Month: January 2017

గాలిబ్-వారాల ఆనంద్ (GHALIB)

Posted on

mirza-ghalib-1_1451280001

 

ఊపిరి కోసం ఉక్కిరిబిక్కిరయి

ఎక్కడెక్కడో తిరిగి తిరిగి

పావురాయిలా ఎగిరి ఎగిరి

సొమ్మసిల్లిన నా హృదయం

           నీ భావాల పందిరికింద

           సేద తీరుతోంది 

నువ్వు లిఖించిన దుఖపు జీరలు 

నువ్వు ఆలపించిన గజల్ గానాలు

మనసు కుడ్యం పై అనుభూతి 

సంతకాల్ని ముద్రించాయి

          ఎన్ని తరాలు నీ అక్షరాలు ఆలంబనాలుగా

          కవిత్వాన్ని శ్వాసి స్తాయో

నా మాటలయితే కొత్త అర్థాల్నీ

చూపులేమో సరి కొత్త ద్వారాల్నీ తెరుచుకున్నాయి

-వారాల ఆనంద్ 

Advertisements

నువ్వు……poem@*సారంగ*

Posted on

mandira1-copy

నువ్వేమో నిరంతరం

ప్రయాణిస్తున్న దారివి

గమ్యం తెలిసిన రహదారివి

 

దట్టమయిన అడివిలో

ఆకుల సందుల్లోంచి రాలి పడుతున్న

విలుతురు ముక్కల దిక్సూచితో

సుధీర్ఘప్రయాణంలో సాగుతున్న వాడివి

 

రాళ్లూ రప్పలూ

లోయలూ పర్వతాలూ

నీకు చుట్టూరా పహారా

 

చీకటీ వెళ్తురూ

నీ చూపును చెదర్చలేవు

నీ నీడను మరల్చలేవు

 

రాత్రి చెంద్రున్ని ఇష్టపడ్డంతగా

పువ్వు పరిమళాన్ని శ్వాసించినంతగా

నువ్వు నీ విశ్వాసాన్ని ప్రేమించావు

దారీ నువ్వే నడకా నీదే

 

దేహాల్ని చిదిమేస్తే

మరణాలు సంభవిస్తాయా

 

చెట్టు కొమ్మల మీద

పూల రెమ్మల మీద

నీ పాటింకా వినిపిస్తూనేవుంది

 

తడి వున్న గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే వుంది

అంతర్లయగా వ్యాపిస్తూనే వుంది.

~ JANUARY 5, 2017

ఆక్రోష్ (AKROSH )

Posted on

                                                                   ఓం పూరి-ఆక్రోష్

ఓం పూరి జాతీయ అంతర్జాతీయ సినిమా ప్రపంచంలో ఒక విలక్షణమయిన పేరు. మొదటినుంచీ లాంఛనంగా ఒక హిందీ  సినిమా  నటుడికి వుంటూ వచ్చిన చాక్లెట్ బాయ్ లాంటి లక్షణాలెవీ ఒంపూరికి లేవు. కానీ భారతీయ సినిమా రంగంలో  నేష్నల్ స్కూల్ ఆఫ్ డ్రామలో, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లల్లో రెంటిలోనూ శిక్షణ పొందిన నటుల్లో ఒంపూరి ఒకరు. శ్యామ్ బెనెగల్ ‘నిశాంత్’ తీయాలనుకున్నప్పుడు గిరీష్ కర్నాడ్ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కు డైరెక్టర్ గా వున్నారు. నాకు మంచి నటులు కావాలని సాంప్రదాయ లక్షణాలు వున్న వాళ్ళు కాదు డౌన్ టు ఎర్త్ వాళ్ళు కావాలని అడిగితే ఒంపూరి ని నసీరుద్దీన్ షాని పరిచయం చేశాడు. అలా మొదలయిన ఓంపూరి ప్రస్థానం అంతర్జాతీయ స్థాయిలో వెలిగింది.

ఓంపూరి కళ్ళల్లో కనిపించే తీక్షణత భావ ప్రకటన వాటిని మరింతగా వ్యక్తీకరింపచేసే కంఠ స్వరం ఆయనకున్న గొప్ప బలం. సీరియస్ అంశాన్ని ఎంతగా పలికించగలడో హాస్యాన్ని అంతే గొప్పగా పండించిన ప్రతిభ గల నటుడు ఒంపూరి. ఓ ట్రైబల్ ఆక్రోశం, దళితుడి సంఘర్షణ, అంగారిన వాడి తిరుగుబాటు, కార్మికుడి వేదన, నిజాయితీ గలిగిన పోలీసు అంతరంగం ఇలా ఎన్నో పాత్రల్లో ఇమిడిపోయాడు ఒంపూరి. కోపమూ ఆవేశం లాంటి ఉద్రేక తత్వాలతో పాటు అమాయకత్వమూ ఆవేదనల్ని కూడా పలికించిన శక్తి ఆయనది. ‘కక్కాజీ కహే’  లాంటి టీవి సిరీస్ లో ఆయన హాస్యం, థమస్, భారత్ ఏక్ ఖోజ్ లాంటి వాటి తో ఆయన రేంజ్ తెలిసిపోతుంది.

గోవింద్ నిహలాని దర్శకత్వం లో (1980) వచ్చిన ‘ఆక్రోష్’ కాళీపట్నం రామా రావు ‘యజ్ఞం’ కథను గుర్తు చేస్తుంది. విజయ్ టెండూల్కర్ రచన లో వచ్చిన ఆక్రోష్ దశాబ్దాలుగా హంట్ చేస్తూనే వుంది.

ఇక అర్ధ సత్య లో దిలీప్ చిత్రే రాసిన ఒక కవితను ఓం పూరీ చదివిన తీరు చాలా గొప్ప గా వుంటుంది. ఈ రెండు సినిమాలు ఓం పూరీ గత వారం గా మనసులో సళ్ళుసుళ్ళు గా  తిరుగుతూనే వున్నాయి.

అర్ధసత్య –దిలీప్ చిత్రే కవిత

Chakravyuh mein ghusne se pehle,
kaun tha mein aur kaisa tha,
yeh mujhe yaad hi na rahega.

Chakravyuh mein ghusne ke baad,
mere aur chakravyuh ke beech,
sirf ek jaanleva nikat’ta thi,
iska mujhe pata hi na chalega.

Chakravyuh se nikalne ke baad,
main mukt ho jaoon bhale hi,
phir bhi chakravyuh ki rachna mein
farq hi na padega.

Marun ya maarun,
maara jaoon ya jaan se maardun.
iska faisla kabhi na ho paayega.

Soya hua aadmi jab
neend se uthkar chalna shuru karta hai,
tab sapnon ka sansar use,
dobara dikh hi na paayega.

Us roshni mein jo nirnay ki roshni hai
sab kuchh s’maan hoga kya?

Ek palde mein napunsakta,
ek palde mein paurush,
aur theek taraazu ke kaante par
ardh satya.