Month: January 2024

కవిగారి జాడ+++++ వారాల ఆనంద్

Posted on

Friends, Poem published today in VIVIDHA of Andhra Jyothy daily

కవిగారి జాడ
+++++ వారాల ఆనంద్

ఊరు భాషలో ఊరు యాసలో
ఊరు గురించి కవిత్వం రాసే
ఓ కవి
తన కవిత్వం వినిపించడానికి
మహానగరానికి వెళ్ళాడు

ఆ కవి తిరిగి ఊరికి
ఎప్పుడొస్తాడో తెలీదు

ఇక్కడ ఊర్లో
పరాయితనం
ముళ్ళకంపలా బ్రహ్మజెముడులా
మొలిచి విస్తరిస్తోంది
రంగులు హంగులు పొంగులు
పొర్లీ పొర్లీ
చెట్టూ చెరువూ చెలిమి
చెల్లా చెదరవుతున్నాయి

పాపం కవి
ఈ దారెంటే వెళ్ళాడు
ఎప్పుడు ఎట్లా తిరిగొస్తాడో

ఇంతలో
ఊర్లో నుంచి కవితొకటి
కవిగారి జాడలో నగరం
దారి వెతుక్కుంటూ వెళ్లింది

**********************
https://epaper.andhrajyothy.com/article/Hyderabad?OrgId=29127cc97a8&eid=0&imageview=0&standalone=1&device=desktop

యాదోంకీ బారాత్2-సిరీస్,న0-3

Posted on

యాదోంకీ బారాత్

2-సిరీస్,న0-3

+++++++++++++ వారాల ఆనంద్

చావు నన్నెప్పుడూ భయపెట్టలేదు

నేను చావును భయాపెడదామన్నా కుదర్లేదు

ఊపిరి తీసుకోవడం/రెప్పలు టప టప  లాడించడం/నాకెవరూ నేర్పలేదు

గాలి వీచినంత సహజంగా/వెళ్తురు కురిసినంత స్వచ్ఛంగా అవి నాతో అల్లుకు పోయాయి

ప్రేమించమనీ ద్వేషించమనీ నాకెవరూ చెప్పనేలేదు/మంచు చల్లగానూ నిప్పులు వేడిగానూ వున్నంత నిజంగా/నా లోనే పుట్టాయి

ఇష్టాల్నీ అయిష్టాల్నీ ఎవరూ బోధించనేలేదు/వాన కురిసినట్టు పిడుగు రాలినట్టు/ఎక్కడినుంచో ఎగిసి దుమికాయి

బతకమనీ బతుకు నేర్వమనీ/చావు అనీ చావు తథ్యమనీ/ఎవరూ దారి చూపాల్సిన పని లేదు

బతుకును నమ్మిన వాణ్ని

చావెప్పుడూ భయపెట్టలేదు

గడప దాకా వచ్చి వెళ్లిపోతుంది.

++++

ఈ మాటలు నేనే రాసుకున్నాను. వాటిని నేను నమ్మాను. కనుకే రాసుకున్నాను. నా విషయం లో సరిగ్గా అట్లే జరిగింది. తీవ్రమయిన అనారోగ్యం కమ్ముకుంది. రెండు కిడ్నీలు పాడయ్యాయి. విషయం తెలిసిన ఆత్మీయులు, స్నేహితులూ అంతా కంగారు పడ్డారు. అంతేకాదు ఆనంద్ పరిస్థితి ఏమిటో ఎట్లా వుంటుందో అనుకున్నారు. ఆవేదనపడ్డారు. కొంతమంది అయితే ఆశలు వాదులుకున్నారు. కానీ డాక్టర్లు డయాలిసిస్ అన్నారు. గ్లోబల్ ఆసుపత్రిలో కాకుండా సన్ షైన్ లో ఆరంభమయింది.

ఆసుపత్రి అనగానే ఎన్నో భావాలు ఆలోచనలు ముప్పిరిగొన్నాయి. కె.శివారెడ్డి గారి ‘ఆసుపత్రి గీతం’  మదిలో మెదిలింది. ప్రభుత్వ దవాఖానా అయినా, కార్పొరేట్ దవాఖానా అయినా దవాఖానా దవాఖానే కదా. చిన్నప్పటి నుండీ వేములవాడలో   చూసిన తాతయ్య డాక్టర్ సుబ్రమణ్యం గారి దవాఖానా గుర్తొచ్చింది. అక్కడి కషాయాలూ గోలీలు గుర్తొచ్చాయి. కానీ ఇప్పటి దవాఖానా వేరు.  ఒగదిలో బంధిస్తారు. స్టాండ్ కు గ్లూకోస్ బాటల్ వేలాడుతూ వుంటుంది. డాక్టర్లు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు నర్సులూ వస్తారు. పరిశీలిస్తారు. పలకరిస్తారు. ఏవేవో చెప్పి అయిదునిమిషాల్లో వెళ్తారు. తర్వాత ఇందిరా నేను మిగుళ్తాం. వారి రూల్స్ ప్రకారం ఎప్పుడో ఒక సమయంలో సందర్శుకుల్ని అనుమతిస్తారు. అట్లా ఒంటరిగా వుండాల్సిందే.  మొదటి ఫిస్టులా అన్నీ రోజులూ చాలా కష్టంగా గడిచాయి. పరిస్తితి అంతా స్పష్టా స్పష్టం.

డిశ్చార్జ్ అయ్యాక అర్జున్ ఇంటికి ప్రయాణం. వారానికి మూడుసార్లు డయాలిసిస్ కి వెళ్ళాలి. అర్జున్ కొంత ఫ్రీగానే వుండడం రాజు మా వెంటే వుండడం రాక పోకలకు నా విషయంలో కొంత అనుకూలమయింది. సౌకర్యమయింది.  ఇదంతా ఇట్లా వుండగా ‘మిమ్మల్ని చూడడానికి అమ్మా నాన్న వస్తామంటున్నారు’ అన్నాడు. ఈ వయసులో వారెందుకులే అన్నాను నేను . హైదరబాద్ లోనే వున్నారు కదా. నేను భౌతికంగా పర్లేదు కాదా బెడ్ రిడేన్ కాదు. మనమే వెళ్దాం అన్నాను. రాజూ నేనూ ఇద్దరమూ హయాత్ నగర్ లో వున్న ఇందిరా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాం. ఇందిరకు కొంత అయిష్టంగానే వున్నా నేనే ఒప్పించాను. పెద్దవాళ్ళు పోనీలే అని. అట్లా రొగే సందర్శకుల వద్దకు వెళ్ళడం సరదాగానే అనిపించింది.

ఇక సరిగ్గా అదే సమయంలో ఉస్మానియాలో పర్యావరణ అంశంలో రిఫ్రెషర్ కోర్సు వచ్చింది. కాలేజీనుంచి ప్రిన్సిపాల్ మురళి  గారు  రిలీవ్ చేశారు. హైదరబాద్ లోనే వుంటారు కదా అటెండ్ కండి అన్నారు. లీవ్ మిగులుతుంది కదా అని నేనూ సిద్దపడ్డాను. ఉస్మానియా అకాడెమిక్ కాలేజీలో అప్పటికే రెండు కోర్సులు చేసి వున్నాను. ఒకటి లైబ్రరీ సైన్స్ లోనూ మరొకటి ఓరియెంటేషన్ కోర్సు. లైబ్రరీ కోర్సు కు ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు గారు బాధ్యుడు. బాగా స్ట్రిక్ట్ గా నడిపారు. తర్వాతి ఓరియెంటేషన్ కి ప్రొఫెసర్ సుదర్శన్ రెడ్డి గారు బాధ్యులు. ఆయనా అంతే. టైమ్ పాబంది. అయితే తానే అప్పుడు కోర్సులో పార్టీసిపెంట్ అయిన నాతో ORIGIN  AND EVOLUTION OF CINEMA అన్న అంశం మీద క్లాస్ ఇప్పించారు. ఆడియో విజువల్ తో కూడిన నా క్లాస్ అందరినీ బాగానే ఆకట్టుకుంది. అదంతా అట్లుంటే ఇప్పుడు ఓ పక్క డయాలిసిస్ మరో పక్క కోర్సు. కానీ ఈసారి ఇంచార్జ్ ప్రొఫెసర్ జన్యుశాస్త్రానికి చెందిన వాడు. ఆయనకు తన రీసర్చ్ క్లాసులు అవీ ఇంపార్టెంట్ కావడం తో అకాడెమిక్ కాలేజీ బాధ్యతల్ని అంతా సీరియస్ గా తీసుకోలేదు. దాంతో నాకు చాలా సులభమయింది. 3-4 వారాలపాటు అలాగే గడిచింది. వారంలో సోమ, బుధ,శుక్ర వారాల్లో డయాలిసిస్. మిగతా సమయాల్లో పర్యావరణ కోర్సు. సాన్ షైన్ ఆసుపత్రిలో డయాలిసిస్ విభాగం లో వున్న సురేశ్ చాలా స్ట్రిక్ట్ గా వుండేవాడు. శుచీ శుభ్రత ఖచ్చితంగా పాటించే వాడు . అదంతా రోగులకు ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా వుండేందుకే అనేవాడు.  నిజమే కదా అనిపించినా ఆయన ఖచ్చితతత్వం ఒక్కోసారి కోపం తెప్పించేది. అయినా తప్పదు మరి. నన్ను లోనికి పంపించి ఇందిర బయట కూర్చునేది. అర్జున్ కు కూడా కాలం వెచ్చించడం కష్టంగానే వుండేది. హైదరబాద్ లో తొలి డైయాలిసిస్ అంకం అట్లా ముగిసింది. మంచయినా చెడు అయినా మొత్హంగా ఏ అనుభవమయినా మనిషికి మొదట కష్టంగా వున్నప్పటికే కాలం గడుస్తూ వుంటే అలవాయిపోతుంది. రొటీన్ అయిపోతుంది. డయాలిసిస్ కూడా నాకు రొటీన్ నాలుగు వారాలకే జీవితంలో భాగమయిపోయింది.

         అదే సమయంలో సహచరి ఇందిర కిడ్నీ ఇవ్వడానికి సిద్దపడింది. ఇందిర సోదరుడు బాలరాజు మొదలు పలువురు తన కిడ్నీ ఇచ్చి కష్టపడేకంటే ‘జీవందాన్’ కార్యక్రమంలో పేరు నమోదు చేసుకుంటే బాగుంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దాని గురించి వివరాలు తెలుసుకుంటే అదంతా త్వరగా కాదని తెలిసింది. అదంతా కాదు తన కిడ్నీ ఇవ్వడమే కరెక్ట్ అని ఇందిర పట్టుబట్టింది. దానికోసం మాచింగ్ తదితర టెస్ట్ చేయాలి. అప్పుడే ఎవరో సలహా ఇచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో ఒక మంచి నెఫ్రాలజిస్ట్ వున్నాడు. కలవమని చెప్పారు. సరే వెళ్ళాం. అక్కడ అనేక టెస్టులు చేశారు. వేలాది రూపాయల బిల్ అయింది. కార్పొరేట్ హాస్పిటల్ అంటే చాలు టెస్ట్స్ అండ్ రేపోర్ట్స్ కదా. ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. డాక్టర్ అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. మాచ్ అవుతున్నట్టు తెలుస్తున్నది. చాలా ఉత్సాహంగా నిర్దేశిత సమయానికి ఇద్దరం వెళ్ళాం.   ముందు బయట డాక్టర్ ఇన్ చీఫ్ కు ఆసిస్టంట్ గా వున్నతన్ని కలిశాం. తర్వాత డాక్టర్ ఇన్ చీఫ్ ని  కలవమన్నారు. అన్నీ రిపోర్ట్స్ చూసి అంతా ఓకే అంటూనే ‘మీ ఇంట్లో ఎవరికయినా సుగర్ వుందా?’ అని ఇందిరను అడిగారు. మా అమ్మకి చాలా ఏళ్లుగా వుందని ఇందిర అంది. అంతే అయితే మీకు కూడా సుగర్ వచ్చే అవకాశం వుంది. దాతగా మీరు అనర్హులు అన్నాడాయన, తనకి సుగర్ లేదు కదా అని నేన్నాను. ఇందిర ఆదేమాట అంది. ఆయనకు బాగాలేకుంటే మీరు వెంట వుండి తిరుగుతున్నారు.రేపు మీరు కూడా సిక్ అయితే మీ ఇద్దరినీ వెంటబెట్టుకుని ఎవరు తిరుగుతారు. అందుకే దాతగా మీరు సరికాదు అన్నాడాయన. అంతే మేం హతాశులమయ్యాము. అంతా సజావుగా వుంటుదనుకున్న సమయంలో పిడుగుపడినట్టు అయింది. ఇందిర ఒకటే ఏడుపు. పిచ్చా చూద్దాం.డయాలిసిస్ నడుస్తుంది కదా అని ఊరడించాను.

ఇంకేముంది ఉస్మానియా లో కోర్స్ అయిపోయింది. మేమిద్దరం బయలుదేరి కరీంనగర్ చేరుకున్నాం. కాలేజెలో జాయిన్ అయ్యాను. సోమ బుధ,శుక్ర మూడురోజులు డయాలిసిస్ కోసం హైదరబాద్ వెళ్ళడం రావడం. ఉదయాన్నే నాలుగింటికి లేచి రెడీ అయి టీ తాగి 5 గంటలకల్లా బస్ ఎక్కడం. జూబ్లీ బస్ స్టాండ్ లో దిగడం. సన్ శైన్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడే వున్న హోటల్ లో బ్రేక్ఫాస్ట్ చేయడం. లోనికి వెళ్ళి నేను దయాలిసీస్ హాలుకి వెళ్ళడం. ఇందిర బయట వైటింగ్ హాల్ లో కూర్చోవడం. 8-12 నాలుగు గంటలు అయ్యాక బయటకొచ్చి. కింద వున్న అదే హోటల్ లో లంచ్ చేసి బస్ ఎక్కడం. కరీంనగర్ చేరుకోవడం. అదీ మా కార్యక్రమం. అయిదారు నెలల పాటు సాగిందా కార్యక్రమం. కాలేజీ బాగా సపోర్ట్ చేసింది.

అప్పటికి కరీంనగర్ లో రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చాయి. ప్రతిమ, చలిమెడ ఆనందరావు కాలేజీలు. ప్రతిమలో దయాలిసి ఫెసిలిటీ వుందని తెలిసి అక్కడికి వెళ్ళాం. టెక్నీషియన్ గా వున్న శ్రీనివాస్ మా కాలేజీ స్టూడెంట్. దాంతో మంచి సహకారం లభించింది. కానీ మొదట అన్నీ రక్త పరీక్షలు చేయాలన్నాడు. నారిపోర్ట్స్ లో హెపటైటిస్ ఇన్ఫెక్షన్ అని వచ్చింది. సార్ ఎక్కడ తగిలిందో ఏమో కానీ డయాలిసిస్ అందరితో చేయలేం అన్నాడు. బయటకొచ్చి అక్కడే అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా వున్న మా మాజీ ప్రిన్సిపాల్ శ్రీ బి.రాంచనర్ రావు గారిని కలిశాం. ఆయన ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం తో ఇందిర ఏడ్చేసింది. ఆయన తండ్రిలాగా ఆమెను ఓదార్చాడు. అంత కంగారుపడితే ఎట్లమ్మా ఏం కాదు అంటూ ధైర్యం చెప్పాడు. రాత్రి షిఫ్ట్  లో డయాలిసిస్ కి ఏర్పాట్లుయాయ్యాయి. కానీ అది చాలా కష్టం. తిరిగి డాక్టర్ గందే శ్రీధర్ ని కలిశాం. తాను వారం వారం కరీంనగర్ వస్తాడు. అంతకు ముందు ప్రతిమలో కన్సల్టెటెంట్ కా వున్నాడు. వివిషయం చెప్పగానే పెరిటోనియల్ డయాలిసిస్ వుంది అది మీరే ఇంట్లో చేసుకోవచ్చు అన్నారు. అయితే పొట్టకు ఒక ఆపరేషన్ చేయాలి అన్నాడు.హైదరబాద్ వెళ్ళాం. సర్జరీ పూర్తి అయ్యాక కరీంనగర్ వచ్చాం.  ట్యూబ్ ద్వారా చేసే ఆ ప్రక్రియ ఇంట్లో చేసుకోవచ్చు. కానీ అది ప్రతి ఎనిమిది గంటల కొకసారి చేయాలి. కానీ అత్యంత పరిశుభ్రమయిన వాతావరణంలో చేయాలి. ఇందిరకు కొంత శిక్షణ ఇచ్చారు. ప్రత్యేకమయిన వాటర్ బాటిల్స్ తెప్పించడం. ఆ ప్రక్రియ చెప్పుకోవడం సులభమే కానీ నిర్వహణ చాలా కష్టం. పొట్టనుంచి పైప్ బయటకు వుంటుంది కాబట్టి రిస్క్ ఎక్కువ. అయిన దాన్ని కొనసాగించాం.   

   అట్లా డాక్టర్లు, వైద్యం,మందులు, వాటి మధ్య అటు మానసికంగానూ, ఇటు ఆర్థికంగానూ తీవ్రమయిన ఒత్తిడి,

మెడికల్ రి ఇంబర్స్మెంట్ ఒక పెద్ద ప్రహసనం…

మిగతా వచ్చేవారం…

  • వారాల ఆనంద్

9440501281   

-వారాల ఆనంద్
Dt: 28 JAN 2024
9440501281

KHUSHWANTH SING

Posted on

“సాహితి స్రవంతి” SAHITHI SRAVANTHI
My Podcast on KUSHVANTH SING