ఆమేరకు మన దేశంలో సినిమా హాల్లకు వెళ్ళే వినోదం ప్రమాదం లో పడినట్టే. 

   ఇక రెండో కారణం గురించి ఆలోచిస్తే మన దేశంలో ఉన్న సినిమా థియేటర్స్ లోకి వెళ్లి కొనే వాళ్ళ సంఖ్య ౩-4 కోట్లు వుంటారు. ఆ సంఖ్య సినిమా హాళ్ల లోని 80 శాతం సీట్లకు మాత్రమే సమానం. ఇక  రెగ్యులర్ గా సాదారణ ప్రేక్షకుడు సంవత్సరానికి 5-6 సినిమాల్ని మాత్రం చూస్తాడు. ఆ స్థితిలో పెద్ద స్టార్లు, విపరీతమయిన ముందస్తు ప్రచారం వున్న సినిమాలకు మాత్రమె జనం తండోప తండాలుగా వచ్చే అవకాశం వుంది. మిగతావాటికి జనం రావడం గగనమే అయిపోతున్నది. అందుకే గతంలో లాగా టాకీసుల ముందు “HOUSE FULL” బోర్డులు కనుమరుగు అయిపోయాయి. మల్టీ ప్లేక్సులు, విపరీతంగా పెరిగిన టికెట్ రెట్లు కూడా మరో ప్రధాన కారణం. అంటే కథా కథనం భిన్నంగానూ హై ఫై గానూ వుండి ప్రేక్షకుల్ని ఊహా లోకాల్లోకి తీసుకెళ్ళే తరహా సినిమాలకు కొంత ఆదరణ దొరికే అవకాశం వుంది. అవి కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అబ్బురపరిచే దృశ్యాలుతో కూడి వుండాలి.

ఇటీవలి కాలంలో పాన్ ఇండియన్ సినిమాల పేరున వచ్చిన పుష్ప, ఆర్ ఆర్ ఆర్, కీజీఎఫ్ లు అలాంటివే. ఇక మరో రకంవి ‘కాశ్మీర్ ఫైల్స్’.  ఎదో ఒక భావోద్వేగాన్ని ప్రేరేపించే సినిమాలు కూడా ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. రాజకీయంగా పాలకులు ప్రమోట్ చేయడం ఆ సిన్మా ఆదరణ పొందడానికి మరో ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు.

మొత్తం మీద ఇవ్వాళ ప్రజల్లో స్పూర్తిని పెపొందించే సినిమాల కంటే ఆకాంక్షల్ని అవీ భూటకపు ఆకాంక్షల్ని పెంచే సినిమాలకు అధికంగా ఆదరణ లభిస్తున్నది. అది సమాజానికి అంత అభిలాష నీయమయింది కాదు. కానీ కేవలం లాభాలు మాత్రమె పరిగణన లోకి తీసుకునే వ్యాపార సినిమా రంగం పెట్టుబడి లాభాల ప్రాతి పదికగా పని చేస్తుంది. అందుకే వందలాది కోట్ల పెట్టుగది తో మరిన్ని సినిమాలు రూపొందే అవకాశాలు మెండుగా వున్నాయి. వాటిల్లో ఎన్ని ‘పుష్ప’ సినిమాలు అవుతాయో, మరిన్ని ‘ఆచార్య’ సినిమాలు అవుతాయో చూడాలి.

కానీ మొత్తం మీద మన ప్రేక్షకులకు అతి చౌకయిన వినోదాన్ని క్రమంగా అతి ఖరీదయిన వినోదం గా మార్చే పనిలో సినిమా రంగం తల మునకలయి వుంది.. చూద్దాం ఇంకా ఏమి జరుగానుందో..భవిష్యత్తులో సినిమా వాళ్ళు గెలుస్తారా ప్రేక్షకులు నెగ్గుతారా…       

-వారాల ఆనంద్                

Clipping of Disha Daily Telugu Newspaper – TS- Main

అంపశయ్య  పై ‘సినిమా వినోదం’

కవిత్వమూ సామాజిక ఉద్యమాలూ ఆమెకు రెండు కళ్ళు- సుగత కుమారి

Posted on

+ వారాల ఆనంద్

‘పువ్వు వికసించినంత సహజంగా నాలో కవిత్వం జనిస్తుంది’ అంటారు సుగత కుమారి. అంతే కాదు ‘నేను కేవలం పాడగలను అంతే…  ‘ ఎట్లా ఏమిటి అంటే నేనేమీ వివరించలేను అంటా రావిడ. ఆమె కవిత్వం నిండా మనుషుల పట్ల ప్రేమా, మనుషుల యొక్క  వేదన ధ్వనిస్తాయి. అంతేకాదు పర్యావరణ సమస్యలు.అస్తిత్వ పరితాపాలు, ప్రేమకోసం స్త్రీల అన్వెషణలు ఇట్లా అనేక అంశాలు ఆమె కవిత్వంలో ప్రతిధ్వనిస్తాయి.

      1970 లలో మలయాళ సాహిత్యం లో ఆధునికత వెల్లివిరుస్తున్న నాటికే సుగత కుమారి సుప్రసిద్ధ కవి.  నిజానికి ఆనాటి కేరళ ఆధునిక సాహిత్యా ఆవరణంలో స్త్రీ స్వరాలు తక్కువే. అధికంగా పురుష సాహితీ వెత్తలే ఆధునిక సాహిత్య దివిటీని పట్టుకుని ముందుకొచ్చారు. కాని 1975 లో ఎప్పుడయితే సుగత కుమారి తన ‘రాత్రిమజ’ (నైట్ రెయిన్)  కవిత రాసిందో అప్పుడే ఒక స్థిరమయిన స్వంతదయిన మహిళా గొంతుక వినిపించింది. ఇక అప్పటినుండి ఆ గుంతుక విస్తారంగా మాట్లాడుతూనే వుంది. ఒక్క సాహిత్య రంగం లోనే  కాదు అనేకానేక సామాజిక ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉంటూ అనేకమంది సాహిత్య కారులని సామాజిక ఉద్యమాలకు మద్దుతును కూడగట్టే పనినీ ఆమె విజయవంతంగా చేసారు. ముఖ్యంగా పర్యావతనం, మహిళా సాధికారికత లాంటి అంశాల్లో సుగత కుమారి చేసిన కృషి విశేషమయింది. ఓ పక్క రాస్తూనే మరో పక్క ఉద్యామాలు నడిపించారామే.

నిజానికి మలయాళీ సాహిత్య చరిత్రలో మహిళల పాత్ర తక్కువే. అక్కడ మీరాకానీ, అక్క మహాదేవి కానీ, ఆండాళ్ లాంటి కవయిత్రులు గానీ లేరు. కేవలం అరబిక్ మలయాళం గీతాల్లో కొన్ని సార్లు ఏవో కొన్ని పేర్లు వినిపిస్తాయి. ముఖ్యంగా 19 వ శతాబ్దం లో కుట్టికుంజు తన్గాచీ, తోట్టాయికట్టు ఇక్కవమ్మ లాంటి కొంత మంది ఎదిగి వచ్చారు. వారి తర్వాత అక్కడ కవయిత్రిగా ఎదిగి గణింప దగ్గ కృషి చేసిన వారిలో సుగత కుమారి అత్యంత ప్రముఖులు.

సుగత కుమారి 22 జనవరి 1934 న జన్మించారు. ఆమె తండ్రి బోదేశ్వరన్ గా పేరుగాంచిన కేశవ పిళ్ళై స్వాతంత్ర సమరయోధుడు. గాంధేయ వాది. ఆమె తల్లి కాత్యాయనీ అమ్మ సంస్కృత పండితురాలు. ఆ ఇద్దరి ప్రభావం చిన్నప్పుడే సుగత కుమారి పైన పడింది. చదువు పట్ల అమిత ప్రేమ వున్న ఆమె తన డిగ్రీ విద్యను తిరువనంతపురం లోని యునివర్సిటీ కాలేజీలో పూర్తి చేసారు. తర్వాత తత్వశాస్త్రం లో పీజీ చేసారు. ఆ తర్వాత మూడేళ్ళపాటు పరిశోధనా రంగం లో ఉన్నప్పటికీ తన పీ.హెచ్.డీ. పూర్తి చేయలేకపోయారు. ఆమె ఫిలాసఫీ తో పాటు విద్యా మనస్తత్వ శాష్ట్రంలో కూడా మంచి అభినివేశాన్ని పొందారు. తాను తన మొట్టమొదటి కవితను 1957 లో రాసారు. తన మొదటి కవితను ఆమె కలం పేరుతో రాసారు. విద్యార్థిగా ఉన్నప్పుడే ఆమె రాష్ట్ర విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేసారు.

సుగత కుమారి కి 1978 లోనే ఆమె రాసిన ‘పతిరా పుక్కయి’( FLOWERS OF MIDNIGHT )  కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. అమె రచనల్లో ముఖ్యమయినవి ముత్తు చిప్పి, పతిర పూక్కల్, పావం పవం మానవ హృదయం, ప్రణామం, ఇరుచిరకుకల్, రాత్రి మజా, అంబాల మని, రాదేయవిడే, దేవదాసి, అభిసారిక లాంటివి అనేకం వున్నాయి. ఆమెకు కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు తో పాటు ఒడకుజ్జల్ అవార్డు, వయలార అవార్డు, ఆసాన్ అవార్డు, వీ టీ సాహిత్య అవార్డు, బషీర్ పురస్కారం, సరస్వతీ సమ్మాన్, కేరళ సాహిత్య అకాడెమీ అవార్డు తో పాటు ఇంకా అనేక అవార్డులు లభించాయి. తనకు 2006 లో పద్మశ్రీ అవార్డు కూడా లభించింది.  

పర్యావరణాన్ని కాపాడేందుకు కూడా పోరాటం చేసారు. మూడు దశాబ్దాల కింద పశ్చిమ కనుమల్లోని సైలెంట్ వ్యాలీలో హైడల్ ప్రాజెక్ట్‌ను నిర్మాణాన్ని అడ్డుకొన్నారు. అందుకోసం పెద్ద ఉద్యమాన్నే లేవదీసారు. తన కవితలతో ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చారు. ఇటీవల కూడా మరో ఉద్యమానికి ఆమె నాయకత్వం వహించారు. అర్నములాలో విమానాశ్రయం నిర్మాణానికి వ్యతిరేకంగా సుగతకుమారి నేతృత్వంలో ఉద్యమం చేపట్టారు. అట్లా సుగాతా కుమారి కవిత్వం రాయడం తో పాటు అనేక సామాజిక ఉద్యమాల్లో ప్రధాన భూమికను పోషించారు. ముఖ్యంగా సలేంట్ వాలీ ఉద్యమంలో ఆమె కృషి గొప్పది. ఆమె తాను పాల్గొనడం తో పాటు అనేకమంది మలయాళీ సాహితీ వేత్తల్ని ఈ ఉద్యమానికి మద్దతుగా కూడగట్టారు.

ఫలితంగా ‘సైలెంట్ వ్యాలీ’ ఉద్యమంలో రచయితలు తమ రచనల్ని కొనసాగించారు.భౌతిక పర్యావరణాన్ని కాపాడడం కోసం విలువల ప్రాముఖ్యతను చెప్పారు. సామాజిక అంశాల్నిశాస్త్రీయ అంశాలతో జోడించారు. అది పర్యావరణీయం అయ్యింది. కవులు రచయితలూ ఉద్యమంలో చేరేసరికి ఉద్యమం తీవ్ర స్ధాయికి చేరింది, ఆ వేగాన్ని వీరు మరింత పెంచారు. వైకం బషీర్,యస్.కే. పోట్టేకర్,ఓ,వీ. విజయన్, కే.భాస్కరన్ నాయర్, సుకుమర్ర్ అజ్హికోడే వంటి వారు ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. వివిధ ప్రయోగాలు చేసారు అందులో భాగంగా  1983లో 34 కవితలతో కూడిన ‘వనపర్వం’ అన్న కవితా  సంపుటిని ప్రచురించారు. సుగత కుమారి సైలెంట్ వ్యాలీని

 ‘దట్టమైన,చల్లని, జీవం ఉట్టిపడుతున్న ప్రదేశం, భూమి వ్యక్త పరిచిన అత్యత్భుతమైన భావన’ అంటారు.

ఆ భావాలన్నీ వనపర్వంలో చోటుచేసుకున్నాయి. వనపర్వం అన్న శీర్షికకి స్ధానికులు సైలెంట్ వ్యాలీ గురించి చెప్పే కధకి పోలిక వున్నది. ఈ ప్రాంతాన్ని సైరంధ్రి వనం అంటారు. ద్రౌపది కి వున్న మరో పేరు సైరంధ్రి. వనవాసమప్పుడు పాండవులు ఇక్కడ కొంత కాలం గడిపారని వారి నమ్మకం. కాలక్రమేణా బ్రిటిష్ వారి కాలం వచ్చే సరికి సైరంధ్రి వనం సైలెంట్ వ్యాలీ గా మారింది.  ఈ ప్రాంతాన్ని  చిపింగ్ సిడా అన్న అడవి  క్రిమి వల్ల కూడా సైలెంట్ వ్యాలీ అన్న పేరు వచ్చింది అన్న నానుడి కూడ వుంది.

     సాహిత్యం ద్వారా కేవలం సైలెంట్ వ్యాలీ అంశాలనే కాక ప్రకృతి మానవ మనుగడ గురించి విశిష్టంగా ‘ప్రకృతి సంరక్షణ,సుస్ధిర జీవనం’ అన్న నినాదం తో ప్రకృతి సంరక్షణ సమితి పని చేసింది. సైలెంట్ వ్యాలీ ఉద్యమం ప్రచారానికి కేరళ నలుమూలల వివిధ కళా రూపాల ద్వారా ప్రచారం చేసారు. 1980 జూన్,6 వ తేదీన కవులను సత్కరించారు. ప్రముఖ కవులు కవితలు చదివి పర్యావరణ విశిష్టతను చెప్పారు. సైలెంట్ వ్యాలీ సంరక్షణకు వివిధ స్ధాయిల్లో సమితి కృషి చేసింది. అందులో సుగత కుమారి ప్రముఖ పాత్ర పోషించారు ,ఆమె రచించిన ‘మరతిను స్తుతి’(వృక్ష గీతం) విశిష్ట ప్రాచుర్యం  పొందింది. ఈ కవితలో ఆమె చెట్టుని, భూమిని కాపాడడానికి  విషం తాగిన శివుడిగా వర్ణిస్తారు. నేను అతనిని పూజిస్తాను/ ఎవరైతే శ్వాస గాలినిస్తారో/ విషం తాగి/నీలకంటుడిలా’(5-8). ఇదంతా పాటకుడికి కిరణజన్య సంయోగంగా అనిపించవచ్చు. ఈ కవిత ప్రకృతి సమతుల్యతను శాస్త్రీయంగా వివరిస్తుంది. ప్రకృతిలో చెట్టు పాత్రను ,అది మానవ మనుగడకు చేసే ఉపయోగాలను.

నువ్వు  మా

తల్లి భూమిని వరదల నుండి రక్షిస్తావు

నేలను పునర్జీవింప చేస్తావు

నువ్వుఅమృతాన్ని భద్ర పరుస్తావు

దివినుండి భువి కి వస్తున్న దానిని

ఉబుకుతున్న నీ గుండెల్లో(౩౩-40,పంక్తులు)

భూమి ఏమైనా ఆడుకునే బంతా లేక ఆడుకునే బొమ్మా! (43-44 పంక్తులు)

ఈ కవితలో భూమి కున్న ఓపికను పరిక్షించొద్దని హెచ్చరిస్తారు. దీని ద్వారా  ‘ప్రకృతి మన తల్లి ,ఆమెని పూజ్య భావంతో, ప్రేమతో దరి చేరమని  చెపుతారు. మన చర్యలు విధ్వంశంగా వుంటే ప్రకృతి ప్రతిచర్యలు అదే విధంగా ఉంటాయి’ ఇది అర్ధం చేస్కునే సునిశిత మనకు అవసరం.

మానవసేవే.. మాధవ సేవ.. దీన్ని అక్షరాల పాటించారు సుగుత కుమారి. కల్లాకపటం, కల్మషం లేని మానసిక రోగులకు ఆశ్రయం కల్పిస్తూ వారికి మరో జన్మ కల్పించారు. కేరళలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో రోగుల దుస్థితిని చూసి చలించి, మానసిక రోగుల కోసం ఏకంగా ఆమె ఓ గ్రామాన్నే నెలకొల్పారు. వేలాదిమందిని తన పిల్లలుగా చూసుకుంటూ, వారి కలలనే తన కలలుగా చేసుకుంటూ జీవితాన్ని గడిపారు. మానసిక రోగులకే కాదు, అనాథ బాలికలు, మహిళలు, ఆల్కాహాల్, డ్రగ్ బాధితులకు కూడా ఆశ్రయం కల్పించారు. అన్ని కేర్ హోమ్ సెంటర్‌లాంటిదిగా కాకుండా అక్కడ వీరూ వారూ అనే తేడా లేదు.. అక్కడ అందరికీ చోటు ఉంటుంది. తిరువనంతపురంలోని కేర్ సెంటర్‌లో లైంగిక వేధింపుల బాధితులు. గృహ హింస బాధితులు. డ్రగ్ అడిక్ట్స్ కు వసతి కల్పించారు. అనాథ బాలికలు. ఎవరూ లేని మహిళలకూ నివాసం కల్పించారు. వారు ఎదుర్కొన్న సమస్యలన్నీ వారికి గతం అయిపోయి వారు కొత్త జీవితాన్ని గడుపుతున్నారు. చదువుకుంటున్నారు. ఉపాధి పొందుతున్నారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో మరో కొత్త జీవితానికి పునాది వేసుకుంటున్నారు. మూడు దశాబ్దాల సేవ..

ఇంకా సుగతకుమారి ఆధ్వర్యంలో తిరువనంతపురంలో అనాథలు, నిరాశ్రయులు, బాధితుల కోసం ఎయిటీస్‌లో ‘అభయ’పేరుతో ఓ ఆశ్రమాన్ని నెలకొల్పారు. లైంగిక వేధింపుల బాధితులతోపాటు వివిధ కారణాలతో అనాథలుగా మారిన, నిరాశ్రయులైన వేలాదిమంది జీవితాల్లో ఈ సంస్థ వెలుగులు నింపింది. ‘అభయ’కు మొదటి నుంచి నిధుల కొరత ఎదురుకొంది.అయినా నిధుల కొరత కారణంగా సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే వున్నా ఆ సంస్థలో చేరిన వారు మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో బయటకు నిలదొక్కుకున్నారు. ఆశ్రమంలో చేరినప్పుడు బేల చూపులు, భవిష్యత్‌పై భయంతో కనిపించిన వారి కళ్లలో మెరుపులు నిండాయి. గొప్ప ఆత్మ విశ్వాసం నిండిన వ్యక్తిత్వం తో భవిష్యత్‌పై ఆశతో కొత్త జీవితాల్ని ఆరంభిస్తున్నారు. సుగతకుమారి విజయానికి ఇవే ప్రత్యక్ష నిదర్శనాలు. 14 జిల్లాల్లో పునరావాస కేంద్రాలు..

‘సరస్వతి సమ్మాన్’ అవార్డు గ్రహీత, రచయిత్రి సుగతకుమారీ ‘అభయ’ను మరింత విస్తరించాలనుకున్నారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్నవారి కోసం కేరళలోలని 14 జిల్లాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం కోసం ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా ఇప్పటికే ప్రభుత్వానికి పంపారు.

 కేరళలలోని ప్రభుత్వ ఆసుప్రతులలో మానసిక వ్యాధిగ్రస్తులను పట్టించుకోకపోవడంతో 1985లో ప్రత్యేకంగా మానసిక రోగుల కోసమే ‘అభయ’ ఏర్పాటైంది. ‘‘ఇప్పటికే ముప్పై ఏళ్లు గడిచిపోయాయి. వేలాదిమంది నిరాశ్రయులకు జీవితంపై ఆశ కల్పించాం. ఈ మూడు దశాబ్దాలలో వదిలివేసిన, నిరాశ్రయులైన, అనాథలకు అండగా నిలిచాం’’ అనుకోకుండా ‘అభయం’ ఏర్పాటయింది. ప్రస్తుతం మల్టీ యూనిట్ ఇన్‌స్టిట్యూట్‌గా ఎదిగింది. అక్కడ పునరావాసంతోపాటు చికిత్సను కూడా అందిస్తున్నారు. డీ అడిక్షన్ సెంటర్, అనాథ బాలికలకు కేర్‌హోమ్, మహిళలకు వసతి గృహాలను నెలకొల్పారు. సన్నిహితులంతా ‘టీచర్’ అని పిలుచుకునే సుగత కుమారి ఓసారి తిరువనంతపురంలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలను సందర్శించారు. ఆ సమయంలో రోగులతో ఆస్పత్రి సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరుతో ఆమె కలత చెందారు. ఆ సమయంలోనే ‘అభయ’ను నెలకొల్పాలని ఆమె డిసైడయ్యారు. ‘‘మేం అడుగుపెట్టేవరకు కేరళలో మానసిక రోగుల పరిస్థితి ఘోరంగా ఉండేది. వారిని పట్టించుకునే నాథుడే లేరు. హాస్పిటల్‌లో నేను చూసిన పరిస్థితులను వివరించడానికి కూడా నోరు రావడం లేదు.. అర్ధనగ్నంగా, గాయాలతో రోగులు విలవిలలాడుతూ కనిపించారు. ఓ చిన్నరూమ్‌లో వారిని బంధించారు. చాలామంది నా కాళ్లు పట్టుకుని భోజనం పెట్టమని వేడుకున్నారు’’ అని ఆనాటి పరిస్థితులను ఆమె కళ్లకు కట్టారు. 81 ఏళ్ల సుగతకుమారి పోరాట ఫలితంగా, ఏళ్లుగా అధికారుల వెనకపడిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వచ్చింది. ప్రస్తుతం ‘‘అభయ’ సేవలను మరింత విస్తరించారు. మలయిన్‌కీజు గ్రామం శివార్లలో 10 ఎకరాల విస్తీర్ణంలో ‘అభయగ్రామం’ పేరుతో మానసిక రోగుల కోసం మరో ప్రపంచాన్ని 1992లో నిర్మించారు. ఈ ‘అభయ గ్రామం’ నర్వ్ సెంటర్‌కు ప్రఖ్యాత టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా పునాది రాయి వేశారు. దలైలామా స్ఫూర్తితో.. దలైలామా ప్రసంగాలు విని, స్ఫూర్తి పొందే సుగతకుమారి, నిరాశ్రయులకు బాసటగా నిలుస్తున్నారు. ‘‘ఓసారి దలైలామా ఇలా అన్నారు. ఈ భూమిని నిరుపేదలకు, ఇళ్లులేని వారికి ఆశ్రయంగా చేయాలి అని. అప్పటి నుంచి ఆయన ఆశయాల సాధనకు ప్రయత్నిస్తున్నాను’’ అని ఆమె తెలిపారు. ప్రస్తుతం అభయ ఎనిమిది కేంద్రాలుగా విస్తరించింది, మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారికి చికిత్స, ఆశ్రయం కోసం ‘కర్మ’ మానసిక రోగల తాత్కాలిక, దీర్ఘకాల సంరక్షణ కోసం ‘శ్రద్ధభవనం’, మిత్ర పేరుతో డీ అడిక్షన్, మెంటల్ హెల్త్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. అనాథ బాలికల కోసం ‘అభయబాల’, మహిళల తాత్కాలిక వసతి కోసం ‘అతని’, అల్కాహాల్, డ్రగ్‌ బాధితుల కోసం ‘బోధి’ మానసిక రోగుల కోసం ‘పకల్‌వీడు’ డే కేర్ సెంటర్లను కూడా ‘అభయ’ నిర్వహిస్తోంది. ఇవే కాకుండా మహిళల కోసం 24 గంటల హెల్ప్‌లైన్, మహిళల కోసం ఉచితంగా న్యాయ సాయం కూడా అందిస్తున్నది. నిధుల కొరత.. నిరాశ్రయుల కోసం, ముఖ్యంగా మానసిక రోగుల కోసం వివిధ రకాల సెంటర్లను నిర్వహిస్తున్న ‘అభయ’ను నిధుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ప్రస్తుతం ‘అభయ’లో 200 మంది నిరాశ్రయులు, 80 మంది ఉద్యోగులున్నారు. ‘ప్రభుత్వ కేటాయింపులు, వ్యక్తిగత విరాళాలపైనే ఆధారపడుతున్నాం. నిధుల కొరత కారణంగా ఎక్కువమందిని ఉద్యోగులను పెట్టుకోలేకపోతున్నాం. అందువల్ల నిరాశ్రయులు సమస్యలపాలవుతున్నారు. ఉద్యోగంలో పెట్టుకున్నవారికి సైతం సరిపోయేంత జీతం ఇవ్వలేకపోతున్నాం’’ అని సుగత కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మతాలు, కులాలతో ‘అభయ’కు ఎలాంటి సంబంధం లేదు. ఇదే సంస్థకు బలమూ, బలహీనత. ఒకవేళ ఎదైనా మతపర సంస్థతో సంబంధం ఉండి ఉంటే, లక్షల రూపాయలు విరాళాలుగా వచ్చేవి’’

అట్లా కవిత్వాన్ని శ్వాసిస్తూ సమాజం కోసం కృషి చేస్తూ సుగత కుమారి తన 87 వ ఏట, 23 డిసెంబర్ 2020 రోజున తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో కోవిడ్ 19 కు చికిత్స పొందుతూ తనువు చాలించారు. పూర్తి ప్రభుత్వ లాంచనాలతో ఆమె అంతిమ యాత్ర నిర్వహించారు.

ఆమె కవితల్లోంచి తెండు కవితలకు నేను చేసిన అనుసృజన ____

నువ్వు వెళ్లి పోయింతర్వాత

+++++

నువ్వు వెళ్లి పోయింతర్వాత ! చూడు

నేనిక్కడే వున్నాను, వెన్నెలా ఇక్కడే వుంది

పగలూ రాత్రీ ఏ కొంచెమూ మారలేదు

ఆకాశంలో నక్షత్రాలున్నాయి

అయినా చీకటి పడే వేళ

ఇంట్లో నేను దీపం వెలిగిస్తూనే వున్నాను

నువ్వు వెళ్లి పోయింతర్వాత

పున్నమి చంద్రుడు విరగబడి నవ్వుతున్నాడు

అయినప్పటికీ మన చీకటి పెరట్లో

పాల వెన్నెల చిందిస్తూనే వున్నాడు

రాత్ర మల్లెలు ఎప్పటిలాగే విరగబూస్తున్నాయి

చల్లటి గాలి సువాసనలు అట్లాగే వున్నాయి

పట్టు వీడకుండా చిన్న పిల్లాడి ఏడుపును వింటూనే వున్నాను

ప్రతిదీ ఎప్పటిలాగే మామూలుగానే వున్నాయి

స్నానం నిద్ర పేపర్ చదవడం

ఎంతో పని వుంది అతిథులు వస్తూనే వున్నారు

నిత్య కృత్యాలు మామూలుగా సాగుతూనే వున్నాయి

నువ్వు లేకున్నప్పటికీ  అన్నీ అర్థం లేకుండా

ఎప్పటిలాగే సాగుతూనే వున్నాయి

పగిలిన పూల కుండీలో పాత తులసి మొక్క

ఎవరూ నీళ్ళు పోయాక ఎండిపోతున్నది

ఇప్పటికీ కేవలం నీ జ్ఞాపకాల్లో

అన్నీ యధావిధిగానూ ప్రతిదీ మామూలుగానూ వున్నాయి  

ఇదంతా యువ యాత్రికుల కోసం రాస్తున్నాను

చేతిలో చెయ్యేసి

నడవడానికి కొంచమయినా సమయం లేదు…

కోరికకు… ప్రేమకు కూడా..

++++++++++++++++++++++

మూలం- సుగత కుమారి

         స్వేచ్చానువాదం – వారాల ఆనంద్

*********************************

రాత్రి వాన (NIGHT RAIN)

*******

రాత్రి వాన

ఏ కారణమూ లేకుండానే

నవ్వుతోంది ఏడుస్తోంది

విరామం లేకుండా అర్థం లేని

గుస గుసలు పోతోంది

తన పొడవయిన నల్లని వెంట్రుకల్ని గాలిలో వూపుతోంది

అది వంగి కూర్చున్న ఓ యువతిలా వుంది

 రాత్రి వాన

ఆసుపత్రి వార్డుల్లోకీ ప్రవహిస్తుంది

అంతు లేని ఏడుపులో నన్ను

తన తెల్లని చేతులతో లాలిస్తుంది

అది జాలీల్లోంచి విస్తారంగా చేతులు సాచిన

చీకటి రాత్రి యొక్క దుఖపుకూతురు

రాత్రి వాన

నొప్పితో మూలుగులు షాకులు ఆశ్చర్యాలు కొపపు శబ్దాలు

ఒక్కసారిగా అమ్మ అరుపులు నన్ను ఆశ్చర్య పరుస్తాయి

చెవుల్ని మూసుకునేలా చేస్తాయి

అవన్నీ నన్నూ నా అనారోగ్యపు మంచాన్నీ చేరతాయి

రాత్రంతా బంధువుల్లా

ఓదార్పు మాటలతో నన్ను వూరడిస్తాయి

ఎవరో అన్నారు

పాడయిపోయిన అవయవాల్ని తొలగించాలని

కాని వాటికంటే ఎక్కువగా పాడయిన

మనసు సంగతేమిటి

రాత్రి వాన

గతంలో నా సంతోషపు రాత్రుల్లో నన్ను ఎంతగానో నవ్వించింది

అమితంగా పులకింపజేసింది

నా కెంతో ప్రేమను మరెంతో ప్రకాశ వంతమయిన

వెన్నెలనీ ఇచ్చింది

గాఢ నిద్రలో ఉలికి పాటుకు గురి చేసింది

నా ప్రేమకు గత కాలపు సాక్షంగా నిలిచింది

‘రాత్రి వాన’..

నేనివ్వాళ అనారోగ్యంతో మంచం మీద ఒంటరిగా అసహనంగా

అటూ ఇటూ దొర్లుతూ కనీసం ఏడవడాన్నీ  మర్చిపోయి

శిలలా గడ్డ కట్టుకు పోయి

నా వేదనకు కొత్త సాక్షంగా మారాను

రాత్రి వానకు చెప్పేస్తాను

నీ దుఖభరిత తడి పాట నాకు తెలుసు

నీ దయాగుణం, అణచి వేయబడ్డ నీ ఆవేశం

చీకట్లో నీ రాక, నీ ఒంటరి ఏడుపు

కన్నీళ్లను త్వర త్వరగా నువ్వు తుడిచి వేయడం

ఎదో నెపం మీద త్వరపడ్డం ఏడవడం నవ్వడం

నాకు తెలుసు నాకన్నీ తెలుసు

ఎందుకో నీకు తెలుసా

నా ఆత్మ సహచరుడిగా నేనూ నీలాగే వున్నాను

ఇలాగే వున్నాను రాత్రి వానలా…  

         మూలం- సుగత కుమారి

         స్వేచ్చానువాదం – వారాల ఆనంద్

కవిత్వమూ సామాజిక ఉద్యమాలూ ఆమెకు రెండు కళ్ళు- సుగత కుమారి

67= యాదొంకీ బారాత్

Posted on

+++++++ వారాల ఆనంద్

నువ్వు

నీ పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడమంటే  

నీ పాత స్నేహితుల్నీ స్నేహితురాల్లనీ ఆత్మీయుల్నీ

కలుసుకోవడం లాంటిది

వాళ్ళు గతంలో ఎంత అందంగా ఉండేవాళ్ళో

ఎంత ప్రేమగా వుండేవాళ్ళో గుర్తుచేసుకోవడంలాంటిది

వాళ్ళ ముఖాల మీది ఇప్పటి ముడుతలు,  

వాళ్ళ ఆలోచనల్లోని మార్పులూ  

నీ జ్ఞాపకాల్ని నిలువరించవు

తమ తమ విశాలమయిన లోకంలోంచి

వాళ్ళంతా నిన్ను పలకరిస్తారు

ఎలాంటి పాశ్చా త్తాపం లేకుండా

వాళ్ళు నిన్ను ప్రేమగా అనురాగంతో పలకరిస్తారు..  

+++++

అలాంటి జ్ఞాపకాల నీడల్లో తిరుగుతూ, ఎందరినో పలకరిస్తూ, ఎన్నింటినో పలవరిస్తూ నేను  ముందుకు సాగుతున్నా.. ఈ జ్ఞాపకాల ప్రయాణంలో కొన్ని మెరుపులు, ఎన్నో మరుపులు.. ఇంకా ఎన్నెన్నో మలుపులు.

అలా మలుపులు తిరుగుతూ తిరుగుతూ 1999 చేరుకున్నా. ఆ సమయంలోనే డాక్టర్ గోపు లింగారెడ్డి ఒక మంచి మిత్రుడిని పరిచయం చేసాడు. ‘నీ దగ్గర ఈ పుస్తకాలున్నాయా అని ఒక రోజు ఒక లిస్టు ఇచ్చాడు. వున్నాయి ఎందుకు అన్నాను. ఏమీలేదు ఇక్కడ డాక్టర్ ఎం.విజయమోహన్ రెడ్డి గారని ఒక డాక్టర్ వున్నాడు. తనకు సాహిత్యమంటే ఎంతో ఇష్టం. తనకు కావాలన్నాడు. ఇస్తావా అన్నాడు. సరే అన్నాను. వయా లింగా రెడ్డి ఎందుకు మనమే కలిసి ఇస్తే బాగుంటుంది కదా అనిపించింది. వెళ్లి డాక్టర్ గారిని కలిసాను. చూడగానే ఎంతో స్నేహంగానూ ఆత్మీయంగానూ అనిపించారు. థాంక్స్ చదివి పంపిస్తాను అన్నారు. అప్పుడక్కడ విజయమోహన్ రెడ్డి గారి దగ్గర మా ఇందిర మేనబావ ప్రభాకర్ గారి అల్లుడు డాక్టర్ ఆకుల సదానందం డ్యూటీ డాక్టర్ గా పని చేస్తున్నారు. సదానందం-మాధవి ల పెళ్ళికి సంభందించి నాకో మంచి కొత్త అనుభవం వుంది. పెళ్ళికోసం నేను ఇందిర వరంగల్ వెళ్లాం. పెళ్ళికొడుకును తీసుకురావడానికి వర్ధన్నపేట్ వెళ్ళగలరా అని నన్ను అడిగారు. నేను సరే నన్నాను. బాలరాజు నేనూ కలిసి సాయంత్రం వెళ్లి తెల్లారగట్ల బయలుదేరి రావాలి అన్నారు. అట్లాగే వెళ్లాం. నాకేమో అంత కొత్త. అయిన సరే ఎంతో పెద్దవాడిగా ప్రవర్తించాను. తెల్లారి కార్లు సరిపోక నేనూ రాజూ లారీ ఎక్కి వరంగల్ చేరుకున్నాం. రెడీ అయి పెళ్ళికి మామూలుగా హాజరు అయ్యాం. అయితే మాధవి, సదానందం కరీంనగర్ కు నివాసం మార్చాక మాకు ఎంతో దగ్గర అయ్యారు. అన్ని విధాలా తోడున్నారు. ఆత్మీయంగా వున్నారు.

   ఇక డాక్టర్ విజయ మోహన్ రెడ్డి కేవలం చదవడమే కాదు రాయడం కూడా చేసేవారు. అట్లా వారు రాసిన ఒక మంచి కథ ‘సుప్రభాతం’లో అచ్చు అయింది. అయితే రోజువారీ సమయంలో మెడికల్ ప్రాక్టీస్ లో చాలా బిజీగా వుండి ఎక్కువగా కథలు రాయలేదు తను. ఇన్నేళ్ళుగా తను నాకు వ్యక్తిగతంగానూ డాక్టర్ గానూ ఎంతగా సాయంచేస్తున్నారో.. మారల్ గానూ.. మెడికల్ గానూ..ఎంత సప్పోర్టివ్ వున్నారో నేను మాటల్లో చెప్పలేను. వారికి కేవలం థాంక్స్ చెప్పి వారి సాయాన్ని తక్కువ చేయలేను.

..         

అప్పటికి ఆగ్రహాం కాలేజీలో పని చేస్తూనే ‘సుప్రభాతం’ పత్రిక కోసం ఫ్రీలన్సర్ గా వార్తలు రిపోర్టులు విశ్లేషణలు రాస్తూ వచ్చాను. సుప్రభాతం ఆగిపోయాక ఏ.బీ.కే.ప్రసాద్ చీఫ్ ఎడిటర్గా, వాసుదేవ రావు గారు ఎడిటర్ గా ‘మాభూమి’ జన చైతన్య వారపత్రిక మొదలయింది. వాసు గారు నన్ను పిలిచారు. ‘మాభూమి’కి రాయండి అన్నారు. లాంచనంగా ఇంటర్వ్యు చేసారు. అది కొద్ది కాలమే నడిచింది. హైదరాబాద్లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరుగుతున్న సందర్భంలో 15 జనవరి 1999 సంచికలో ‘తెగులు పట్టిన తెలుగు సినిమా’ కవర్ స్టోరీ రాసాను. అదే సంచికలో గల్ఫ్ ఉద్యోగాల వ్యామోహంతో బయలు దేరి మధ్యలోనే మాయమవుతున్నవారి గురించి ‘గల్ఫ్ గద్ద తన్నుకు పోయింది’ అన్న న్యుస్ స్టోరీ రాసాను. అట్లా మాభూమిలో  కొంతకాలం గడిచింది.

ఇదంతా ఇట్లా వుండగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని 1986 తర్వాత మళ్ళీ 1999 లో హైదరాబాద్లో నిర్వహించడానికి కేంద్రం ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నివిధాల సహకరించడానికి అంగీకరించింది. ఇంకేముంది విశ్వసినిమా అభిమానులకు, అర్థవంతమయిన సినిమాల ఆరాధకులకు అదొక గొప్ప సందర్భం, ముఖ్యంగా ఆరోజుల్లో ఉధృతంగా నడుస్తున్న ఫిలిం సొసైటీ సభ్యులకు మరింత విశేష ఉత్సవం. 1986 లో ఆనాటి ఎన్టీఅర్ ప్రభుత్వం ఫైల్మోత్సవ్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గొప్పగా నిర్వహించింది. IT WAS A MEMORABLE EVENT.

ఇక 1999 లో హైదరాబాద్లో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని నేనెట్లా మెమోరేబుల్ గా చేసుకోవాలి అన్న ఆలోచన మొదలయింది. ఏముంది గతంలో ‘పల్లకి’ వర పత్రికలో నేను రాసిన ‘డైరెక్టర్’స్ డైరీ’ వ్యాసాలను తిరిగి రాసి అప్డేట్ చేసి పుస్తకంగా వేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే ప్రముఖ దర్శకుడు బి.నరసింగ రావుగారిని సంప్రదించాను ఆయన ఉత్సాహపరిచారు. ఫైనల్ స్క్రిప్ట్ తనకు పంపించమన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ ఫిలిం క్లబ్ కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి గారు రిలీజ్ కు సంబదించి సపొర్ట్ చేయడానికి అంగీకరించారు. అప్పటికి వేములవాడ, కరీంనగర్ ఫిలిం సొసైటీల కార్యక్రమాల ద్వారా వారిద్దరూ నాకెంతో ఆత్మీయులు. ఇక కరీంనగర్ ఫిలిం సొసైటీ కి చెందిన నరెడ్ల శ్రీనివాస్, కోల రాంచంద్రారెడ్డి , నారాయణ రెడ్డి, నారదాసు లక్ష్మణ రావు, దామోదర్ రెడ్డి ఇట్లా అందరూ ప్రోత్సాహంగా మాట్లాడారు, గొ ఎహేడ్ అన్నారు. ఏముంది స్క్రిప్ట్ రాయడం, పూర్తి చేయడం ఆరంభించాను. అప్పటికి సమాచారం కోసం ఇంటర్నెట్ లేదు. సినిమా ఇన్ ఇండియా. సినిమా ఇండియా ఇంటర్నేషనల్, స్క్రీన్ లాంటి పత్రికలే ప్రధాన సమాచార సోర్సెస్. ఇంకా నేను పాల్గొన్న ఫిలిం ఫెస్టివల్ బుక్స్ ఆర్టికల్స్, సెమినార్లే ఆధారం. వాటన్నింటికంటే కూడా అప్పటిదాకా చూసిన సమాంతర సినిమాలు వాటి విమర్శ, ఆయా సినిమాల పట్ల దర్శకుల గురించి నాకు కలిగిన అవగాహన పుస్తకం రాయడానికి ముఖ్యంగా తోడ్పడ్డాయి. ఫోటోల సేకరణ కూడా అంతే. పేపర్ కట్టింగ్స్, ఫెస్టివల్ బ్రోచర్స్ లోని స్టిల్స్ ని స్కాన్ చేసి సిద్దం చేసాను. పల్లకి వ్యాసాలను తిరగరాసి ఫస్ట్ డ్రాఫ్ట్ సిద్దం చేసి ముందు మాట కోసం నరసింగ రావు గారికి పంపాను. ఆయనే పుస్తకానికి ‘నవ్య చిత్ర వైతాళికులు’ అన్న పేరును సూచించారు. నాకూ నచ్చింది. రాత ప్రతిని  మిత్రులు నలిమెల భాస్కర్, రుద్ర రవి లు కూడా చూసారు. రవి అయితే తెలుగు సినిమా దర్శకులని కూడా చేర్చాలని పట్టుబట్టాడు. ఈ పుస్తకం పరిధి లోకి వాళ్ళు రారన్నాను. కొంచెం నొచ్చుకున్నా అంగీకరించాడు. ఇదంతా సరే మరి ప్రింటింగ్ కి డబ్బులు అనే ప్రశ్న ముందుకొచ్చింది. వెంటనే ఇందిరా అంది మనం కడుతున్న ‘చిట్’ వుంది దాన్ని లిఫ్ట్ చేసి వాడండి అంది.. పొడుపు డబ్బుని ఎదో బంగారానికో మరి దేనికో కాకుండా పుస్తకానికి ఖర్చు చేద్దామనేసరికి, కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ ముందుకు సాగాం.

పుస్తకానికి నరసింగ రావు గారు “మానవ అనుభూతులను నేసే రూపశిల్పులు..” అన్న శీర్షికతో ముందు మాట రాసారు. ‘మానవుల ఆవేశకావేషాల్ని, ఆశల్ని, ఆశయాల్ని, వారి సంఘర్షణల్ని, వారి మానసిక విశ్లేషణని సంబంధ బాంధవ్యాలనీ, పరిసరాల్ని పరిధుల్నీ, ఉన్నత విలువల్ని, రాక్షస కృత్యాల్నీ  ఒక్కటేమిటి ప్రతి అంశాలనీ  సూక్ష్మ దృష్టితో మనముందు ఉంచుతాయి ఈ నవ్యచిత్రాలు. ఇవి మానవ జీవిత గమనానికి సంబందించిన సాంసృతిక వ్యాఖ్యానాలు. మహోన్నత ఆశయంతో చిత్తశుద్దితో నిర్మించిన మానవ చిత్రాలు..” అన్నారాయన.

    అట్లా నవ్యచిత్ర వైతాళికులు పుస్తకం సత్యజిత్ రే, మృణాల్ సేన్, రిత్విక్ ఘటక్, శ్యాం బెనెగల్, లాంటి వివిధ భారతీయ భాషలలోని 54 మంది దర్శకుల పైన రాసిన వ్యాస సంపుటి. దాంట్లో నేను రాసుకున్న ఆముఖం లో ‘దృశ్య శ్రవణ మాధ్యమాలని తనలో ఇముడ్చుకుని ఈ శతాబ్దపు అద్భుతంగా రూపొందిన సినిమా సర్వకళా సమ్మిశిత్రమయి వందేళ్లుగా విశ్వవ్యాప్తంగా విరాజిల్లోతోంది’ అని రాసాను.

    పుస్తకం సిద్ధమయింది. డీటీపీ పనిని తమ్ముడు అమర్ తీసుకున్నాడు. కరీంనగర్ లో అప్పటికి ఇంకా సీడీ/డీవీడీ లు అందుబాటులోకి రాలేదు. అంతా ఫ్లాపీల మాయం. ప్రింటింగ్ కోసం ఖైరతబాద్ లోని ధరణి ప్రెస్ ను సంప్రదించాం.

   ఇక బుక్ రిలీజ్ చేయాలి. అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ‘ఓపెన్ ఫోరం’ అన్న పేరున ఒక విభాగం ఏర్పాటయింది. దాన్ని నిర్వహించే బాధ్యతను FESTIVAL DIRECTORATE వాళ్ళు  ‘ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం సొసైటీస్ ఆఫ్ ఇండియా’కు అప్పగించారు. అప్పుడు మద్రాస్ కు చెందిన మిత్రుడు శ్రీ కళ్యాణ రామన్ ప్రాంతీయ కార్యదర్శిగా వున్నాడు. ఆయన ప్రకాశ్ రెడ్డి గార్లు రిలీజ్ బాధ్యతని తీసుకున్నారు.

జనవరి 18న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో నా పుస్తకం విడుదల షెడ్యూల్ అయింది. ఎవరు చేయాలన్నది సమస్య, నరసింగ రావు గారు ప్రముఖ కన్నడ దర్శకుడు గిరీష్ కాసరవెల్లి తో మాట్లాడాడు. నేను కాసరవెల్లిని 1989 డిల్లీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కలిసివున్నాను. ఇంటర్వ్యు కూడా చేసాను. ఆయన బుక్ రిలీజ్ చేయడానికి అంగీకరించారు. ప్రముఖ సినీ విమర్షుకురాలు మైథిలి రావు గారిని సమీక్ష కోసం ఒప్పించారు. విడుదల అనంతరం కాసరవెల్లి, మైథిలి రావు మీనింగ్ ఫుల్ సినిమా గురించి చాలా బాగా మాట్లాడారు.  అట్లా ఆ బుక్ రిలీజ్ ఫంక్షన్ బాగా జరిగింది. కళ్యాణ రామన్ స్వాగతం చెప్పగా, ప్రకాష్ రెడ్డి వందన సమర్పణ చేసారు. నరసింగ రావు సభకు అధ్యక్షత వహించారు. ‘ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం సొసైటీస్ ఆఫ్ ఇండియా’ ప్రాంతీయ సభ్యులు కోదండ రామన్, వీ.టీ.సుబ్రహ్మణ్యం తదితరు హాజరయ్యారు. ఇంకా సభకు అనేక మంది నవ్యసినిమా అభిమానులు, జర్నలిస్టులు, కవులు రచయితలు వచ్చారు.

      ప్రముఖ కవి దేవిప్రియ అప్పుడు వార్త దిన పత్రికలో ప్రధాన బాధ్యతలో వున్నారు. ఆయన కూడా మీటింగ్ కి వచ్చారు. సభ కాగానే అక్కడే తానే స్వయంగా న్యూస్ రాసి మా మిత్రుడు వార్తలో పనిచేస్తున్న కొడం పవన్ కు ఇచ్చి ఆఫేసులొ ఇమ్మన్నాదు. మర్నాడు ఆ వార్త మెయిన్ ఎడిషన్లో దేవిప్రియ ‘బౌ లైన్’ తో వచ్చింది. దేవిప్రియ గారు స్వయంగా రాయడం నేనెంతో గౌరవంగా భావించాను.

ఇక ఆనాటి సమావేశానికి ఎందరో ఆత్మీయులు వచ్చారు. అప్పుడు మా ప్రమద చిన్నమ్మ(గునక్క) వాళ్ళు రామ్ కోట్ లో వుండే వాళ్ళు. ఆ ఫెస్టివల్ రోజులన్నీ నేను వాళ్ళింట్లోనే వున్నాను. తను, బాబాయి విద్యాసాగర్, జింబో, శైలజ, నిహారిక,నందిగం కృష్ణా రావు,అనిత, డాక్టర్ జే.మనోహర్ రావు, కే, దామోదర్ రెడ్డి, నారదాసు లక్ష్మన్ రావు, నలిమెల భాస్కర్, కొడం పవన్ కుమార్, నరెడ్ల శ్రీనివాస్ లాంటి ఎంతో మంది మిత్రులు సభకు హాజరు కావడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మా వాడి పుస్తకం రిలీజ్ అని అంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారంతా రావడం నాకూ పెద్ద ఊపే.

ఫిలిం సొసైటీ మిత్రులు, సాహితీ మిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నాకు ఆ సభ ఓ  గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోయింది. తర్వాత పుస్తకానికి మంచి సమీక్షలే వచ్చాయి.

….

ఇదిట్లా వుండగా వరంగల్ ఫిలిం సొసైటీ పక్షాన కూడా ‘నవ్యచిత్ర వైతాళికులు’ పుస్తకావిష్కరణ పెడదామన్నారు. అంపశయ్య నవీన్, శ్యాంసుందర్ లు ఎంతో చొరవ తీసుకున్నారు. నవీన్ గారు నేను డిగ్రీ చదువుతున్నప్పటి నుండి నాకు బాగా తెలుసు. ఆయన అంపశయ్య నాటికీ నేటికీ నాకెంతో అభిమాన నవల. అంతే కాదు ఆయన మా కరీంనగర్ ఫిలిం సొసైటీ వ్యవస్థాపకులు కూడా. ఆనాటి వరంగల్ సభకు బి.నరసింగ రావు, దర్శకుడు కే.బి.తిలక్, హైదరాబాద్ ఫైల్మ్ క్లబ్ కు చెందిన మిత్రుడు ప్రకాష్ రెడ్డి, పాల్ శర్మ తదితరులు హాజరయ్యారు. ప్రముఖ రచయిత అల్లం రాజయ్య, పద్మజ తదితర మిత్రులూ వచ్చారు. వరంగల్ సభకూడా చాలా బాగా జరిగింది.

   తర్వాత కరీంనగర్ ఈనాడు లో  ఆ పుస్తకం మీద చాలా పెద్ద కవరేజ్ ఇచ్చారు. దర్శకుల ఫోటోలు స్టిల్స్ వేసి మరీ రాసారు. అది చూసిన అగ్రహారం కాలేజీ మిత్రుడు వీ.శ్రీరాములు ఆ న్యుస్ఐటం లో నా ఫోటో వేయలేదని తీవ్రంగా ఆక్షేపించాడు. వార్త విపులంగా రావడం ముఖ్యం కానీ  ఫోటోది ఏముంది అని సర్ది చెప్పాల్సి వచ్చింది.

     అట్లా మొత్తం మీద నవ్య చిత్ర వైతాళికులు నా సృజనాత్మక జీవితంలో గొప్ప సంతోషాన్ని మిగిల్చింది. అదే సంవత్సరం నవంబర్ లో నా ‘బాలల చిత్రాలు’ విడుదల అయింది.. ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను

-వారాల ఆనంద్   

6 నవంబర్ 2022     

బాలలు వోటర్లు కాదనేగా.

Posted on

My WEEKLY COLUMN IN ‘DISHA’ daily

బాలలు వోటర్లు కాదనేగా.

—————— వారాల ఆనంద్

  నవంబర్ నెల వచ్చిందంటే చాలు మనకు నెహ్రు గారి జయంతీ.. బాలల దినోత్సవం గుర్తొస్థాయి. అప్పుడు అందరమూ పిల్లల గురించి మాట్లాడతాం. అటు ప్రభుత్వమూ ఇటు సంస్థలూ సభలు పెడతాయి. జెండాలు కడతాయి. పిల్లలకు మిఠాయీలు పంచుతాయి. అంతా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాం. భావి భారత పౌరులు అంటాం. భవిష్యత్తు నిర్మాతలు అంటాం. మర్నాటికి మరిచిపోతాం.

     నిజాలు మాట్లాడుకుంటే పిల్లలంటే మనకు అసలు పట్టింపు లేదు, ప్రేమ అసలే లేదు.ఇట్లా అంటే కొంచం కష్టం అనిపించొచ్చు. కానీ అది నిజం. మనం కేవలం  నవంబర్ రోజులలో  మాత్రమే పిల్లల గురించి మాట్లాడతాం. కానీ వాళ్ళ కోసం ఆలోచించం. ఏమీ చేయం. ప్రభుత్వాలూ పార్టీలూ ఏమీ చేయవు. ఎందుకంటే బాలలు వోటర్లు కాదు. వాళ్లకు వోటు హక్కు లేదు.

         అంతేకాదు బాల కోసం ప్రత్యేకంగా ఏమీ రాయం. కథలు లేదా కవితలు రాయడానికో వాళ్ళని ప్రోత్సహించం. పిల్లల్ని మార్కుల వెంట పరుగేత్తిస్తాం. మెరిట్ అంటూ హింస పెడతాం. ఇప్పుడు ఇంకా ఆన్ లైన్ క్లాసులు, డిజిటల్ తరగతుల పేర కనీస సంబందాల్నుంచీ దూరం చేస్తున్నాం. అన్ని భారతీయ భాషల్లోనూ చూస్తే కేవలం బెంగాలీ, మలయాళం, కన్నడ, మరాఠీ భాషల్లో తప్ప మిగతా ఇతర భాషల్లో బాలసాహిత్యం తక్కువ. కొన్ని భాషల్లో నయితే శూన్యం. పిల్లల కోసం రాసేవాళ్ళు తక్కువ. రాసిన వాళ్లకు గుర్తింపు తక్కువ. పిల్లల పుస్తకాలకు మార్కెట్ తక్కువ. పిల్లల్ని చేరే సాహిత్యం తక్కువ. అంతేకాదు పిల్లల కోసం సృజనాత్మక కార్యక్రమాలు మరీ తక్కువ. దేశంలో పాలకులు అధికారులు చివరికి తల్లిదండ్రుల్లో కూడా (ఏ కొంత మందో తప్ప) పిల్లల గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ కానీ వాళ్ళకోసం ప్రత్యేకించి చేసేది తక్కువే.

    ఇక మన దేశంలో బాల సాహిత్యం కంటే ‘బాలల సినిమాల’ ది మరీ దారుణమయిన పరిస్థితి.  దాదాపు అన్ని భాషల నిర్మాతల్లోనూ పిల్లల సినిమాలు తీస్తే మార్కెట్ లేదు ఏమొస్తుంది అనే భావనే. మలయాళం, బెంగాలీ లాంటి కొన్ని భాషల్లో వేళ్ళ మీద లెక్కించే కొన్ని మంచి సినిమాలు మాత్రం తీసారు. ఇక ముంబై లోని బాలల చిత్ర సమితి ( CHILDREN FILM SOCIETY OF INDIA) నిర్మించిన వందలాది పిల్లల సినిమాలు ప్రదర్శనకు నోచుకోకుండా ముంబై లో పడి వున్నాయి.

     ఫిలిం సొసైటీ  ఉద్యమం బలంగా వున్న కాలంలో  కరీంనగర్ లో రెండేసి వారాల పాటు పిల్లలంతా స్కూల్లల్లోంచి ఉదయమే ‘ప్రభాత్ భేరీ’ లాగా వరుసగా సినిమా హాల్లకు వచ్చేవాళ్ళు. వూరు ఊరంతా ఆ బాలల చలనచిత్రోత్సవాలు జరిగినన్ని రోజులూ పెద్ద కోలా హలంగా వుండేది. 80 ల నుంచి రెండున్నర  దశాబ్దాల పాటు కరీంనగర్ తో పాటు వేములవాడ,సిరిసిల్లా, జగిత్యాల,లాంటి అనేక చోట్ల పిల్ల సినిమాల పండుగ జరిగేది. అంతే కాదు ముఖ్యంగా 1987 లో గ్రామీణ బాలలకోసం చొప్పదండి, తాటిపల్లి, కొండాపూర్, మల్లాపూర్, పెంబట్ల తదితర గ్రామాల్లో గ్రామీణ బాలల చిత్రోత్సవాల పేరపిల్లల సినిమాలు ప్రదర్శించారు.

కానీ ఫిలిం సొసైటీ ఉద్యమం సనగిల్లిన తర్వాత ఇప్పుడు “ ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు” అని బాధ పడాల్సిన స్థితి నెలకొంది.

     చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రథమ భారత ప్రధాని నెహ్రూ ఆలోచనల మేరకు నియమించబడిన ఎస్.కె.పాటిల్ కమిటీ సూచనల ప్రకారం 1955లో ఏర్పాటయింది. చిల్ద్రెన్ ఫిలిం సొసైటీ ఆక్టివ్ గా వున్నప్పుడు ముఖ్యంగా కేదార్ శర్మ, భీమసేన్, జయాబచ్చన్, సాయి పరంజపే, గుల్జార్ తదితరులు దానితో వున్నప్పుడు ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. పోత్లీ బాబా, జంగల్ బుక్, ముజ్సే దోస్తీ కరోగే, లావణ్య ప్రీతీ,ఇట్లా ఎన్నో ఎన్నో సినిమాలు వచ్చాయి. 

    బాలల కోసం సినిమాలు నిర్మించడం, నిర్మాతలకు ఆర్థికంగా సహాయం చేయడం, రెండేండ్లకోసారి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన కర్తవ్యాలు. అందులో భాగంగానే దేశంలోని వివిధ నగరాల్లో 1979 నుంచి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్ని నిర్వహిస్తూ వస్తున్నది. 1995 లో మొదటి సారి గా మన హైదరాబాద్ లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహించారు. తర్వాత 1999 లో మరోసారి నిర్వహించారు. అనంతరం బాలల చిత్రోత్సవాలకు ఒక శాశ్వత వేదిక వుండాలని హైదరాబాద్‌ని ప్రతిపాదించారు.

      అప్పటి ఉమ్మడి  రాష్ట్ర ప్రభుత్వం ఇతోధిక సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. అంతే కాదు రాష్ట్రం లో నిర్మించే బాలల చిత్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తే గొప్ప నగదు బహుమతులు ఇస్తామని ప్రకటించింది. చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీకి భూమి ఇస్తామని అందులో శాశ్వత కార్యాలయం, ప్రత్యేక థియేటర్లు నిర్మించుకోవాలని సూచించింది. అయితే ఇదంతా ప్రకటనల ఆర్భాటమే తప్ప అవేవీ అప్పుడు సాకారంకాలేదు. ఇప్పటికీ కాలేదు. భూమి ఇచ్చినట్టే ఇచ్చారు కానీ ఆధీనం చేయలేదు. తెలంగాణా ప్రభుత్వం వచ్చింతర్వాత కూడా అదేమీ జరగ లేదు. ఇంతలో కేసులు వగైరాలతో అది మూల బడింది. ఇప్పుడా భూమి వుందో అన్యాక్రాంతం అయిందో ఎవరికీ పట్టింపు లేదు. ఇప్పటికీ శాశ్వత వేదికకు ఎలాంటి ప్రయత్నాలూ జరగలేదు. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం హైదరాబాద్లో  టూరింగ్ ఫెస్టివల్ గానే మిగిలిపోయింది. చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీ అధికారులు రెండేం డ్లకోసారి హైదారాబాద్ వచ్చి ఏదో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నిర్వహించాము అనిపించి అది అయిపోగానే పెట్టె బేడా సర్దుకుని వెళ్ళి  పోయే వాళ్లు. ఇప్పుడు అదీ లేదు.

  నిజానికి పిల్లల మనో వికాసానికి సమగ్ర ఎదుగుదలకి కళా సాంస్కృతిక విషయాలు ఎంతో దోహదపడతాయి. చదువు మేధస్సు ఎదుగుదలకు, క్రీడలు శారీరక ఎదుగుదలకు తోడ్పడితే సాంస్కృతిక విషయాలు వారి వ్యక్తిత్వ ఎదుగుదలకి దోహదపడి సాటి మనిషిని ప్రేమించే తత్వాన్ని ఇస్తాయి. సాంస్కృతిక విషయాల్లో దృశ్య మాధ్యమాలు పిల్లల పైన అనితర సాధ్యమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకే సినిమాను పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్మించి వారికి అందించాల్సిన అవసరం ఉన్నది. దానికి ఇరాన్ లాంటి దేశాల పిల్లల చిత్రాల్ని ప్రేరణగా తీసుకోవాలి. బాలల చిత్రోత్సవాలు మహా నగరాలకు, పట్టణాలకు పరిమితం చేయకుండా పల్లెల్లో వుండే బాలలకూ ప్రదర్శించగలిగితే గొప్పగా వుంటుంది. దానికి జిల్లాల స్థాయిలో నిర్వాహక కమిటీలు ఏర్పాటు చేసి, ఎప్పుడో రెండేండ్లకోసారి కాకుండా క్రమం తప్పకుండా ఉత్తమ బాలల చిత్రాల్ని అందించగలిగితే బాలలకు ఎంతో మేలు చేసినట్టు అవుతుంది.

అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్, రష్యాల నుంచి వచ్చిన పిల్లల సినిమాలు అద్భుతంగానూ, భావస్పోరకంగానూ వుంటాయి. అవి మొత్తం ప్రపంచాన్ని కట్టి పడే శాయి. ఇరాన్ సినిమాలకున్న నేపథ్యం మన తెలంగాణకూ ఉన్నది. కావలసిందల్లా ఇరాన్‌లో లాగా ప్రభుత్వం తోడ్పాటును అందించాల్సి ఉన్నది. మన దర్శకులు కూడా రొడ్డకొట్టుడు నీతి బోధల సినిమాలు కాకుండా భిన్నంగా బాలల మనసుల్ని గెలుచుకునే సినిమాలు నిర్మించ గలిగితే తెలంగాణ గొప్ప బాలల చిత్రాలకు వేదికయ్యే అవకాశం ఉన్నది. రాష్ట్ర చలన చిత్రాభివ్రుద్ది సంస్థకు చైర్మన్ ను నియమించి చేతులు దులుపుకున్న రాష్ట్ర ప్రభుత్వం అర్థవంతమయిన సినిమాల గురించి ముఖ్యంగా బాలల కోసం ప్రత్యేకంగా ఆలోచించాల్సి వుంది.

పిల్లలకోసం ఎ కొంత చేసినా ఎంతో చేసిన వాళ్ళవుతారు.

Clipping of Disha Daily Telugu Newspaper – TS- Main

బాలలు వోటర్లు కాదనేగా.