ENGLISH POETRY

Mamang Dai

Posted on

Friends, Celebrated poet Mamang Dai will be the Poet Laureate of the 14th edition of Tata Literature Live! The Mumbai LitFest. I have written a small article on Mamang Dai, published today in edit page of SAKSHI daily, thanks to the editor and his editorial team members

-anand varala

Posted on

READ, LISTEN AND WATCH

+++++

కవి అనేవాడు తనను తాను ఆవిష్కరించుకోవాలి

జయంత్ మహాపాత్ర

****

జీవన సారాంశాన్ని చెప్పాలి. కవి అనేవాడు తన కవిత్వం లో తన శక్తిమేరకు జీవన గమనాన్ని నిజాయితీగానూ కళాత్మకంగానూ చెప్పగలగాలి.

జయంత్ మహాపాత్ర కవిత్వం గాఢమైన జీవితానుభవంలాగా చాలా సాంద్రంగా సాగుతుంది.

ఆయన్ని స్థానిక పాబ్లో నెరూడా గా పిలుస్తారు. ప్రపంచ ప్రసిద్ది పొందిన భారతీయ ఆంగ్ల కవుల్లో ప్రముఖుడయిన జయంత్ మహా పాత్ర ఒక చోట ఇట్లా అంటాడు “ నేను ఒక కవిత రాయాలనుకున్నప్పుడు ఒక ప్రతీక తో ఆరంభిస్తాను, లేదా కొన్ని ప్రతీకలతో ఆరంభిస్తాను అవి ఒకటి నుంచి మరొకటి దాన్నుంచి మరోటి అట్లా ఏర్పడుతూ పోతాయి.ఆ కవిత ఎట్లా ముందుకు సాగుతుందో తెలీదు..ఎట్లా ముగుస్తుందో కూడా తెలీదు’.

జయంత్ మహాపాత్ర కవిత్వం నిండా ఒడిశా ప్రజల ప్రాచీన సంస్కృతి, వర్తమాన చరిత్ర అన్నీ పరుచుకుని వుంటాయి. అట్లని ఆయన్ని స్థానిక కవిగా భావిస్తే తప్పే అవుతుంది.

ఆయన కవిత్వం స్థానీయత నుండి విశ్వజనీనమయిన భావన వైపునకు,

ఒడిశా ప్రాంతీయత నుండి ప్రపంచ వ్యాప్త దృష్టి కోణాన్ని ఆయన తన కవితల్లో ఆవిష్కరించాడు.

ఆయన కవిత్వం ప్రపంచ ద్వారాల్ని ఒడుపుగా తెరుస్తుంది.

2 అక్టోబర్ 1928 కటక్ లో జన్మించిన జయంత్ మహాపాత్ర కింది మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు. తన ప్రాథమిక విద్య కటక్ లోని స్టీవర్ట్ స్కూలు లో జరిగింది. చిన్నప్పటినుండీ ఆంగ్ల మాధ్యంలో చదువుకున్న ఆయన సైన్స్ బాగా ఉత్సాహంగా ఆసక్తిగా చదువుకున్నాడు. భౌతిక శాస్త్రం లో పీజీ ప్రథమ శ్రేణిలో పాసయి, శాస్త్రవేత్తగా శిక్షణ పొందాడు. కాలేజీ టీచర్ గా తన వృత్తి జీవితం ప్రారంభించాడు. ఒదిశా లోని పలు కాలేజీల్లో ముప్పయి ఆరేళ్ళ పాటు భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా పని చేసాడు. గంగాధర్ మెహర్ కాలేజ్ సంబల్ పూర్, బి.జే.బి కాలేజి, భువనేశ్వర్,ఫకీర్ మోహన్ కాలేజి బాలాసోర్, రావెన్ షా కాలేజ్,కటక్ లాంటి అనేక కాలేజీల్లో పని చేసాడు. చిన్నప్పటినుండీ ఎప్పుడూ కవిత్వం రాయాలని కవి ని కావాలని ఆయన అనుకోలేదు. చాలా మంది కవుల కంటే భిన్నంగా జయంత్ మహాపాత్ర తన 38 వ ఏట కవిత్వం రాయం మొదలు పెట్టాడు. ఆయన ఇంగ్లీష్, ఒడియా రెండు భాషల్లో విరివిగా రాసాడు. భారతీయ ఆంగ్ల కవిగా ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించాడు.

ఆయన మొట్టమొదటి పుస్తకం “CLOSE THE SKY , TEN BY TEN” 1970 లో అచ్చు అయింది. అప్పటిదాకా భౌతిక శాస్త్రం భోదిస్తూ ఉన్నప్పటికీ, ఆయనకు నవలలు కథలు బాగా ఇష్టంగా ఉండేవి. అందులోనూ ఇంగ్లీష్ వచనం బాగా చదివాడు. కానీ ఎప్పుడూ కవి అవుతానని అనుకోలేదు. కాని కవిత్వం లోకి గుడ్డిగా వచ్చేసాడు.. ఎటు పోతున్నాడో తెలీని స్థితి.. కవిత్వ తొలి రోజుల్లో ఆయన కవిత్వం నిండా స్వీయ స్పృహ అధికంగా కనిపిస్తుంది. అయితే ‘కవిగా మొదటి రోజుల్లో పడిపోయాను, లేచాను, ఎదిగాను’ అంటాడు మహాపాత్ర. బహుశా అప్పటిదాకా ఆయనలోనో నిబిడీకృత మయివున్న కవితాంశ, భావావేశం, సృజనాత్కత పెల్లుబికి కవిత్వంగా రూపుదిద్దుకుందేమో అనిపిస్తుంది. ఆయన రాయకుండా తన భావాల్ని చెప్పకుండా ఉండలేని స్థితికి గురయి విస్తృతంగా రాసాడు. రెండు భాషల్లో రెండు చేతులతో రాసాడనే చెప్పాలి. ఆయన విస్తృతంగా చదివాడు. అట్లా చదవడం వల్లనే తనకు భాష వొంటబట్టింది. ఆ భాషను కవిత్వం లో వాడాడు. చిన్నప్పటి నుండీ మిషనరీ స్కూల్స్ లో చదవడం వాళ్ళ ఆయనకు ఇంగ్లీష్ స్వభావ సిద్దంగానే వచ్చింది. ఒడియానే తనకు సెకండ్ లాంగ్వేజ్ గా నిలిచింది. అయినా ఆయన చుట్టూ వున్నది ఒడియా భాష అక్కడి ప్రజలు. వారితో మమేకం అయివుందడంతో ఆయన రచనల్లో ఆ జీవితం ఆ భాష ప్రభావం అమితంగా వుంది. తాను నివసించిన ఒడిశా ప్రాంత చరిత్ర సంస్కృతి ఆయన్ని తీవ్రంగా ప్రభావితం చేసాయి. మహాపాత్ర ఇంగ్లీషు కవిత్వంలో ధ్వనించే లయ మిగతా బయటి దేశాల ఇంగ్లీష్ భాషా కవులకంటే భిన్నంగా వుంటుంది. దానికి ప్రదానంగా ఆయన పైన వున్న ఒడిశా లోని మౌఖిక సాహిత్యం, జానపద గీతాలు అనే చెప్పాలి.

జయంత్ మహాపాత్ర కవితా సంకలనం ‘ఏ రెయిన్ ఆఫ్ లైఫ్’ కవితలన్నీ బ్రిటన్ లోని క్రిటికల్ క్వార్టర్లీ, టి.ఎల్.ఎస్.లాంటి వాటిల్లోనూ, చికాగో రివ్యు లాంటి పత్రికల్లోనూ అచ్చయ్యాయి. అంతేకాదు అమెరికా, ఆస్ట్రేలియాలలోని సాహిత్య పత్రికల్లో కూడా వచ్చాయి. దాంతో ఆ పుస్తకానికి జాకోబ్ గ్లాట్ స్టైన్ అవార్డు వెతుక్కుంటూ వచ్చింది.

జయంత్ మహాపాత్ర ఇప్పటికి 30 కి పైగా కవితా సంకలనాలు వెలువరించారు. అందులో అధికంగా ఇంగ్లీష్ లోనూ మిగతావి ఒరియాలోనూ రాసారు.

జయంత్ మహాపాత్ర ప్రధానంగా కవిత్వం రాసినప్పటికీ వచనం కూడా రాసారు. దొర్ ఆఫ్ పేపర్స్ కథా సంకలనం, అనేక వ్యాసాలూ, తన జ్ఞాపకాలూ రాసారు.అంతేకాదు జయంత్ మహాపాత్ర అనేక ఒడియా కవితల్ని ఇంగ్లీషులోకి అనువదించారు. అనువాదకుడిగా కూడా ఆయనకు గొప్ప గౌరవముంది.

ఆయన కవితా సంకలనం ‘రిలేషన్ షిప్స్’ కి 1981 లో సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. దాంతో ఆయన మొట్టమొదటి భారతీయ ఆంగ్ల కవిగా ఆ అవార్డును అందుకున్నాడు. చికాగో పోయెట్రీ మాగజైన్ నుండి జాకోబ్ గ్లాట్ స్టయిన్ పురస్కారం, అల్లెన్ టా టే అవార్డును ద సేవానీ రివ్యు నుండి, సార్క్ లిటరరీ అవార్డు, టాటా లిటరేచర్ జీవన సాఫల్య పురస్కారంఅందుకున్నారు. ఇంకా 2009 లో పద్మశ్రీ పురస్కారం, ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, సాహిత్య అకాడెమీ ఫెల్లో షిప్ కూడా అందుకున్నారు. ఫెల్లోషిప్ ను అందుకున్న మొట్ట మొదటి భారతీయ ఆంగ్ల కవి కూడా జయంత్ మహాపాత్ర నే. అంతే కాదు అనేక జాతీయ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో కవిత్వ పఠనాల్లో పాల్గొన్నారు.

‘కవి తనకు తాను వేసుకునే అనేక ప్రశ్నలకు, తాను రాసే కవిత్వం సమాధానాలు చెబుతుంది’ అంటాడు జయంత్ మహాపాత్ర.

అందుకే ఆయన కవిత్వం ఆయనకు తన అంతర్ బహిర్ సంఘర్షణలకు వేదికగా నిల్చింది. ఆయన రాసిన కవిత్వం ఆయనకే కాదు చదువరులు తాము ఎదుర్కొనే అనేక ప్రశ్నలకు కూడా వెతికితే సమాధానాలు లభిస్తాయి.

ఆయన్ని చదివిన తర్వాత నా అనుభవం చెబుతున్న సత్యమిది.

ఎవరికయినా చదవడం రాయడం ఒక మంత్రం లా పని చేస్తుంది. అది ఆ పాఠకుడిలో వున్న అనేక అనేక బాధలకు, సంక్షోభాలకు తెరిపినిస్తుంది. అందులో ముఖ్యంగా రాయడం వలన కవిలో పెల్లుబికిన ఉద్వేగం కాగితం మీదికి ఒలికి అతను అతని మనసు నిమ్మలమవుతుంది. జయంత్ మహాపాత్ర కవిత్వం కూడా అంతే ఆయన కూడా అంతే.. రాస్తూ తాను ఎంతో ఉపశమనం పొందుతానని అంటాడు.

‘కవి తాను స్వేచ్చగా రాయాలి, తన ఆవగాహనకు స్థాయికి అనుగుణంగా రాయాలి. ప్రేమ కవి, కమర్షియల్ కవి అంటూ కాకుండా కవి అనేవాడు తప్పకుండా తనను తాను ఆవిష్కరించుకోవాలి.. ఎలాంటి భేషజాలు, లేకుండా తాను భావించిన విషయాలు, తాను అనుకున్న సత్యాలు తాను చూసిన లేదా అనుభవించిన వాటిని తన కవిత్వంలో నిజయితీగా ప్రతిఫలింప జేయాలి’ అంటాడు జయంత్.

‘కవి అనేవాడు తన కవిత్వం తో నీతివంతమయిన ప్రవర్తనకు సంరక్షకుడిగా వుండాలి. కవిత్వం అలాంటి స్థితి సృష్టించ లేనప్పుడు ప్రపంచ మనుగడే ప్రశ్నార్థక మవుతుంది’ అంటాడు జయంత్ మహాపాత్ర.

కవి ఒంటరిగా ఒంటరితనంలో కూర్చుని రాయలేడు, అట్లా చేస్తే స్తబ్దత, ఎడారితనం కవిని చుట్టుముడుతాయి.అందుకే తన చుట్టూ జరుగుతున్న విషయాల్ని పతిన్చుకోకుండా ఉండలేడు. కవి తన వేదనని భావోద్వేగాన్ని గూర్చే రాస్తాడు. కవిత్వం కవి అంతర్ బహిర్ సంభాషణ నుంచే పుడుతుంది అంటాడు. అంతేకాదు కవిత్వం వర్తమాన కాలపు సంక్షోభాన్నీ, దుఖాన్ని ప్రతిబించాలంటాడు.

“నేను ఒడిశా లో పుట్టాను, ఇక్కడే బతికాను బతుకుతున్నాను, ఇక్కడి చరిత్ర నాది, కోణార్క్ నాది, కోణార్క్ వైశాల్యం నాది, వైభవం నాది, దాని ఒంటరితనం నాది.. అంతే కాదు ఇక్కడి ఆకలి.. ఇక్కడి కరువు కాటకాలు నావి.. ఎవరయినా వాటిని దాటి నా నుంచి మరే రచనల్ని ఆశిస్తారు.. నేను అదే రాసాను.. రాస్తున్నాను..చెట్టు మీద మామిడి ఎట్లా పండి పోతుందో నేనూ అట్లే మరణం వైపు పరి పక్వం చెందుతున్నాను” అంటాడు జయంత్ మహాపాత్ర.

ఆయన కవిత్వంలో కాలం ముఖ్య భూమికను పోషిస్తుంది. ఆయన కాలంతో పాటు సమాంతరంగా సాగాడు. కాలం ఆయన కవిత్వం లో ముందుకు వెనక్కు కదుల్తూ వుంటుంది.

ఆయన కవిత్వం నిండా నాస్టాల్జియా కనిపిస్తుంది.

‘రాస్తున్నప్పుడు నిన్ను నువ్వు కోల్పోతావు … ఒక్కోసారి కవిత్వం గతాన్ని స్తుతిస్తుంది’ అని కూడా ఆయనంటాడు.

ఇట్లా భౌతిక శాస్త్రం చదువుకుని బోధించి కవితా ప్రపంచంలోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ స్పష్టమయిన అభిప్రాయాలతో అందమయిన స్థానీయమయిన ప్రతీకలతో గొప్ప కవిత్వాన్ని రాసి ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించిన జయంత్ మహాపాత్ర ఈ కాలపు మహా కవిగా మన్ననల్ని అందుకున్నాడు. ఒక కవి అలుపెరుగ కుండా సీరియస్ గా కవిత్వం రాస్తూ వుంటే అవార్డులు రివార్డులు అతన్ని వెతుక్కుంటూ వస్తాయి అదే క్రమంలో జయంత్ మహాపాత్రకు అనేక అవార్డులు మన్ననలు వచ్చాయి.

జయంత్ మహాపాత్ర కటక్ కీ, మహానదీ తీరానికీ, ఒడియా నేలకీ జీవితమంతా అంటిపెట్టుకుపోయాడు. ఆ విషయంలో రామానుజన్ కన్నా, పార్థసారథికన్నా దిలీప్ చిత్రేకన్నా తనెంతో అదృష్టవంతుణ్ణని చెప్పుకుంటాడు. ఇప్పుడు తన ఆత్మకథ మాత్రం ఒడియాలో రాస్తున్నాడు

ఒక వేసవి కవిత

ఊళ పెడుతున్న దిగులుగాలిలో

మరింత గట్టిగా వినిపిస్తున్న పూజారులమంత్రాలు.

భారతదేశపు నోరు తెరుచుకుంటోంది.

మొసళ్ళు మరింతలోతుల్లోకి జరుగుతున్నాయి.

మండుతున్న పేడపిడకల ప్రభాతాల

పొగ ఎండలో.

బారెడు పొద్దెక్కినా

నా ధర్మపత్ని ఇంకా

నా శయ్యలో

కలలు కంటూనే ఉంది

చితిమంటలపెళపెళలకు

సొలసిపోని స్వప్నాలతో.

దేవాలయం వీథి, పూరి

మట్టిలాగా జేగురురంగు పిల్లలు

వికలాంగుల్నీ, వీథికుక్కల్నీ

చూసి నవ్వుతున్నారు

వాళ్ళనెవరూ పట్టించుకుంటారన్న బాధ లేదు.

అనంతలయోన్ముఖం దేవాలయం .

నున్నగా గొరిగినగుండురంగు వీథిదుమ్ములో

అన్నీ నిరంతరం సంచరిస్తూనే వుంటాయి

కాని ఏ ఒక్కటీ దృష్టిపథం దాటిపోదు.

ఇక అక్కడ ఆ ఆకాశం

ఉల్లంఘించలేని ఏ అధికారానికో

కట్టుబడి నిశ్శబ్దపు చంకకర్రలు సాయంగా.

రేపటికోసమొక ఆశతో

పూరిలో కాకులు

విశాలమైన ఆ ఒక్క వీథి

రాక్షసినాలుకలాగ సోమరిగా.

అటుపోతున్న పూజారికోసం

దారితొలుగుతున్న

అనామకులు ఐదుగురు కుష్టువాళ్ళు .

వీథి చివర దేవాలయద్వారం

దగ్గర తోసుకుపడుతున్న మనుష్యసందోహం.

మహోన్నతకారణాలగాలిలో

తలూపుతున్న

బృహత్ పవిత్రపుష్పం.

=========================

CLICK AND WATCH

May be an image of 1 person and text that says "విశ్వజనీనమయిన Jayanta Mahapatra Selected Poems అనేవాడు తనను తాను ఆవిష్కరించుకోవాలి జయంత్ మహాపాత్ర Collected Poems సారాంశాన్ని Jayanta Mahapatra సాహితీ సవంతి కవిత్వం Relationship Jayanta Mahapatra పవిత్రపుప్పం. JAYANTA MAHAPATRA వేసవి గమనాన్ని నిజాయితీగానూ కళాత్మకంగానూ చెప్పగలగాలి మవుతుంది అంటా ఒంటరిగా ఒంటరితనంలో కూర్చుని పిల్లలు 1974-2008"

FREEDOM and I

Posted on

++ VARALA ANAND

FREEDOM and I

++++++++ VARALA ANAND

Freedom and I are monolith  

Call one both answer

I and my breath are dynamic 

Inhale and exhale

The day and day out

Independence, my home

Is not a bank locker

It’s structured built with sweat and blood

With their own Beliefs, Food, love

Amma, Ammeejan, akka bava,

Dada and daadi , beta beti 

All are happy and fine

In the mansion of 75 years

Sometimes thatched roof is pricked

We patch and even recap

When

Bandicoots entered  

My home is disturbed  

But

Foundations of my Mansion are

Strong and intact 

My lovely home remains Uninterrupted

Nectar of Friendship shower  for ever

I rejoice equal among equals

****************

FREEDOM and I   ++ VARALA ANAND

Posted on

అమృతం

+++++

సప్త సముద్రాలూ

ప్రపంచం నిండా

సుధలను పొంగించనీ

ఆకాశం నుంచి

చంద్రుడు

మకరందాన్ని కురిపించనీ

మాతృమూర్తి స్థనాన్నుండి

జీవనామృతం పారనీ

మనిషి మంచితనం నుండీ     

మానవత్వం నుండీ

అమృతం ఉద్భవించనీ

కవి రాసే

సున్నితమయిన మాటల్నుండి 

అమృతమే

బొట్లు బొట్లుగా రాలనీ 

……

కాశ్మీరీ మూలం & ఆంగ్లానువాదం : బ్రిజ్ నాథ్ బెతాబ్

స్వేచ్చానువాదం: వారాల ఆనంద్  

అందుకున్నాను SINGING IN THE DARK

Posted on

అందుకున్నాను

==================

మిత్రులారా ,

రెండు వారాల క్రితం నాకిష్టమయిన కవి సచ్చిదానందన్ సహసంపాదకుడుగా వున్న SINGING IN THE DARK   ‘చీకటి కాలం లో గానం’  సంకలన వివరాలు ఆన్ లైన్ లో చూసి ఆర్డర్ చేసాను. ఆ గ్లోబల్ సంకలనాన్ని అందుకోగానే ప్రపంచం లో కవులు రచయితలూ అంతా దుఃఖ కాలంలో దాదాపుగా ఒకే గొంతుకతో ఎట్లా స్పందిస్తారో చూసి మనసంతా తడి తడి అయిపోయింది. కొందరి అనుభవాలు  వ్యక్తిగతమయినవి, మరి కొందరివి విన్నవి, చూసినవీ కావచ్చు కాని స్పందన మాత్రమే ఒకే స్థాయిలో వుండడం ఇంకా మనుషుల్లో కదిలే గుణం బతికే వుంది అనిపించింది. కే. సచ్చిదానందన్, నిశి చావ్లా ల సంయుక్త సంపాదకత్వంలో వచ్చిన ఈ 360 పేజీల సంకలనం కవిత్వపరంగా ఎంత గాఢంగా వుందో ప్రచురించిన తీరు కూడా అంత ఈస్తేతిక్ గా వుంది. అతి తక్కువ సమయంలో అనేక దేశాల కవుల కరోనా కాలపు కవితల్ని సేకరించి  కూర్చిన సంపాదకుల్ని మనసారా అభినందించాల్సిందే.

+++

ఏమి కాలమిది…

భయం పరిణామం చెంది

దుఖం గా రూపుదాల్చుతోంది

బతుకు వేదనై  రోదనై

స్మశానం వైపు చూస్తున్నది …

ఎన్నడూ ఊహించని అలాంటి కాలంలో ఎలాంటి అనుభవాల్ని చూసాం. లాక్ డౌన్, సాంఘిక దూరం, మాస్క్, సానిటైసర్ లాంటి అనేక కొత్త మాటల్ని విన్నాం. ఇంట్లో స్వీయ నిర్బంధంలోకి వెళ్లాం. ఆప్తుల్ని,ఆత్మీయుల్నీ, తెలిసినవాల్లనీ, మంగలేష్ డబ్రాల్ లాంటి కవుల్నీ, బాలసుబ్రహ్మణ్యం లాంటి కళాకారుల్నీ కోల్పోయాం. పోగొట్టుకున్న వాళ్ళ చివరి చూపునకూ దూరంయ్యాం…కార్మికుల వందలాది మైళ్ళ కాలి నడకల్నీ చూసాం..ఎంత ఘోరమయిన కాలాన్ని అనుభవించామో చెప్పలేము.  

    ఈ నాణేనికి మరో వైపు గంగానది పరిశుభ్రమయిందనీ, ఢిల్లీలో  వెన్నెల ప్రకాశ వంతమయిందనీ, రోడ్లమ్మట జంతువులు స్వేచ్చగా సంచరించగలుగుతున్నాయనీ విన్నాం.

వీటన్నింటి నేపధ్యం లో సామాజిక దూరం ఇప్పటికే దూరమవుతున్న మనల్ని మరింత దూరం చేసింది. ఇలాంటి స్థితిలో గ్లోబల్ స్థాయిలో కవుల కవితలతో కూడిన ఈ SINGING IN THE DARK లో వివిధ దేశాలకు చెందిన 112 మంది కవుల కవితలున్నాయి. కొందరు కవులు దుఖం తో రాస్తే, కొందరు కోపం తోనూ మరికొందరు ధైర్యాన్ని ప్రోది చేస్తూనూ రాసారు. తప్పకుండా చదవాల్సిన సంకలనమిది.  

+++

ఈ సంకలనం లోంచి ఒకటి రెండు కవితలకు నేను చేసిన స్వేచ్చానువాదం చదవండి….

రైలు –కే. సచ్చిదానందన్

రైలు మా వూరికి వెళ్తోంది

నేనందులో లేను కానీ

రైలు పట్టాలు నాలోపలున్నాయి

రైలు చక్రాలు నా చాతీపై నున్నాయి

రైలు కూత నా అరుపు

నన్ను తీసుకెళ్ళడానికి రైలు తిరిగి వచ్చినప్పుడు

నేనక్కడ ఉండను కానీ

నా శవాన్ని కాపలా కాస్తూ నా శ్వాస

రైలుపై కప్పు మీద ప్రయాణం చేస్తుంది

మా వూళ్ళో రైలు ఆగగానే

నా ప్రాణం నా దేహంలోకి చేరుతుంది

అక్కడ వేచి చూస్తున్న నా సైకిలెక్కి

తెలిసిన దారులెంత చక్కర్లు కొడుతుంది

సైకిలు గంట విని నా పిల్లలు

నాన్నొచ్చాడు నాన్నొచ్చాడు

అంటూ పరుగెత్తు కొస్తారు

తిరిగొచ్చింది నా మృత దేహమని

వాళ్లకి నేనే భాషలో చెప్పను

వచ్చింది స్వర్గం నుంచా నరకం నుంచా

నేనెక్కడో ఆరెంటి మధ్యా వున్నాను

బావినో కుంటనొ మాట్లాడ నివ్వండి

ఒక వేళ నీళ్ళు మాట్లాడానికి నిరాక రిస్తే

నా ప్రాణం ఇంటి ప్రాంగణం లోని

మునగ చెట్టు మీది కాకిలా  మారి

వాళ్లకు నిజం చెప్పేస్తుంది

=====

ఈ కాలం –కీ .శే. మంగలేష్ డబ్రాల్

కంటి చూపు కరువైన వాళ్ళు

తమ దారిని ఏర్పరుచు కోలేరు

అంగ వికల్యం వున్న వాళ్ళు

ఎక్కడికీ చేరుకోలేరు

బధిరులు

జీవితపు ప్రతిధ్వనుల్ని వినలేరు

ఇల్లు లేని వాళ్ళు

తమ ఇంటిని నిర్మించుకోలేరు

పిచ్చి వాళ్ళు

తమకేం కావాలో తెల్సుకోలేరు

ఇవ్వాల్టి కాలంలో

ఎవరయినా గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు,  

చెవిటి వాళ్ళు, ఇల్లులేని వాళ్ళుగా

మారి పోవచ్చు

=======

చివరిగా ఓ హైకూ

The invisible crown

Makes everything

Vacant

  • BAN’YA NATSUISHI (JAPANESE POET)

ఈ అనువాదాలు కేవలం మచ్చుకు మాత్రమే ఎన్నో దేశాల నుండి ఎంతో మంది రాసిన ఎంతో మంచి కవితలు ఈ సంకలనం నిండా వున్నాయి. తప్పకుండా చదివి భధ్రపరుచుకోవాల్సిన సంకలనమిది. సంపాదకులకు మరోసారి  ధన్యవాదాలు.

========================

తెలుగులో కూడా కరోనా నేపధ్యం లో అనేక మంది కవులు వీటికి దీటయిన గొప్ప కవితలు రాసారు. కాని ఇంగ్లీషులోకి, ఇతర భాషలలోకి  వెళ్ళక పోవడంతో ఆ కవితల రీచ్ పరిమితమయి పోయింది. నిజానికి అది గొప్ప విషాదమే.  

  • వారాల ఆనంద్

==============================================

 అయితే ఇక్కడ నేను రాసిన రెండు కవితల్ని మీతో షేర్ చేసుకోవాలనే temptation  ఆపుకోలేక ఇస్తున్నాను

వీలయితే చదవండి—–

‘కరోనా’ భయానికో విజ్ఞప్తి

========= వారాల ఆనంద్

ఇంతకుముందు

భయమేస్తే

నలుగురం ఒక చోట చేరేవాళ్ళం

ఒంటరిగా లేమన్న ‘థీమా’ కోసం

నలుగురమున్నామన్న భరోసాకోసం

సామూహిక ‘బృందగానం’ తో

భయాన్ని బద్దలు కొట్టేవాళ్ళం

ఇదేమిటీ కొత్త భయం

కొత్త పేరు

గుండెలనే  కాదు

సమాజాన్నీ బద్దలు కొడుతోంది

అందరూ ఎవరికి వారు

ఇళ్ళల్లో గోడలక్కొట్టిన శిలక్కొయ్యలకు

వేలాడుతున్నారు

నిజమే కొత్త భయం దెబ్బకు 

‘ప్రపంచమంతా మా గుప్పిట్లో ‘

అన్న మాటలన్నీ ఆవిరై

ఇంటి కప్పే రక్షా కవచమంటున్నారు

నాలుగు గోడలే ప్రపంచమంటున్నారు

‘వసుధైవ కుటుంభం’ అన్న మాట పోయి

కుటుంబమే ప్రపంచమయి పోయింది   

అత్తా మామ, కొడుకూ కోడలూ అన్నా చెల్లీ 

అక్కా తమ్ముడూ అంతా

కోపాల్నీ, తాపాల్నీ

అలకల్నీ ఆవేశాల్నీ

చుట్ట చుట్టి కట్ట కట్టి

పాత సామాన్ల గదిలో పడేసారు   

వెలిగించుకున్న చిరునవ్వుల వెలుగులో

భయాన్ని ఇంటిబయటి వాకిట్లో నిలబెడుతున్నారు

సరే సరే

సమాజంలోనూ

మనుషుల నడుమా ఉన్న దూరాలని

చెరిపేస్తున్న భయమా

నీకు సెహబాష్

అయితే భయమా

ప్లీజ్ మరింత పెరిగి 

మనుషుల్లోని మనసుల మధ్య

దూరాల్నీ చేరిపేయవూ

మేమంతా మనసుల్ని విచ్చుకుని

చేతుల్ని కలుపుకొని

ప్రపంచాన్ని చుట్టు ముట్టేస్తాం

రౌండ్ అప్ చేసి

భూగోళానికి బారికేడ్లు కడతాం

భయాన్ని బద్దలు కొడతాం

ఆకాశంలో పాతరేస్తాం

=========================================

ఇంట్లోనే  వుందాం

———— వారాల ఆనంద్

బయటమో కనిపించని క్రిమి

కత్తులు నూరుతోంది

దాని ఊపిరి దాహానికి అంతే లేదు

దాని చూపు ఊపు

ముందర  

రాజు పేదా తేడా లేదు  

+++++++++++++

మనం మన ముఖాలమీంచి

కళ్ళద్దాలని తీసేద్దాం

జనం కళ్ళల్లోని

దుఖపు లోతుల్ని చూద్దాం

భయం పరిణామం చెంది

దుఖం గా రూపుదాల్చుతోంది

బతుకు వేదనై  రోదనై

స్మశానం వైపు చూస్తున్నది

+++++++++

ఇవ్వాళ చేయీ చేయీ కలిపి

దిగంతాలకు కాదు గదా

వీదుల్లోకే  వెల్లలేము

బాగున్నారా అని

నాలుగు అడుగుల దూరం నుంచే

కుశలమడిగే  దుస్థితి

++++++++++++

అందుకే

భయాన్ని బంధించి

దుఖాన్ని పొట్లం కట్టి 

ఇంట్లోనే ఉందాం

కాసేపు

అద్దం ముందు కూర్చుందాం

మనల్ని మనం తెలుసుకుందాం

కాసేపు

మన లోనికి చూసుకుందాం

మన బలమేమిటో బలహీనతేమిటో

అర్థం చేసుకుందాం

++++++++ 

ఇంట్లోనే వుండి 

భావిష్యత్తు పవనాలకు

ద్వారాలు తెరుద్దాం

కొత్త లోకాన్ని కలగందాం

======================

ముక్తకాలు(Mukkalu)

Posted on Updated on

ముక్తకాలు :వారాల ఆనంద్

–———-

ప్రతి హృదయమూ అలల సముద్రమే కొందరు దాని రుచిని చూస్తే,

మరింకొందరు దాని లోతునీ వైశాల్యాన్నీ చూస్తారు

Every heart is an ocean of waves.
Some taste it and some measure it.

Tr. Anu Bodla