SHORT FILM

తెలంగాణా కి రాయబారులు గా లఘు దృశ్య కారులు

        తెలంగాణా ఇవాళ వలస వాద దోపిడి నుంచి విముక్త ప్రాంతం. రాజ్యాంగ పరిధిలో  తమ పరిపాలనను సాగిస్తున్న విలక్షణ మయిన రాష్ట్రం . ఆరు దశాబ్దాల పాటు అనేక పోరాటాల అనంతరం స్వీయ సాధించి స్వయం పాలనను సాగిస్తున్న ప్రాంతం గా నిలిచి నడుస్తున్నది. తమని తాము పాలించుకుంటూ తమ ప్రజల వర్తమానం భవిష్యత్తు గురించి తమ దయిన  ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతోంది. ఈస్థితిలో కొత్త రా రాస్థ్రం కొత్త ప్రభుత్వం ఎట్లా మనుగడ సాగిస్తుందని ఎలాంటిపాలసీలతో ముందుకు సాగుతుందని దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచం  లోని బిన్న ప్రాంతాల వారుఆసక్తిగా ఎదిరిచూస్తున్న సంధర్భం. అంతే కాదు ఎట్లా విఫల మయితుందో కూడా చూడాలనే ఆశ తో వున్న పక్క రాష్ట్రాల వారూ వున్నారు. ఈ నేపథ్యంలో తలంగాణాలో జరుతున్న కార్యక్రమాలు చేపడుతున్న ప్రణాళికల గురించి ప్రపంచానికి తెలియ జేయాల్సిన ఆవరమూ ఆవశ్యకత ఎంతో వుంది.అంతేకాదు హైదరబాద్ మరియు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచాల్సిన అవసరమూ  వుంది.అందుకోసం ప్రభుత్వం బ్రాండ్ అంబాస్సడర్లు గా క్రీడాకారుల్ని నియమించి  ఎవరూ వూహించని విధంగా  వాళ్ళకి  ఆర్థిక సహకారం అందించిన  సందర్భాలున్నాయి. వాటి ఫలితాలు ఏమేరకు వున్నాయో వేచి చూడాల్సి వుంది.

కానీ ఈ రోజు ప్రపంచం దృశ్య మాధ్యమం మీద నడుస్తున్నది. యువత దాదాపు మొత్తంగా విశువల్ మీడియా మీదే కాలం గడుపుతోంది. బుక్ కల్చర్ కి మంగళం పాడేసి లుక్ కల్చర్ కి దాసోహం అనేసింది. ఇక పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని పిడికిట్లోకి తెచ్చేసింది. ఇంకా 4 జనరేషన్ 5 జనరేషన్ గురించి చర్చలు జరుగుతున్నాయి పరిశోధనలు సాగుతున్నాయి. ఫేస్ బుక్, ట్విటర్, వాట్స్ అప్ లాంటి అనేక సామాజిక మాధ్యమాలు యువతీయువకులతో పాటుఅందరి జీవితాల్ని ఆక్రమించేశాయంటే అతిశయోక్తి  కాదు. ఫలితంగా ఈరోజు విషయ ప్రసారాల విస్తృతి ఎంతో పెరిగింది. వార్తల్ని, దృశ్యాల్ని ప్రపంచ వ్యాప్తంగా క్షణాల్లో ప్రసారం చేయడంసులభ సాధ్యమయింది అంతే కాదు అత్యంత వేగంగానూ మారిపోయింది. ఈ వార్తమాన స్థితిని ఎంతపసిటివ్ గా  ఉపయుక్తం చేసుకుంటే అంతగా ఉపయోగ పడే అవకాశం వుంది.

సాంకేతిక సౌలభ్యాన్ని డిజిటల్ పరిజ్ఞాన్ని, దృశ్య మాధ్యమాన్ని  ఉపయోగించుకుంటూ తెలంగాణలోని అనేక ఇంజనీరింగ్,మెడికల్ కాలేజీలు, విశ్వ విద్యాలయాల్లోని విధ్యార్థులూ, యువకులూ చిన్న చిన్న లఘు చిత్రాల్ని నిర్మించే పనిలో వున్నారు. వారు వ్యాపార సినిమా రంగానికి సమాంతరంగా తమదయిన మాధ్యమాన్ని రూపొందించుకునే ప్రయత్నాల్లో వున్నారు, కొత్త కొత్త ఆలోచనలతో,

అనేక కొత్త విషయాల్ని చిన్న చిన్న సినిమాలుగా రూపొందిస్తున్నారు. అలా లఘు సినిమాల్ని షార్ట్ ఫిలిమ్స్ గా ప్రసారమాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి తెస్తున్నారు. అంతే కాదు దేశ వ్యాప్తంగానూ ప్రపంచ వ్యాప్తంగానూ  నిర్వ హించ బడుతున్న అనేక ఆన్- లైన్ ఫిలిమ్ ఫెస్టివల్స్ లో పాల్గొంటూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు.. షార్ట్ ఫిలిమ్ నిర్మాణం నేటి యువతకి తమ  సృజనని నిరూపించుకునేసాధనంగానూ, ఒక ప్రతిభావంత మయిన, ప్రభావ వంతమయిన మాధ్యమంగా వినియోగించుకుంటున్నారు. నిజానికి షార్ట్ ఫిలిమ్ నిర్మాణానికి లక్షలూ కొట్లూ అవసరం లేదు. లఘు బడ్జెట్ లో లఘు చిత్రాలు నిర్మించే అవకాశం వుంది. అట్లా నిర్మించిన షార్ట్ ఫిలిమ్స్ ని యు ట్యూబు,ఫేస్ బుక్, వాట్స్ అప్, ట్విటర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో పోస్ట్ చేసే అవకాశం వుంది. కేవలం ఒక్క క్లిక్ తో వందలు వేలు లక్షల మందికి పర్సనల్ గా చేరే అవకాశం వుంది గ్రూపులుగా ఏర్పాటు చేసుకున్న ఐడి లతో యువత ఈ అవకాశాన్ని విస్తృతంగా నూ విశ్రుంకలంగా నూ వినియోగించుకుంటున్నారు.

యువతకున్న ఈ శక్తిని క్రమ బద్దీకరించి సక్రమంగా వినియోగిస్తే గొప్ప ఫలితాలు సాధించేఅవకాశం వుంది. రాస్ట్ర ప్రభుత్వం సాంస్కృత సారథి పేర రాష్ట్రం లో  వినూత్నమయిన కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. కళాకారులతో పది జిల్లాల్లో కార్యక్రమాల నిర్వహణకు నాంది పలికింది. కళాకారులకు ఇదో మంచి అవకాశంగానే చెప్పుకోవచ్చు. ఏ రాష్ట్రం లోనూ లేని విధంగా కళాకారులకి ఉద్యోగాలిచ్చి ప్రోత్సహిస్తున్న ఘనత తెలంగానాదే.  అయితే వారి కార్యక్రమాలు సృజనాత్మకంగాను వినూత్నంగా వుంటే స్థానికంగానూ రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లోనూ మంచి ఫలితాలు సాధించే అవకాశం వుంది.

అట్లాగే ప్రపంచ వ్యాప్త కాన్వాస్ వున్న షార్ట్ ఫిలిమ్స్ కి షార్ట్ ఫిలిమ్ నిర్మాతలకి దర్శకులకి  కూడా సారధి లాంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించగలిగితే తెలంగాణా భాషా సంస్కృతి విలక్షణత ల తో పాటు కొత్త రాష్ట్ర ఎదుగుదల ప్రణాళికలు కూడా ఒక్క క్లిక్ తో విశ్వ వ్యాప్తం  చేసే అవకాశం వుంది. బ్రాండ్ అంబాస్సడర్లుగా వ్యక్తుల్ని నియమించి వారి వ్యక్తిగత విజయాలతో హైదరా బాద్ కు  తెలంగాణ కు పేరొస్తుందనుకుంటె  ఫలితాలు గొప్పగా వుండే అవకాశం తక్కువ. సామూహికంగా యువకులు కలిసి చేసే పనుల వల్ల ఫలితాలు గొప్పగా వుంటాయి. అంతే కాదు వారు చేసే ప్రయత్నాలు విశ్య్వ వ్యాప్తంగా విస్తృత మయ్యే అవకాశం వున్నప్పుడు రీచ్ కూడా అధికంగానే  వుంటుంది.

అందుకే చిన్న చిన్న బుడ్జెట్ లతో తెలంగాణ గొప్ప తనాన్ని విలక్షతనిడిజిటల్ మాధ్యమం లో షార్ట్ ఫిలిమ్ లు గా నిర్మించి విస్తృతంగా సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం తో పాటు డిజిటల్ చాలన్ చిత్రో త్స్వాల్ని అన్నీ జిల్లా లల్లో దేశం లోని అన్నీ ప్రాంతాల్లో నిర్వహించగలిగితే గొప్ప ఫలితాల్ని సాధించే అవకాశం వుంది. లఘు చిత్రాల్ని, లఘు దృశ్యకారుల్ని తెలంగాణా బ్రాండ్ అంబాస్సడర్లుగా రూపొందించుకుని తెలంగాణ విలక్షణతని ప్రపంచ వ్యాప్తం చేయాల్సి వుంది. ఈ దిశగా ప్రయత్నాలు ఆరంభం కావాలని ఆశిద్దాం. విల క్షణ దృశ్య మాధ్య మాన్ని వినూత్నంగా వాడుకుందాం.

-వారాల ఆనంద్

9440501281

(పూర్వ కార్యదర్శి, ఫెడరేషన్ ఒఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా )