Month: September 2018

MONOGRAPH on PAIDI JAIRAJ

Image Posted on

3e1f9a1e-2667-4b1b-b892-4682b79a45d5

Advertisements

‘GREEN POEMS’ఆకుపచ్చ కవితలు

Posted on

Gulzar’s ‘GREEN POEMS’ (ఆకుపచ్చ కవితలు)
Chat and Recitation of poems for AIR Hyderabad. Recorded today will be in air soon…Thank you C.S.Rambabu garu

41733915_10157747868509377_7358177704249655296_n

ముక్తకాలు- వారాల ఆనంద్

Posted on

ముక్తకాలు

————-

పెరట్లో మొక్కలు వాడి పోతున్నాయి, నేల తడిపితే బాగుండు

మట్టి వాసనతో అవి విచ్చుకుంటాయి

==============================

మొక్కలన్నీ తల వంచుకు నిలబడ్డాయి, ఊపిరులూదినట్టు

పాదు ల్లోకి నాలుగు చినుకులు కురిస్తే బాగుండు

========================================

రోడ్డు మీద ఒకటే గొడవ తన్నుకుంటున్నట్టున్నారు

దయతో ఓ వర్షం కురిస్తే బాగుండు

=======================================

పక్కింట్లో కొత్త జంట ఎడమొహం పెడ  మొహం

ఇద్దరినడుమా ఓ సుగంధపు ఆగరొత్తీ వెలిగిస్తే బాగుండు

======================================

టేబుల్ కు ఆపక్కా ఈ పక్కా ఫ్రేమికుల జంట

నడుమ మౌనం, బేరర్ ఓ కూల్ డ్రింకూ రెండు స్ట్రాలూ తెస్తే బాగుండు

=======================================

62e83634-d5d4-4775-8faf-a32f66f87dc7

ఆరు దశాబ్దాల బహుముఖీన   ప్రయాణికురాలు పి భానుమతి

Posted on

       సినిమా ఆవిర్భావం నుండి స్టూడియో ల ఆజమాయిషీ, పెట్టుబడి అధికారం  పురుషుల/ హీరో ల  ఆధిపత్యం చెలామణి అవుతూ వస్తున్నది. నాటి నుండి దాకా పరిస్థితిలో  పెద్ద మార్పేమీ లేదు. అందుకే సినిమా ప్రధానంగా మేల్ సెంట్రిక్ ఇండస్ట్రీ. అలాంటి వాతావరణంలో భానుమతి ఆరు దశాబ్దాల క్రితమే ఆత్మ విశ్వాసంతో నిల దొక్కుకొని హీరోలకు సమంగా తన ఉనికిని చాటుకోవడమే కాకుండా తెరమీద బయటా కూడా తన ముద్రను కొనసాగిస్తూ వ్యక్తిత్వాన్ని చాటుకున్న నటిగా పేరుతెచ్చుకొంది. నటన, రచన, గానం, సంగీతం,నిర్మాణం, స్టూడియో అజమాయిషీ ఇట్లా బహుముఖీన ప్రతిభకు తోడు చెరగని ఆత్మవిశ్వాసం ఆమెకు చివరంటా తోడున్నాయి. రచయిత్రిగా ‘అత్తగారి కథలు’ తో ఆమె సాహితీ రంగంలో కూడా తన ముద్రను చాతుకున్నారు. తన దామినేటింగ్ స్క్రీన్ ప్రేజెన్స్ తో మహిళా వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. భానుమతికున్నది సహజంగా కళాకారులకుండే ధిక్కార స్వరమే. ఆ స్వర ప్రదర్శనలో ఆమె ఎవరినీ లెక్కపెట్టినట్టు కనిపించదు.  సహ నటులేవరయినా సరే తాను తక్కువ అన్న భావం ఆమెలో కనిపించదు. ఒక్కోసారి తానే తన పాత్రలకు అతీతంగా నటనను ప్రదర్శించిన సందర్బాలు కూడా కనిపిస్తాయి. మొదట్లో సినిమాల పట్ల నటన పట్ల అంతగా ఆసక్తిలేని భానుమతి 1939  లో మొట్ట మొదటిసారిగా సి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన ‘వరవిక్రయం’ లో నటించింది. కాళ్ళకూరి నారాయణ రావు రచించిన నవల ఆధారంగా నిర్మించ బడ్డ వరవిక్రయం వరకట్న సమస్య మీద నిర్మించబడింది. అయిష్టంగానే సినిమాల్లోకి వచ్చిన ఆమె క్రమంగా నిలదొక్కుకొని ఒక స్థిరమయిన స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగలో అప్పుడప్పుడే సేపధ్య సంగెతం ఆరంబమయింది. భానుమాతి తన పాటల్ని తానే పాడుకొనేది.నటిగా వరవిక్రయం తర్వాత ‘మాలతీ మాధవం’, ధ్రమపత్ని, కృష్ణ ప్రేమ, భక్తిమాల లాంటి సినిమాల్లో నటించారు. ఇక 1945 లో బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘స్వర్గసీమ’ ఆమె నట జీవితానికి మైలురాయిగా మిగిలింది. స్వర్గసీమలో భానుమతి పాడిన ‘ఓ.. పావురమా..’  అద్బుతంగా శ్రోతల్ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. aa పాట నేటికీ శ్రోతలను అలరిస్తునేవుంది. దాంతో అప్రతిహతిమయిన ఆమె ప్రస్తానం ఆరంభమయింది. 1946 లో ఎల్ వి ప్రసాద్ తీసిఅన గృహప్రవేశం కూడా ఆమె స్థానం పదిలం కావడానికి ఎంతో దోహదం చేసింది. తర్వాత రత్నమాల, రాజ ముక్తి తదితర సినిమాలు వచ్చాయి. నిజానికి కృష్ణప్రేమ తర్వాత హెచ్.వి.బాబు వద్ద సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న రామకృష్ణను ఆమె ప్రేమించి పెళ్ళాడారు. పెళ్లి తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా వున్న భానుమతిని బి.ఎన్.రెడ్డి , వై.వి.రావు తదితరులు ఒప్పించి తిరిగి సినిమాల్లో నటించేలా చేసారు. తమిళ టాకీస్ వాళ్ళు తమ మురుగన్ సినిమాకోసం అప్పట్లోనే భానుమతికి 25 వేళా పారితోషకం ఇచ్చి నటిమ్పజేసారు. aa సొమ్ముతో ఆమె భరణి స్టూడియో నిర్మించారు. భరణి సంస్తనుంచే భానుమతీ రామకృష్ణలు రత్నమాల, లైలా మజ్ను, విప్రనారాయణ, బాటసారి, వివాహ బంధం తదితర విజయవంతమయిన సినిమాలు తీసారు. ఇక ఆమె నట జీవితంలో మరొక అద్భుతమయిన సినిమా బి.ఎన్.రెడ్డి తీసిన ‘మల్లేశ్వరి’ .  అమాయక అమ్మాయి పాత్రలో ఆమె నటన అజరామరంయింది. నేటికీ మల్లీశ్వరి ఒక కల్ట్ సినిమా. అందులో పాటలు ‘మనసున మల్లెల మాలలూగెనే.., ‘పిలచినా బిగువటరా..’, ఏడ దాగున్నాడో బావ..’ లాంటి పాటలు telugu సినీ చరిత్రలో చిరస్థాయిలో మిగిలిపోయాయి. భానుమతి గాన మాద్ర్యం ఎప్పటికీ ప్రేమికుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే వుంది. ఇక తర్వాత ‘ఆలీబాబా 40 దొంగల్’, తోడూ నీడా, సారంగధర లాంటి అనేక సినిమాల్లో భానుమతి సంపూర్ణ వ్యక్తిత్వంతో నటించి ఒక ఒరవడికి దారి తీసారు.

     సంగీత దర్శకురాలిగా భానుమతి చక్రపాణి,అంతా మన మంచికే, చింతామణి లాంటి సినిమాలకు పని చేసి గొప్ప సంగీతాన్ని అందించారు. గాయనిగా వందాలాది పాటలు పాడిన భానుమతి మల్లెశ్వరితో సహా విప్రనారాయణ లో పాడిన ఎందుకోయి తోట మాలి.. అద్భుతమయిన పాట.

భానుమతి మొట్టమొదటిసారి 1953లో చండీ రాణి సినిమాకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. తర్వాత 20 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారామె. దర్శకురాలిగా తన వ్యక్తిత్వానికీ, స్వభావానికి తగిన సినిమాల్ని తీసారు. పాత్రల్ని పోషించారు. తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో  ‘ అంతా మన మంచికే ‘ తన కిష్టమయిన సినిమా అని ఆమె ఒక చోట చెప్పుకున్నారు. స్త్రీలను చులకన గా చూసే వారికి,మోసగాళ్ళకు గునపాతం చెప్పే పాత్రలో ఆమె నటించారు. ఆమె బాల నటులతో ‘ భక్త ధ్రువ మార్కండేయ’ సినిమా ను ప్రయోగాత్మకంగా తీసి విజయం సాదించారు.

భానుమతి 1925 సెప్టెంబర్ 7 న ఒంగోల్ ప్రాంతానికి చెందిన దొడ్డవరం లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు సరస్వతమ్మ, బొమ్మరాజు వెంకట సుబ్బయ్య. కుటుంబం సంగీత కుటుంబం కావడం తో ఆమెకు చిన్నప్పటినుండే సంగీత శిక్షణ లభించింది. హెచ్.ఎం.వి వారికోసం రికార్డ్ చేయాడానికి మద్రాస్ వెళ్ళిన భానుమతికి సినిమా రంగం ఆహ్వానం పలికి నిలబెట్టింది.

    తెలుగుతో పాటు భానుమతి తమిళంలో కూడా అనేక సినిమాల్లో నటించారు. మదురై వీరన్, నాదోది మన్నన్, అన్నై , మంగళ, అంబికాపతి లాంటి తమిళ సినిమాల్లో ఆమె నటించారు. నిషాన్, మంగళా, నాయి రోష్ని లాంటి hindi సినిమాల్లో కూడా నటించారామె.

 

వరవిక్రయం సినిమా తర్వాత భానుమతికి బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, విశ్వనాథ సత్యనారాయణ లాంటి కవుల పరిచయం కలిగింది. వారి ప్రభావం తో ఆమె రచనలు చేయడం ఆరంభించింది. తనలో సహజంగా వున్న వ్యంగ్యాన్ని జోడించి గొప్ప కథలు రాసారామె. మొదట తన రైలు ప్రయాణ అనుభవాన్ని రంగరించి ‘మరచెంబు’ కథ రాసారామె. అలా మొదలయిన ఆమె సాహితీ ప్రస్తానం ‘ అత్తగారి కథలు’ తదితర రచనలతో విలక్షణంగా సాగింది. సాహిత్య అకాడెమి అవార్డును అందుకున్నారమె.  ఇక ఆమె రాసిన ‘ నాలో నేను’ పుస్తకానికి ప్రభుత్వ ఉత్తమ గ్రంధం అవార్డును అందుకుంది.

  ఆమెను తమిళనాడు ప్రభుత్వం మద్రాస్లోని ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్ గా నియమించింది. ఇక పల్నాటి యుద్ధం, అన్నై, అంతస్తులు సినిమాలకు ఆమెకు రాష్త్రపతి అవార్డులు వచ్చాయి. పద్మశ్రీ(1966 ), పద్మభూషణ్(2001) , ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, రఘుపతి వెంకయ్య అవార్డు పలు నంది ఫిలిం ఫేర్ అవార్డులు దక్కాయి . దాదాపు ఆరు దశాబ్దాలు సాగిన ఆమె సినీ ప్రస్థానం విజయవంతంగా సాగింది.

భానుమతి తన ఎనభై ఏళ్ల వయసులో 2005 లో మరణించారు.

సంపూర్ణ వ్యక్తిత్వంకల మహిళా పాత్రల్ని పోషించడంతో పాటు బహుముఖ ప్రతిభాశాలిగా నిలిచిపోయారామె.

PAGE 1

PAGE 2