Month: April 2018

‘అక్షరాల చెలిమె’ ప్రాణికోటి జీవనాంతర్లయ

Posted on Updated on

(వారాల ఆనంద్ కవిత్వం ‘అక్షరాల చెలిమే విశ్లేషణ, నమస్తే తెలంగాణ చెలిమె పేజి)

వారాల ఆనంద్ లయ కవితా సంపుటితో మొదలుపె ట్టి ఇప్పటికి నాలుగైదు కవితా సంపుటాలు వెలువరించారు. కవిత్వంతో పాటు ఆయన సినీరంగానికి సంబంధించిన శోధనలు, విమర్శలు, విశ్లేషణలు అనేకం చేశారు. వారాల ఆనంద్ అనగానే ఎక్కువమందికి సినీ విశ్లేషకులుగా పరిచయం. కాని ఆయన తొలుత కవి. ఇప్పటికీ ఆయన ఆత్మ కవితాకళ యే. కవిత్వం ఆయన మౌలికమైన కళారూపం. ఇప్పుడు వెలువరించిన అక్షరాల చెలిమె తన కవిత్వంలోనూ, ఈనాటి సమకాలీన కవిత్వంలోనూ విలక్షణమైనది. అక్షరాల చెలిమె అని పేరుపెట్టడం వెనుక ఆరని తడి ఒకటి ఉం దనే సూచన ఉంది. ఈ ఆరని తడియే వేదన. వేదన నుంచే వేదాలు, రామాయాణాది కావ్యా లూ వెలువడ్డాయి. మనిషికి జీవధాతువు వేదనయే. దాన్ని కవిత్వం చేయడం కళ. అది చెలిమెగా కవితాక్షరాలను ఊరించి సాహితీ పిపాసువులకు కవితాదాహార్తిని తీర్చే కవిత్వం ఇం దులో ఉంది.

కవులు దృశ్యాలకు, సంఘటనలకు స్పందిం చి తమవైన అనుభూతులను, స్పందనలను అందించడం కనపడుతుంది. అవి రాజకీయాలు, ప్రకృతి విధ్వంసం, పల్లెల్లో మార్పులు, కుల,మత,ధన భేదాలవల్ల కలుగుతున్న అసమానతలు.. ఇట్లాంటి వస్తువులు ఎక్కువగా కనిపిస్తాయి. లేదా సమకాలీనమైన ఉద్య మంచోటు చేసుకుంటుంది. ఆనంద్‌లో వీటన్నిటికంటే విలక్షణంగా మానవాత్మలో కదిలే అత్యంత లోతైన అనుభూతులను, తన నుంచి అందరికీ, అందరి నుంచి తనకు ప్రసా రం చేసే ఒక విలక్షణమైన అభివ్యక్తి ఉంది. ఇందులో వస్తువూ, అభివ్యక్తీ రెండూ భిన్నంగా సాగినాయి. 72 కవితల ఈ సంకలనంలో కవిత్వాన్ని గురించి తనదైన ఆలోచనను, దృక్పథాన్ని, తత్త్వాన్ని తెలియజేసేశారు.
యమయాతన/తెల్లకాగితంపై నాలుగక్షరాలు పొదగడానికి/ నాలుగు మాటలు అల్లడానికి
నాలోకి నేను ప్రవేశిస్తాను/………….. మనసులోకి వెళ్ళాను/ ఆత్మలోకి తొంగిచూశాను
నిజంగానే నాకు తెలీని విషయాలు/నాలోనూ వున్నాయి……

ఇది తనను తాను అన్వేషించుకోవడం. ఒకవిధంగా ఆత్మాన్వేష ణ. అయితే ఇందులో దైవం, పరమాత్మ వంటివాటి ప్రస్తావన ఉం డదు. మనిషిని గురించి ఎన్నో అంశాలున్నాయని, అవి తనలో ఉం డికూడా తానే గ్రహించలేకపోయానని వాటిని ఇప్పుడు తనతోపాటు మనకూ అందించాలనే ఒక తపన కనపడుతుంది. అయితే ఇది నాలో అని చెప్పడం ఆత్మాశ్రయం. ఒకప్పుడు భావకవులు ఈ ఆత్మాశ్రయ పద్ధతిని ఎక్కువగా వాడుకున్నారు. కాని అది కల్పిత భావనలకే పరిమితమైంది. ఊహాసుందరులు, కల్పితదుఃఖాలు, భావకవిత్వంలో ఉండి తాత్కాలికంగా కదిలించినా స్థిరంగా నిలువలేవు. ఆనం ద్ ఆత్మాశ్రయ పద్ధతిలో వ్యక్తీకరించడం మాన వ సహజానుభూతులను మాత్రమే కాని కల్పితాలను, ఊహలను, భ్రమలను, రాని కాని కలలను గురించి కాదు.

కవిత్వం అనే శీర్షికలో కవిని గదా/ చీకటిని ఆహ్వానించాను/ వచ్చేయి నీ బయటి ప్రపంచాన్ని వదిలేసి/ ఇక్కడ పోగొట్టుకునేది ఏదీ లేదు/ పోగొట్టుకున్నది వెతుక్కోవడానికి కాదు కవిత్వం/ పోగొట్టుకున్నది కూడా మన వెంటుండడమే కవిత్వం అని కవితానిర్వచనం మరో విధంగా. ఇక్కడ కూడా తననుతాను పట్టుకోవడమే, అది వెంటబెట్టుకోవడమే కవిత్వం అంటారు. భౌతిక సంపదలా? మనోవేదనలా? జ్ఞాపకాలా? చరిత్ర చెప్పిన అశేషవిశేష సారాంశాలా? వైయక్తికమా? సామూహికమా? దేనికైనా వర్తించవచ్చు. ఇట్లా బహుళార్థకంగా ప్రయోగించడమే కవిత్వంలో ఒక నేర్పరిత నం. కవిత్వం ఆర్ట్ మాత్రమే కాదు అది నిత్యం సాధనచేసే క్రాఫ్ట్‌గా చూపించారు ఆనంద్.

భావాలు అక్షరాలుగా రూపాంతరం దాల్చినప్పుడుగదా/ నేను సంభాషించడం మొదలుపెట్టింది/ అక్షరాల చెలిమెలోంచి/ నన్ను అందరూ వినడం ఆరంభించింది. అని తన ఆత్మపలికిన భావాలకు అక్షరరూపం ఇచ్చినవే ఈ కవితలు. ఒకవిధంగా ఇందులో అనేకం కవిత్వం గురించి చెప్పిన మాటలు కవిత్వం మీద కవిత్వం చెప్పినట్టుగా కనిపిస్తాయి. అలంకార శాస్త్ర ప్రమాణాలతో, ఆధునిక పాశ్చా త్య సాహిత్య ప్రమాణాలతో నిర్మాణ శిల్పాలను కొలువవచ్చుగాని అనుభూతుల లోతులను అందించలేవు. అది కవిత్వం మాత్రమే చేసే కళ. దాన్ని నిర్వచిస్తే దాని కళారూపం చిన్నబోతుంది.

కాలం, లయ, గమనం, నిద్ర, చుక్కల్లోకి, నిరంతరం, దారి, కక్ష, కన్నీటిధార, దిగులు పేజి, అలిఖిత, మొలక, మూలం, హృద యం, తెరచాప ఇవీ ఆయన కవితా సామగ్రి. కవితల వస్తువులన్నీ హృదగతాలే. భౌతిక వస్తువును తీసుకున్నా అది పోలికగానో, రూపకంగానో కనిపిస్తుంది తప్ప అసలు వస్తువు కాదు. ఆయా వస్తువుల ను గురించిన కవిత్వం ఉండదు. ఉదాహరణకు కాపలాదారులు అనే ఒక కవితలో చంద్రుడు రాత్రంతా అందాన్ని వెదుకుతున్నాడ ని, సూర్యుడు పగలంతా ప్రాణుల్లో ఆనందాన్ని వెతుకుతున్నాడనీ అంటారు. ఇందులో సూర్యచంద్రులు కనిపించినా చెప్పదలచుకున్నది మాత్రం జీవుల్లోని అందం, ఆనందం గురించి మాత్రమే. ఏది అందం? ఏది ఆనందం? అవి ఎక్కడ ఉన్నాయి? ఎట్లా ఉన్నాయి? ఎట్లా ఉంటాయి? జీవితంలో ఈ రెండు ప్రతి ప్రాణికీ అవసరమనే మహార్థాన్ని ఈ కవిత్వం వ్యంజింపజేస్తుంది. ఇది తెలుగువాళ్ళకో తెలంగాణ వాళ్ళకో మాత్రమే కాదు. యావత్ మానవాళికి, ప్రాణికోటికి సంబంధించినది.

అనుభూతులను దృశ్యాలుగా, దృశ్యాలను అనుభూతులుగా చిత్రించే శిల్పవైవిధ్యం ఈ కవితల్లో అభివ్యక్తికి సంబంధించిన విశేషం. నాకు పిడికెడు నిద్ర కావాలి అంటాడు. నిద్ర వస్తువు కాదు. అది అనుభవం మాత్రమే. కాని పిడికెడు అనే మాటలో ఏదో దానం అడుగుతున్నట్లు, అది కరువైనట్లు వెంటనే పాఠకుని మనసులో నిలిచిపోతుంది. లయ అనే కవితలో ఇంట్లో ప్రాణవాయువులా కదలాడే కవిత్వం అంటారు. ఇదేదో కదలాడే ప్రాణివలె రూపింపజేస్తారు. కాని ఇది అరూపమై ఆవరించిన అనుభూతి మాత్రమే.ఈ కవిత్వానికి నిర్వచనం చెప్పుకోవడమంటే మళ్ళీ ఆత్మలోయల్లోకి దిగటమే. అక్కడే ఒక విషాదం నిండి ఆనందాన్నందించే రసానుభూతి కలుగుతుంది.

ఆనంద్ కవితల నిండా ప్రధానంగా కనిపించేది తడి ఉన్న అంతర్లయ కోసం పడే వేదన. అయితే నిరాశ, నిస్పృహ లేదు. గమన మూ, దారీ, గమ్యమూ అన్నీ నేనుగా అంటే మానవునిగా సాధించే అచంచలమైన ఆత్మవిశ్వాస ప్రకటన ఉంది.
నువ్వేమో నిరంతరం/ప్రయాణిస్తున్న దారివి
గమ్యం తెలిసిన రహదారివి
……………………
దేహాల్ని చిదిమేస్తే/ మరణాలు సంభవిస్తాయా?
చెట్టుకొమ్మలమీద/ పూల రెమ్మల మీద
నీ పాటింకా వినిపిస్తూనే ఉంది/తడి ఉన్న గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అంతర్లయగా వ్యాపిస్తూనే ఉంది.
కవిత్వం నిండా మానవ జీవనయానంలోని నిత్య జీవనార్ద్రత అంతర్లయగా విని పంచిన కవితలు అక్షరాల చెలిమె.
– డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, 98493 28036

‘అక్షరాల చెలిమే’

Posted on

ఈ రోజు ‘మనం’ సాహిత్య పేజీలో నా కవితా సంకలనం ‘అక్షరాల చెలిమే’ ను డాక్టర్ రాధాకృష్ణమా చార్యులు పరిచయం చేశారు. వారికి, మనం సంపాదకులకు ధన్యవాదాలు.

MANAM REVIEW

ఉనికిని చాటుకున్న ఒడియన్ సినిమా

Posted on Updated on

      దేశంలోని అన్నీ ప్రాంతీయ సినిమా రంగాల్లాగే ఒల్లీవుడ్ గా పిలువ బడే ఒరియన్ సినిమా రంగం కూడా హ్ందీ సినిమా ఉప్పెనలో కొట్టుకుపోతున్నది. సుధ్రీర్ఘమయిన సినిమా నిర్మాణ చరిత్ర వున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన కనీస ప్రోత్సాహాలూ కరువయి ఒడిస్సా రాష్ట్రం లో ప్రాంతీయ భాషా సినిమా అటు వ్యాపార సినిమా గా కానీ, ఇటు అర్థవంతమయిన సినిమా గా కానీ ఎడగలేకపోయింది. నిధుల లేమి, సాంకేతిక కొరత హిందీ సినిమా ప్రభావం లాంటి ప్రతికూల అంశాలున్నప్పటికీ కొంత మండి చాలనచిత్రకారులు స్వతంత్రంగా కృషి చేస్తూ కొన్ని విజయవంతమయిన ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. వారి ప్రయత్నాలు గొప్ప స్పూర్తి దాయకమయినవి. అలాంటి ప్రయతనాలు చేస్తున్న వ్యక్తుల కు స్పూర్హ్టిదాయకమయిన వి రెండు ఫిల్మ్ ఫెస్టివల్స్ ఒడిస్సా రాష్ట్రంలో నిర్వహించబడుతున్నాయి. 2004లో పూరిలో నిర్వహించబడుతున్న ‘ బ్రింగ్ యువర్ ఓన్ ఫిల్మ్ ఫెస్టివల్’ BYOFF ఒక ప్రధాన మయిన వేదిక. ఈ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు దర్శకులకు ఎలాంటి నిబంధనలు  వుండవు. ఎలాంటి ముందస్తు పరిశీలనాలుండవు. ఎంపిక ప్రహసనాలుండవు. డైరెక్టర్లు మాత్రమే కాదు పాల్గొనదలుచుకున్న సినిమాకు సంబంధించి నటులు, సాంకేతిక నిపుణులు ఎవరయినా నేరుగా వచ్చి నమోదు చేసుకొని తమ సినిమాని ప్రదర్శించే వీలుందిక్కడ. అట్లా ఓపెన్ ఫెస్టివల్ దేశవ్యాప్త చాలనచిత్రకారుల్ని ఒక చోట చేర్చుతుంది. అదొక గొప్ప వేదిక ఇక ఫిల్మ్ సొసైటి ఆఫ్ భువనేశ్వర్ నిర్వహిస్తున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ భువనేశ్వర్ మరో వేదిక గత 9 ఏళ్లుగా ఈ ఫెస్టివల్ స్పూర్తిదాయకంగా కోన సాగుతున్నది. ఇలా మంచి సినిమా వివిధ భాషల ‘మాహోల్’ ఒరియన్ సినిమాకు ప్రేరకంగా నిలుస్తున్నది.

ఇట్లా ఒరియన్ భాషా సినిమా చిన్న సంఖ్యలోనూ, స్వల్ప గొంతు తోనూ తన ఉనికిని కొనసాగిస్తూనే వుంది.

      ఒరియన్ సినిమా చర్త్రను పరిశీలిస్తే మొదటి సినిమా ‘సీతా బిబాహ్’ 19336లో విడుదల అయింది. మోహన్ సుందర్ దేవ్ గోస్వామి ఆ సినిమాను రూపొందించాడు. ముప్పై వేల రూపాయల బడ్జెట్ తూ కామపాల మిశ్రా నాటకాన్ని సినిమాగా తీశారు. అది ఆర్థికంగా ఘనా విజయం సాధించింది. కానీ 1951 వరకు రెండవ సినిమా రాలేదు. కొంత మండి భూస్వాములు వ్యాపార వేత్తలు కలిసి కొన్ని ప్రాయత్నాలు చేశారు. 1960లో ప్రఫుల్ల సేన్ గుప్తా దర్శకత్వం లో వచ్చిన ‘శ్రీ లోకేనాథ్’  జాతీయ అవార్డును అందుకుంది.

అదే యేడు ఒరియా సినిమారంగంలో విశిష్ట మయిన స్థానాన్ని పొందిన నటుడు ప్రశాంత నందా జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. తర్వాత 1966,1969 లో కూడా ఉత్తమ నటుడి బహుమతు అనుకున్నాడు ప్రశాంత్ నందా.

ఒరిస్సా సినిమా రంగంలో విజయవంతమయిన దర్శకుడిగా మహమ్మద్ మోఃసిన్ పేరు తెచ్చుకున్నాడు. పూలా చందన లాంటి 16 విజయవంతమయిన సినిమాల్ని ఆయన రూపొందించాడు. తర్వాత అమియా రంజన్ పట్నాయక్, రాజు మిశ్రా, అక్షయ్ మోహన్తీ, బీజయ్ మోహన్తీ,ఉత్తమ్ మోహన్తీ లాంటి వాళ్ళు విజయవంతమయిన సినిమాల్ని తీశారు. వారిలో అమియా ర్ంజన్ పట్నాయక్ మూడు భాషల్లో కూడా సినిమాలు తీశాడు. ఒరియా, బెంగాలీ,బంగ్లాదేశీ భాషల్లో సినిమాలు రూపొందించాడు. అట్లా ఒడిస్సాలో సినిమా రంగం చాలా తక్కువ సంఖ్యలో నిర్మాణాలతో సాగింది. కానీ కాల క్రమేణా ఒరియన్ సినిమా తన ఆ మాత్రపు ప్రాభవాన్ని కూడా కోల్పోయింది. ఒడియా భాషా సంస్కృతుల ప్రతిబింబాలుగా వుండాల్సిన ఒడియా సినిమాలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. దానికి ప్రధానంగా సినిమాల నిర్మాణంలో నిర్మాతల  అతి ప్రమేయం, సాంకేతిక వసతుల కొరత లాంటివి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇక కొత్త గా రంగంలోకి వస్తున్న దర్శకులకు సరయిన అవగాహన సాంకేతిక పరిజ్ఞానం లేక పోవడం కూడా మరో కారణంగా చెప్పొకోవచ్చు. ఇక ప్రభుత్వం నుంచి కనీస ప్రోత్సాకాలు లేకపోవడం పరిస్థితిని మరింత దిగచార్చింది.

అలాంటి  ప్రతికూల పరిశ్తిఃతుల్లో కూడా ఇదిశా నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును అందుకున్న సీమాలు వచ్చాయి. దర్శకులూ వచ్చారు. అర్థవంతమయిన కొన్ని సినిమాలు ఇదిస్సాకు పేరు న్తెచ్చాయి అలాంటి వాయిలో ప్రధమంగా చెప్పుకోవాల్సిన వాడు నీరద్ మహాపాత్ర.

నీరద్ మహాపాత్ర: ఆయన మొదట 1974లో ఫిల్మ్ ఎక్స్టాసీ పేరుమీద భువనేశ్వర్లో ఫిల్మ్ సొసైటి స్థాపించి అంతర్జాతీయ సినిమాని ఒడిస్సాకు పరిచయం చేశాడు. అంతకు ముందు ఆయన 1968లో పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డిప్లొమా పూర్తి చేసి 1972నుంచి అక్కడే ఫిల్మ్ అధ్యాపకుడిగా చేరిపోయాడు. సినిమాకు సంబధించి ఆయన పాఠాలు మరిచిపోలేనవని ఆయ్న విధ్యార్హ్తులు చెబుతారు. 1983లో ఆయన తన మొదటి సినిమా ‘ మాయా మిర్గా’ రూపొందించాడు. కాలం గడుస్తున్నకొద్దీ సమిష్టి కుటుంబాల్లో జరిగే మార్పుల్ని అత్యంత సహజంగా చూపించాడాయన. మాయ మిర్గా లండన్, కేన్స్,లోకార్నో లాంటి ఫిల్మ్ ఫెస్టివాల్స్ లో పాల్గొని ప్రశంసలు అందుకుంది. తర్వాత నీరద్ అనేక డాకుమెంటరీ సినిమాల్ని తీశాడు.

మన్మోహన్ మహాపాత్ర: పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందిన మన్మోహన్ 1975లో తన మొట్టమొదటి సినిమా ‘సీతారాఠీ’ రూపొందించాడు. ఛాందస లోకానికి ఎదురోడ్డి నిలిచిన ఒక స్త్రీ గాధను ఆ సినిమా ఆవిష్కరించిది. 1984 లో ఆయన తీసిన ‘ నీరభ్ జద్ధ’ ( నిశబ్ద తుఫాన్) ఒక గ్రామంలో భూస్వామికీ రైతుకూ నడుమ జరిగే సంఘర్షణని చిత్రించింది.ఆ తర్వాత క్లాన్తా అపర్ణ హా, అందా దిగంతా  లాంటి మంచి సినిమాలు తీశాడు.

ఏకే బీర్: తాను మొదట సినిమాటోగ్రాఫర్ గా మొదలయ్యాడు. 1969-70లో ఆయన పూనా లో సినిమాటోగ్రఫీ లో డిప్లొమా పూర్హిచేశాడు. సినిమాటోగ్రాఫర్ గా ’27 డౌన్’ సినిమా తో తన కారీర్ ఆరంభించాడు. దానికి తర్వాత బీనర్సింగ రావు తీసిన ‘దాసి’ కి బీర్ జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా అవార్డుల్ని అందుకున్నాడు. తర్వాత తెలంగాణ పల్లె గుండెల్ని తడిమితడిమి ఉవ్వెత్తున ఎగిసిన ఉద్వేగాల్ని, సంస్కృతినీ ఆవిష్కరించిన ‘ మావూరు’ డాకుమెంటరీ కి కెమెరా బాధ్యతల్ని నిర్వహించాడు. దానికి గాను ఇండియన్ డాకుమెంటరీ ప్రొడ్యూసర్స్ అవార్డును అందుకున్నాడు. అట్టెన్ బారో గాంధీ సినిమాకు కూడా బీర్ పని చేశాడు. తర్వాత దర్శకుడిగా మారి ‘ఆదిమీమాంస’, ‘లావణ్య ప్రీతి’ , ‘అరణ్యక’,’ శేష దృష్టి’, లాంటి సినిమాలు తీసి తనడయిన ముద్రను వేసుకున్నాడు ఏకే బీర్.

నందిత దాస్: ఫైర్, ఎర్త్,భవిందర్,కంలీ, ఫిరాఖ్ లాంటి 40కి పైగా సినిమాల్లో నటించి నటిగా తన స్థానాన్ని నిరూపించుకున్న నందిత అనేక జతతీయ అంతర్జాతీయ అవార్డుల్ని అందుకోంది. దర్శకత్వ భాధ్యతల్ని ‘ ఆమె ‘ఫిరాఖ్’ తో మొదలు పెట్టింది. గుజరాత్ ఘర్షణల తర్వాత అనేక కథల సమాహారం గా తీయ బడిన ఫిరాఖ్ 24గంటల కాలాన్ని తన కథా కథన కాలం గా తీసుకోండది నందిత దాస్.2017లో ఇన్ దేఫెన్స్ ఆఫ్ ఫ్రీడం షార్ట్ ఫిల్మ్ తీసిందామే. 2017లోనే సుప్రసిద్ద రచయిత సాదత్ హాసన్ మ్యాన్తో జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసిందామే ఆ సినిమా ప్రస్తుతం వివిధ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలల్లో ప్రదర్శిత మవుతున్నది.

సుశాంత్ మిశ్రా: మహాపాత్రల తర్వాత ఒడిస్సా చలన చిత్రా సీమలో మంచి దర్శకుడిగా నిలిచిన వాడు సుశాంత్ మిశ్రా. బ్రింగ్ యువర్ ఓన్ ఫిల్మ్ ఫెస్టివల్ రూపకర్త అయిన సుశాంత్ 1992లో ‘హీరేన్ ఆంగ్ తీ’ తో తన ఫిల్మ్ కరీర్ ఆరంభించాడు. తర్వాత       1993లో మిశ్రా తీసిన ‘ఇంద్రహానూర్ చాయ్’ రష్యాలో గ్రాండ్ ప్రిక్స్, కేన్స్ లో ఉన్సర్టెన్ రేగార్డ్ లో స్థానాన్ని పొందింది. తర్వాత ‘బిశ్వ ప్రకాశ్’(1999), ‘ధరిణి’(2002) తీశాడు. ఇంకా దెన్ కనాల్, సమార్పణం లాంటి డాకుమెంటరీ సినిమాలు కూడా తీశాడు.

    సుశాంత్ మిశ్రా తర్వాత యువకుడయిన అంర్త్య భట్టాచార్య కొత్త  ఒరవడి తో సినిమాల్ని తీస్తున్నాడు. కాపిటల్ 1, ఖ్యానికా లాంటివి విశేష ప్రశంసల్ని అందుకుంటున్నాయి.

ఇట్లా ప్రభుత్వ సహకారం లేకుండానే ఎలాంటి సబ్సిడీలు లేకుండానే ఇదిస్సా లో ఒడియన్ సినిమా తన మనుగడను కోన సాగిశ్తూనే వుంది. తన గొంతును వినిపిస్తూనే వుంది.

73561c5a-d403-456b-bbbe-5cc2821a17d555fdceef-029a-41cb-8227-69bed64442af