Month: August 2019

Posted on

Posted on

Posted on

‘YAVANIKA’ ONLINE FILM CLUB

Posted on Updated on

‘YAVANIKA’ ONLINE FILM CLUB Every Wednesday ==========================
‘తమస్’ సుప్రసిద్ద దర్శకుడు సినిమాటోగ్రాఫర్ గోవింద్ నీహాలని రూపొందించిన పీరియడ్ ఫిల్మ్. భీష్మ సహాని రాసిన థామస్ నవల రూపాంతరీకరణ ఈ టెలివిజన్ సినిమా 1988 లో నిర్మించబడి దూర దర్శన్ లో మినీ సీరియల్ గా ప్రసారమయి అనంతరం గంటన్నర ఫీచర్ ఫిల్మ్ గా విడుదల అయింది 1947 లో జరిగిన పంజాబ్ విభజన సమయంలో పాకిస్తాన్ లో జరిగిన తీవ్రమయిన అల్లర్ల నేపధ్యం లో తమస్ కథ సాగుతుంది.విభజన పర్యవసానంగా వలస వెళ్ళిన ఒక సిఖ్ తో సహా అనేక హిందూ కుటుంబాలు ఎదుర్కొన్న పర్యవసానాల్ని తమస్ అత్యంత వాస్తవికంగా హృద్యంగా ఆవిష్కరిస్తుంది. ఓంపురి, దీపా సాహి, భీష్మ సహానీ, సురేఖా సిక్రి ల నటన దశకుడిగా గోవింద్ నిహలాని ప్రతిభ సినిమాను ఒక ఉద్వేగభరిత దృశ్యీకరణ గా నిలిపాయి. నవలగా కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును అందుకున్న తమస్ సినిమాగా కూడా 35వ జాతీయ అవార్డుల్లో నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా అవార్డును గెలుచుకుంది.తమస్ లోని ఒక దృశ్యాన్ని అందిస్తున్నాను అందులో ఓంపురి నటన కెమెరా పనితనం గమనించండి. పూర్తి సినిమా యూట్యూబ్ లో వుంది. తప్పకుండా చూడండి

Posted on Updated on