Month: May 2017

అద్దం (POEM)

Posted on

bing-8

 

అద్దం

ఆకాశంలో నల్లని మబ్బుల

పరదాల్ని దాటి చంద్రుడు

చెరువు లోకి తొంగి చూసినట్టు

నేను అద్దం లోకి చూశాను

దిగులు ముఖం ఒంటరిగా దీనంగా కనిపించింది

కోపంగా అద్దాన్ని నెలకు కొట్టాను

వంద ముక్కలయింది

చూద్దును కదా

నూరు దిగుళ్లు ముప్పిరిగొన్నాయి

-వారాల ఆనంద్