Month: December 2016

“HIGHWAY “

Posted on Updated on

CLICK THE LINK

HIGHWAY

హై వే (హింది)

సినిమా ఆవిష్కరణ జరిగిన నాటి నుంచి సాంకేతికరంగానూ భావ పరంగానూ విశేషంగా మారుతూ వస్తున్నది. అనేక శాఖలుగా జానర్లుగా విస్తృతమవుతూనే వుంది. అలాంటి ఒక జానర్ ‘రోడ్ మూవీ’. రోడ్ మూవీ లో సినిమా మొత్తంగా రోడ్ మీదే జరుగుతుంది. సినిమాలో  రోడ్ ఒక పాత్ర అయిపోతుంది. ప్రపంచ సినిమా రంగం లో ఈ రోడ్ మూవీ విలక్షణమయిన జానర్ గా పేరు గడించింది. ‘ఇ ట్ హాప్పెండ్ వన్ నైట్’, ‘గ్రేప్స్ ఆప్ రాత్’, ‘ద విజార్డ్ ఆఫ్ ఒజ్’లాంటివి రోడ్ మూవీల్లోక్లాసిక్స్ గా నిలిచాయి. ఆ జానర్ లోనే వచ్చిన హింది సినిమా ‘హై వే’.   ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో నిర్మించ బడ్డ ఈ సినిమా లో చెప్పుకోవాల్సింది అనిల్ మెహ్తా సినిమాటోగ్రఫి, అలియ భట్ నటన. అంతే కాదు స్క్రీన్ ప్లే తో పాటు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం కూడా మనసుకు హత్తుకుంటుంది. ఈ రోడ్ మూవీ చిత్రీకరణ ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ , హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ హై వే లల్లో సాగుతుంది.  ఎక్కడా వూరు పేరు ప్రస్తావించకుండా నే ఆ ప్రాంతపు ఫీల్ కలిగేలా చిత్రీకరణ సాగడం అనిల్ మెహ్తా , దర్శకుడు ఇంతియాజ్ అలీ ల ప్రతిభే.

ఆద్యంతం ఉద్వేగంగానూ, ఆసక్తికరంగానూ సాగే  హైవే కథ మొత్తంగా ధనికురాలయిన స్వేచ్చను కోరుకునే అందమయిన అమ్మాయి చుట్టూరా సాగుతుంది. వీరా త్రిపాఠి ఒక పలుకుబడి గలిగిన ధనవంతుడి కూతురు. ఆమె తన పేళ్ళికి ముందు రోజు పెళ్ళికుమారుడితో కలిసి బయట తిరగాలనుకుంటుంది. పెట్రోల్ బంక్ దగ్గర వుండగా ఒక గాంగ్ ఆమెను బలవంతంగా ఎత్తుకు పోతారు. పెళ్ళికొడుకు భయంతో కారు లోనే వుండి పోతాడు. వీరా తడ్రికి ప్రభుత్వంలో పలుకుబడి వుందని తెలిసి కిడ్నాపర్లు ఆమెను తమ వెంట లారీ లో తీసుకు వెళ్తారు. పోలీసుల నుంచి తప్పించుకుంటూ అనేక వూర్లు దాటుకుంటూ వారి ప్రయాణం సాగుతుంది. మొదట కిడ్నాప్ పట్ల భయ పడ్డ వీర క్రమంగా స్వేచ్ఛను ఫీలవుతుంది. చిన్నప్పుడు ఇంట్లో మామయ్య పెట్టిన హింసను తలుచుకుని మొదట మహాబీర్ పట్ల భయపడ్డ వీరా క్రమంగా ప్రయాణాన్ని, కిడ్నాపర్ మహావీర్ ను అభిమానించడం మొదలు పెడుతుంది.  పోలీసులు ట్రక్కును పట్టుకుని వెతికినప్పుడు వీరా చిత్రంగా వారికి దొరక్కుండా దాక్కుంటుంది.  మహాబీర్ కూడా క్రమంగా కోపాన్ని తగ్గించుకుని వీర పట్ల మామూలుగా వుండేందుకు ప్రయత్నిస్తాడు. వీర క్రమంగా మహాబీర్ గతాన్ని తెలు సుకునే ప్రయత్నం చేస్తుంది మహాబీర్ కూడా ఆమె ముందు తన గతాన్ని వివరిస్తాడు. మహాబర్ తండ్రి తననీ తన తల్లినీ ఎట్లా హింసించిందీ చెబుతాడు. తన తల్లిని ధనవంతుల కోరిక తీర్చడానికి ఎట్లా వుపయోగించినదీ చెబుతాడు. అక్కడినుంచి   తప్పించుకున్నానని చెబుతాడు. వీరా సహచర్యంలో  మహాబీర్ కోపం పోయి మామూలుగా అవుతాడు. వీరాను పోలీసు స్టేషన్ వద్ద విడిచిపెడతానంతాడు. కాని వీర అంగీకరించదు. మహాబీర్ తోనే వుండిపోతానంటుంది మహాబీర్ కు  కూడా వీర పట్ల అభిమానం ప్రేమా పెరిగి ఎక్కడో పర్వత శిఖరం మీద చిన్న గుడిసె వేసుకుని వుంటారు. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్ర పోతారు. కానీ సూర్యోదయాన్నే ఎక్కడినుండో వచ్చిన పోలీసులు దాడి చేసి మహాబీర్ ను కాల్చివేసి వీరా ను ఆమె తండ్రికి అప్పగిస్తారు. ఇంటికి చేరిన వీర చుట్టూ  పెళ్లికొడుకుతో సహా భందువు లంతా చేరతారు. వీర ఆవేశంగా చిన్నప్పుడు హింసించిన మామయ్య తో ఘర్షణకు దిగితుంది. బయటేక్కడో రక్షణ లేదంటారెందుకు ఇంట్లో వున్న స్థితిని గమనించరు అంటూ తండ్రిని నిల దీస్తుంది. ఇక్కడ నాకు ప్రశాంతత లేదు నేనిక్కడ వుండలేను అంటూ ఇల్లు వదిలి వేరే వుద్యోగం చూసుకుని ఓ ఇల్లు కొనుక్కుని పర్వత ప్రాంతంలో వుండి  పోతుంది. వీరా కళ్ళు మూసుకుని ఆకాశం కేసి దీర్ఘంగా  చూస్తుండగా మూసిన ఆమె కళ్ల ముందు తన తొమ్మిదేళ్ల వయస్సులో హాయిగా ఆడుకోవడం అప్పుడే ఒక పిల్లవాడు ఆమెతో ఆడుకోవడానికి రావడం కనిపిస్తుంది.

హై వే మొత్తం మీద స్వంత ఇంట్లో, స్వంత మనుషుల నడుమ దగా పడి అణచివేతకు గురయిన రెండు హృదయాలు ఎంతలా స్వేచ్చను కోరుకుంటాయో వివరిస్తుంది. కోట్ల డబ్బూ అన్నీ వసతులూ వుండి కూడా స్వేచ్ఛకు దూరమయి మనసుకు నచ్చినట్టుగా వుండలేని పరిస్థితుల్లో వీరా మహా వీర్ వద్ద  వూరటను పొందుతుంది. అట్లాగే తండ్రి పెట్టిన హింసనూ తల్లి పడ్డ భాధనూ చూసి తెగింపుతో కోపంతో కిడ్నాపర్ గా మారిన మహాబీర్ వీర చూపిన ప్రేమలో అభిమానంలో కరిగి తిరిగి మామూలు మనిషి అవుతాడు. ఈ రెండు పరిణామాల్నీ దర్శకుడు ఇంతియాజ్ అలీ చక్కని సన్నివేశాల్తో అల్లుకుంటూ వస్తాడు. మంచి హాస్యాన్ని రంగరించి ఆసక్తి కలిగిస్తాడు.  పరివర్తన చెందే మనుషులూ వారి మనసులూ హై వే లో స్పష్టమవుతాయి. అంతే కాదు వీరా కుటుంబం ప్రతీకగా వర్తమాన సమాజంలో కనిపిస్తున్న కృతక మానవ సంభందాల్ని వివరిస్తాడు. అనేక రాష్ట్రాల గుండా ప్రేక్షకుల్ని ప్రయాణం చేయిస్తూనే మనుషుల్నీ మనసుల్నీ ఆవిష్కరిస్తాడు ప్రతిభావంతుదయిన ఇంతియాజ్ అలీ. మహావీర్ పాత్రలో రణదీప్ హూడా కూడా గొప్పగా నటించాడు.

మొత్తం మీద 2014 లో వచ్చిన హై వే ఆధునిక సమాజపు భిన్న మయిన కోణాల్ని చూపించింది. రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాలకు భిన్నంగా వున్న హై వే చూడాల్సిన సినిమా.

‘హై వే’ ( హింది), నటీ నటులు: అలియ భట్, రందీప్ హూడా.,రచన దర్శకత్వం: ఇంతియాజ్ అలీ,సినిమాటోగ్రాఫి: అనిల్ మెహ్తా,సంగీతం: ఏ.ఆర్.రహమాన్

PUBLISHED JANUARY 2017 ISSUE

karmika-vahini

Jernail S Aanand on ‘SIGNATURE OF LOVE’

Posted on Updated on

No automatic alt text available.
Friends, pl read a review on my book ‘SIGNATURE OF LOVE” by Dr.Jernail S Aanand, Ambassador at World Union of Poets – Unione Mondiale dei Poeti and Chairman at Writers International (Professor of English,ENGLISH AUTHOR, POET, SCHOLAR, COLUMNIST, ENVIRONMENTALIST, AND MORAL PHILOSOPHER)
I am honored by these words, Thank you very much Dr.Jernail S Aanand sir.very kind of you.

Jernail S Aanand 

 SIGNATURE OF LOVE by Varala Anand

Thanks Varala Anand for sharing with me this beautiful collection of poetry …Telugu poetry translated by Anu Bodla. The poet‘s sleek voice raising it’s concerns over several issues. The poems which stick to memory are Endeavour and Pondless Town.Even Book Shelf impresses. In the poem Poetry he paints a beautiful picture of somebody going out of the room…peeping through the windows and coming in noiselessly….

POETRY

I lighted a candle.
The darkness in the room
Bowed her head and
Walked out silently.

Through the windows and ventilators
She began to peep in now and then
In a while the candle
melted and extinguished

The darkness
Noiselessly
Entered the room.

..TWINS

I know sorrow and poetry are twins

IT IS ALL WATER

Flows out of eyes
It’s sorrow
Soaks in the heart
It’s spirit
Sorrow has no bounds
Spirit has no grounds
It’s all water.

SILENCE

My silence is a storm
It has settled at cross roads..
..
We wish to leave silence
And speak a few words
I think
Than many futile words
Silence is eloquent.

TALENGANA

Today my land
Breathing it’s freedom
Moving towards
The shores of happiness…
Let this journey of excitement
Lead us towards reconstruction
And experience new springs.

PONDLESS TOWN

Alas! We realised
In a Pondless town
Even tears are scarce.

They can neither be renovated
Nor restored
Our Pondless town
Dry in all seasons
Burns like a blazing desert.

This poem which rounds off this journey through Varala Anand’s book takes a dig at growing civilization and dwindling life systems. From joy to struggle this is our movement. We have yet to realise the loss is too great and the gain too meagre.

I congratulate Varala Anand for this beautiful work for the simple reason that it provides good company in vacant hours. Best wishes and I must say Anu Bodla too impresses.

DR JERNAIL SINGH ANAND

అలిఖిత UNWRITTEN (POEM)

Posted on

surya-poem
Pl read my poem published in SURYAA telugu daily
 
అలిఖిత
మనిషినుంచి మనిషికి
తరాన్నుంచి తరానికి
పయనించీ పయనించీ
 
ముని వేళ్ళ దాకా చేరి
ముడుచుకుని
అక్షరంగా రూపు దిద్దుకోలేక పోయా
 
మనసు లోపల సళ్ళు తిరుగుతూ తిరుగుతూ
భాషను కాలేక పోయా
పదాలు పదాలుగా చెల్లా చెదరయి పోయా
 
కలగా ఘనీభవించి
అవ్యక్త ప్రేమగా
అలిఖిత కవిత గా
గుండె గొడల్లో నిలిచిపోయా
 
-వారాల ఆనంద్
9440501281 

ఊరూరా థియేటర్లు

Posted on Updated on

ఊరూరా థియేటర్లు

PUBLISHED: SUN,DECEMBER 18, 2016 12:55 AM

సినిమా రంగానికి ఊతమిచ్చే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మినీ థియేటర్ల నిర్మాణానికి పూనుకోవడం అభినందనీయం. సినిమా రంగానికి సంబంధించిన నిర్మాణ, పంపిణీ,ప్రదర్శనా రంగాల్లో ముఖ్యమైన సినిమాల ప్రదర్శన విషయంలో గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు.

భవిష్యత్తులో తెలంగాణ సినిమా కూడా ప్రదర్శనాలేమి ప్రమాదం ఎదుర్కోకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మినీ థియేటర్ల నిర్మాణం ఎంతో ఉపయుక్తం అవుతుంది. కేవలం వ్యాపార లక్ష్యమే కాకుండా అర్థవంతమైన సినిమాలు తెలంగాణలో నిర్మింపబడాలంటే వాటికి ప్రదర్శనకు సం బంధించి నిర్మాణాత్మకమైన కృషి జరిగే విషయంలో చిన్న థియేటర్ల నిర్మాణం గొప్ప ఆశావాహంగా కనిపిస్తున్నది.

anand
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండల కేంద్రాల్లోనూ బస్‌స్టేషన్ల ఆవరణల్లోనూ, ఇతరత్రా ఖాళీ స్థలాల్లో ఈ మినీ థియేటర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న ట్టు ప్రకటించింది. నిజానికి సినిమా ఎక్కువమంది ప్రజల కు చేరినప్పుడే అటు విలువల పరంగాను, వ్యాపార పరంగాను దాని ప్రయోజనం నిరూపితమవుతుంది. మారుమూల పల్లెల్లో కూడా ప్రదర్శనా వసతులు ఏర్పడ్డప్పుడే మంచి సినిమాకైనా, చెత్త ఆంధ్రా సినిమాకైనా ప్రజలను చేర్చే అవకాశం లభిస్తుంది. సినిమాలోని మంచి, చెడు విషయాలు ప్రజలకు తెలువడంతో పాటు వ్యాపారపరంగా కూడా జయాపజయాలు తేలిపోతాయి. తక్కువ సీట్లున్న మినీ థియేటర్లు నిర్మించి, వాటిని మల్టీప్లెక్స్‌ల్లాగా మార్చ గలిగితే కేవలం టికెట్ల వల్లనే కాకుండా వాటిచుట్టూ ఏర్పాటయ్యే ప్రచార వాతావరణం, క్యాంటీన్, పార్కింగ్ తదిత ర మార్గాల ద్వారా కూడా సినిమా వ్యాపారం విస్తరించే అవకాశం ఉన్నది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో తెలంగాణ సినిమాకు ఎంతో ఉపయుక్తమవుతుంది. విప్లవాత్మకం కూడా కావచ్చు.

సినిమాలు పుట్టిన నాటినుంచి డేరాలూ, తడకల హాళ్లు, రేకుల షెడ్లు, టూరింగ్ టాకీసులు తదితర రూపాల్లో ఉన్న ప్రదర్శన వసతులు, కాలక్రమేణా సింగల్ ప్రొజెక్టర్ హాళ్లు, డబుల్ ప్రొజెక్టర్ హాళ్లు ఏర్పాటయ్యాయి. ఇటీవలి కాలం లో తక్కువ సీట్లున్నవి, మల్టీఫ్లెక్స్‌లు ఏర్పాటయ్యాయి. ఫలితంగా చిన్న సినిమాలకు, ప్రయోగాత్మక సినిమాలకు టాకీసులు దొరికి ప్రదర్శన అవకాశాలు మెరుగయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు భారత్ సంఖ్యాపరం గా అత్యధిక సినిమాలు నిర్మిస్తున్న దేశంగా పేరుగాంచింది. దేశంలో ఏటా దాదాపు 2000 సినిమాల దాకా నిర్మించబడుతున్నాయి. ఇరువై భాషల్లో విస్తరించి ఉన్న భారతీయ సినిమా రంగం ఏటా 2.1 బిలియన్ల వ్యాపారాన్ని విస్తరిం చి ఉన్నది. అది క్రమంగా పెరిగి 2020 సంవత్సరానికల్లా 3.7 బిలియన్ల వ్యాపారాన్ని సాధిస్తున్నదని అంచనా వేస్తున్నారు. సంఖ్యాపరంగా ఎక్కువైనప్పటికీ ఆదాయపరంగా హాలీవుడ్‌తో పోలిస్తే చాలా తక్కువే. భారతీయ సినిమా వ్యాపారంలో బాలీవుడ్‌గా పిలువబడే హిందీ సినిమా రం గమే 43 శాతం ఆక్రమిస్తుండగా 7 శాతం విదేశీ చిత్రాలుంటున్నాయి. ఇక మిగతా 50లో మిగిలిన భారతీయ భాషా చిత్రాలుంటున్నాయని అంచనా. 50లో కూడా తెలుగు సినిమానే అధిక శాతం ఆక్రమిస్తున్నదనడంలో అతిశయోక్తి లేదు. ఇందులో ఇప్పటికీ పెద్ద సినిమా హాల్లే అధిక శాతం వ్యాపారం చేస్తున్నాయి. మొత్తంలో 85 శాతం పెద్ద హాల్లే ఉన్నప్పటికీ వాటి ఉనికి క్రమంగా అంతరిచిపోతున్నది. పలు థియేటర్లు పెళ్లి మంటపాళ్లుగా, గోదాములుగా రూపాంతరం చెందడం చూస్తూనే ఉన్నాం.

మన దేశంలో ఇప్పటికీ దాదాపు 2100 మల్టీఫ్లెక్సులు ఒక్కోదాంట్లో 150-250 సీట్లతో ఉండగా పెద్ద టాకీసులు 6000 పైన 750-1200 సీట్లతో ఉన్నట్టు అంచనా. బాక్సాఫీస్ ఆదా యం విషయంలో మల్టీఫ్లెక్సులు 40 శాతం సమకూరుస్తున్నాయి. అమెరికాలో మాత్రం తొంభై శాతం మల్టీఫ్లెక్సులే ఉన్నాయి. అధిక ఆదాయం కూడా వాటితోనే వస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. మన దేశంలో ఇటీవలి కాలంలో మల్టీప్లెక్సుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ మొత్తమ్మీద అవి మహా నగరాలకే పరిమితమై ఉండటాన్ని గమనించవచ్చు. తెలంగాణ విషయానికి వస్తే మల్టీప్లెక్సు లు ప్రధానంగా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అందుకే తెలంగాణ జిల్లా కేంద్రాల్లో మల్టీప్లెక్సులు, మండల కేంద్రా ల్లో మినీ థియేటర్లు ఏర్పాటైతే సినిమా రంగానికి ఇతోధికంగా సహకారి అవుతుంది.

కొత్తగా రూపొందబోతున్న మనదైన తెలంగాణ సినిమా మనుగడకు ఎంతో ఉపయోగరంగా ఉంటుంది.
చిన్న సినిమాలకు, తక్కువ బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు, ప్రయోగాత్మక సినిమాలకు మల్టీప్లెక్సులు మినీ థియేటర్లే ఊపిరి పోస్తాయి. ఎందుకంటే అవి పెద్ద రెంట్లు కట్టి, ఆక్యుపెన్సీ లేక వాటి ఖర్చును భరించలేక విడుదలకే నోచుకోని సినిమాలే మనకు కనిపిస్తాయి. భవిష్యత్తులో తెలంగాణ సినిమా కూడా ప్రదర్శనాలేమి ప్రమాదం ఎదుర్కోకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మినీ థియేటర్ల నిర్మాణం ఎంతో ఉపయుక్తం అవుతుంది. కేవ లం వ్యాపార లక్ష్యమే కాకుండా అర్థవంతమైన సినిమాలు తెలంగాణలో నిర్మింపబడాలంటే వాటికి ప్రదర్శనకు సం బంధించి నిర్మాణాత్మకమైన కృషి జరిగే విషయంలో చిన్న థియేటర్ల నిర్మాణం గొప్ప ఆశావాహంగా కనిపిస్తున్నది.ఇక సినిమాల పరంగానే కాకుండా ఈ మినీ థియేటర్ల ద్వారా ఆయా నగరాల్లో, మండల కేంద్రాల్లో థియేటర్ల చుట్టూ పెంపొందే ఇతర వ్యాపారాల ద్వారా కూడా మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. ఫలితంగా పన్నుల రూపేణా ప్రభుత్వానికీ ఆదాయం పెరుగుతుంది.

అయితే ఒక విషయాన్ని మాత్రం కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటికే తెలంగాణలో వున్న థియేటర్లలో అధిక శాతం కొంతమంది బడా బడా ఆంధ్రా సిని మా పెద్దల చేతుల్లో ఉన్నాయని. వారి వ్యాపార లక్ష్యాల నేపథ్యంలోనే గుత్తాధిపథ్యం నడుస్తున్నదనే విషయం ప్రాచుర్యంలో ఉన్నది. దానికి అనుగుణంగానే ప్రముఖ ఆంధ్రా సినిమా నిర్మాత ఒకరు మాట్లాడితే థియేటర్ల గురించి ఆరోపిస్తారు, మేమేమీ చట్ట వ్యతిరేకంగా వ్యాపా రం చేయడం లేదని ఇటీవల ప్రకటించారు. ఆయన తన కు అనుగుణంగా ఉన్న చట్టం గురించే మాట్లాడారు కానీ వ్యాపారానికి కూడా పద్ధతి, న్యాయమూ ఉంటాయని అంగీకరించలేదు. ఆ పరిస్థితి తెలంగాణ మినీ థియేటర్లకు రాకుండా చూడాలి. అంతేకాదు ప్రదర్శనావేళల్లో తెలంగా ణ సినిమాలకు ఇన్ని షోలు కేటాయించాలనే నియమం కూడా ఉపయోగపడుతుంది. మినీ థియేటర్ల నిర్మాణ సమయంలో కూడా రాయితీలు, లోన్లు, నాణ్యమైన విద్యు త్తు ఉదారంగా ఇచ్చే ఏర్పాటు చేయగలిగితే తెలంగాణ సిని మా ప్రదర్శనారంగం బతికి బట్ట కడుతుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న మొదటి అడుగు తెలంగాణ మినీ థియేటర్లు.

05186369-d6fe-4e17-b42b-99add925475d