తెలంగాణా సాంస్కృతిక ముద్ర- ‘యాది సదాశివ'(88వ జయంతి)

Posted on Updated on

sadashiva

ఆయన ఓ జ్ఞాపకాల గని , ముచ్చట్ల పందిరి,నడుస్తున్న సాహిత్య చరిత్ర,మరపు రాణి ఓ హిందుస్తానీ గానకచేరి తదిమేతే చాలు శర పరంపరగా అలవోక గా మాట్లాడుతూ వినే వాళ్ళని ముచ్చట్ల తో ముగ్దుల్ని చేసే విశాల ప్రపంచం ఆయనది.
ఎలాంటి రెఫెరెన్సు లు లేకుండా ఎక్కదేక్కదివో ఎప్పతెప్పతివో అనిక విషయాలు జాలు వారే ప్రవాహం అయన.

అంతటి పెద్దాయన నాకంతకు ముందు వ్యక్తిగతంగా పరిచయం లేదు.అయన రచనలు చదవడం అయన గురించి వినడమే తప్పితే కలిసింది లేదు.
మొట్ట మొదసారి గా కరీంనగర్ లో తెలంగాణా రచయితల వేదిక సభలు వైశ్య భవన్ లో జరిగినప్పుడు వేదిక పైన ఆయన్ని చూడ్డం మొదటి సారి
అప్పటికే దృశ్య మాధ్యమం పైన అమిత మైన అభిమానం, అత్యంత ప్రభావవంత మైన దాని శక్తి పైన విశ్వాశం ఉన్న నేను ‘తెలంగాణా సాహితీ మూర్తులు’ పేర
డాకుమెంటరీ సెరీస్ ను నిర్మించాలని ప్రయత్నం ప్రారంబించాను.అందులో భాగంగానే ముద్దసాని రామిరెడ్డి జీవితం సాహిత్యం పైన అరగంట నిడివి గల
జీవన చిత్రాన్ని నాటి వేదిక సభల్లో అల్లం రాజయ్య చేతుల మీదుగా అవిష్కరించాను.
సభా కార్యక్రమం తర్వాత కరీంనగర్ ప్రశాంత్ లాడ్జ్ లో బస చేసిన సదాశివ ను కలవద్దనికి నేను నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం గండ్ర లక్ష్మన్ రావు తదితర మిత్రులం వెళ్ళాము.అదే మొదటి సారి ఆయన్ని చూడడం
ఎప్పటిలాగే మౌన ప్రేక్షకుడిగా ఆయన్ని వింటూ కూర్చున్నాను. ఎని మాటలో ముచ్చటలో …అప్పుడు అయన అన్నారు ‘ ఇప్పుడే రామిరెడ్డి ని కలిసి వచ్చిన గీడ మూలక్కుచున్నా అని వేదన వద్దని చెప్పిన
అక్కడ వైశ్య భవన్ లో నిలువెత్తుగా నిన్ను ఆవిష్కరించారు ని కీర్తి శాశ్వతం అయింది పో అని చెప్పి వచ్చిన అన్నాడు.
నా వైపు తిరిగి మంచి పని చేసినావు.అవును నువ్వు జింబో కు అమవుతావు అని అడిగాడు. అయన మేన మామ అని చెప్పిన. అయితే నారాయణ్ రావు అమితడు అన్నాడు. పెదనాన్న అని చెప్పిన.
దానికి సదాశివ నారాయణ రావు తని కలిసి పని చేసినప్పటి సంగతులు చెప్పాడు.
రెండు గంగ్తలు ఆయనతో కూర్చున్నంక భాస్కర్ తో మెల్లిగా అన్న మన రెండవ సాహితీ మూర్తి సదాశివ గారని. అయన ఎంతో సంతోష పడ్డాడు.మరింకేంది చెబుదా మన్నాడు.
నా ప్రతి పాడనా సదాశివ ముందుంచాను.ఆదిలాబాద్ వస్తామని చెప్పాను.
‘నా దగ్గర ఏముందయ్యా’అన్నాడు.
‘ఉన్నదేదో ఉన్నట్టు చూపిస్తానని చెప్పాను’
మీరు కాదని అనవద్దు అని భాస్కర్ ఒత్తిడి చేసాడు.
‘మరయితే రాండ్రి’  అన్నాడు సదాశివ.
రెండు రోజుల తర్వాత ఆదిలాబాద్ బయలు దేరాం నేను భాస్కర్.
రోజంతా అయన ముచట్లు. అయన ఇంటి పరిసరాలు అన్ని చూస్తు నేను …
చివరిగా అయన అడిగాడు ‘ నా మిద చిత్రం తీస్తే నికేమోస్తుంది ‘
ఏమి రాదన్నాను ప్రతిది ఏదో వస్తుందని చేయం కదా అన్నాను.
నవ్వి ఊరుకున్నాడు మీ ఇష్టం అన్నాడు సదాశివ. నేనేమి చేయాలో చెప్పు అన్నాడు. యౌనిట్ తో కలిసి వస్తామని చెప్పి బయలు దేరాం.
ఎంత వద్దన్నా పెద్దాయన బస్సు స్టాండ్ వరకు వచ్చి సాగనంపాడు.
అల మొదలయింది ‘యాది సదాశివ్’ డాకుమెంటరీ.
********************************************
తర్వాత టి.వి, నారాయణ,కొడం సంతోష్ తదితర ఉనిత్ తో కలిసి ఆదిలాబాద్ బయలుదేరా చిన్నపటి నుంచి అద్భుత మైన దృశ్యం గా
మదిలో మిగిపోయిన రాయపట్నం వంతెన గోదావరి నది దాని ఆనుకునే వున్నా అడవి అన్నింటిని షూట్ చేస్తూ ఆదిలాబాద్ ప్రయాణం సాగింది
అక్కడ సదాశివ ఇంట్లో కమెఅ రేఫ్లేక్టర్లు మొత్తం షూటింగ్ వాతావరణం సదాశివ లో ఉత్సాహాన్ని నింపాయి.ఇంట్లో అందరిని షూట్ కి రెడీ చేసారు.
సదాశివ గురించి మాట్లాడడానికి వసంత రావు దేశ్పాండే తో సహా అంత సిద్దం అయ్యారు. ఇల్లు వాతావరణం ఇన్త్రెవిఎవ్ లు ముగించుకుని
లక్షెట్టిపెట్ లో నారాయణ్ రావు గారి ఇంటర్వ్యూ తర్వాత షూటింగ్ హైదరాబాద్ కి మారింది.
యౌనిట్ తో పాటు ప్రముఖ కవి మిత్రుడు దర్భశయనం, మా అబ్బాయి అన్వేష్ కూడా జత కూడాడు. సదాశివ గురించి అయన అభిమానుల
మాటల్ని అయన తిరుగాడిన సుల్తాన్ బజార్ ,నివసించిన ఆదర్శ లాడ్జ్ లాంటి ప్రదేశాల్ని షూట్ చేయాలని బయలు దేరాం. వాడ్రేవు చినవీర భద్రుడు
మాట్లాడుతూ ‘ఉర్దూ సాహిత్యం గజాల్లు, దోహాలు లాంటి వాటి గురుంచి సదాశివ చెప్పిన అంశాల్ని నెమరు వేసుకున్నాడు. ఫణి కుమార్ అప్పుడు ప్రకృతి
చిక్త్సలయం లో వుంటే అక్కడికి వెళ్లి పలకరించాము.కొత్తగా రాస్తున్న వారిగురించి సదాశివ పట్టించుకునే విధానాన్ని వివరించారు. అప్పటి ఆంధ్ర జ్యోతి ఎడిటర్ రామచంద్రమూర్తి
మాట్లాడుతూ ఎలాంటి రెఫెరెన్సు లు లేకుండా సదాశివ చెప్పే వివరాల్ని ప్రశంసించారు. యాది కాలం రాయిన్చుకున్నప్పటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు.ఆచార్య
జయధీర్ తిరుమల్ రావు తెలంగాణా కి లభించిన గొప్ప భండా గారం గా సదాశివ ను పేర్కొన్నారు. తర్వాత చిత్రిఅరణ వరంగల్ కు మారింది. ఆచార్య లక్ష్మన మూర్తి మాట్లాడుతూ
అలతి అలతి మాటల్లో సదాశివ చెప్పే అంశాలు ఎంత గొప్పవో వివరించారు.ఆచార్య జయశంకర్ మాట్లాడుతూ  అతి సామాన్య జీవితం గడిపిన సదాశివ ప్రతిభ అసామాన్య మైన్దన్నారు
అల సాగిన సదాశివ జీవన చిత్రం లో అయన తిరుగాడిన ఇంటి వాతావరం తో పాటు వంగల్ బ్రాడ్ వే, కరీంనగర్ ప్రశాంత్ లాడ్జ్ ల వాతావరణం కూడా డాకుమెంటరీ లో చూపించాము.
యది సదాశివ నిర్మాణ క్రమంలో ఆయనతో గడిపిన సమయాలు నిజంగా జీవితం లో మరచిపోలేని అనుభవాలు. అయన వెలువరించిన అభిప్రాయాలు సువర్ణ అక్షరాలు.
‘కర్ణాటక సంగీతం లో బహుదారి అని ఒక రాగం వుంది నాది అదే దారి ‘ అంటారు సదాశివ. అన్ని దారులూ వచ్చి కలుస్తాయి అందుకే నన్ను అందరూ కలుస్తారు ఆచార్య లక్ష్మన మూర్తి, ఆచార్య సంపత్కుమార,
మహాజాబిన్,యాకూబ్, శివ రెడ్డి, దేవిప్రియ ఇలా ఒకరేమిటి అందరు వస్తారు అందుకే నాది బహుదారి అన్నారు సదాశివ.
నాజీవితం లో ఎప్పుడు నెగెటివ్ గా ఎప్పుడు ఆలోచించ లేదు ఎవరి చెప్పిందాంట్లో నైన మంచి ఉందేమో నని ఆలోచించాను కవిత్వం కండ్లబడ్డ ప్పుడు
ఆనందించకుండా ఉండలేదు. ఎవరే పని చేసిన ఏదో ఒక ప్రతిభ ఉంటేనే చేస్తాడు దాన్ని నిరాకరిస్తే ఎట్లా? వీలయితే ప్రోత్సహించాలే లేదా ఆనందించాలే కాని నిరాకరించొద్దు.
ఇది అయన జీవన విధానం. ఇలా కలగలసి పోయిన అయన జీవితం సాహిత్యం రెంటిని తడుముతూ చేసిన చిన్న ప్రయత్నం ‘యది సదాశివ’
అయన మాటలు నడక నివాసం అనింటిని దృశ్య మానం చేసే అవకాశం నాకు దొరికింది.
నిజంగా తన చుట్టూ వున్నా అత్యంత సాదారణ జీవితంలోంచి తెలంగాణా సాంస్కృతిక ముద్ర ఇది, తెలంగాణా అస్తిత్వం ఇది అని చెప్పిన మహానుభావుడు సదాశివ.
అయన తెలంగాణా కు లభించిన గొప్ప కానుక. అలాంటి కానుక ను భావి తరాలకోసం సజీవంగా నిలిపే అవకాశం నాకు కలగడం గొప్ప ఆనందాన్నిచ్చింది.

Leave a comment